Students can go through AP Board 10th Class Social Notes 16th Lesson భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947 to understand and remember the concept easily.
AP Board 10th Class Social Notes 16th Lesson భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947
→ రెండవ ప్రపంచయుద్ధం 1939లో ప్రారంభమైనది. ఈ సమయంలో అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలిస్తున్నాయి.
→ 1935లో బ్రిటిషు భారత ప్రభుత్వ చట్టాన్ని ఆమోదించింది.
→ 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఓటువేసే అధికారాన్ని చాలా కొద్దిమందికే ఇచ్చారు. రాష్ట్ర శాసనసభలకు 12%, కేంద్రసభకు 1% ప్రజలకే ఓటు హక్కు లభించింది.
→ 1937లో ఎన్నికలు నిర్వహించినపుడు 8 రాష్ట్రాలలో కాంగ్రెస్, ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.
→ అనేకమంది కాంగ్రెస్ నాయకులు హిట్లర్, ముస్సోలినిని, ఫాసిజాన్ని వ్యతిరేకించారు.
→ రెండవ ప్రపంచయుద్ధ సమయంలో బ్రిటన్ లో “కన్సర్వేటివ్” పార్టీకి చెందిన విస్టన్ చర్చిల్ ప్రధానమంత్రిగా ఉన్నాడు.
→ 1937లో జరిగిన ఎన్నికలలో అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.
→ 1939లో రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభమైంది.
→ భారతీయులతో సంప్రదించకుండా భారత ప్రజలు యుద్ధంలో ఇంగ్లాండుకు సహాయం చేయాలనే వైస్రాయి ప్రకటనకు నిరసనగా కాంగ్రెస్ ప్రభుత్వాలు 1939లో రాజీనామా చేశాయి.
→ బ్రిటిష్ ‘విభజించి పాలించు’ అన్న సిద్ధాంతాన్ని పాటించింది.
→ ‘విభజించి పాలించు’ సూత్ర ప్రాతిపదికగా ముస్లిం లీగును ప్రోత్సహించి కాంగ్రెస్ ప్రాముఖ్యాన్ని తగ్గించసాగింది.
→ 1906 లో ముస్లింలీగు ఏర్పడింది.
→ 1909 నుంచి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను బ్రిటిష్ ఏర్పాటు చేసింది.
→ కులం, వర్గ భేదాలను అధిగమించి హిందువులనందరినీ ఏకం చేయడానికి కృషి చేసినవి, హిందూ మహాసభ, ఆర్.ఎస్.ఎస్‌లు.
→ “సారే జహాసే అచ్ఛా హిందూస్తాన్ హమారా” అన్న కవిత రాసిన ఉర్దూ కవి “మహ్మద్ ఇక్బాల్” 1930లో వాయవ్య ముస్లిం రాష్ట్ర ఆవశ్యకత గురించి మాట్లాడినాడు.
→ పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ (పంజాబ్, ఆఫ్ఘన్, కాశ్మీరు, సింద్, బెలుచిస్తాన్ ఇంగ్లీష్ అక్షరాల నుంచి ఏర్పడింది) అన్న ఆ పేరును పంజాబీ ముస్లిం చౌదరి రెహ్మత్ ఆలి రూపొందించాడు.
→ 1942 లో క్రిప్స్ భారతదేశం వచ్చి, కొన్ని ప్రతిపాదనలు చేసాడు.
→ 1942 ఆగష్టులో “క్విట్ ఇండియా” ఉద్యమాన్ని గాంధీజీ ప్రారంభించారు.
→ సుభాష్ చంద్రబోస్ 1942లో జపానులో భారతీయ సైనికులతో ఒక సైన్యాన్ని తయారుచేశాడు.
→ 1946 ఫిబ్రవరి 16న బొంబాయి రేవులోని రాయల్ నౌకాదళంలోని భారత సైనికులు బ్రిటిష్ అధికారుల ప్రవర్తన పట్ల నిరసనగా నిరాహారదీక్ష చేపట్టారు.
→ హైదరాబాదులో కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ ప్రాంత రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించింది.
→ 1946 లో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలలో కేంద్రంలో రిజర్వు చేసిన 30 స్థానాలనూ, రాష్ట్రంలో 442 స్థానాలను ముస్లిం లీగు గెలుచుకుంది.
→ 1946 లో సాధారణ నియోజక వర్గాలలో కాంగ్రెస్ పార్టీ ముస్లిమేతర ఓట్లలో 91 శాతంతో విజయం సాధించింది.
→ 1946 మార్చిలో కాబినెట్ మిషన్ భారతదేశం వచ్చింది.
→ ముస్లిం లీగు 1946 ఆగష్టు 16ను ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించింది.
→ 1947 ఫిబ్రవరిలో మౌంట్ బాటెన్ వైస్రాయిగా వచ్చాడు.
→ మౌంట్ బాటెన్ ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న పంజాబు, బెలూచిస్తాన్, తూర్పు బెంగాల్ లను పాకిస్తాన్ గా విభజించి, 1947 ఆగష్టు 14న పాకిస్తాన్ కు, భారతదేశానికి ఆగష్టు 15న స్వాతంత్ర్యాన్ని ప్రకటించడం జరిగింది.
→ భారతదేశం ప్రజాస్వామిక లౌకికరాజ్యంగా ఆవిర్భవించింది.
→ దేశ విభజన మూలంగా వలసలు జరిగి 1.5 కోట్ల హిందూ, ముస్లింలు నిర్వాసితులయ్యారు.
→ 1948 జనవరి 30న “నాథూరాం గాడ్సే” గాంధీజీని హత్య చేసినాడు.
→ బ్రిటిష్ ఇండియాలో ఉన్న 550 స్వదేశీ సంస్థానాలను స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో విలీనం చేసే కార్యక్రమానికి “సర్దార్ పటేల్” నాయకత్వం వహించాడు.
→ 1971లో భారత ప్రభుత్వం రాజ భరణాలను, బిరుదులను రద్దు చేసింది.
→ రాజ్య ( డొమీనియన్) ప్రతిపత్తి : జామీనియన్ ప్రతిపత్తి” అనే అంశం 1942లో భారతదేశానికి వచ్చిన “సర్ స్టాఫర్డ్ క్రిప్స్” రాయబారంలోని ముఖ్య అంశం. దీని ప్రకారం రెండవ ప్రపంచ యుద్ధం ముగియగానే భారతదేశానికి “సార్వభౌమాధికారం కలిగిన రాజ్య ప్రతిపత్తి” ఇస్తామని చెప్పారు. డొమీనియన్ ప్రతిపత్తికి అనుగుణంగా ఒక రాజ్యాంగ నిర్మాణసభ సమావేశమై రాజ్యాంగాన్ని రూపొందిస్తుంది. కాని ఈ రాజ్యాంగాన్ని బ్రిటిష్ అమలుచేస్తుంది. దీని ప్రకారం ఏదైనా రాష్ట్రం కాని, ప్రాంతం కాని, సంస్థానాలు కాని తమకు ఇష్టం అయితే ఇందులో చేరవచ్చు లేదా స్వతంత్ర రాజ్యాలుగా ఉండవచ్చు. ఈ సూచనలు భారతదేశాన్ని ముక్కలుగా విభజిస్తాయని కాంగ్రెస్, ముస్లిం లీగులు భావించి, వీటిని తిరస్కరించినారు.
→ విభజించి పాలించు : శీఘ్రంగా పెరిగిపోతున్న జాతీయోద్యమాన్ని ఎదుర్కోవడానికి, దానిని నిలువరించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఈ “విభజించి పాలించు” అనే విధానాన్ని అవలంభించింది. ఈ బ్రిటిష్ విధానాన్ని పాటించి, కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమాలను ప్రోత్సహించింది. హిందూ-ముస్లిం మధ్య మత వైరుధ్యాన్ని పోషించింది. కమ్యూనల్ ఎలక్టరేట్లను ప్రవేశపెట్టడం ద్వారా విద్యావంతులు మరియు సాధారణ ప్రజానీకం మధ్య శత్రుత్వాన్ని పెంచి పోషించారు. అతివాదులకు వ్యతిరేకంగా మితవాదులను ప్రోత్సహించారు. ఇటువంటి విభజించే విధానాలను బ్రిటిష్ వారు పాటించినారు.
→ ప్రత్యేక నియోజకవర్గం : 1906లో ప్రత్యేక ముస్లిం లీగు ఏర్పాటు జరిగింది. బ్రిటిష్ వారు ముస్లింలకు “ప్రత్యేక సదుపాయాలు చేస్తూ ప్రత్యేక ముస్లిం నియోజక వర్గాలను 1909 మింటో మార్లే సంస్కరణలలో” భాగంగా చేశారు. దీని ప్రకారం ముస్లింలు ఎన్నుకోబడి, శాసనసభలలోకి వెళ్ళడానికి అవకాశం కలిగింది.
→ ద్విజాతి సిద్ధాంతం : భారతదేశంలోని ప్రజలందరూ హిందూ, ముస్లిం జాతులుగా విభజింపబడుటను “ద్విజాతి సిద్ధాంతం” అంటారు. హిందువులు ప్రత్యేక జాతి, ముస్లింలు ప్రత్యేక జాతి అని వీరిద్దరి ఆశయాలు వేరని చెప్పడమే ద్విజాతి సిద్ధాంతం.
→ కమ్యూనల్ అవార్డు : దళిత కులాలకు ప్రత్యేక ఎలక్టోరేట్లను ఏర్పాటు చేయుటనే “కమ్యూనల్ అవార్డు” అంటారు. దీని ప్రకారం దళితవర్గాలు స్వయంగా ఎంపిక చేసుకొన్న పేర్ల జాబితా నుంచి కామన్ జాయింట్ నియోజక వర్గాల ద్వారా భర్తీ చేయవలసి ఉంది. రిజర్వ్ చేసిన స్థానాల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది.