AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 17th Lesson లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 17th Lesson లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

9th Class Social Studies 17th Lesson లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
1. కింది వాటిని జతపరచండి. (AS1)

1. నల్లమందు యుద్ధాలు అ) బెల్జియం
2. ఒట్టోమన్ సామ్రాజ్యం ఆ) స్పెయిన్
3. వ్యక్తిగత ఆస్తిగా వలస ప్రాంతం ఇ) వలస ప్రాంతంగా మార్చటానికి ముందు వ్యాపారాన్ని నియంత్రించారు
4. రైతులు స్థిరపడేలా చేయడం ఈ) చైనా

జవాబు:

1. నల్లమందు యుద్ధాలు ఈ) చైనా
2. ఒట్టోమన్ సామ్రాజ్యం ఇ) వలస ప్రాంతంగా మార్చటానికి ముందు వ్యాపారాన్ని నియంత్రించారు
3. వ్యక్తిగత ఆస్తిగా వలస ప్రాంతం అ) బెల్జియం
4. రైతులు స్థిరపడేలా చేయడం ఆ) స్పెయిన్

ప్రశ్న 2.
ఐరోపా వాసులు ‘కనుగొనటం’, ‘అన్వేషణ’ అన్న పదాలను ఎలా ఉపయోగిస్తారు? ఆ భౌగోళిక ప్రాంతాలలో ఉంటున్న ప్రజలను ఇవి ఎలా ప్రభావితం చేశాయి? (AS1)
జవాబు:
ఐరోపా వాసులు ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య వర్తక వాణిజ్యాలు కొనసాగించి అధిక లాభాలు ఆర్జించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో వర్తక వాణిజ్యాలు కొనసాగించడానికి, అనేక నూతన ప్రదేశాలను కనుగొని, ముఖ్య పట్టణాలలో ముఖ్యమైన వ్యాపార కేంద్రాలను అన్వేషణ చేసి వ్యాపారాభివృద్ధికి తోడ్పడ్డారు. ప్రపంచానికి తెలియని అనేక కొత్త ప్రాంతాలు, దేశాలను అన్వేషించి, వాటికి పేర్లు పెట్టారు. తమ వలస ప్రాంతాలకు తేలికగా, సులువుగా చేరుకొనే ప్రయత్నంలో అనేక కొత్త మార్గాలను అన్వేషించారు. పోర్చుగీసు వాళ్ళు ఆఫ్రికా చుట్టుముట్టి భారతదేశానికి దారి కనుక్కోటానికి ప్రయత్నించారు. వివిధ కొత్త ప్రాంతాలను అన్వేషించి, కనుగొనడం ద్వారా ఆయా ప్రాంత ప్రజలు ఆనందం వెలిబుచ్చారు. వ్యాపారాభివృద్ధితో ముందుకు నడిపించడమే కాకుండా కొన్ని సందర్భాలలో హింసలకు, బానిసత్వానికి గురయ్యారు. ఏ విధమైన స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు లేక వలస పాలకుల అధీనంలో చీకటి బతుకులు బతికేవాళ్ళు.

AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

ప్రశ్న 3.
వలస ప్రాంతాలుగా మార్చటంలో వ్యాపారం పోషించిన పాత్ర ఏమిటి? (AS1)
జవాబు:
రాజుల పాలనలో రాజుల ఆధీనంలో ఉన్న ముఖ్య పట్టణాలను, వ్యాపారం పేరిట వివిధ దేశాలకు చెందిన వ్యాపారస్తులు, రాజుల అనుమతితో వర్తకం చేసుకోవడానికి అనుమతి పొందేవారు. తమ వ్యాపార మెళుకువలతో రాజులను ఆకర్షించడమే కాకుండా ముఖ్య నగరాలు, ముడి పదార్థాలు అభ్యమయ్యే ప్రాంతాలను తమ వ్యాపార కేంద్రాలుగా వ్యాపారస్తులు మలుచుకున్నారు. అంతేకాకుండా అప్పుడు రాజులలో ఉన్న అనైక్యత, వైరుధ్యాలు, వైరాలను తమకు అనుకూలంగా మార్చుకొని, లంచం రూపంలో నిధులు అందించి, చాలా ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. వ్యాపార కేంద్రాలు ద్వారా తమ అధీనమైన ప్రాంతాలలోని ప్రజలను బానిసలుగా చేసి, వలస ప్రాంతాలుగా మలుచుకొని అధిక సంపదను దోచుకొని, తమ పాదాక్రాంతం చేసుకున్నారు.

ప్రశ్న 4.
వలస పాలన వివిధ దేశాలలో స్థానిక ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేసింది? మూడు ఖండాలకు వేరుగా ఒక్కొక్క దాని గురించి ఈ కింది నేపథ్యంలో రాయండి.
ఎ) పండించిన పంటలు
బి) మతం
సి) ప్రకృతి వనరుల వినియోగం (AS1)
జవాబు:
ఎ) పండించిన పంటలు :
యూరపు వలస ప్రాంతాలలోని స్థానికులు నావికులను, వ్యాపారస్తులను ఆహ్వానించి, ఆహారం, ఆశ్రయం ఇచ్చారు. కాని స్పెయిన్ ప్రజలు వాళ్ళను దోచుకుని బానిసలుగా వాడుకున్నారు. వ్యవసాయ క్షేత్రాలలో వలస ప్రాంతాలు ఏర్పరిచారు. పండిన పంటలు ఆక్రమించుకుని రైతుల భూములు ఆక్రమించి వారికి భూముల్లేకుండా చేశారు.

లాటిన్ అమెరికాలో వలస దేశాల పరిపాలనలో కేథలిక్కు చర్చి కూడా ముఖ్య పాత్ర పోషించింది. స్పెయిన్ నుంచి స్థిరపడినవారి అధీనంలో విశాల భూభాగాలు ఉండేవి. వీటిని ‘హసియండా’ అనేవాళ్ళు. వేలాది ఎకరాలలో విస్తరించి అందులో వెండి, రాగి గనులు, వ్యవసాయ భూములు ఉండేవి. చెరుకు, పొగాకు, పత్తి వంటి వాణిజ్య పంటలను సాగుచేసి వలస పాలిత ప్రాంతాలు వాటిని చవకగా తమపై ఆధిపత్యమున్న దేశాలకు అమ్మాలి.

ఆసియాలో యూరపు వలస దేశాల పాలనలో కూడా రబ్బరు, మిరియాలు, చెరుకు వంటి ఏక పంటలతో ప్రోత్సహించారు.

బి) మతం :
మూడు ఖండాల మధ్య చాలా వ్యాపార మార్గాల అన్వేషణ, నియంత్రణ, అధిక లాభాలకై యుద్దాలు చేసేవారు. కేథలిక్కు మత విధానాలను బలవంతంగా రుద్దసాగారు. మతాధికారులు, మతగురువులు, పోపు ఆధిపత్యం కొనసాగింది. వలస పాలిత ప్రాంతాలలో మత ఆధిపత్యం చెలాయించటానికి అధికంగా ప్రయత్నించారు.

సి) ప్రకృతి వనరుల వినియోగం :
వలస ప్రాంతాలలో ప్రకృతి వనరులు ఈ మూడు ఖండాల వారిని ఆకర్షించాయి. ప్రకృతి వనరులను తమ అధీనంలోకి తెచ్చుకోడానికిగాను భూదాహంతో ఆయా ప్రాంతాలలో స్థిరపడడానికి ప్రయత్నించారు. విలువైన బంగారు గనులు, వెండి నిక్షేపాలు గల భూములను ఆక్రమించి, యజమానులను తరిమికొట్టారు. కొన్ని ప్రాంతాలలో వలస ప్రాంత భూములను చవకగా పొంది ప్రకృతి వనరులను అనుభవించారు.

AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

ప్రశ్న 5.
చైనా, భారతదేశం, ఇండోనేషియాలపై వలసపాలన తీరు గురించి రాయండి. వాటి మధ్య పోలికలు, తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
భారతదేశం :
15వ శతాబ్దం ఆరంభంలో గోవా వంటి ఓడ రేవుల పై పోర్చుగీసు ఆధిపత్యం సాధించింది. ఇతర యూరప్ దేశాలు 16వ శతాబ్దం చివరి నాటికి వ్యాపార కేంద్రాలను స్థాపించి, భారతదేశంతో వ్యాపారం చేయటం మొదలుపెట్టాయి. భారతదేశ భాగాలపై రాజకీయ నియంత్రణ దక్షిణ భారతంలో మొదలైంది. మద్రాస్ పైన బ్రిటిష్, పాండిచ్చేరి పైన ఫ్రెంచి ఆధిపత్యం సాధించాయి. చవక ధరలకు తమ ఉత్పత్తులను అమ్మేలా రైతులు, చేతి వృత్తి కళాకారులు, వ్యాపారస్తులను బలవంతం చేయటానికి తన రాజకీయ శక్తిని బ్రిటిషు వారు ఉపయోగించుకున్నారు.

