These AP 10th Class Social Studies Important Questions 2nd Lesson అభివృద్ధి భావనలు will help students prepare well for the exams.
AP Board 10th Class Social 2nd Lesson Important Questions and Answers అభివృద్ధి భావనలు
10th Class Social 2nd Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium
1. ఆదాయ రీత్యా ప్రస్తుతము భారతదేశ స్థితి ఏమిటి?
జవాబు:
మధ్యస్థ ఆదాయం గల దేశం.
2. రాష్ట్రాల బడ్జెట్ లో చదువుపై ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏది?
జవాబు:
హిమాచల్ ప్రదేశ్.
3. 2013 మానవాభివృద్ధి సూచిక ప్రకారం భారతదేశం ఏ స్థానంలో ఉంది?
జవాబు:
136
4. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో పాఠశాల విద్యా విప్లవం ప్రారంభమయినది?
జవాబు:
హిమాచల్ ప్రదేశ్.
5. స్త్రీలను పురుషులతో సమానంగా చూడక పోవటాన్ని ఏమంటారు?
జవాబు:
తలసరి ఆదాయం
6. దేశాలను వర్గీకరించటానికి ప్రపంచ బ్యాంక్ చేత ఉపయోగించబడిన సూచిక ఏది?
జవాబు:
తలసరి ఆదాయం
7. మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాల సూచి ప్రకారం వేట, సేకరణ ఎప్పటి నుండి ప్రారంభమయింది?
జవాబు:
2,00,000 సం||లు.
8. ‘కుడంకుళం’ ఏ రాష్ట్రంలో కలదు?
జవాబు:
తమిళనాడు (తిరునల్వేలి జిల్లా)
9. ‘ఐవరీకోస్ట్’ దేశం ఏ ఖండంలో ఉంది?
జవాబు:
ఆఫ్రికా.
10. దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే …….. వస్తుంది.
జవాబు:
లింగ వివక్షత.
11. తలసరి ఆదాయం =?
జవాబు:
12. 2012 సం||రానికి 1035 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాలను ఏమని అంటారు?
జవాబు:
తక్కువ ఆదాయ దేశాలు.
13. 2012 సం||రానికి 12,600 అమెరికన్ డాలర్ల కంటె ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలను ఏమని పిలుస్తారు?
జవాబు:
అధిక ఆదాయ దేశాలు.
14. పోలికకు ‘సగటు’ ఉపయోగకరంగా ఉన్న ఇది ఏమి వెల్లడి చేయదు?
జవాబు:
ప్రజల మధ్య అంతరాలను.
15. అక్షరాస్యత శాతంను గణించేటపుడు ఎన్ని సం||రాలకు మించి వయస్సు ఉన్న వాళ్ళను లెక్కలోకి తీసుకుంటారు?
జవాబు:
7 సం||లు.
16. నికర హాజరు శాతం లెక్కించడానికి ఎన్ని సం||రాల వయస్సు పిల్లల్లో బడికి హాజరవుతున్న పిల్లల శాతంను తీసుకుంటారు?
జవాబు:
6 – 17 సం||లు.
17. సజీవంగా పుట్టిన ప్రతి వెయ్యి మంది పిల్లల్లో సం||రం పూర్తి అయ్యేసరికి ఎంత మంది చనిపోతున్నారో తెలియజేసే సంఖ్యను ఏమంటారు?
జవాబు:
శిశు మరణాల రేటు.
18. మానవాభివృద్ధి సూచికలో మొత్తం ఎన్ని దేశాలలో ఆయా దేశాల స్థానాన్ని ఇస్తుంది?
జవాబు:
177.
19. 2005 సం||లో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్య పై సగటున ప్రతి విద్యార్థిపై ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టాయి?
జవాబు:
₹1049
20. లింగ వివక్షత తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?
జవాబు:
హిమాచల్ ప్రదేశ్.
21. UNDPని విస్తరింపుము.
జవాబు:
ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమము.
22. HDI ని విస్తరింపుము.
జవాబు:
మానవాభివృద్ధి సూచిక.
23. మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాలసూచి ప్రకారం పారిశ్రామికీకరణ మొదలై ఎన్ని సం||రాల ని తెలుస్తుంది?
జవాబు:
400 సం||లు కు పూర్వం
24. మానవాభివృద్ధి చరిత్ర పరిణామ క్రమ కాలసూచి ప్రకారం వ్యవసాయం మొదలై ఎన్ని సం||రాలని తెలుస్తుంది?
జవాబు:
12000 సం||లు.
25. అబిద్ జాన్ పట్టణం ఏ దేశంలో కలదు?
జవాబు:
ఐవరి కోస్ట్.
26. దేశ వాసులందరి ఆదాయము మొత్తం కలిపి ఏమి అంటాము?
జవాబు:
జాతీయాదాయము.
27. ఒక దేశంలోని ప్రజలు మరో దేశ ప్రజల కంటే మెరుగ్గా ఉన్నారా లేదా అనే విషయం తెలుసుకోవడానికి దేనిని పోలుస్తాం?
జవాబు:
సగటు ఆదాయం
28. పశ్చిమాసియా దేశాలు, మరికొన్ని చిన్నదేశాలు మినహా ‘ధనిక దేశాలను’ సాధారణంగా ఏ దేశాలని అంటారు?
