SCERT AP 10th Class Biology Guide Pdf Download 1st Lesson బలం Textbook Questions and Answers.
AP State Syllabus 10th Class Biology 1st Lesson Questions and Answers పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ
10th Class Biology 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
కింది వాని మధ్య భేదాలు రాయండి. (AS1)
ఎ) స్వయంపోషణ-పరపోషణ
బి) అంతర గ్రహణం- జీర్ణక్రియ
సి) కాంతి చర్య- నిష్కాంతి చర్య
డి) పత్రహరితం-హరితరేణువు
జవాబు:
ఎ) స్వయంపోషణ – పరపోషణ :
స్వయంపోషణ | పరపోషణ |
1. జీవులు పోషకాలను స్వయంగా తయారు చేసుకొనే పద్ధతిని “స్వయంపోషణ” అంటారు. | 1. పోషకాల కొరకు ఇతర జీవులపై ఆధారపడే ప్రక్రియను “పరపోషణ” అంటారు. |
2. గాలి, నీరు వంటి నిరింద్రియ పదార్థాల నుండి ఆహారం తయారు చేసుకుంటాయి. | 2. ఇతర జీవులను తినటం ద్వారా పోషకాలను గ్రహిస్తాయి. |
3. కాంతిని శక్తి వనరుగా ఉపయోగించుకుంటాయి. | 3. ఆహారపదార్థాల నుండి శక్తిని పొందుతాయి. |
4. పత్రహరితం కలిగి ఉంటాయి. ఉదా : ఆకుపచ్చని మొక్కలు |
4. పత్రహరితం కలిగి ఉండవు. ఉదా : జంతువులు |
బి) అంతర గ్రహణం – జీర్ణక్రియ :
అంతర గ్రహణం | జీర్ణక్రియ |
1. ఆహార పదార్థాలను నోటిలోనికి గ్రహించే విధానమే “అంతర గ్రహణం”. | 1. సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చే ప్రక్రియను “జీర్ణక్రియ” అంటారు. |
2. ఆహారాన్ని సంపాదించటానికి ముఖభాగాలు, చేతులు, గోర్లు తోడ్పడతాయి. | 2. ఆహారం జీర్ణం చేయటానికి జీర్ణరసాలు, ఎంజైమ్స్ తోడ్పడతాయి. |
3. ఆహారం ముక్కలుగా చేయబడి గ్రహించబడుతుంది. | 3. ముక్కలైన ఆహారాన్ని శోషణ చెందటానికి అనువుగా ద్రవస్థితికి మార్చబడుతుంది. |
4. ఇది ఒక భౌతిక ప్రక్రియ. ఎటువంటి రసాయన చర్యలూ ఉండవు. | 4. ఇది జీవరసాయనిక ప్రక్రియ. పదార్థ నిర్మాణం మారుతుంది. |
5. జీర్ణక్రియలోని మొదటి ప్రక్రియ అంతర గ్రహణం. | 5. అంతర గ్రహణం తరువాత జీర్ణక్రియ ప్రారంభమౌతుంది. |
సి) కాంతి చర్య- నిష్కాంతి చర్య :
కాంతి సమక్షంలో జరిగే చర్యలకు, కాంతి ప్రమేయం లేని చర్యలకు మధ్యగల భేదాలు ఏమిటి ?
కాంతి చర్య | నిష్కాంతి చర్య |
1. కిరణజన్యసంయోగక్రియలోని మొదటి దశ. | 1. కిరణజన్యసంయోగక్రియలోని రెండవ దశ. |
2. కాంతిశక్తి గ్రహించబడుతుంది. | 2. కాంతిశక్తితో ప్రమేయం లేదు. కానీ కాంతిచర్యలపై ఆధారపడుతుంది. |
3. హరితరేణువులోని గ్రానాలో జరుగును. | 3. హరితరేణువులోని అవర్ణిక (సోమా) లో జరుగును. |
4. ATP, NADH లు అంత్య ఉత్పన్నాలు. | 4. పిండిపదార్థం (గ్లూకోజ్) అంత్య ఉత్పన్నము. |
5. శక్తిగ్రాహకాలు ఏర్పడతాయి. | 5. శక్తిగ్రాహకాలు వినియోగింపబడతాయి. |
6. ప్రధానంగా ఆక్సీకరణ చర్యలు. | 6. ప్రధానంగా క్షయకరణ చర్యలు. |
7. నీటి కాంతి విశ్లేషణ జరుగుతుంది. | 7. కర్బన స్థాపన జరుగుతుంది. |
డి) పత్రహరితం – హరితరేణువు :
పత్రహరితం | హరితరేణువు |
1. ఆకుపచ్చ వర్ణాన్ని కలిగించే వర్ణద్రవ్యం. | 1. పత్రహరితాన్ని కలిగి ఉన్న కణాంగాన్ని హరితరేణువు అంటారు. |
2. పత్రహరితం హరితరేణువులలో ఉంటుంది | 2. హరిత రేణువులు కణద్రవ్యంలో డిస్క్ ఆకారంలో ఉంటాయి. |
3. మెగ్నీషియం అణువును కలిగి ఉండే స్థూల అణువు | 3. త్వచ నిర్మాణాలు కలిగిన కణాంగము |
4. సౌరశక్తిని గ్రహిస్తుంది. | 4. కిరణజన్యసంయోగక్రియను నిర్వహిస్తుంది. |
5. కిరణజన్యసంయోగక్రియను ప్రారంభిస్తుంది. | 5. కిరణజన్యసంయోగక్రియలోని చర్యలన్నీ హరిత రేణువులలో జరుగుతాయి |
ప్రశ్న 2.
కింది వానికి కారణాలు చెప్పండి. (AS1)
ఎ) సజీవ ప్రపంచానికి కిరణజన్యసంయోగక్రియ శక్తికి మూలాధారమని ఎలా చెప్పగలవు?
జవాబు:
జంతువులన్నీ పరపోషకాలు. ఇవి మొక్కలపై ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఆధారపడి జీవిస్తుంటాయి. వీటికి ఆహారాన్ని అందించే ఏకైక క్రియ కిరణజన్యసంయోగక్రియ. కిరణజన్యసంయోగక్రియ ద్వారా మొక్కలు తయారుచేసిన ఆహారం సజీవ ప్రపంచానికి శక్తి ఆధారం అవుతుంది. కావున సజీవ ప్రపంచానికి కిరణజన్యసంయోగక్రియ మూలాధారమని చెప్పవచ్చు.
బి) నిష్కాంతి చర్యను కాంతితో సంబంధం లేకుండా జరిగే చర్య అని పిలవడం సముచితం.
జవాబు:
నిష్కాంతి చర్య ప్రారంభానికి శక్తి గ్రాహ్యకాలు అవసరం. ఇవి కాంతిచర్య నుండి ఏర్పడతాయి. శక్తి గ్రాహ్యకాలు ఏర్పడగానే కాంతి ఉన్నా లేకున్నా నిష్కాంతి చర్య కొనసాగుతుంది. కావున నిష్కాంతి చర్యను కాంతితో సంబంధంలేని చర్య అని పిలవడం సముచితం.
సి) కిరణజన్యసంయోగక్రియలో నిర్వహించే ప్రయోగాలకు ముందు మొక్కలోని పిండిపదార్థం తొలగించాలంటారు. ఎందుకో చెప్పండి.
జవాబు:
కిరణజన్యసంయోగక్రియను పిండిపదార్థం ఏర్పడటం వలన నిర్ధారిస్తారు. అయోడిన్ పరీక్ష జరిపి పిండిపదార్థం ఉంటే కిరణజన్యసంయోగక్రియ జరిగినట్లు భావిస్తారు. ఈ ప్రక్రియలో పత్రంలో పిండిపదార్థం ఉంటే కిరణజన్యసంయోగక్రియ జరగకపోయినా, జరిగేటట్లు ఫలితాలు వస్తాయి. అందువలన కిరణజన్యసంయోగక్రియ నిర్వహించే ప్రయోగాలకు ముందు మొక్కలోని పిండిపదార్థం తొలగిస్తారు.
డి) ఆకుపచ్చటి మొక్కలను సూర్యరశ్మిలో పెట్టి శ్వాసక్రియకు సంబంధించిన ప్రయోగాలు నిర్వహించలేము. ఎందుకు?
జవాబు:
- ఆకుపచ్చని మొక్కలను సూర్యరశ్మిలో ఉంచినపుడు, కిరణజన్యసంయోగక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియలో CO2 గ్రహించబడి O2 వెలువడుతుంది.
- శ్వాసక్రియ ప్రయోగాలలో CO2 విడుదలను నిర్ధారణ చేసి నిరూపిస్తారు.
- పగటి సమయంలో శ్వాసక్రియలో వెలువడిన CO2 కిరణజన్యసంయోగక్రియలో వినియోగించబడుతుంది. కావున శ్వాసక్రియను నిరూపించలేము.
