AP 9th Class Social Notes Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

Students can go through AP Board 9th Class Social Notes 20th Lesson ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన to understand and remember the concept easily.

AP Board 9th Class Social Notes 20th Lesson ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

→ 17, 18వ శతాబ్దాలలో ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలలో ప్రజాస్వామిక ప్రభుత్వాలు ప్రారంభమయ్యా యి.

→ ప్రజాస్వామ్యం అంటే అంతిమంగా ప్రజల నుంచి అధికారం పొంది, దానికి జవాబుదారీగా ఉండే ప్రభుత్వం.

→ లిబియాలో అంతిమ అధికారం రివల్యూషనరీ కమాండ్ కౌన్సిల్ కి ఉంది.

→ ఎన్నికైన ప్రజా ప్రతినిధులు వివిధ రకాలుగా ప్రజలకు జవాబుదారీగా ఉంటారు.

→ ప్రజల పాలన అని అన్నప్పుడు వయోజనులైన అందరూ అని అర్థం.

AP 9th Class Social Notes Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

→ 1920 నుంచి శ్వేతజాతి మహిళలకు మాత్రమే అమెరికా ఓటుహక్కు ఇచ్చింది.

→ 1965 నుంచి నల్లజాతీయులైన పౌరుల ఓటుహక్కుపై వివక్షతను తొలగించినది.

→ 1893లో న్యూజీలాండ్ లో అందరికీ ఓటుహక్కు లభించింది.

→ సార్వజనీన ఓటుహక్కు కల్పించిన తొలి పెద్ద దేశం యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్.

→ ఫిజిలోని ఎన్నికల విధానం ప్రకారం భారతీయ – ఫిజియన్ ఓటు కంటే స్థానిక ఫిజియన్ ఓటుకు విలువ ఎక్కువ.

→ 2013 నుంచి ఫిజిలో అందరి ఓటు సమాన విలువతో ఎన్నికలు జరుగుతున్నాయి.

→ ప్రజాస్వామ్యానికి పౌరుల క్రియాశీల భాగస్వామ్యం కావాలి.

→ ఒక దేశం నుండి మరో దేశానికి వలస వెళ్ళినవారిని కాందిశీకులు అంటారు.

→ 2012లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో 40 శాతానికి పైగా ప్రజలు తమ ఓటుహక్కును ఉపయోగించుకోలేదు.

→ ప్రజాస్వామ్యంలో పౌరులకు పౌరహక్కులుండాలి.

→ ప్రజాస్వామ్యానికి సమానత్వం కావాలి.

→ ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛాయుత ఎన్నికలు కావాలి.

→ రష్యా, మయన్మార్, లిబియా వంటి అనేక దేశాలలో ఒకటి లేదా రెండు పార్టీలను మాత్రమే పోటీ చేయడానికి అనుమతిస్తారు.

→ 1980లో జింబాబ్వే స్వాతంత్ర్యం పొందింది.

→ స్వేచ్ఛాయుత ఎన్నికల పునాదులపై ప్రజాస్వామ్యం నిర్మింపబడాలి.

→ ప్రజాస్వామ్యానికి చట్టాన్ని, అల్ప సంఖ్యాకుల అభిప్రాయాన్ని గౌరవించటం కావాలి.

→ యూరప్ ఖండంలో ఒక చిన్న దేశం – బెల్జియం.

AP 9th Class Social Notes Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

→ బెల్జియం దేశంలో ఫ్లెమిస్ ప్రాంతానికి చెందిన డచ్ భాష మాట్లాడే ప్రజలు 59% (వలోనియా ప్రాంతానికి చెందిన ఫ్రెంచ్ భాష మాట్లాడే ప్రజలు – 40%, మిగిలిన 1% జర్మన్ భాష మాట్లాడే ప్రజలు.

→ బ్రస్సెల్స్ లో 80% మంది ఫ్రెంచ్ మాట్లాడే ప్రజలు ఉండగా మిగిలిన 20% మంది డచ్ భాష మాట్లాడే ప్రజలు.

→ బెల్జియం రాజధాని బ్రసెల్స్.

→ శ్రీలంక భారతదేశానికి దక్షిణాన ఉన్న ద్వీప దేశం.

→ 1948లో శ్రీలంకకి స్వాతంత్ర్యం వచ్చింది.

→ శ్రీలంకలో తమిళాన్ని పట్టించుకోకుండా సింహళ ఒక్కదానినే అధికార భాషగా చేశారు.

→ 1980ల నాటికి శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాలతో కూడిన స్వతంత్ర ‘తమిళ ఈలం’ కోరుతూ అనేక పార్టీలు, సంస్థలు ఏర్పడ్డాయి.

→ బెల్జియం ప్రజలు 1970, 1993 మధ్య దేశ రాజ్యాంగాన్ని 4 సార్లు మార్చారు.

→ వ్యక్తి గౌరవాన్ని, స్వేచ్ఛని కాపాడటంలో వివిధ రకాల ప్రభుత్వాలలో ప్రజాస్వామ్యం మెరుగైనది.

→ ప్రజాస్వామ్యంలో ప్రత్యేకత ఏమిటంటే దానికి నిరంతరం పరీక్షలుంటాయి.

→ ప్రజాస్వామిక సమాజంలో మహిళలను గౌరవించటం, సమానులుగా చూడటం జరుగుతుంది.

AP 9th Class Social Notes Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

→ భారతదేశంలో కుల, ఆధారిత అసమానతలు, అత్యాచారాలు అక్కడక్కడా ఉన్నాయి. వాటిని నిర్మూలించడానికి అనేక చర్యలు చేపట్టడం జరుగుతుంది.

→ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్ (సోవియట్ రష్యా) :
సార్వజనీన ఓటు హక్కు కల్పించిన తొలి పెద్ద దేశం యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ (సోవియట్ రష్యా). 1917లో విప్లవం తరువాత అందరికీ ఈ హక్కు లభించింది. 2.

→ బహిరంగ చర్చలు:
ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికల్లో పాల్గొని పాలకులను ఎన్నుకోవటమేనన్న ధోరణి మాత్రమేకాక, ప్రభుత్వ విధానాలు, చట్టాలు తయారు చేయటంలో, వాటిని అమలు చేయటంలో కూడా ప్రజలు భాగస్వాములు కావాలి. ఇది ఎలా సాధ్యమవుతుందనగా ప్రజలందరూ బహిరంగంగా పాల్గొని తము అవసరాలు, అభిప్రాయాలు స్పష్టంగా పేర్కొనేలా బహిరంగ చర్చలు జరిపిన తరువాత చట్టాలు, విధానాలు రూపొందించినప్పుడు ఇది సాధ్యమవుతుంది.

→ పౌరహక్కులు : రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కులు.

→ సామాజిక, ఆర్ధిక సమానత్వం :
రాజకీయ సమానత్వం : ప్రతి వ్యక్తికీ ఒక ఓటు ఉండటం, ప్రతి ఓటుకు ఒక విలువ ఉండటం.

సామాజిక, ఆర్థిక అసమానత :

 1. రాజకీయ సమానత్వం ప్రభావం చూపాలంటే సామాజిక, ఆర్థిక హోదాలలో సైతం సమానత్వం ఉండాలి. సమాజం ధనిక-పేదలుగా, పైకులాలు – దళితులుగా విభజింపబడి ఉంటే రాజకీయ సమానత్వం అర్థరహితం అవుతుంది.
 2. ఉన్నత హోదా, సంపద ఉన్నవాళ్ళు తమకు అనుకూలంగా ఓటువేయమని మిగిలిన వాళ్లని తేలికగా ప్రభావితం చేయగలుగుతారు.
 3. చాలా కుటుంబాలలో ఆ కుటుంబానికి పెద్ద అయిన పురుషుడు మహిళలతో సహా కుటుంబ సభ్యులందరూ ఎవరికి ఓటు వేయాలో నిర్ణయిస్తాడు.
 4. అమెరికా వంటి అనేక దేశాలలో అనేక ప్రసార సాధనాలు ధనిక కార్పొరేట్ సంస్థలు లేదా వ్యక్తుల చేతుల్లో ఉంటాయి. దీనిని ఎక్కువగా ప్రసారం చేస్తారు. దీనిని విస్మరిస్తారు అన్న దానిని బట్టి వీళ్లు ప్రజాభిప్రాయాన్ని తీర్చిదిద్దుతారు. ప్రభావితం చేస్తారు. సంపన్నులకు, శక్తిమంతులకు శాసనసభ్యులు, మంత్రులు అందుబాటులో ఉంటారు. కాబట్టి వాళ్ళు విధానాలు, కార్యక్రమాలను ప్రభావితం, చేయగలుగుతారు.
 5. ఇంకోవైపున పేదలకు, నిరక్షరాస్యులకు ప్రభుత్వ వర్గాలు ఈ విధంగా అందుబాటులో ఉండవు. కాబట్టి అనేక దేశాల ప్రభుత్వాలు ధనికులకు అనుకూలంగా, పేదల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే విధానాలను అనుసరిస్తుంటాయి. ఇలాంటి విధానాలను సామాజిక – ఆర్థిక అసమానత అంటారు.

