AP 10th Class Social Notes Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

Students can go through AP Board 10th Class Social Notes 12th Lesson సమానత – సుస్థిర అభివృద్ధి to understand and remember the concept easily.

AP Board 10th Class Social Notes 12th Lesson సమానత – సుస్థిర అభివృద్ధి

→ అభివృద్ధికి కొలమానంగా తలసరి ఆదాయం, స్థూల జాతీయోత్పత్తి (GDP) ల కంటే మానవ అభివృద్ధి సూచిక (HDI) మెరుగైనది.

→ సమాజంలో అధిక ఆదాయం, సంపద ఉన్నవాళ్ళు భోగభాగ్యాలతో తులతూగగా, అధిక శాతం ప్రజలు కనీస అవసరాలు తీర్చుకొనే స్థితిలో లేరు.

→ పర్యావరణం నాశనం చేయటం వలన సహజవనరులు. అంతరించిపోవడమే కాకుండా వాతావరణం కూడా అతలాకుతలమయిపోతోంది.

→ పొలాలు, నదులు, చెట్లు, జంతువులు, పక్షులు, కొండలు, లోయలు, మన చుట్టూ ఎన్నో వస్తువులు కనపడతాయి. మనతో సహా అవన్నీ కలసి ఉన్నదే “పర్యావరణం”.

→ మనం వాడుతున్న నీళ్ళు, తింటున్న ఆహారం, వేసుకుంటున్న బట్టలు, మనం వాడుతున్న కరెంటు, ఇంధనాలు, ఖనిజాలు, లోహాలు, పెట్రోలు, డీజిలు ఇవన్నీ మనకు ప్రకృతి ప్రసాదించినవే.

→ భూమి, నీరు, ఖనిజాలు, చెట్ల నుంచి వచ్చే ఉత్పత్తులు, పశువులు వంటివి సహజవనరులు.

→ రసాయనిక ఎరువులు, పురుగుమందులను వినియోగించకుండా పంటమార్పిడి, పెంటపోగు ఎరువు వంటి సహజ పద్దతులను ఆచరించి, స్థానిక వనరులను వినియోగించి చేసే వ్యవసాయం “సేంద్రియ వ్యవసాయం”.

AP 10th Class Social Notes Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

→ చెట్లను హత్తుకొని (కౌగిలించుకొని) గుత్తేదార్ల గొడ్డళ్ళకు అడ్డుగా నిలిచి 1970లో ఆరంభమైన ఉద్యమం “చిప్కో ఉద్యమం”.

→ ఈ భూమి మీద ఎన్నో రకాల మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు ఉన్నాయి. ఇలా రకరకాల జీవులు ఉండడాన్నే “జీవవైవిధ్యం” అంటాం.

→ భారతదేశంలో అతి పెద్ద ఆనకట్ట నర్మదా లోయ అభివృద్ధి పథకం. ఇది ప్రపంచంలోని అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టులలో ఒకటి.

→ స్థూల జాతీయోత్పత్తి దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు, సేవల విలువను సూచిస్తుంది.

→ సుస్థిర అభివృద్ధి : భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చటం.

→ పర్యావరణం : మనచుట్టూ ఉండే చెట్లు, పక్షులు, పురుగులు, నేల, ప్రవహించే నదులు, కొండలు, పర్వతాలు మొదలగునవి.

→ వనరుల మూలం : మానవుడు సుఖజీవనానికి ఉపయోగించే, భూగర్భజలాలు, ఇంధన వవరులు, ఖనిజాలే ముఖ్యం.

AP 10th Class Social Notes Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

→ ప్రజల హక్కులు : ప్రజల జీవనానికి, ఆనందమైన, సుఖవంతమైన బ్రతుకులకు ఆధారమైన రాజ్యాంగం కల్పించినవి.

→ సమానత : ప్రకృతిలో లభించే వనరులు, ప్రభుత్వం అందించే పథకాలు తరతమ భేదాలు లేకుండా ప్రజలందరకూ చేరడం.

→ శుద్ధిచేయు విధి : ఇది చాలా ముఖ్యమైన విధి. కాలుష్యాన్ని పర్యావరణం గ్రహించి ప్రమాదరహితంగా మార్చే శక్తిని, ‘శుద్ధిచేయు విధి’ అని అంటారు.

AP 10th Class Social Notes Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి