Students can go through AP Board 9th Class Social Notes 24th Lesson రోడ్డు భద్రతా విద్య to understand and remember the concept easily.
AP Board 9th Class Social Notes 24th Lesson రోడ్డు భద్రతా విద్య
→ క్రమబద్ధీకరణ అనగా రోడ్డును ఉపయోగించే వారందరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించడం.
→ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లే వాటిని ట్రాఫిక్ అంటాం.
→ ట్రాఫిక్ నియమ నిబంధనలు సరళంగా, స్పష్టంగా వివరించి తెలియజేయడాన్ని ట్రాఫిక్ విద్య అంటారు.
→ రోడ్డును ఎక్కువగా ఉపయోగిస్తున్న వారిలో కౌమార దశలోని పిల్లలు ఉన్నారు.
→ “నిలుపుటకు వీలు లేదు” అనే ప్రదేశంలో వాహనాలను నిలుపరాదు.
→ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపరాదు.
→ డ్రైవింగ్ లైసెన్స్ రకాలు :
- లెర్నర్ లైసెన్స్
- శాశ్వత లైసెన్స్
→ లెర్నర్ లైసెన్స్ పొందుటకు అవసరమైన ధ్రువపత్రాలు
1) నివాస ధ్రువీకరణ : రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు. పన్ను చెల్లింపు రశీదు, జీవిత బీమా, ఓటరు గుర్తింపు కార్డు, పాస్పోర్టు లేదా ఆధార్ కార్డు.
వయస్సు ధ్రువీకరణకు : పాఠశాల ధ్రువీకరణ, పాస్పోర్టు, పుట్టినతేది ధ్రువీకరణ, ఆధార్, పాన్ కార్డు.
→ 50 సి.సి. కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలను నడుపుటకు ఉండవలసిన కనీస వయస్సు 18 సం||లు.
→ వస్తువుల, మనుషుల రవాణాకు ఉపయోగించే వాహనాలను నడుపుటకు ఉండవలసిన కనీస వయస్సు 25 సం||లు.
→ మనం ఆల్కహాల్ తీసుకున్నట్లయితే అది రక్తంలో కలిసిపోయి, మన శరీరం మొత్తానికి రక్తం ద్వారా వ్యాపిస్తుంది. ఊపిరితిత్తులలోకి చేరడం ద్వారా మనం విడిచిపెట్టే గాలిలో ఆల్కహాల్ కు సంబంధించిన ఆనవాలును ఒక ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా గుర్తించవచ్చు.
→ తాగి వాహనం నడిపే వారి వాహనాలను అధికారులు సీజ్ చేయవచ్చు.
→ డ్రైవరు ఎల్లప్పుడూ తన వాహనాన్ని ఎడమవైపున నడుపుతూ కుడివైపున వేగంగా వెళ్లే వాహనాలకు దారి వదలాలి.
→ రిజిస్ట్రేషన్ లేకుండా ఏ వాహనాన్ని నడపరాదు.
→ రోడ్డుపై గుర్తులను రోడ్డు ఉపరితలంపై నడిచే పాదచారుల కోసం, వాహన చోదకులకు మార్గనిర్దేశనం చేయడం కోసం ఉపయోగిస్తారు.
→ రోడ్డుకు ఇరువైపులా పాదచారులు నడవడానికి వీలుగా ఉండే దారి సుమారు రెండు మీటర్ల వెడల్పు ఉంటుంది.
→ రోడ్డును రెండు సమాన భాగాలుగా విభజించేదానిని డివైడర్ అంటారు.
→ జీబ్రా క్రాసింగ్ గుర్తులున్న చోట మాత్రమే పాదచారులు రోడ్డును దాటాలి.
→ రోడ్డు మీద వాహనాలను నడుపువారు ఈ గుర్తులను తప్పనిసరిగా పాటించాలి.
→ ఎరుపు రంగు – గీతకు ముందు ఆగాలని సూచిస్తుంది.
→ ఆరెంజ్ రంగు – వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తుంది.
→ ఆకుపచ్చ రంగు – వాహనాన్ని కదిలించమని సూచిస్తుంది.
→ పాదచారులు నిర్దేశించిన మార్గంలోనే నడవాలి.
→ పాదచారులు రాత్రివేళల్లో నడిచేటప్పుడు విధిగా టార్చిలైట్ దగ్గర ఉంచుకోవాలి.
→ వాహన చోదకులు హెల్మెట్ ధరించాలి.
→ వాహన రిజిస్ట్రేషన్ : ఆర్.టి.ఏ అధికారి కార్యాలయంలో నూతన వాహనానికి సంబంధించిన వివరాలను నమోదు చేసుకుని పొందు పము.
→ శ్వాస పరీక్ష పరికరం: ఆల్కహాల్ తీసుకున్నామా ! లేదా ! అని శ్వాసను పరీక్షించే పరికరం.
→ తప్పనిసరి గుర్తులు : వాహనదారులు తమ రక్షణ కోసం పాటించవలసిన ట్రాఫిక్ కు సంబంధించిన గుర్తులు.
→ ట్రాఫిక్ విద్య ట్రాఫిక్ నియమ నిబంధనలు సరళంగా, స్పష్టంగా తెలియజేయడాన్ని ట్రాఫిక్ విద్య అంటారు.
→ డ్రైవింగ్ లైసెన్స్ వాహనాలను నడిపే నియమ నిబంధనలను పరిశీలించి ఇచ్చే అనుమతి పత్రం. దీనిని మోటారు వాహనాలు నడుపువారు తప్పనిసరిగా పొందవలసి ఉంటుంది.
→ లెర్నర్ లైసెన్స్ తాత్కాలికమైనది. డ్రైవింగ్ నేర్చుకొనుటకు ఆరునెలల కాల పరిమితితో దీనిని జారీ చేస్తారు.
→ శాశ్వత లైసెన్స్ తాత్కాలిక లైసెన్స్ జారీ చేసిన ఒక నెల తరువాత నుంచి శాశ్వత లైసెన్స్ పొందుటకు అర్హత లభిస్తుంది.
→ పాదచారుల దారి : రోడ్డుకు ఇరువైపులా పాదచారులు నడవటానికి వీలుగా ఉండే దారి.
→ ఎరుపు రంగు : గీతకు ముందు ఆగాలని సూచిస్తుంది.
→ ఆరెంజ్ రంగు : వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తుంది.
→ ఆకుపచ్చరంగు : వాహనాన్ని కదిలించమని సూచిస్తుంది.