ప్రశ్న 3.
ఈ కింది వానికి ఉదాహరణలివ్వండి. (AS1)
ఎ) జీర్ణక్రియ ఎంజైమ్లు
బి) పరపోషణను పాటించే జీవులు
సి) విటమిన్లు
డి) పోషక ఆహారలోపం వలన కలిగే వ్యాధులు
జవాబు:
ఎ) జీర్ణక్రియ ఎంజైమ్లు : టయలిన్, లైపేజ్, అమిలాప్సిన్, ప్రొటియేజ్, పెప్సిన్ మొదలగునవి.
బి) పరపోషణను పాటించే జీవులు : ఆవు, మేక, పులి, సింహం, మానవుడు
సి) విటమిన్లు : విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి మొదలగునవి.
డి) పోషక ఆహారలోపం వలన కలిగే వ్యాధులు : క్వాషియార్కర్, మెగాస్మస్, నోటిపూత, అంధత్వం.
ప్రశ్న 4.
కిరణజన్యసంయోగక్రియకు కావాల్సిన ముడిపదార్థాలు మొక్కలు ఎక్కడ నుండి గ్రహిస్తాయి? (AS1)
జవాబు:
కిరణజన్యసంయోగక్రియకు కావలసిన పదార్థాలు :
1. కాంతి : మొక్కలు సూర్యుని నుండి కాంతిని గ్రహిస్తాయి. సూర్యశక్తి చిన్నరేణువులుగా భూమిని చేరతాయి. వీటిని ‘ఫోటాన్’ అంటారు. ఫోటాన్లలోని శక్తిని క్వాంటం శక్తి అంటారు.
2. CO2 : గాలిలో CO2 0.03% ఉంటుంది. గాలిలోని CO2 సూర్యరశ్మి మొక్కలు పత్రరంధ్రాల ద్వారా గ్రహిస్తాయి. నీటిలోని మొక్కలు కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ రూపంలో కార్బన్ డై ఆక్సైడ్ పత్రహరితం గ్రహిస్తాయి.
3. నీరు : మొక్కలు నేల నుండి వేర్ల ద్వారా నీటిని గ్రహిస్తాయి. వేర్ల ద్వారా గ్రహించిన నీరు ‘దారువు’ ద్వారా ఇతర భాగాలకు సరఫరా చేయబడుతుంది.
4. పత్రహరితం : ఇది మొక్కల ఆకుపచ్చభాగంలో ఉంటుంది. సూర్యకాంతిని గ్రహించటంలో తోడ్పడుతుంది.
ప్రశ్న 5.
స్వయంపోషణ జరగడానికి కావలసిన పరిస్థితుల గురించి వివరించండి. ఈ చర్యలో ఏర్పడే ఉత్పన్నాలు ఏవి? (AS1)
జవాబు:
- స్వయంపోషణలో ప్రధానమైనది కాంతి స్వయంపోషణ. ఈ ప్రక్రియను కిరణజన్యసంయోగక్రియ అంటారు.
- ఈ క్రియ జరగటానికి మొదటిగా పత్రహరితం అవసరం. దీనితో పాటుగా, నీరు, CO2, సూర్యరశ్మి తప్పనిసరి. ఈ నాలుగు కారకాలు లేకుండా స్వయంపోషణ జరగదు.
- స్వయంపోషణలో చివరిగా పిండిపదార్థం, నీటిఆవిరి మరియు ఆక్సిజన్ ఏర్పడతాయి.
ప్రశ్న 6.
రసాయన సమీకరణం సహాయంతో కిరణజన్యసంయోగక్రియ జరిగే విధానాన్ని ప్లోచార్ట్ సహాయంతో వివరించండి. (AS1)
జవాబు:
కాంతిని ఒక శక్తివనరుగా ఉపయోగించుకొంటూ, అంత్య ఉత్పత్తిగా కార్బోహైడ్రేట్సను తయారుచేయు ఆకుపచ్చని మొక్కలలోని జీవ రసాయనిక చర్యను ‘కిరణజన్యసంయోగక్రియ’ అంటారు.
కిరణజన్యసంయోగక్రియ ప్రధానంగా రెండు దశలలో జరుగుతుంది. అవి :
1. కాంతి చర్య
2. నిష్కాంతి చర్య.
1. కాంతి చర్య :
కాంతి సమక్షంలో జరిగే ఈ రసాయనిక చర్యను కాంతిచర్య అంటారు. ఇది హరితరేణువులోని థైలకాయిడ్ త్వచంలో జరుగుతుంది.
ఎ) ఫోటాలసిస్ :
ఈ ప్రక్రియలో కాంతిరేణువులోని శక్తిని వినియోగించుకొని నీటి అణువు విచ్ఛిన్నం చేయబడుతుంది. ఈ చర్యనే నీటి కాంతివిశ్లేషణ లేదా ఫోటాలసిస్ అంటారు. దీనిని “హిల్” అనే శాస్త్రవేత్త నిరూపించుట వలన “హిల్ చర్య” అంటారు.
బి) ఫోటోఫాస్ఫారిలేషన్ :
ఫోటాన్ కదలిక శక్తిని వినియోగించుకొని పదార్థం మరొక ఫాస్ఫేట్ తో కలిసి ATP గా మారుతుంది. ఈ చర్యను (ఫోటోఫాస్ఫారిలేషన్’ అంటారు.
ADP + P → ATP
సి) క్షయకరణచర్య : ఈ ప్రక్రియ NADH అణువు క్షయకరణం చెంది NADH2 గా మారుతుంది.
2NADH + H2 → 2NADH2
ఈ విధంగా కాంతి చర్యలో ATP, NADH2 లు ఏర్పడతాయి. వీటిని “శక్తిగ్రాహకాలు” అంటారు.
2. నిష్కాంతి చర్య :
కాంతి ప్రమేయం లేకుండా జరిగే ఈ చర్యలు, హరితరేణువులోని అవర్ణికలో జరుగుతాయి. ఈ చర్యలకు కాంతిచర్యలో ఏర్పడిన శక్తి గ్రాహకాలు తప్పనిసరి.
CO2 పదార్థం రిబ్యులోజ్ బై ఫాస్ఫేట్ తో కలిసి హెక్సోజ్ చక్కెరగా మారుతుంది. నిలకడలేని ఈ చక్కెర విచ్ఛిన్నం చెంది ఫాస్ఫాగ్లిజరిక్ ఆమ్లంగా మారుతుంది. ఈ ఫాస్ఫాగ్లిజరిక్ ఆమ్లం కొన్ని వరుస చర్యల తరువాత గ్లూకోజ్ గా మారి, పిండి పదార్థంగా నిల్వ చేయబడుతుంది.
CO2 → రిబ్యులోజ్ బై ఫాస్ఫేట్ → హెక్సోజ్ చక్కెర
హెక్సోజ్ చక్కెర → ఫాస్ఫాగ్లిజరిక్ ఆమ్లం
ఫాస్ఫాగ్లిజరిక్ ఆమ్లం → గ్లూకోజ్
గ్లూకోజ్ → పిండిపదార్ధం
ప్రశ్న 7.
కిరణజన్యసంయోగక్రియలో ఏర్పడే ఏవైనా మూడు అంత్య ఉత్పన్నాల పేర్లు రాయండి. (AS1)
జవాబు:
కిరణజన్యసంయోగక్రియలో గ్లూకోజ్, ఆక్సిజన్ మరియు నీరు అంత్య ఉత్పన్నాలుగా ఏర్పడతాయి. గ్లూకోజ్ పిండి పదార్థంగా మార్చబడి నిల్వ చేయబడుతుంది.
ప్రశ్న 8.
కాంతి చర్య, నిష్కాంతి చర్యల మధ్య సంబంధ పదార్థంగా పనిచేసేది ఏది? (AS1)
జవాబు:
కాంతిచర్య అంత్య ఉత్పన్నాలుగా ATP మరియు NADP లు ఏర్పడతాయి. వీటిని “శక్తి గ్రాహకాలు” అంటారు. వీటిలోని శక్తిని ఉపయోగించుకొని కాంతితో ప్రమేయం లేకుండా నిష్కాంతి చర్యలు ప్రారంభమౌతాయి. ఇవి నిష్కాంతి చర్య ప్రారంభ పదార్థాలు.
ప్రశ్న 9.
చాలా రకాల ఆకుల పైభాగం కింది భాగం కంటే మెరుస్తుంటుంది. ఎందుకు? (AS1)
జవాబు:
ఆకుల అడుగు, పై భాగం అవభాసిని పొరచే కప్పబడి ఉంటుంది. ఆకు అడుగుభాగం కంటే పై భాగాన సూర్యరశ్మి బాగా సోకుతుంది. కావున, సూర్యరశ్మిని తట్టుకోవటానికి అవభాసిని పై తలాల భాగం మందంగా ఉంటుంది. మందమైన అవభాసిని వలన ఆకుల పై భాగం మెరుస్తూ ఉంటుంది.
