Students can go through AP Board 9th Class Social Notes 4th Lesson వాతావరణం to understand and remember the concept easily.
AP Board 9th Class Social Notes 4th Lesson వాతావరణం
→ సంవహన ప్రవాహాలు : వేడెక్కిన ఉపరితలం మీద ఉన్న అణువులు వేడెక్కుతాయి. వేడెక్కిన ఈ అణువులు చల్లని ప్రదేశాల వైపు ప్రయాణం చేయడం ద్వారా ఉష్ణం బదిలీ అవుతుంది. ఈ ప్రక్రియ వలన “సంవహన ప్రవాహాలు” ఏర్పడతాయి.
→ అంతర అయన రేఖాభిసరణ స్థానం : భూమధ్యరేఖ వద్ద ఉండే అధిక వేడిమి వల్ల వాతావరణం వేడెక్కి వేడిగాలి పైకి లేస్తుంది. దీనివల్ల భూమధ్యరేఖ ఉపరితల ప్రాంతంలో పీడనం తగ్గుతుంది. ఈ తక్కువ పీడనం మేఖలను భూమధ్యరేఖ తక్కువ “పీడన మేఖల” లేదా “అంతర అయన రేఖాభిసరణ స్థానం” అంటారు.
→ కొరియాలిస్ ప్రభావం భూమి తన అక్షం మీద తన చుట్టూ తాను తిరుగుతున్న దాని ప్రభావం వల్ల జనించే శక్తిని “కొరియాలిస్ ప్రభావం” అంటారు.
→ సాపేక్ష ఆర్థత : ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత మరియు లెక్కకట్టిన సమయంలో గాలిలో గల నీటి ఆవిరి పరిమాణానికి మధ్యగల నిష్పత్తిని “సాపేక్ష ఆర్ధత” అంటారు.
→ వర్షచ్ఛాయా ప్రాంతం : అరేబియా మహాసముద్రం నుంచి వచ్చే తేమతో కూడిన గాలి పశ్చిమ కనుమల మీద పైకి లేచే క్రమములో విస్తరించి, చల్లబడి, వానపడుతుంది. పశ్చిమ కనుమల ఒక వైపున దిగే గాలిలో తేమ ఉండదు. దక్కన్ పీఠభూమి మధ్య భాగంలో వానలు తక్కువ. కాబట్టి ఈ ప్రాంతం పొడిగా ఉంటుంది. దీనిని “వర్షచ్చాయా ప్రాంతం” అంటారు.
→ అయన రేఖా తుపానులు : చల్లగా, పొడిగా ఘనంగా ఉన్న గాలులు వెచ్చగా, తేమగా, తేలికగా ఉన్న గాలులను కలిసినప్పుడు సమశీతోష్ణ ప్రాంతపు తుపానులు సంభవిస్తాయి.
→ హిమశీకరాలు భూమి ఉపరితలం వద్ద చల్లటి పొరగుండా వాన కురుస్తున్నప్పుడు వర్ప బిందువులు మంచుగా గడ్డకట్టి కిందకు పడతాయి. దీనిని స్లీట్ (హిమశీకరాలు) అంటారు.
→ చినూక్ : ఉత్తర అమెరికాలోని అమెరికా – కెనడా ప్రాంతంలోని రాకీ పర్వతాల కిందగా వీచే పవనాలను “చినూక్” అంటారు.
→ పర్వతీయ వర్షపాతం : తేమతో కూడిన గాలి దాని దారిలో ఉన్న కొండ లేదా ఎత్తైన అవరోధం వల్ల పైకి లేచినపుడు ఈ రకమైన వర్షం కురుస్తుంది.