→ అంతర్యుద్ధాలు అంతర్గత ఘర్షణలు :
అంతర్యుద్ధాలు అంతర్గత ఘర్షణలు ఉదా :

 1. 1948లో శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చినది.
 2. అధిక సంఖ్యలో ఉన్న సింహళనాయకులు ప్రభుత్వంపై ఆధిపత్యం సాధించటానికి ప్రయత్నించారు.
 3. ఫలితంగా ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వం సింహళీయుల ఆధిపత్యాన్ని నెలకొల్పటానికి అధిక శాతం ప్రజల వాదాన్ని అమలు చేయసాగింది.
 4. తమిళాన్ని పట్టించుకోకుండా సింహళ ఒక్కదానినే అధికార భాషగా చేశారు.
 5. ఉద్యోగాల భర్తీలో సింహళ దరఖాస్తుదారులకు ప్రాధాన్యత ఇచ్చే విధానాలను ప్రభుత్వాలు అనుసరించాయి.
 6. కొత్త రాజ్యాంగం ప్రకారం బౌద్ధ మతానికి ప్రభుత్వ మద్దతు, ప్రాపకం లభించింది.
 7. ఒకటొకటిగా చేపట్టిన ఈ చర్యల వల్ల శ్రీలంక తమిళులలో తాము వేరు అన్న భావం ఏర్పడింది.
 8. ఫలితంగా క్రమేపి సింహళీయుల, తమిళ ప్రజల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
 9. సమాన స్థాయి కోసం శ్రీలంక తమిళులు రాజకీయ పార్టీల ద్వారా పోరాటాలు చేపట్టారు.
 10. తమిళులు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలకు స్వయంప్రతిపత్తి కోరిక పలుమార్లు తిరస్కరింపబడింది.
 11. 1980ల నాటికి శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాలతో కూడిన స్వతంత్ర తమిళ ఈలం (రాష్ట్రం) కోరుతూ అనేక పార్టీలు, సంస్థలు ఏర్పడ్డాయి.
 12. రెండు వర్గాల ప్రజల మధ్య అపనమ్మకం కారణంగా ఘర్షణలు తీవ్రమయ్యాయి. విస్తరించాయి.
 13. ఎల్ టిటిఇ అనే తీవ్రవాద సంస్థ తమిళులు నివసిస్తున్న కొన్ని ప్రాంతాలలో స్వతంత్ర పాలన నెలకొల్పటంతో ఇది అంతర్గత పౌర యుద్ధంగా మారింది.

AP 9th Class Social Notes Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

→ పౌరస్వేచ్ఛ :
ప్రజాస్వామ్యంలో పౌరులు తమ హక్కులను గురించి తెలుసుకోవటానికి, చర్చించటానికి, స్వతంత్ర అభిప్రాయాలు ఏర్పరచుకోటానికి, వాటిని వ్యక్తపరచటానికి సంఘాలుగా ఏర్పడి తమ భావాల అమలుకు పోరాడటానికి పౌరులకు ఉన్న స్వేచ్ఛను పౌరస్వేచ్చ అంటారు.

AP 9th Class Social Notes Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన 1