ప్రశ్న 10.
చక్కని పటం సహాయంతో క్లోరోప్లాస్ట్ నిర్మాణం గురించి వివరించండి. (AS1)
(లేదా)
కిరణజన్య సంయోగ క్రియను నిర్వహించే కణాంగమును పటము సహాయంతో వివరించండి.
జవాబు:
హరితరేణువు నిర్మాణం :
- హరితరేణువులు ఆకులోని పత్రాంతర కణాలలో బాహ్యత్వచం సోమా థైలకాయిడ్ ఉంటాయి.
- ఆకుపచ్చని మొక్కలన్నిటిలో ఉండే హరిత రేణువులు కొవ్వుకణికలు స్ట్రోమా చక్రాభంగా ఉంటాయి.
- హరితరేణువు రెండు త్వచాలను కలిగి ఉంటుంది.
- దీనిలోపలి వర్ణరహిత పదార్థాన్ని అవర్గీక అంటారు.
- అవర్ణికలో దొంతరలుగా ఉండే థైలకాయిడ్లు ఉంటాయి. వీటిని పటలికారాశి లేక ‘గ్రానా’ అంటారు.
- ఇవి అవర్ణికా పటలికలతో కలుపబడి ఉంటాయి.
- పత్రహరితం, దానికి సంబంధించిన ఇతర వర్ణ ద్రవ్యాలు, హరితరేణువులోని థైలకాయిడ్ పొరలలో కొవ్వులో కరిగి ఉంటాయి.
- వర్ణద్రవ్యాలు కాంతిచర్య వ్యవస్థ I (PS I) మరియు కాంతిచర్య వ్యవస్థ II (PS II) లుగా ఉంటాయి.
ప్రశ్న 11.
జీర్ణాశయంలో ఆమ్లం పాత్ర ఏమిటి? (AS1)
జవాబు:
- జీర్ణాశయంలో స్రవించబడే జఠరరసం హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిగి ఉంటుంది.
- ఈ ఆమ్లం లాలాజలం యొక్క క్షార స్వభావాన్ని తగ్గించి జీర్ణ ఎంజైమ్ లు చురుకుగా పనిచేయటానికి తోడ్పడుతుంది.
- ఆహారంతో పాటు ప్రవేశించిన సూక్ష్మజీవులను సంహరించటానికి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉపయోగపడుతుంది.
ప్రశ్న 12.
ఆహారం జీర్ణం చేయడంలో జీర్ణక్రియా ఎంజైమ్ పాత్ర గురించి రాయండి. (AS1)
జవాబు:
- ఆహారం జీర్ణం చేయటంలో ఎంజైమ్స్ కీలకపాత్ర వహిస్తాయి. ఎంజైమ్స్ పనిచేసే పదార్థాలను ‘అదస్తరాలు’ అంటారు.
- పనిచేసే స్వభావాన్ని బట్టి ఎంజైమ్స్ ను వర్గీకరిస్తారు. పిండిపదార్థంపై పనిచేసే ఎంజైమ్స్ ను “అమైలేజ్” అని, ప్రోటీన్స్ పై పనిచేసే వాటిని “ప్రోటియేజ్” అని, కొవ్వులపై పనిచేసే వాటిని “లైపేజ్” అని అంటారు.
- కొన్ని ఎంజైమ్స్ పదార్థాలకు నీటి అణువులను చేర్చి విచ్ఛిన్నం చేస్తాయి. వీటిని “జల విశ్లేషక ఎంజైమ్లు” అంటారు.
- ఎంజైమ్స్ పదార్థాలలోని రసాయన బంధాలను విచ్ఛిన్నం చేసి, వాటిని సరళపదార్థాలుగా మార్చుతాయి. ఈ క్రియనే “జీర్ణక్రియ” అంటారు.
- జీర్ణం కాబడిన సరళపదార్థాలు రక్తంలోనికి శోషణ చెందుతాయి.
ప్రశ్న 13.
ఆహారం శోషించటానికి చిన్నప్రేగు నిర్మాణం ఎలా మార్పు చెంది ఉంటుంది? (AS1)
జవాబు:
చిన్నప్రేగు యొక్క ప్రధాన విధి శోషణ. జీర్ణమైన ఆహార పదార్థాలను రక్తంలోనికి తీసుకోవడాన్ని శోషణ అంటారు. ఈ ప్రక్రియ కొరకు చిన్నప్రేగు నిర్మాణం అనుకూలంగా ఉంటుంది.
- చిన్నప్రేగు పొడవుగా (8 మీటర్లు) ఉండుట వలన జీర్ణమైన ఆహారం పీల్చుకోవటానికి అధిక ప్రదేశం లభిస్తుంది.
- ఎక్కువ పొడవుగల కొద్ది ప్రదేశంలో అమరి ఉండటానికి చిన్నప్రేగు అనేక ముడతలు చుట్టుకొని ఉంటుంది.
- చిన్నప్రేగు యొక్క లోపలి గోడలు ముడతలు పడి వ్రేళ్ళవంటి నిర్మాణాలు ఏర్పరుస్తుంది. వీటిని ఆంత్రచూషకాలు అంటారు. ఇవి శోషణాతల వైశాల్యం పెంచుతాయి.
- ఆంత్రచూషకాలు, రక్తనాళాలు మరియు శోషరసనాళాలను కలిగి ఉండి శోషణ ప్రక్రియను నిర్వహిస్తాయి.
ప్రశ్న 14.
కొవ్వులు ఎలా జీర్ణమవుతాయి? ఎక్కడ జీర్ణమవుతాయి? (AS1)
జవాబు:
- జీర్ణవ్యవస్థలో కొవ్వులు ఆంత్రమూలంలో జీర్ణమౌతాయి. కొవ్వులను జీర్ణం చేసే ఎంజైమ్స్ ను “లైపేజ్”లు అంటారు.
- కాలేయంచే స్రవించబడే పైత్యరసం, కొవ్వు పదార్థాలను చిన్న అణువులుగా విడగొట్టుతుంది. ఈ ప్రక్రియను “ఎమల్సీకరణం” అంటారు.
- క్లోమం, క్లోమరసాన్ని స్రవిస్తుంది. దీనిలోని లైపేజ్ అనే ఎంజైమ్ కొవ్వులపై పనిచేసి కొవ్వు ఆమ్లాలుగా, గ్లిజరాల్ గా మార్చుతుంది.
- గ్లిజరాల్ కొవ్వు యొక్క సరళ అంత్య ఉత్పన్నం. ఇది చిన్న ప్రేగులోని శోషరసనాళం ద్వారా శోషణ చెంది శరీరానికి సరఫరా అవుతుంది.
ప్రశ్న 15.
ఆహారం జీర్ణం కావడంలో లాలాజలం పాత్ర ఏమిటి? (AS1)
జవాబు:
లాలాజలం ఆహారాన్ని ముద్దగా మార్చటంతోపాటు జీర్ణక్రియలో కూడా పాల్గొంటుంది. లాలాజలం టయలిన్ అనే ఎంజైమ్ కలిగి ఉంటుంది. ఇది పిండిపదార్థాలపై పనిచేసి వాటిని చక్కెరలుగా మార్చుతుంది. కావున నోటిలో నమిలిన ఆహారం కొంచెం సేపటికి తియ్యగా మారుతుంది.
ప్రశ్న 16.
జీర్ణవ్యవస్థలో చిన్న ప్రేగులు క్రమంగా ఆమ్లయుతంగా మారితే, ప్రోటీన్లు జీర్ణం కావటంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? (AS1)
జవాబు:
- చిన్నప్రేగులో అంత్య జీర్ణక్రియ జరుగుతుంది. చిన్న ప్రేగు గోడలు స్రవించే ఆంత్రరసం ఈ క్రియలో పాల్గొంటుంది.
- ఆంత్రరసంలోని పెప్టిడేజెస్ ఎంజైమ్ పెప్టైడ్స్ పై చర్య జరిపి వాటిని అమైనో ఆమ్లాలుగా మార్చుతుంది.
- ఈ చర్య తటస్థ మాధ్యమంలో చురుకుగా జరుగుతుంది. చిన్న ప్రేగు క్రమంగా ఆమ్లయుతంగా మారితే, ఈ జీర్ణక్రియ నెమ్మదించి, ప్రోటీన్స్ జీర్ణక్రియ అసంపూర్తి అవుతుంది.
ప్రశ్న 17.
జీర్ణనాళంలో పీచు పదార్థాల పాత్ర ఏమిటి? (AS1)
జవాబు:
పీచు పదార్థాలు జీర్ణనాళంలో జీర్ణం కావు. ఇవి ఎటువంటి పోషక విలువలు కలిగి ఉండవు. అయినప్పటికి జీర్ణక్రియలో కీలకపాత్ర వహిస్తాయి.
పీచుపదార్థాలు జీర్ణనాళంలోని ఆహారానికి బరువును చేకూర్చుట వలన ఆహారం సులువుగా కదులుతుంది. పీచుపదార్థం ఆహారనాళాలను శుభ్రం చేయటానికి తోడ్పడుతుంది. ఆహార కదలికలు సులువుగా ఉండుట వలన మలబద్దకం నివారించబడుతుంది. కావున మన ఆహారంలో పీచుపదార్థాలకు ప్రాధాన్యం ఉంది.
ప్రశ్న 18.
పోషకాహార లోపం అంటే ఏమిటి? ఏవైనా కొన్ని పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధుల గురించి రాయండి. (AS1)
జవాబు:
పోషకాహార లోపం :
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాలు లోపించిన ఆహారాన్ని తీసుకోవటం వలన జీవక్రియలో ఏర్పడే అసమతుల్యతను ‘పోషకాహార లోపం’ అంటారు.
పోషకాహార లోపం వలన కలిగే వ్యాధులు :
క్వాషియార్కర్ (Kwashiorkor)
ఇది ప్రోటీన్ లోపం వలన కలిగే వ్యాధి. శరీరంలోని కణాంతరావకాశాలలో నీరు చేరి శరీరమంతా ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. కండరాల పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. కాళ్ళు, చేతులు, ముఖం బాగా ఉబ్బి ఉంటాయి. పొడిబారిన చర్మం, విరేచనాలతో బాధపడుతూ ఉంటారు.
మెరాస్మస్ (Marasmus)
ఈ వ్యాధి ప్రోటీన్లు, కేలరీలు రెండింటి లోపం వల్ల కలుగుతుంది. సాధారణంగా ఈ వ్యాధి వెంటవెంటనే గర్భం దాల్చడం వల్ల పుట్టే పిల్లల్లో లేదా ఎక్కువ కాన్సులయిన తల్లికి పుట్టేపిల్లల్లో సంభవిస్తుంది. ఈ వ్యాధిగ్రస్తులలో నిస్సత్తువగా, బలహీనంగా ఉండడం, కీళ్ళవాపు, కండరాలలో పెరుగుదల లోపం, పొడిబారిన చర్మం, విరేచనాలు మొదలైన లక్షణాలుంటాయి.
ప్రశ్న 19.
ఫంగె, బాకీరియాల వంటి జీవులలో పోషణ ఎలా జరుగుతుంది? (AS1)
జవాబు:
- ఫంగై, కొన్ని బాక్టీరియాలు, మృతకళేబరాలను కుళ్ళబెట్టి వాటి పోషకాలను గ్రహించుకుంటాయి.
- ఇవి జీర్ణరసాలను తమ పరిసర మాధ్యమంలోనికి స్రవించి పదార్థాలను జీర్ణం చేస్తాయి. జీర్ణమైన పదార్థాలను తరువాత శోషించుకుంటాయి.
- ఇటువంటి పోషణ విధానాన్ని ‘పూతికాహారపోషణ’ అంటారు. వీటిని పూతికాహారులు అంటారు.
ప్రశ్న 20.
గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం క్రమంగా పెరుగుతూ పోతుంటే అది కిరణజన్యసంయోగక్రియ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? (AS2)
జవాబు:
- గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం పెరుగుతుంటే కిరణజన్యసంయోగక్రియ రేటు క్రమంగా పెరుగుతుంది.
- ‘FACE’ ప్రయోగాలు అనుసరించి గాలిలో CO2 మోతాదు 475 నుండి 600 PPM కు పెరిగినపుడు కిరణజన్య సంయోగక్రియ రేటు 40% పెరిగింది.
- ఈ విలువకు మించి CO2 పెరిగినపుడు, కిరణజన్యసంయోగక్రియరేటు 40% పడిపోయింది.
- అధిక CO2 గాఢతలో పత్రరంధ్రాలు మూసుకుపోయి, వాయువును గ్రహించిన స్థితికి పత్రం చేరి కిరణజన్యసంయోగక్రియ రేటు పడిపోతుంది.
ప్రశ్న 21.
కిరణజన్యసంయోగక్రియ రేటు కంటే శ్వాసక్రియ రేటు ఎక్కువైతే ఏమౌతుంది? (AS2)
జవాబు:
- కిరణజన్యసంయోగక్రియలో CO2 గ్రహించబడి ), వెలువడుతుంది.
- అదేవిధంగా శ్వాసక్రియలో O2 గ్రహించబడి CO2 వెలువడుతుంది.
- ప్రకృతిలో ఈ రెండు క్రియలు సమతాస్థితిని పాటిస్తూ, వాయుస్థిరత్వానికి తోడ్పడుతున్నాయి.
- కిరణజన్యసంయోగక్రియ రేటు పెరిగితే, గాలిలో CO2 శాతం తగ్గి O2 శాతం బాగా పెరుగుతుంది.
- అధిక ఆక్సిజన్ గాఢతలో జీవులు జీవించలేవు. అది మరణానికి దారితీస్తుంది.
- కావున కిరణజన్యసంయోగక్రియ రేటు పెరగటం ప్రమాదకరం. రెండు క్రియలు సమతాస్థితిలో ఉండటం ప్రకృతి ధర్మం.
ప్రశ్న 22.
పిండిపదార్థాలు జీర్ణాశయంలో జీర్ణంకావని ఎలా చెప్పగలవు? (AS2)
జవాబు:
- జీర్ణాశయంలో జఠరరసం స్రవించబడి జీర్ణక్రియను నిర్వహిస్తుంది.
- జఠరరసంలో రెనిన్, లైపేజ్, పెప్సిన్ అనే ఎంజైమ్స్ ఉంటాయి.
- రెనిన్ పాల ప్రోటీన్స్ మీద పనిచేయగా, లైపేజ్ కొవ్వుల మీద, పెప్సిన్ ప్రోటీన్స్ మీద పనిచేసి వాటిని సరళ పదార్థాలుగా మార్చుతాయి.
- జఠరరసంలో పిండి పదార్థం పై పనిచేసే ఎంజైమ్స్ లేవు. కావున జీర్ణాశయంలో పిండిపదార్థాలు జీర్ణం కావు.
ప్రశ్న 23.
ఆకులలో పిండిపదార్థాన్ని పరిశీలించటానికి మీరు మీ పాఠశాల ప్రయోగశాలలో అనుసరించిన విధానాన్ని తెలపండి. (AS3)
(లేదా)
ఆకులలో పిండి పదార్థాన్ని పరీక్షించే కృత్యాన్ని రాయండి. (కృత్యం -1)
(లేదా)
ఆకులలో పిండిపదార్థం ఉంటుందని నిరూపించే ప్రయోగంలో కావలసిన పరికరాలు, ప్రయోగ విధానము తెలిపి దాని నుండి వచ్చిన ఫలితంతో నీవేమి గ్రహించావో రాయండి.
జవాబు:
కావలసిన పరికరాలు :
త్రిపాది, బీకరు, నీరు, మిథైలేటెడ్ స్పిరిట్, పరీక్షనాళికలు, అయోడిన్ ద్రావణం, పెట్రెడిష్, డ్రాపర్, బున్సె న్ బర్నర్.
ప్రయోగ విధానం :
- కుండీలో పెరుగుతున్న ఏదైనా మొక్క నుండి ఒక ఆకును తీసుకోండి. ఆ ఆకు మెత్తగా పలుచనదై ఉండాలి.
- బొమ్మలో చూపిన విధంగా ప్రయోగానికి కావలసిన పరికరాలను సిద్ధం చేసుకోండి.
- పరీక్షనాళికలో మిథైలేట్ స్పిరిట్ ను తీసుకొని అందులో ఆకును ఉంచండి.
- పరీక్షనాళికను నీరు కలిగిన బీకరులో ఉంచి వేడి చేయండి.
- వేడి చేసినపుడు ఆకులోని పత్రహరితం (Chlorophyll) తొలగించబడుతుంది. అందువల్ల ఆకు లేత తెలుపు రంగులోకి మారుతుంది.
ఫలితం : ఆకు ముదురు నీలం రంగులోకి మారినది.
గ్రహించినది : ఆకులలో పిండిపదార్థం ఉంటుందని గ్రహించితిని.
ప్రశ్న 24.
ఆకుపచ్చని మొక్కను సూర్యకాంతిలో ఉంచినపుడు, ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి అనటానికి నీవు ఎలాంటి ప్రయోగం చేస్తావు? (AS3)
(లేదా)
కాంతి సమక్షంలో మొక్కలు కిరణజన్య సంయోగక్రియను నిర్వర్తించేటపుడు ఆక్సిజన్ వెలువడుతుంది అని నిరూపించే ప్రయోగాన్ని వివరించండి.
జవాబు:
ఉద్దేశం :
కిరణజన్యసంయోగక్రియలో ఆక్సిజన్ ఏర్పడుతుందని నిరూపించుట.
కావలసిన పరికరములు :
1. గాజుబీకరు 2. గాజుగరాటు 3. పరీక్షనాళిక 4. హైడ్రిల్లా మొక్కలు 5. నీరు
ప్రయోగ విధానం :
- కొన్ని హైడ్రిల్లా మొక్కలను తీసుకుని వాటిని వెడల్పు మూతిగల గరాటులో ఉంచవలెను.
- హైడ్రిల్లా మొక్కలతో కూడిన గరాటును, దాని కాడ పైకి ఉండునట్లుగా ఒక బీకరులో ఉంచవలెను.
- గరాటు కాడ పూర్తిగా మునుగు వరకు బీకరులో నీరు పోయవలెను.
- ఒక పరీక్ష నాళికను పూర్తిగా నీటితో నింపి, గాలి బుడగలు లేకుండా జాగ్రత్త వహించి, దానిని పటములో చూపినట్లు పరీక్ష నాళిక మూతి నీటిలో ఉండేటట్లు, గరాటు కాడపై బోర్లించవలెను.
- ఈ ప్రయోగమును సూర్యరశ్మిలో ఉంచవలెను. కొంచెం సేపు తర్వాత ఆ మొక్కల నుండి గాలిబుడగలు పైకి రావడం గమనిస్తాము.
- ఈ రగలు పరీక్ష నాళిక కొనభాగానికి చేరతాయి. అపుడు పరీక్ష నాళికల నీటిమట్టం తగ్గుతుంది.
- గాలిబుడగలు తగినంత చేరిన తర్వాత పరీక్షనాళిక మూతిని బొటనవేలితో మూసి నీటి నుండి పైకి తీసి వెలుగుతున్న పుల్లతో ఆ గాలిని పరీక్షించ వలెను.
- ఆ వెలుగుతున్న పుల్ల మరింత ఎక్కువ కాంతితో మండుతుంది.
నిర్ధారణ :
వస్తువులను ఎక్కువ కాంతివంతముగా మండించే ధర్మము ఆక్సిజనకు కలదు. కాబట్టి ఇక్కడ హైడ్రిల్లా మొక్కల నుండి వెలువడిన వాయువు ఆక్సిజన్ వాయువు అనియు, అది మొక్కలు కిరణజన్యసంయోగక్రియ జరిపినపుడు విడుదల అయినదనియు ఋజువగుచున్నది.
ప్రశ్న 25.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి పౌష్టికాహార లోపంతో బాధపడుచున్న వేరువేరు వయస్సు ఉన్న పిల్లల సమాచారాన్ని సేకరించి మీ సొంత పట్టికలో నమోదు చేసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
ప్రశ్న 26.
భూమిపైన ఆకుపచ్చని మొక్కలు లేకపోతే, భూమిపైన జీవరాశి మనుగడ కష్టమౌతుందా? దీనిని ఎలా సమర్థిస్తావు? (AS5)
జవాబు:
- భూమిపై అన్ని జీవరాశులకు కావలసిన ఆహారాన్ని ఆక్సిజన్‌ను అందించే ఏకైక ప్రక్రియ కిరణజన్యసంయోగక్రియ.
- భూమి మీద ఆకుపచ్చని మొక్కలు లేకపోతే, వాతావరణంలోనికి ఆక్సిజన్ తిరిగి చేరదు. కావున జీవులు మనుగడ సాగించలేవు.
- జంతువులన్నీ కూడా మొక్కలపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆహారం కొరకు ఆధారపడతాయి. కావున మొక్కలు లేకుండా ఈ జీవులు మనుగడ సాగించలేవు.
ప్రశ్న 27.
మీరు పరిశీలించిన పత్రరంధ్రం పటం గీయండి. కిరణజన్యసంయోగక్రియలో దీని పాత్రను తెలపండి. (AS5)
జవాబు:
- కిరణజన్యసంయోగక్రియలో CO2 గ్రహించబడి ఆక్సిజన్ వెలువడుతుంది.
- ఈ వాయు వినిమయం పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది.
- పత్ర రంధ్రాలు మొక్కకు ముక్కువంటివి. ఇవి శ్వాసించటానికి మరియు కిరణజన్యసంయోగక్రియలో వాయు వినిమయానికి ఉపయోగపడతాయి.
- కిరణజన్యసంయోగక్రియలో గ్రహించబడే కార్బన్ డై ఆక్సైడ్ పత్రరంధ్రాలచే నియంత్రించబడుతుంది.
- రక్షక కణాల సడలింపు వ్యాకోచం వలన పత్రరంధ్ర పరిమాణం మారుతూ, వాయు వినిమయాన్ని నియంత్రిస్తుంది.
ప్రశ్న 28.
మానవుని జీర్ణవ్యవస్థ పటం గీచి, భాగాలు గుర్తించండి. ఏ ఏ భాగాలలో పెరిస్టాల్టిక్ చలనం ఉంటుందో, జాబితా రాయండి. (AS5)
జవాబు:
మానవుని జీర్ణవ్యవస్థలో ఈ క్రింది భాగాలలో పెరిస్టాల్టిక్ చలనం కనిపిస్తుంది.
1. ఆహారవాహిక :
ఆహారవాహికలో పెరిస్టాల్టిక్ చలనం వలన ఆహారం నోటి నుండి జీర్ణాశయం చేరుతుంది.
2. జీర్ణాశయం :
జీర్ణాశయంలోని పెరిస్టాల్టిక్ చలనాల వలన ఆహారం బాగా కలియబెట్టబడి చిలకబడుతుంది.
3. చిన్నప్రేగులు :
చిన్నప్రేగులలో పెరిస్టాల్టిక్ చలనం వలన చిన్నగా ముందుకు కదులుతూ శోషించబడుతుంది. శోషించబడని ఆహారం పెద్ద ప్రేగులకు చేరుతుంది.
4. పెద్ద ప్రేగు :
పెద్ద ప్రేగులో ఆహారంలోని నీరు పీల్చుకోబడి, వ్యర్థ పదార్థం ముందుకు నెట్టబడుతుంది.
ప్రశ్న 29.
ఆహారనాళంలో వివిధ అవయవాల గుండా ఆహారం ప్రయాణించే విధానాన్ని ప్రదర్శించేందుకు రహీమ్ ఒక నమూనాను తయారుచేశాడు. దానిని పరిశీలించండి. అవయవాల పేర్లు రాయండి. (AS5)
జవాబు:
ప్రశ్న 30.
కింది పటాన్ని పరిశీలించండి. కాంతి, నిష్కాంతి చర్యల గురించి మీరేమి అర్థం చేసుకున్నారో రాయండి. (AS5)
జవాబు:
పటం ఆధారంగా అర్థంచేసుకొన్న విషయాలు :
- కిరణజన్యసంయోగక్రియ రెండు దశలలో జరుగుతుంది. కాంతి అవి :
1. కాంతి చర్యలు
2. నిష్కాంతి చర్యలు - కాంతి చర్యలు హరిత రేణువులలోని గ్రానాలో జరుగుతాయి. ఈ చర్యలలో సౌరశక్తి పత్రహరితంచే గ్రహించబడుతుంది.
- కాంతి శక్తి ఆధారంగా నీటి అణువు విచ్చిన్నం చెందుతుంది. ఈ ప్రక్రియను ‘నీటి కాంతివిశ్లేషణ’ లేదా ‘ఫోటాలసిస్’ అంటారు.
- ఫోటాలసిలో ఏర్పడిన ఫోటాన్ చలనం ఆధారంగా ATP, NADPH పదార్థాలు ఏర్పడతాయి. వీటిని శక్తి గ్రాహకాలు అంటారు.
- శక్తిగ్రాహకాలు, నిష్కాంతి చర్యలో వినియోగించబడతాయి.
- నిష్కాంతిచర్యలో ‘రిబ్యులోజ్ బై ఫాస్ఫేట్’ అనే మాధ్యమిక పదార్థం CO2 ను గ్రహించి చక్కెరగా మారుతుంది.
- ఈ చక్కెర అనేక మార్పుల అనంతరం పిండి పదార్థంగా మారుతుంది.
- కాంతి పిండి పదార్థం రిబ్యులోజ్ బై ఫాస్పేట్ పునరుద్ధరణకు ఉపయోగించబడుతుంది.
- ఈ వలయ చర్యలను వివరించిన కెల్విన్ పేరు మీదుగా నిష్కాంతి చర్యను ‘కెల్విన్ వలయం’ అంటారు.
ప్రశ్న 31.
దాదాపు జీవ ప్రపంచమంతా ఆహారం కోసం మొక్కల పైనే ఆధారపడుతోంది కదా! ఆకుపచ్చని మొక్కలు ఆహారం తయారుచేసే విధానాన్ని నీవు ఎలా అభినందిస్తావు? (AS6)
జవాబు:
- ఆకుపచ్చని మొక్కలు ఆహారం తయారుచేసే కిరణజన్యసంయోగక్రియ ఒక అద్భుతమైన జీవక్రియ.
- ఈ జీవక్రియ సమస్త జీవరాశికి ఆహారం అందిస్తుంది. అన్ని జీవరాశులు తమ ఆహారం కొరకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ జీవక్రియపై ఆధారపడుతున్నాయి.
- జీవులకు ఆహారం అందించుటయేగాక, ఆక్సిజన్‌ను అందించే అద్భుత ప్రక్రియ కిరణజన్యసంయోగక్రియ. ఈ క్రియ ఆధారంగానే మనం శ్వాసించటానికి కావలసిన ఆక్సిజన్ లభిస్తుంది.
- మనకు జీవనాధారమైన ఈ క్రియ కొరకు మనం చెట్లపై ఆధారపడి ఉన్నాము. కావున చెట్లను పెంచడం, వాటిని రక్షించటం మన మనుగడకు ఆవశ్యకమని గుర్తించాలి.
- అద్భుతమైన కిరణజన్యసంయోగక్రియ, జీవక్రియ కోసం నేను చెట్లు పెంచుతాను.
ప్రశ్న 32.
గట్టిగా ఉండే ఆహార పదార్థాలు సైతం జీర్ణక్రియలో మెత్తని గుజ్జుగా మారిపోతాయి. అలాగే ఎక్కడ ఏ రకమైన ఎంజైమ్ అవసరమో ఆ ప్రత్యేక ప్రదేశంలోనే ఆ ఎంజైమ్ విడుదలవుతుంది. ఆశ్చర్యం కలిగించే ఈ అంశాలను సూచిస్తూ ఒక కార్టూన్ గీయండి. (AS7)
జవాబు:
ప్రశ్న 33.
ఈ పాఠం చదివిన తరువాత నీవు నీ ఆహారపు అలవాట్లలో ఏ ఏ మార్పులు చేసుకొంటావు? (AS7)
జవాబు:
ఈ పాఠం చదివిన తరువాత నా ఆహారపు అలవాట్లలో కింది మార్పులు చేసుకొన్నాను.
- ఆహారాన్ని తినేటప్పుడు బాగా నమిలి మింగుతున్నాను. అందువలన జీర్ణక్రియ సులభంగా జరుగుతున్నది.
- సరళమైన ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇస్తున్నాను. తద్వారా, జీర్ణక్రియ చురుకుగా పనిచేస్తున్నది.
- ఆహారపదార్థం, కాయలు, పండ్లకు ప్రాధాన్యం ఇవ్వటం వలన పీచు పదార్థం లభిస్తున్నది.
- భోజనానికి ముందు చేతులు పరిశుభ్రంగా కడగటం వలన సూక్ష్మజీవుల ప్రవేశం నివారిస్తున్నాను.
- భోజనం చేసేటప్పుడు మాట్లాడకుండా మౌనంగా భోజనం చేస్తున్నాను.
10th Class Biology 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ Textbook InText Questions and Answers
10th Class Biology Textbook Page No. 4
ప్రశ్న 1.
కిరణజన్యసంయోగక్రియకు కావలసిన పదార్థాలన్నీ సమీకరణంలో ఇమిడి ఉన్నాయని చెప్పగలమా?
జవాబు:
కిరణజన్యసంయోగక్రియ సమీకరణం :
ఈ సమీకరణంలో కిరణజన్యసంయోగక్రియకు అవసరమైన CO2, నీరు, కాంతి, పత్రహరితంతో పాటు, అంత్య ఉత్పన్నాలు కూడా సూచించబడ్డాయి.
10th Class Biology Textbook Page No. 5
ప్రశ్న 2.
ప్రయోగ అమరికను కదపకుండా పుదీనా మొక్కను గంట జాడిలో ప్రవేశపెట్టడానికి ‘జోసఫ్ ప్రీస్టే’ ఏం చేసి ఉంటాడు?
జవాబు:
ప్రయోగ అమరికను కదపకుండా పుదీనా మొక్కను గంట జాడిలో ప్రవేశపెట్టటం సాధ్యం కాదు. వాస్తవానికి జోసఫ్ ప్రీస్టే ‘గంట జాడిలో ఎలుకను ఉంచి అది జీవించిన సమయాన్ని లెక్కించాడు. రెండవ సారి పుదీనా మొక్కను గంట జాడిలో ఉంచి ఎలుక జీవించి ఉన్న సమయం అధికంగా ఉండటం గమనించాడు. ఇదే ప్రయోగాన్ని రెండు గంటజాడీలతో ఒకే సమయంలో నిర్వహించవచ్చు.
ప్రశ్న 3.
గంటజాడీ వెలుపల నుండి క్రొవ్వొత్తిని ఎలా వెలిగించి ఉంటాడు?
జవాబు:
వాస్తవానికి ప్రీస్టే తన ప్రయోగంలో కొవ్వొత్తిని వెలిగించి దానిపైన గంట జాడిని బోర్లించాడు. గంట జాడి వెలుపల నుండి క్రొవ్వొత్తిని వెలిగించటానికి, ఎలక్ట్రిక్ స్పార్క్ వంటి ఆధునిక పరికరాలు ఉపయోగించవలసి ఉంటుంది.
ప్రశ్న 4.
కొవ్వొత్తికి, ఎలుకకు, పుదీనా మొక్కకు మధ్య మీరు ఏమైనా సంబంధాన్ని గుర్తించారా?
జవాబు:
జంతువుల శ్వాసక్రియలో – కొవ్వొత్తి మండే ప్రక్రియలో వినియోగించబడుతున్న వాయువు పుదీనా మొక్కచే భర్తీ చేయబడుతుంది. జీవుల శ్వాసక్రియలో ఆక్సిజన్ వినియోగించబడగా, మొక్కలు కిరణజన్యసంయోగక్రియ ద్వారా ఆక్సిజనన్ను విడుదల చేస్తాయి.
10th Class Biology Textbook Page No. 9
ప్రశ్న 5.
వివిధ రంగులు కలిగిన ఆకులు కూడా కిరణజన్యసంయోగక్రియను నిర్వహిస్తాయా?
జవాబు:
ఆకులో పత్రహరితం ప్రధాన వర్ణద్రవ్యంగా ఉన్నప్పటికీ, ఇతర రంగులకు కలిగించే వర్ణకాలు కూడా కిరణజన్య సంయోగక్రియను నిర్వహిస్తాయి. కెరొటిన్, జాంథోఫిల్ వంటి వర్ణదాలు ఆకులలో పసుపు, ఎరుపు వర్ణకాలను ఏర్పరచి కిరణజన్యసంయోగక్రియను నిర్వహిస్తాయి.
ప్రశ్న 6.
మొక్కల్లో పత్రహరితం మరియు ఇతర వర్ణదాలు ఎక్కడ ఉంటాయి?
జవాబు:
మొక్కలలో పత్రహరితం మరియు ఇతర వర్ణదాలు హరితరేణువులో ఉంటాయి. హరితరేణువులోని థైలకాయిడ్ త్వచములో కిరణజన్య సంయోగక్రియ నిర్వహించే వర్ణదాలు అమరి ఉంటాయి.
ప్రశ్న 7.
మొక్కలలో కిరణజన్యసంయోగక్రియ జరిగే భాగాల పేర్లు చెప్పండి.
జవాబు:
మొక్కలలోని ఆకుపచ్చని భాగాలయిన పత్రాలు కిరణజన్యసంయోగక్రియ ప్రధాన వనరులు. వీటితో పాటుగా లేత కాండాలు, మొగ్గలు, కిరణజన్యసంయోగక్రియను నిర్వహిస్తాయి.
ప్రశ్న 8.
మొక్కలలో నూతనంగా ఏర్పడే ఎరుపురంగు చిగురాకులు కూడా కిరణజన్యసంయోగక్రియను నిర్వహిస్తాయని భావిస్తున్నారా?
జవాబు:
అవును. లేత ఆకులలో ఉండే కెరొటిన్, జాంథోఫిల్ వర్ణకాలు కిరణజన్యసంయోగక్రియను నిర్వహిస్తాయి. ఆకు పెరిగే కొలది వాటిలో పత్రహరితం తయారౌతుంది.
10th Class Biology Textbook Page No. 15
ప్రశ్న 9.
మనం తిన్న ఆహారం శరీరం లోపలికి వెళ్ళిన తరువాత ఏమౌతుంది?