జవాబు:
అభివృద్ధి చెందిన
29. దశాబ్దం క్రితం భారతదేశం. ఏ ఆదాయ దేశాల జాబితాలో ఉండేది?
జవాబు:
తక్కువ ఆదాయం
30. ఆయు:ప్రమాణం, తలసరి ఆదాయం మనకంటే ఎక్కువ ఉన్న మన పొరుగు దేశమేది?
జవాబు:
శ్రీలంక
31. పాఠశాల విద్యలో ఎన్ని సం||లు గడపటం అన్నది హిమాచల్ ప్రదేశ్ పిల్లలకు నియమంగా మారిపోయింది?
జవాబు:
10 సం||లు
32. 2012 సం||రానికి 1036 – 12599 అమెరికన్ డాలర్ల మధ్య తలసరి ఆదాయం ఉన్న దేశాలన్నీ ఏ దేశాల జాబితాలోకి వస్తాయి?
జవాబు:
మధ్య ఆదాయ దేశాలు.
33. దూర ప్రదేశంలో ఉద్యోగం వస్తే జీతమే కాకుండా పరిగణనలోకి తీసుకునే ఏదైనా ఒక అంశం రాయండి.
జవాబు:
కుటుంబానికి ఉండే సదుపాయాలు, పని పరిస్థితులు, క్రమం తప్పకుండా పని దొరకడం.
34. మహిళలు అనేక రకాల ఉద్యోగాలు చేపట్టటానికి, వ్యాపారాలు నిర్వహించటానికి వారికి కల్పించాల్సిన ముఖ్యమైన సదుపాయం ఏది?
జవాబు:
భద్రత
35. 2012 సం||రంలో పంజాబు రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత?
జవాబు:
₹78,000
36. 2012 సం||రంలో హిమాచల్ ప్రదేశ్ తలసరి ఆదాయం ఎంత?
జవాబు:
₹74,000
37. 2011 జనాభా లెక్కల ప్రకారం పంజాబు రాష్ట్ర అక్షరాస్యత శాతం ఎంత?
జవాబు:
77%
38. 2011 జనాభా లెక్కల ప్రకారం హిమాచల్ ప్రదేశ్ అక్షరాస్యత శాతం ఎంత?
జవాబు:
84%
39. 2006 సం||రంలో బీహార్ రాష్ట్రంలోని శిశుమరణాలు 1000కి ఎంత ఉన్నాయి?
జవాబు:
62.
40. 2006 సం||రంలో పంజాబు రాష్ట్రంలోని శిశుమరణాలు 1000 కి ఎంత ఉన్నాయి?
జవాబు:
42.
41. శిశు మరణాల రేటును తగ్గించటానికి చేపట్టాల్సిన ఏదైనా ఒక చర్యను తెల్పండి.
జ. మౌలిక ఆరోగ్య సదుపాయాలు, విద్య సౌకర్యాలు కల్పించాలి.
42. 2018 సం||రం లెక్కల ప్రకారం భారతదేశ తలసరి ఆదాయం ఎంత?
జవాబు:
3285
43. 2018 సం||రం లెక్కల ప్రకారం శ్రీలంక తలసరి పంజాబ్ ఆదాయం ఎంత?
జవాబు:
$ 5170
44. హిమాచల్ ప్రదేశ్ లో ఆడ పిల్లలు కూడా అత్యధిక బీహార్ సంఖ్యలో చదువుకోడానికి ఒక కారణం తెల్పండి.
జవాబు:
వివక్షత లేకపోవటం, తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పు రావటం.
45. ఆడ పిల్లల చదువు వల్ల వచ్చే ప్రయోజనంను ఒకటి రాయండి.
జవాబు:
ఆత్మవిశ్వాసం కనబరుస్తారు, ఆడవాళ్ళ మాటకు ప్రాధాన్యత ఉంటుంది, స్వతంత్రంగా ఆలోచిస్తారు.
46. 2006 సం||రంలో హిమాచల్ ప్రదేశ్లో 6 సం||లు దాటిన ఆడపిల్లల్లో బడికి వెళ్ళిన వారి శాతం ఎంత?
జవాబు:
60%
47. 2006 సం॥రంలో హిమాచల్ ప్రదేశ్ లో 6 సం||లు దాటిన మగపిల్లల్లో బడికి వెళ్ళిన వారి శాతం ఎంత?
జవాబు:
75%
48. “2006 సం||రంలో భారతదేశంలో 6 సం||లు దాటిన ఆడపిల్లల్లో బడికి వెళ్ళిన వారి శాతం ఎంత?
జవాబు:
40%
49. క్రింది వానిలో సరికాని వ్యాఖ్యను గుర్తించి, రాయండి.
→ వర్షధార రైతులు సరియైన వర్షాలు కోరుతారు.
→ గ్రామీణ కార్మికులు మెరుగైన కూలీని కోరుతారు.
→ ధనిక రైతులు గ్రామాల్లోనే స్థిరపడాలని కోరుతారు.
→ ధనిక కుటుంబ అమ్మాయి స్వేచ్ఛను కోరుతుంది.
జవాబు:
ధనిక రైతులు గ్రామాల్లోనే స్థిరపడాలని కోరుతారు.
50. క్రింది వానిలో మానవాభివృద్ధి సూచిక (HDI) పరిగణనలోకి తీసుకోని అంశాలను గుర్తించి, రాయండి.
విద్య, వైద్యం, తలసరి ఆదాయం, జాతీయాదాయం
జవాబు:
జాతీయాదాయం
51. 2018లో భారతదేశంలో ఆయు:ప్రమాణం ఎన్నిసం||రాలు?
జవాబు:
65.8 సం||రాలు
52. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) వేరు వేరు వ్యక్తులకు వేరు వేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు.
ii) ఒకరికి అభివృద్ధి అయినది మరొకరికి కూడా అభివృద్ధి అవుతుంది.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
4-0 మాత్రమే
53. ఇవ్వబడిన పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నకు సమాధానము వ్రాయుము.
పట్టిక 3: కొన్ని రాష్ట్రాల తలసరి ఆదాయం
రాష్ట్రం | 2012 సం||లో తలసరి ఆదాయం (రూ.లో) |
పంజాబ్ | 78,000 |
హిమాచల్ ప్రదేశ్ | 74,000 |
బీహార్ | 25,000 |
ప్ర : ఏ రాష్ట్రం అభివృద్ధి చెందినదిగా భావించవచ్చు?
జవాబు:
పంజాబు
54. ఇవ్వబడిన పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నకు సమాధానము వ్రాయుము.
ప్ర : ‘క’ దేశం సగటు ఆదాయం ఎంత?
జవాబు:
10,000/-
ప్ర: ‘గ’ దేశం సగటు ఆదాయం ఎంత?
జవాబు:
10,000/-
55. ఇవ్వబడిన పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నకు సమాధానము వ్రాయుము.
ప్ర. ఆడపిల్లల్లో 5సం|| కంటే ఎక్కువ కాలం బడికి వెళ్ళిన వారి శాతం 1993 నుండి 2006 నాటికి ఎంత శాతం పెరిగింది?
జవాబు:
21%.
10th Class Social 2nd Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
క్రింది పట్టికను పరిశీలించి a, b, c, d ప్రశ్నలకు జవాబులు రాయండి.
a) సగటు విద్యాకాలం ఎక్కువగా ఉన్న రెండు దేశాలు ఏవి?
b) భారత్ కంటే మెరుగైన ర్యాంకింగ్ ఉన్న రెండు ఆసియా దేశాలు ఏవి?
c) ప్రపంచ సగటు జీవితకాలం కంటే వెనుకబడిన దేశాలు ఏవి?
d) భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్లలో సగటు విద్యాకాలం తక్కువగా ఉండడానికి కారణాలేవి?
జవాబు:
a) సగటు విద్యాకాలం ఎక్కువగా ఉన్న రెండు దేశాలు : నార్వే, అమెరికా.
b) భారత్ కంటే మెరుగైన ర్యాంకింగ్ ఉన్న రెండు ఆసియా దేశాలు : శ్రీలంక, చైనా
c) ప్రపంచ సగటు జీవిత కాలం కంటే వెనుకబడిన దేశాలు : భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్.
d) 1. ఈ దేశాలలో పేదరికం ఎక్కువగా ఉండడం.
2. గ్రామీణ జనాభా ఎక్కువగా ఉండడం.
3. అక్షరాస్యత ప్రాధాన్యత తెలియకపోవడం వలన సగటు విద్యాకాలం తక్కువగా ఉంది.
ప్రశ్న 2.
తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ కేంద్ర స్థాపనకు వ్యతిరేకంగా నిరసన ఉద్యమాలు చెలరేగడానికి గల కారణమేమి?
(లేదా)
తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం స్థాపనను ప్రజలు ఎందుకు వ్యతిరేకించారు?
జవాబు:
తీర ప్రాంత పరిరక్షణ, రేడియోధార్మిక, వినాశకర ప్రమాదం నుండి రక్షణ కొరకు కుడంకుళం అణు విద్యుత్ కేంద్ర స్థాపనకు వ్యతిరేకంగా నిరసన ఉద్యమాలు చెలరేగాయి.
(లేదా )
రక్షణ, భద్రత మరియు జీవనోపాధుల పరిరక్షణ కోసం ప్రజలు అణు విద్యుత్ కేంద్ర స్థాపనను వ్యతిరేకించారు.
ప్రశ్న 3.
“అభివృద్ధికి సంబంధించి ఇద్దరు వ్యక్తులకు లేదా బృందాలకు పరస్పర విరుద్ధమైన కోరికలు ఉండవచ్చు.” ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
అభివృద్ధికి సంబంధించి విరుద్ధమైన కోరికలు – ఉదాహరణ : ఎక్కువ కరెంటు కోసం భారీ డామ్ లు కట్టాలని పారిశ్రామికవేత్తలు కోరవచ్చు. కానీ తమ భూములు మునిగిపోతాయని గిరిజన తెగలు దీనిని వ్యతిరేకించవచ్చు.
ప్రశ్న 4.
కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది?
జవాబు:
తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లాలో ఉంది.
ప్రశ్న 5.
తలసరి ఆదాయం అనగానేమి?
జవాబు:
దేశం మొత్తం ఆదాయాన్ని (జాతీయాదాయం) ఆ దేశ జనాభాతో భాగించగా వచ్చేదే ఆ దేశ తలసరి ఆదాయం. దీనినే “సగటు ఆదాయం ” అని కూడా అంటారు.
ప్రశ్న 6.
ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నివేదిక ప్రకారం ఎన్ని అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను అధిక ఆదాయ లేదా ధనిక దేశాలు అంటారు?
జవాబు:
2012 సంవత్సరానికి 12,600 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ.
ప్రశ్న 7.
ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నివేదిక ప్రకారం 1,035 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను ఇలా పిలుస్తారు.
జవాబు:
తక్కువ ఆదాయ దేశాలు లేదా పేద దేశాలు.
ప్రశ్న 8.
“సగటు” యొక్క ప్రధాన లోపం ఏమిటి?
జవాబు:
సగటు పోలికకు ఉపయోగకరంగా ఉన్నా అది ప్రజల మధ్య అంతరాలను వెల్లడి చేయదు.
ప్రశ్న 9.
2012 సం||లో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల యొక్క తలసరి ఆదాయాలు ఎంత?
జవాబు:
పంజాబ్ – ₹78,000
హిమాచల్ ప్రదేశ్ – ₹74,000
బీహార్ – ₹ 25,000
ప్రశ్న 10.
అక్షరాస్యత శాతం అనగానేమి?
జవాబు:
ఏడు సంవత్సరాలు, అంతకుమించిన వయస్సు వాళ్లల్లో అక్షరాస్యతను తెలియజేయునది అక్షరాస్యత శాతం.
ప్రశ్న 11.
నికర హాజరు శాతం ఏమి తెలియజేయును?
జవాబు:
6-17 సంవత్సరాల వయస్సు పిల్లల్లో బడికి హాజరవుతున్న పిల్లల శాతంను “నికర హాజరు శాతం” అంటారు.
ప్రశ్న 12.
శిశుమరణాల రేటు అనగానేమి?
జవాబు:
సజీవంగా పుట్టిన ప్రతి వెయ్యిమంది పిల్లల్లో సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియజేయు సంఖ్య.
ప్రశ్న 10.
ఆయు:ప్రమాణ రేటు దేనిని తెలియజేయును?
జవాబు:
వ్యక్తి జీవించే సగటు కాలమును తెలియజేయును.
ప్రశ్న 13.
UNDP అనగానేమి?
జవాబు:
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమము (United Nations Development Programme)
ప్రశ్న 14.
మానవాభివృద్ధి సూచికలేవి?
జవాబు:
విద్యాసాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాలు మానవాభివృద్ధి సూచికలు.
ప్రశ్న 15.
మానవ అభివృద్ధి సూచిక (2013) లో మొత్తం ఎన్ని దేశాలకు స్థానాన్ని ఇచ్చారు?
జవాబు:
మానవ అభివృద్ధి సూచికలో మొత్తం 177 దేశాలకు స్థానం ఇచ్చారు.
ప్రశ్న 16
ఏ రాష్ట్రంలో పాఠశాల విద్య విప్లవంగా పరిగణించబడుతుంది?
జవాబు:
హిమాచల్ ప్రదేశ్ లో పాఠశాల విద్య విప్లవంగా పరిగణించబడుతుంది.
ప్రశ్న 17.
2005 సం||లో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు సగటున ప్రతి విద్యార్థిపై ఎంత ఖర్చు పెట్టారు? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఎంత ఖర్చు చేసింది?
జవాబు:
1,049 రూ.లు, 2,005 రూ.లు వరుసగా
ప్రశ్న 18.
హిమాచల్ ప్రదేశ్ పిల్లలకు ఏది నియమంగా మారిపోయింది?
జవాబు:
పాఠశాల విద్యలో పది సం||రాలు గడపటం అనేది నియమంగా మారిపోయింది.
ప్రశ్న 19.
హిమాచల్ ప్రదేశ్ లో లింగ వివక్షత తక్కువగా ఉండుటకు ఒక కారణం చెప్పండి.
జవాబు:
హిమాచల్ ప్రదేశ్ లో మహిళలు ఇంటి బయట ఉద్యోగాలు చేయడం, చురుకుగా పనిచేస్తున్న మహిళా మండలులు.
ప్రశ్న 20.
ఆదాయాన్ని పొందడమే కాకుండా ప్రజలు ఏ ఇతర అంశాలను కోరుకుంటున్నారు?
జవాబు:
సమానత, స్వేచ్ఛ, భద్రత, ఇతరుల నుంచి గౌరవం పొందడం వంటి అంశాలు కోరుకుంటున్నారు.
10th Class Social 2nd Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
భూమి లేని గ్రామీణ కార్మికులు ఏ ఏ అభివృద్ధి లక్ష్యాలను, ఆకాంక్షలను నిర్దేశించుకుంటారు?
జవాబు:
భూమి లేని గ్రామీణ కార్మికుల అభివృద్ధి లక్ష్యాలు :
- ఎక్కువ రోజుల పని, మెరుగైన కూలి.
- స్థానిక పాఠశాలలో తమ పిల్లలకు నాణ్యమైన విద్యను ఆశించడం.
- సామాజిక వివక్షత లేకపోవడం, వాళ్ళు కూడా గ్రామంలో నాయకులు కాగలగడం.
- తమ ఆవాస ప్రాంతంలో సరైన మౌలిక సదుపాయాలు ఆశించడం.
ప్రశ్న 2.
వివిధ వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యాలు భిన్నంగా ఉంటాయనడానికి ఉదాహరణలివ్వండి.
జవాబు:
వివిధ వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యాలు భిన్నంగా ఉంటాయనడానికి ఉదాహరణలు :
వివిధ వర్గాల ప్రజలు | అభివృద్ధి లక్ష్యాలు |
భూమి లేని గ్రామీణ కార్మికులు | ఎక్కువ పనిరోజులు, ఎక్కువ జీతం, పిల్లలకు నాణ్యమైన విద్య, సామాజిక వివక్షత లేకపోవడం. |
ధనిక రైతులు | పంటలకు అధిక మద్దతు ధరలు, పిల్లలు విదేశాల్లో స్థిరపడడం. |
వర్షాధార రైతులు | చాలినంత వర్షపాతం. |
పట్టణ నిరుద్యోగిత యువత | ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం. |
గనుల తవ్వక ప్రాంతంలోని ఆదివాసీలు | వారి జీవనాధారం, వనరులను పరిరక్షించుకోవడం. |
తీరప్రాంతంలోని చేపలు పట్టే వ్యక్తి | చేపలు పట్టడానికి కావలసిన అనుకూల వాతావరణం. |
ప్రశ్న 3.
అభివృద్ధిని కొలవడానికి గల వివిధ సూచికలు ఏవి? వాటిలో నీవు దేనితో ఏకీభవిస్తావు?
జవాబు:
అభివృద్ధిని కొలవడానికి గల వివిధ సూచికలు:
- తలసరి ఆదాయం
- సగటు ఆయుః ప్రమాణం
- సగటున బడిలో గడిపిన సంవత్సరాలు
- పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలు
- విద్యా స్థాయి (అక్షరాస్యత రేటు)
- ఆరోగ్య స్థితి
- ఉద్యోగితా స్థాయి
- పంపిణీ న్యాయం
- జీవన ప్రమాణ స్థాయి మొదలైనవి.
పై వాటిలో అన్నిటితో నేను ఏకీభవిస్తున్నాను. సంపూర్ణ అభివృద్ధికి ఇవన్నీ కొలమానాలని నా అభిప్రాయం.
ప్రశ్న 4.
‘హిమాచల్ ప్రదేశ్ లో పాఠశాల విప్లవం’ గురించి మీరేమి గ్రహించారు?
జవాబు:
- హిమాచల్ ప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వం విద్యపై చాలా ఆసక్తి చూపారు.
- అనేక పాఠశాలలను ప్రారంభించారు.
- విద్య చాలా వరకు ఉచితంగా లభించేటట్లు చూశారు.
- ప్రభుత్వ బడ్జెట్లో విద్యకు ఎక్కువ వాటా కేటాయించారు.
- పాఠశాలల్లో అన్ని కనీస సదుపాయాలు ఉండేలా చూశారు.
- అధికశాతం పిల్లలకు పాఠశాల అనుభవం సంతోషదాయకంగా ఉంది.
ప్రశ్న 5.
మానవాభివృద్ధిని కొలవడానికి ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు?
జవాబు:
మానవాభివృద్ధిని కొలవడానికి పరిగణనలోకి తీసుకునే అంశాలు :
- తలసరి ఆదాయం
- ఆయుః ప్రమాణం
- అక్షరాస్యత
- శిశుమరణాలు – జనన రేటు
- జీవన ప్రమాణం
- ప్రజారోగ్యం
ప్రశ్న 6.
ఆదాయమే కాకుండా ప్రజలు ఇంకా ఏమి కోరుకుంటారు?
జవాబు:
ఆదాయమే కాకుండా ప్రజలు ఇంకా కోరుకునేవి
1) సమానత
2) స్వేచ్ఛ
3) భద్రత
4) ఇతరుల నుండి గౌరవం పొందడం
ప్రశ్న 7.
ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదిక ప్రకారం తలసరి ఆదాయం ప్రామాణికంగా ఎలా వర్గీకరించారు? భారతదేశం ఏ జాబితాలో ఉంది?
జవాబు:
- దేశాలను వర్గీకరించటానికి ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదికలో ఈ ప్రామాణికాన్ని ఉపయోగించింది.
- 2012 సంవత్సరానికి 12,600 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను “అధిక ఆదాయ దేశాలు” లేక ధనిక దేశాలు అంటారు.
- అదే విధంగా 2012లో 1,035 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉండే దేశాలను “తక్కువ ఆదాయ దేశాలు” అంటారు.
- అయితే ఒక దశాబ్దం క్రితం భారతదేశం తక్కువ ఆదాయ దేశాల జాబితాలో ఉండేది. చాలా ఇతర దేశాలకంటే భారతదేశ తలసరి ఆదాయం వేగంగా పెరగటంతో దాని స్థానం మెరుగుపడింది.
ప్రశ్న 8.
వ్యక్తులకు ఆదాయమే కాకుండా ఎటువంటి లక్ష్యాలు ఉన్నాయి?
జవాబు:
- వ్యక్తులను, ఆకాంక్షలను, లక్ష్యాలను చూసినప్పుడు మెరుగైన ఆదాయమే కాకుండా భద్రత, ఇతరులతో గౌరవింపబడటం, సమానంగా చూడబడటం, స్వేచ్చ వంటి లక్ష్యాలు కూడా ఉన్నాయని తెలిసింది.
- అదేవిధంగా, ఒక దేశం లేదా ఒక ప్రాంతం గురించి ఆలోచించినప్పుడు సగటు ఆదాయమే కాకుండా ఇతర ముఖ్యమైన ప్రామాణికాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.
ప్రశ్న 9.