జవాబు:
మనం తిన్న ఆహారం శరీరంలోనికి వెళ్ళిన తరువాత, జీర్ణవ్యవస్థలోని వివిధ భాగాలలో జీర్ణమై చిన్న ప్రేగులోకి పీల్చుకొనబడుతుంది.
10th Class Biology Textbook Page No. 18
ప్రశ్న 10.
జీర్ణక్రియా విధానం గురించి నీవు ఏమనుకొంటున్నావు?
జవాబు:
జీర్ణక్రియ చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. జీర్ణవ్యవస్థ ఆహారం వివిధ ప్రాంతాల గుండా ప్రయాణిస్తూ జీర్ణమౌతుంది. జీర్ణక్రియ ఒక్కసారిగా కాకుండా దశల వారీగా ముందుకు కొనసాగుతుంది.
ప్రశ్న 11.
జీర్ణక్రియలో జరిగే ప్రధాన దశలు ఏవి?
జవాబు:
జీర్ణక్రియలో ప్రధానంగా నాలుగు దశలు ఉంటాయి. అవి :
- అంతర గ్రహణం
- జీర్ణక్రియ
- శోషణ
- మలవిసర్జన
10th Class Biology 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ Textbook Activities (కృత్యములు)
కృత్యం – 1: ఆకులలో పిండిపదార్థం
పత్ర పరిశీలన :
1. ఆకును వాచ్ గ్లాస్ లేదా పెట్రెడిష్ లో మడతలు పడకుండా వెడల్పుగా పరచండి. దానిపైన కొన్ని చుక్కలు అయోడిన్ లేదా బెటాడిన్ ద్రావణాన్ని చుక్కలు చుక్కలుగా వేయండి. పత్రాన్ని పరిశీలించండి. మీరు ఏమి మార్పులను గమనించారు?
జవాబు:
పత్రం నీలి రంగుగా మారింది.
2. కిరణజన్యసంయోగక్రియ ద్వారా కాంతిశక్తి రసాయనిక శక్తిగా మార్చబడుతుందని మీరు భావిస్తున్నారా?
జవాబు:
ఔను. కిరణజన్యసంయోగక్రియ ప్రారంభంలో శక్తి సూర్యుని నుండి గ్రహించబడుతుంది. ఈ సౌరశక్తి ఆధారంగా మొక్కలు ఆహారం తయారు చేస్తాయి. కావున సౌరశక్తి ఆహారంలో నిల్వ ఉంటే రసాయనిక శక్తిగా మార్చబడినది.
కృత్యం -2 : కిరణజన్యసంయోగక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ ఆవశ్యకత
2. కిరణజన్యసంయోగక్రియకు CO2 అవసరం అని ఎలా నిరూపిస్తావు?
(లేదా)
కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డై ఆక్సైడ్ అవసరమని నిరూపించే కృత్యాన్ని రాయండి.
జవాబు:
ఉద్దేశం : కిరణజన్యసంయోగక్రియకు CO2 అవసరమని నిరూపించుటకు
కావలసిన పరికరములు :
- కుండీలో పెరుగుచున్న పొడవాటి వెడల్పు తక్కువగల ఆకుపచ్చని ఆకులు గల మొక్క.
- వెడల్పు మూతిగల గాజుసీసా.
- సీసామూతికి సరిపడు కార్కు (రెండుగా చీల్చబడినది.)
- అయోడిన్ పరీక్షకు కావలసిన పరికరాలు.
ప్రయోగ విధానం :
- పొడవాటి, వెడల్పు తక్కువ ఆకులు గల కుండీలో వున్న మొక్కను ఎంచుకోవాలి.
- ఆ మొక్కకు రెండు లేక మూడు రోజులు సూర్యరశ్మి తగులకుండా ఉంచాలి. దీనివలన ఆకులలో పిండిపదార్థం తయారవ్వదని నిర్ధారణ చేసుకోవచ్చు.
- వెడల్పు మూతిగల గాజుసీసాను, దానికి సరిపోయే బెండుమూతను తీసుకోవాలి. బెండుమూతను మధ్యగా కోసి రెండు భాగాలు చేయాలి.
- ప్రయోగం చేసేముందు ఆ సీసాలో కొంచెం పొటాషియం హైడ్రాక్సైడు ద్రావణం పోయాలి. ఇది సీసాలో ఉండే గాలిలోని కార్బన్ డై ఆక్సైడును పీల్చివేస్తుంది.
- ప్రయోగం చేసే రోజున ఉదయం, ఎంచిన ఆకు అర్ధభాగాన్ని, రెండుగా చీల్చిన కార్కు మధ్య భాగంలో ఉంచి, పటంలో చూపినట్లు, గాజుసీసాలోకి ఉంచాలి. ఈ ఆకును మొక్క నుండి వేరుచేయరాదు.
- ఆకు చివరివైపు భాగం సీసాలో ఉంటే, దాని కింద భాగం కార్కుకు పై భాగాన ఉంటుంది.
- సీసా మూతికి చుట్టూ గాలి చొరబడకుండా గ్రీజు కాని, వేజ్ లైను గాని పూయాలి.
- సీసాలో పోసిన క్షారద్రావణం ఆకుకు తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి.
- అలా అమర్చిన మొక్కను 3 – 4 గంటలు ఎండలో ఉంచాలి.
- తరువాత ఆ ఆకును సీసా నుండి తీసి, మొక్క నుండి వేరుచేసి పిండిపదార్థం కొరకు అయోడితో పరీక్షించాలి.
- సీసాలోవున్న పత్రం చివరిభాగం నీలిరంగుగా మారదు. కారుపై వున్న పత్రభాగం పిండిపదార్థం తయారుచేసికొనుట వలన నీలిరంగులోకి మారుతుంది.
ప్రయోగ ఫలితం :
సీసాలోని కార్కు వెలుపల ఉన్న పత్రభాగాలు రెండూ కూడా సూర్యకాంతిని పొంది నీరు, హరితరేణువులను కలిగి ఉంటాయి. సీసాలో ఉండే పత్రభాగానికి కార్బన్ డై ఆక్సైడు లభించలేదు. అందువలన అక్కడ పిండిపదార్థం తయారుకాలేదు. అందుచేతనే అయోడిన్ పరీక్ష చేసినపుడు ఆ భాగం నీలిరంగుగా మారలేదు.
నిర్ధారణ :
దీనిని బట్టి కిరణజన్యసంయోగక్రియకు కార్బన్ డై ఆక్సైడు అవసరమని ఋజువగుచున్నది.
గ్రహించినది :
1. మొక్కను మొదట చీకటిలో ఉంచిన తరువాత వెలుతురులో ఉంచటానికి కారణం ఏమిటి?
జవాబు:
మొక్కను చీకటిలో ఉంచినపుడు, పత్రంలో నిల్వ ఉన్న పిండి పదార్థం వినియోగింపబడుతుంది. తిరిగి కిరణజన్య సంయోగక్రియ జరిగి పిండిపదార్ధం ఏర్పడడానికి, మొక్కను తిరిగి సూర్యరశ్మిలో ఉంచారు.
2. ఈ ప్రయోగంలో రెండు ఆకులను ఎందుకు పరీక్షించాలి?
జవాబు:
మొదటి ఆకును CO2 అందించకుండా, రెండవ ఆకుకు CO2 అందించి పరీక్షించుట వలన ఫలితాలను స్పష్టంగా నిర్ధారించవచ్చు. ఈ ప్రయోగంలో CO2 అందించని పత్రంలో పిండి పదార్థం ఏర్పడలేదు. అందించిన పత్రంలో పిండిపదార్థం ఏర్పడింది. కావున కిరణజన్యసంయోగక్రియ జరగటానికి CO2 అవసరమని నిర్ధారించవచ్చు.
కృత్యం – 3 : పిండి పదార్థం ఏర్పడడానికి కాంతి ఆవశ్యకత:
3. కిరణజన్యసంయోగక్రియకు కాంతి అవసరమని ఎలా నిరూపిస్తావు?
లేదా
పిండిపదార్థం ఏర్పడడానికి కాంతి అవసరమనే కృత్యాన్ని రాయండి.
జవాబు:
ఉద్దేశం : కిరణజన్యసంయోగక్రియకు కాంతి అవసరమని నిరూపించుట
కావలసిన పరికరములు :
కుండీలో పెరుగుచున్న ఆకుపచ్చని ఆకులు గల మొక్క, లైట్ స్క్రీన్.
నల్ల కాగితం ప్రయోగం ప్రయోగ విధానం :
- కుండీలో వున్న మొక్కను తీసుకొని, రెండు రోజులు దానిని చీకటిలో ఉంచాలి. దీని వలన ఆ మొక్క ఆకులోని పిండి పదార్థం సంపూర్ణంగా అదృశ్యమవుతుంది.
- ఒక ఆకుకు కాంతి పడకుండా చేసే లైట్ స్క్రీన్‌ను అమర్చాలి. లైట్ స్క్రీన్ మూత ఆకును పట్టి ఉంటుంది.
- మూతమీద ముందే చెక్కిన ‘S’ ఆకారపు నమూనా ఉంటుంది.
- మొక్కకు తగినంత నీరుపోసి 4 – 5 గంటలు ఎండలో ఉంచాలి. దీనివలన మూతమీద చెక్కిన ‘S’ ఆకారము ద్వారా మాత్రమే ఆకుపైన కాంతి ప్రసరిస్తుంది.
- తదుపరి మొక్క నుండి ఆకును వేరుచేసి, ఆ తరువాత లైట్ స్క్రీన్‌ను కూడా ఆకు నుండి తీసివేయాలి.
- పిమ్మట పిండిపదార్ధము కొరకు ఆ ఆకును అయోడిన్ పరీక్ష చేయాలి.
- సూర్యకాంతి గ్రహించిన ప్రదేశంలో మాత్రమే నీలంగా మారుతుంది.
- ఇలా మార్పు చెందినచోటు, మూతమీద చెక్కిన ‘S’ ఆకారపు నమూనాను పోలి ఉంటుంది. కాంతి గ్రహించనిచోట నీలిరంగుగా మారదు.
నిర్ధారణ :
దీనినిబట్టి కిరణజన్యసంయోగక్రియకు కాంతి లేక వెలుతురు అవసరమని ఋజువగుచున్నది.
పరిశీలన :
1. కొన్ని గంటల తరువాత మొక్క నుండి ఆకును వేరుచేయవలెను. పిండిపదార్థం కొరకు అయోడిన్ పరీక్షను నిర్వహించవలెను. ఏ భాగం నీలి నలుపు రంగులోకి మారింది? మిగిలిన భాగం ఎలా ఉంది?
జవాబు:
నల్ల కాగితం ఉన్న ప్రాంతం మినహా మిగిలిన ప్రాంతం నీలి నలుపు రంగులోకి మారింది.
2. కత్తిరించిన డిజైన్ ఆకారం గుండా కాంతి ప్రసరించిన ఆకుభాగం మాత్రమే అయోడితో నీలి నలుపు రంగులో మారటం గమనిస్తాం. కారణం ఏమిటి?
జవాబు:
పిండి పదార్థం ఉన్న ప్రాంతం నీలి నలుపు రంగుకు మారింది. మొక్కలలో కాంతి సోకిన భాగంలో నీలి నలుపుగా మారిందంటే ఆ ప్రాంతంలోనే కిరణజన్యసంయోగక్రియ జరిగింది. కనుక కిరణజన్యసంయోగక్రియ జరగటానికి సూర్యరశ్మి అవసరమని దీని ద్వారా నిరూపించవచ్చు.
కృత్యం – 4: లిట్మస్ కాగితం పరీక్ష
‘జీవక్రియలలో సమన్వయం’ పాఠంలో సూచించిన విధంగా పిండిపదార్థంపై లాలాజల ప్రభావాన్ని తెలిపే ప్రయోగం (కృత్యం-7) చేయండి. ‘ఫలితాల గురించి మీ తరగతిలో చర్చించండి.
పిండి పదార్థంపై లాలాజల ప్రయోగం ద్వారా ఈ క్రింది విషయాలు అవగాహన అయినాయి.
- లాలాజలం పిండిపదార్థం పై చర్య జరుపుతుంది. లాలాజలం కలిపిన పిండి పదార్థం అయోడిన్ పరీక్షలో నీలిరంగుగా మారలేదు. అంటే లాలాజల ప్రభావం వలన పిండిపదార్థం తన స్వభావాన్ని మార్చుకుంది.
- లాలాజలం పిండిపదార్థంపై పనిచేసి దానిని చక్కెరగా మార్చుతుంది. కావున మనం అన్నం నోటిలో పెట్టుకొన్నప్పుడు చప్పగా ఉండి నమిలే కొలది తియ్యగా అనిపిస్తుంది.
- లాలాజలంలో టయలిన్ అనే ఎంజైమ్ పిండిపదార్థంపై పనిచేస్తుంది. ఇది అమైలేజ్ వర్గానికి చెందిన ఎంజైమ్. దీని ప్రభావం వలన పిండిపదార్థం మాల్టోజ్ చక్కెరగా మారుతుంది.
కృత్యం – 5 : ఎంజైమ్ ల పట్టిక పరిశీలిద్దాం
జీర్ణవ్యవస్థలో పనిచేసే ఎంజైమ్ ల పట్టికను పరిశీలించండి. వివిధ రకాల జీర్ణరసాలు మరియు ఎంజైమ్ ల విధులను గురించి తరగతి గదిలో చర్చించండి.
1. కార్బోహైడ్రేట్స్ పై చర్యజరిపే ఎంజైమ్లు ఏవి?
జవాబు:
టయలిన్, అమైలేజ్ ఎంజైమ్స్, కార్బోహైడ్రేట్స్ పై పనిచేస్తాయి.
2. ఏ జీర్ణరసంలో ఎంజైమ్లు ఉండవు?
జవాబు:
పైత్యరసంలో ఎంజైమ్స్ ఉండవు.
3. ప్రోటీన్లపై చర్య జరిపే ఎంజైమ్ లు ఏవి?
జవాబు:
పెప్సిన్, ట్రిప్సిన్, పెప్టైడేజెస్ ఎంజైమ్స్ ప్రోటీన్లపై చర్య జరుపుతాయి.
కింది ఖాళీలను పూరించండి
1. మొక్కలు తయారుచేసుకునే ఆహారపదార్థం …………… రూపంలో నిల్వచేయబడుతుంది. (పిండిపదార్థం)
2. కిరణజన్యసంయోగక్రియ జరిగే ప్రదేశంగా పేర్కొనదగినది (హరితరేణువు)
3. క్లోమరసంలో ఉండే ఎంజైమ్లు ……………….. లను జీర్ణం చేయడానికి తోడ్పడతాయి. (అమైలేజ్, ట్రిప్సిన్)
4. చిన్నప్రేగులలో ఉపరితల వైశాల్యం పెంచడానికి వేళ్ళ వంటి నిర్మాణాలు కనబడతాయి. వీటిని ……. అంటారు. (ఆంత్రచూషకాలు)
5. జఠరరసంలో …. …………….. ఆమ్లం ఉంటుంది. (హైడ్రోక్లోరిక్)
6. ప్రేగులలో ఉండే బాక్టీరియా ……………………….. విటమినను సంశ్లేషిస్తుంది. (K)
సరైన సమాధానాన్ని గుర్తించండి
1. కిందివానిలో పరాన్నజీవులు (C)
i) ఈస్ట్ ii) పుట్టగొడుగు iii) కస్కుట iv) జలగ
A) (i), (ii)
B) (iii)
C) (iii), (iv)
D) (i)
జవాబు:
C) (iii), (iv)
2. కిరణజన్యసంయోగక్రియ రేటు కింది వాటితో ప్రభావితం కాదు
A) కాంతి తీవ్రత
B) ఆర్తత
C) ఉష్ణోగ్రత
D) కార్బన్ డై ఆక్సైడ్ గాఢత
జవాబు:
B) ఆర్తత
3. మొక్కను 48 గంటలపాటు చీకటిలో ఉంచిన తరువాత కిరణజన్యసంయోగక్రియకు సంబంధించిన ప్రయోగం చేస్తారు ఎందుకంటే
A) క్లోరోఫిల్ ను తొలగించుటకు
B) పిండిపదార్థాన్ని తొలగించుటకు
C) కిరణజన్యసంయోగక్రియ జరుగుటను నిరూపించుటకు
D) పిండిపదార్థం అయిపోతుందని తెలుసుకోవడానికి
జవాబు:
B) పిండిపదార్థాన్ని తొలగించుటకు
4. కింది వానిలో ఎంజైమ్ లేని జీర్ణరసం
A) పైత్యరసం
B) జఠరరసం
C) క్లోమరసం
D) లాలాజలం
జవాబు:
A) పైత్యరసం
5. ఏకకణ జీవులలో ఆహార సేకరణ క్రింది వాని ద్వారా జరుగుతుంది
A) శరీర ఉపరితలం ద్వారా
B) నోటి ద్వారా
C) దంతాల ద్వారా
D) రిక్తిక ద్వారా
జవాబు:
A) శరీర ఉపరితలం ద్వారా
6. కిరణజన్యసంయోగక్రియ జరిగేటపుడు మొక్కలో ఏ భాగం గాలిలో నుండి కార్బన్ డై ఆక్సైడ్ ను గ్రహిస్తుంది?
A) మూలకేశాలు
B) పత్రరంధ్రం
C) ఆకుఈనె
D) రక్షకపత్రాలు
జవాబు:
B) పత్రరంధ్రం