పట్టిక : కొన్ని రాష్ట్రాలకు సంబంధించి కొన్ని తులనాత్మక గణాంకాలు
పట్టికలో పేర్కొన్న అంశాలకు వివరణలు :
శిశుమరణాలు : సజీవంగా పుట్టిన ప్రతి వెయ్యిమంది పిల్లల్లో సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియచేసే సంఖ్య.
అక్షరాస్యత శాతం : ఏడు సంవత్సరాలు, అంతకుమించిన వయస్సు వాళ్లల్లో అక్షరాస్యతను తెలియచేస్తుంది.
నికర హాజరు శాతం : 6-17 సంవత్సరాల వయస్సు పిల్లల్లో బడికి హాజరవుతున్న పిల్లల శాతం.
పై సమాచారము ఆధారంగా క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు ఒక్క మాటలో సమాధానములిమ్ము.
1) శిశుమరణాల రేటు అధికంగా ఉన్న రాష్ట్రమేది?
జవాబు:
బీహార్
2) అక్షరాస్యత ఎక్కువగా కలిగి ఉన్న రాష్ట్రమేది?
జవాబు:
హిమాచల్ ప్రదేశ్
3) హిమాచల్ ప్రదేశ్ కు బీహారు నికర హాజరు శాతంలో తేడా ఎంత?
జవాబు:
90-56 = 34.
4) నికర హాజరు శాతం అనగా?
జవాబు:
6-17 సం||రాల వయస్సు పిల్లల్లో బడికి హాజరవుతున్న పిల్లల శాతం.
5) నికర హాజరు శాతం తక్కువగా ఉన్న రాష్ట్రం?
జవాబు:
బీహార్
6) పట్టికలో పేర్కొన్న అంశాల ప్రకారం మానవాభివృద్ధిలో ముందున్న రాష్ట్రమేది?
జవాబు:
హిమాచల్ ప్రదేశ్
ప్రశ్న 10.
పట్టిక : 2013 లో భారతదేశం, దాని పొరుగు దేశాలకు సంబంధించిన కొన్ని వివరాలు
పట్టికకు సంబంధించిన వివరాలు :
- మానవ అభివృద్ధి సూచికలో మొత్తం 177 దేశాలలో ఆయా దేశాల స్థానాన్ని ఇస్తుంది.
- వ్యక్తి జీవించే సగటు కాలం : జన్మించిన నాటి నుండి ఒక వ్యక్తి యొక్క సగటు జీవితకాలాన్ని సూచిస్తుంది.
- సగటున బడిలో గడిపిన కాలం : 25 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు సగటున బడిలో గడిపిన సంవత్సరాలు.
- పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలు : ప్రస్తుతం బడిలో పిల్లలు చేరుతున్నదాన్ని బట్టి బడి ఈడు పిల్లలు బడిలో ఎన్ని సంవత్సరాలు ఉంటారన్న అంచనా.
- తలసరి ఆదాయం : పోల్చటానికి వీలుగా అన్ని దేశాల తలసరి ఆదాయాన్ని అమెరికన్ డాలర్లలో లెక్కిస్తారు. ప్రతి దేశంలోనూ ప్రతి డాలరు అంతే మొత్తంలో సరుకులు, సేవలు కొనగలిగేలా దీనిని లెక్కిస్తారు.
పై సమాచారమును పరిశీలించి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సరియైన సమాధానములిమ్ము.
1) ప్రపంచ మానవ అభివృద్ధి సూచికలో మెరుగైన స్థానం కల్గి ఉన్న పొరుగుదేశం ఏది?
జవాబు:
శ్రీలంక
2) ఆయుః ప్రమాణ రేటు అంటే?
జవాబు:
వ్యక్తి జీవించే సగటు కాలం.
3) 2013 భారతదేశ తలసరి ఆదాయం ఎంత?
జవాబు:
3285 డాలర్లు
4) ఏ దేశంలో బడిలో గడిపిన సంవత్సరాల సగటు ఎక్కువగా ఉంది?
జవాబు:
శ్రీలంక
5) భారతకు, శ్రీలంకకు ఆయుః ప్రమాణంలో ఎన్ని సంవత్సరాల తేడా ఉంది?
జవాబు:
75.1 – 65.8 = 9.3 సం||లు,
ప్రశ్న 11.
పట్టిక : హిమాచల్ ప్రదేశ్ లో ప్రగతి
పై సమాచారము ఆధారంగా క్రింది ప్రశ్నలకు సరియైన సమాధానములిమ్ను.
1) (6 సంవత్సరాలు మించిన) ఆడపిల్లల్లో 5 సం||ల కంటే ఎక్కువ కాలం బడికి వెళ్లిన వారి శాతం భారతదేశంలో, హిమాచల్ ప్రదేశ్ లో 1993 నుండి 2006 వరకు ఎంతమేర పెరిగింది?
జవాబు:
12% (భారతదేశం), 21% (హిమాచల్ ప్రదేశ్)
2) (6 సంవత్సరాలు మించిన) మగపిల్లల్లో 5 సం||లు కంటే ఎక్కువకాలం బడికి వెళ్ళినవారి శాతం 2006లో భారత సగటు కంటే హిమాచల్ ప్రదేశ్ ఎంత ఎక్కువగా ఉంది?
జవాబు:
75 – 57 = 18
ప్రశ్న 12.
క్రింది పటమును పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు సరియైన సమాధానమివ్వండి.
మానవాభివృద్ధిని సూచించు ప్రపంచ పటం
1) పటం దేనిని సూచిస్తుంది?
జవాబు:
పటం వివిధ ఖండాలలో మానవాభివృద్ధి తీరుతెన్నులను సూచిస్తుంది.
2) భారతదేశం ఏ మానవాభివృద్ధి వర్గానికి చెందింది?
జవాబు:
మధ్యస్థ వర్గానికి
3) అత్యధిక (HDI) కల్గి ఉన్న ప్రాంతాలు (దేశాలు) ఏవి?
జవాబు:
ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా, దక్షిణ అమెరికాలోని దక్షిణ ప్రాంతాలు.
4) అల్పాభివృద్ధి సూచిక కల్గిన రెండు దేశాలకు ఉదాహరణనిమ్ము.
జవాబు:
జింబాబ్వే, కెన్యా
5) అల్పాభివృద్ధి ఎక్కువగా ఏ ఖండంలో కన్పిస్తుంది?
జవాబు:
ఆఫ్రికా
10th Class Social 2nd Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
ఈ క్రింద ఇవ్వబడిన పట్టికను చదివి దిగువన ఉన్న ప్రశ్నలకు సమాధానము వ్రాయండి.
పట్టిక : కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని తులనాత్మక గణాంకాలు.
a) అక్షరాస్యత శాతం అంటే ఏమిటి?
b) నికర హాజరు శాతం ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది?
c) హిమాచల్ ప్రదేశ్ లో అక్షరాస్యత అధికంగా ఉండటానికి గల కారణమేమి?
d) శిశుమరణాలు తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?
జవాబు:
a) ప్రతి వందమంది జనాభాకు గల అక్షరాస్యుల సంఖ్యను అక్షరాస్యతా శాతం అంటారు.
b) హిమాచల్ ప్రదేశ్
c) 1) హిమాచల్ ప్రభుత్వము, అక్కడి ప్రజలు విద్యపై ఎంతో ఆసక్తి చూపారు.
2) పాఠశాలలు తెరిచి చాలా వరకు విద్య ఉచితంగా ఉండేలా లేదా తల్లిదండ్రులకు నామమాత్రపు ఖర్చు అయ్యేలా ప్రభుత్వం చూసింది.
3) పాఠశాలలో తగినంతమంది ఉపాధ్యాయులతోపాటు తరగతి గదులు, మరుగుదొడ్లు, త్రాగునీరు వంటి కనీస సదుపాయాలు ఉండేలా చూసింది.
4) భారతదేశ రాష్ట్రాలలో ప్రభుత్వ బడ్జెట్ లో ప్రతి విద్యార్థి చదువుపై ఎక్కువ మొత్తం ఖర్చు పెడుతున్న రాష్ట్రాలలో హిమాచల్ ప్రదేశ్ ఒకటి.
d) హిమాచల్ ప్రదేశ్
ప్రశ్న 2.
క్రింది పేరాను చదివి, వ్యాఖ్యానించండి.
దేశంలో అనేక ప్రాంతాలలో మగపిల్లల చదువుతో పోలిస్తే ఆడపిల్లల చదువుకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆడపిల్లలు కొన్ని తరగతులు చదువుతారు కాని పాఠశాల విద్య పూర్తి చేయరు.
జవాబు:
విద్యకు లింగ వారీగా ఇచ్చే ప్రధాన్యతని తెలియచేస్తోంది. ఇది చాలావరకు గ్రామాల్లో జరుగుతోంది. అనేక రకాల సామాజిక కారణాల వలన ఆడపిల్లల చదువులకు ఆటంకం కల్పిస్తున్నారు. పట్టణాలలో కూడా ఈ పరిస్థితి ఆర్థికంగా వెనుకబడిన వారిలోనే ఉన్నది. లేదా వలస కార్మికుల కుటుంబాలలో ఉన్నది. కాని నేడు కొంత మార్పు కనిపిస్తోంది. ఆడపిల్లల చదువుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యార్జనీ విద్యార్థుల సంఖ్య దీనిని నిరూపిస్తోంది.
ప్రశ్న 3.
క్రింది సమాచారాన్ని కమ్మీ (బార్ గ్రాఫ్) రేఖాచిత్రంలో చూపండి. మీ పరిశీలనను రాయండి.
రాష్ట్రం | అక్షరాస్యత రేటు |
1. పంజాబ్ | 77 |
2. హిమాచల్ ప్రదేశ్ | 84 |
3. బీహార్ | 64 |
జవాబు:
పరిశీలన : అధిక అక్షరాస్యతను కలిగి ఉన్నది కాబట్టి హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా పరిగణించవచ్చు.
ప్రశ్న 4.
పట్టికను పరిశీలించి దిగువ ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.
1) మానవాభివృద్ధి సూచికలో భారతదేశం కంటే అన్ని విషయాలలో మెరుగైన స్థానంలో ఉన్న దేశం ఏది?
2) మానవాభివృద్ధి సూచిక తయారీలో పరిగణనలోకి తీసుకొనబడే అంశాలు ఏవి?
3) అతి తక్కువ తలసరి ఆదాయం గల దేశాన్ని పేర్కొనండి.
4) మానవాభివృద్ధి నివేదికలో భారతదేశ స్థానం మెరుగుపడడానికి రెండు సూచనలు వ్రాయండి.
5) సగటున బడిలో గడిపిన కాలం – నిర్వచింపుము.
6) ఆయుః ప్రమాణంలో మెరుగ్గా కల దేశమేది?
7) అన్ని ప్రమాణాలలో మెరుగైన స్థానంలో కల దేశమేది?
8) మానవాభివృద్ధి సూచిక తయారీలో పరిగణనలోకి తీసుకునే అంశాలేవి?
జవాబు:
- శ్రీలంక
- తలసరి ఆదాయం , ఆయుః ప్రమాణం, సగటున బడిలో గడిపిన సం||రాలు. పాఠశాల విద్యలో ఉండే సం||రాలు.
- నేపాల్
- a) వైద్య సదుపాయాలు మెరుగుపరచాలి.
b) నాణ్యతతో కూడిన విద్య అందించాలి. - 25 సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళు సగటున బడిలో గడిపిన సంవత్సరాలు.
- శ్రీలంక
- శ్రీలంక
- తలసరి ఆదాయం, ఆయుఃప్రమాణం, సగటున బడిలో గడిపిన సంవత్సరాలు, పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలు.
ప్రశ్న 5.
క్రింది పేరాగ్రాఫ్ చదవండి :
“దేశంలో అనేక ప్రాంతాలలో మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.”
ప్రశ్న : ‘భారతదేశంలో లింగ వివక్షతపై వ్యాఖ్యానించండి.”
జవాబు:
- మనది పురుషాధిక్యత సమాజము.
- స్త్రీలలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్నది.
- ఇంటి బయట పనిచేసే స్త్రీల సంఖ్య తక్కువగా ఉంది.
- సాంప్రదాయపరంగా సామాజిక జీవితంలో మహిళల పాత్ర తక్కువ.
- ఈ కారణాల వల్ల లింగ వివక్షత ఇంకా కొనసాగుతూ ఉంది.
- ఇది సమాజాభివృద్ధికి ఆటంకము.
- అబ్బాయిలను, అమ్మాయిలను సమానంగా చూడాలి.
ప్రశ్న 6.
మానవ అభివృద్ధి నివేదిక గురించి నీకు తెలిసింది వివరించుము.
జవాబు:
- ఆదాయస్తాయి. ముఖ్యమైనప్పటికి అభివృద్ధిని సూచించటానికి అదొక్కటే సరిపోదని గుర్తించిన తరువాత ఇతర ప్రామాణికాల గురించి ఆలోచించటం మొదలు పెడతాం.
- ఇటువంటి ప్రామాణికాల జాబితా చాలా పెద్దగా ఉంటే అప్పుడది అంతగా ఉపయోగపడదు. చాలా ముఖ్యమైన అంశాల చిన్న జాబితా కావాలి.
- కేరళ, పంజాబులను పోల్చటానికి ఉపయోగించిన ఆరోగ్యం , విద్యా సూచికలు ఎంతో ముఖ్యమైనవి.
- గత దశాబ్ద కాలం నుంచి అభివృద్ధికి కొలమానంగా ఆదాయంతో పాటు ఆరోగ్యం, విద్యా సూచికలను కూడా – విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
- ఉదాహరణకు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్ డిపి) ప్రచురించిన మానవ అభివృద్ధి నివేదిక దేశాలను ఆ ప్రజల విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాలను బట్టి పోలుస్తుంది.
ప్రశ్న 7.
హిమాచల్ ప్రదేశ్ లో ‘లింగ వివక్షత’ ఏ రంగంలో తక్కువగా ఉంది? ఎందువలన?
జవాబు:
- లింగ వివక్షత తక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగించవచ్చు.
- విద్యలోనే కాకుండా దీనిని ఇతర రంగాలలోనూ చూస్తాం.
- ఇతర రాష్ట్రాలలో పరిస్థితికి విరుద్ధంగా హిమాచల్ ప్రదేశ్ లో పుట్టిన కొన్ని నెలల్లో చనిపోయే పిల్లల్లో మగపిల్లల కంటే ఆడపిల్లల సంఖ్య తక్కువ.
- దీనికి ఒక కారణం హిమాచల్ ప్రదేశ్ మహిళలు ఇంటి బయట ఉద్యోగాలు చేస్తున్నారు.
- బయట ఉద్యోగాలు చేసే మహిళలు స్వతంత్రంగా ఉంటారు, ఆత్మవిశ్వాసం కనబరుస్తారు.
- ఇంటిలో తీసుకునే నిర్ణయాలలో అంటే పిల్లల చదువు, ఆరోగ్యం, పిల్లల సంఖ్య, గృహ నిర్వహణ వంటి వాటిల్లో ఆడవాళ్ల మాటకు ప్రాధాన్యత ఉంటుంది.
- వాళ్ళు ఉద్యోగాల్లో ఉండటం వల్ల పెళ్లి అయిన తరువాత తమ కూతుళ్లు ఉద్యోగాలు చెయ్యాలని తల్లులు కోరుకుంటారు.
- కాబట్టి చదువుకు ప్రాధాన్యతను ఇవ్వటం సహజ విషయంగానూ, సామాజిక నియమంగానూ మారిపోయింది.
- సామాజిక జీవితంలోనూ, గ్రామ రాజకీయాలలోనూ హిమాచల్ ప్రదేశ్ మహిళల పాత్ర ఇతర రాష్ట్రాలలో కంటే ఎక్కువే.
- పలు గ్రామాలలో చురుకుగా పనిచేస్తున్న మహిళా మండలులు కనపడతాయి.