చైనా :
యూరపు దేశాలు చైనాలో స్వేచ్ఛగా వ్యాపారం చేయడానికి చైనా అనుమతించలేదు. ఒక పట్టణంలో మాత్రమే వ్యాపారం చేసుకోడానికి అనుమతిచ్చారు. చైనాలో బాగా గిరాకి ఉండి, భారత్ లో విరివిగా పండు నల్లమందు అక్రమ రవాణా ద్వారా లాభాలు గడించాలని యూరపు దేశస్తులు తలంచారు. నల్లమందు ద్వారా తమ దేశస్తులు నష్టపోతున్నారని చైనా తలంచగా ఈ రెండు దేశాల మధ్య, 1840 – 42 ల మధ్య యుద్ధాలు జరిగాయి. తదుపరి చైనా ఓడిపోయి ఇంగ్లాండు. ఒప్పందాలకు అంగీకరించింది.

ఇండోనేషియా :
బలమైన రాజ్యాలు లేని ఇండోనేషియాలోని విశాల భూభాగాలను డచ్ కంపెనీ ఆక్రమించుకోసాగింది. తమ ఉత్పత్తులను కంపెనీకి తక్కువ ధరలకు అమ్మేలా స్థానిక ప్రజలపై ఒత్తిడి పెట్టగలిగింది. 1800 సం|| నుండి ఇండోనేషియా ఆక్రమించుకొని పాలించసాగింది. ఆ దేశాన్ని ఆదాయ వనరుగా ఉపయోగించుకుంది.

పోలికలు :

  1. ఈ మూడు దేశాలు వలస దేశాలుగా ఉన్నవే.
  2. ఈ మూడు దేశాలు, ప్రకృతి వనరులు, సహజ సంపదతో విలసిల్లేవి.
  3. వ్యాపారాలతో ప్రారంభించి, వలసవాద దేశాల అధీనంలోనికి వెళ్ళినవే.
  4. ఇచ్చట ప్రజలలో, రాజులలో అనైక్యత మూలంగానే.
  5. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న దేశాలు.
  6. ప్రజలను బానిసలుగా మార్చారు.

తేడాలు :
‘భారతదేశం’లో అన్ని ప్రాంతాలలో వర్తక వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతులు పొందారు. (ముఖ్య పట్టణాలు).

‘చైనా’ అన్ని ప్రాంతాలు కాకుండా, ఒకే ఒక్క పట్టణంలో వ్యాపారానికి అనుమతి.
‘ఇండోనేషియా’ బలమైన రాజ్యాలు లేకపోవడం వల్ల దేశం అంతా ఆక్రమణ.
భారతదేశంలో ఆధిపత్యానికి ఒకదానితో ఒకటి పోటి పడసాగాయి. అనేక యుద్ధాలు ద్వారా పరిపాలన పాదాక్రాంతం. చైనాలో నల్లమందు ద్వారా యుద్ధాలు ప్రారంభం. అనేక ఒప్పందాలు వల్ల నిధులన్ని కొల్లగొట్టారు.
ఇండోనేషియాలో రబ్బరు, మిరియాలు, చెరుకు వంటి ఏక పంటలతో విస్తృత తోటలు సాగు చేయటాన్ని ప్రోత్సహించింది.

ప్రశ్న 6.
ప్రపంచ పటం నందు పోర్చుగీసు, డచ్, బ్రిటిష్, ఫ్రెంచి వలసలను గుర్తించి, రంగులతో నింపండి. (AS5)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం 4

9th Class Social Studies 17th Lesson లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం InText Questions and Answers

9th Class Social Textbook Page No.205

ప్రశ్న 1.
వాళ్ళకు అసలు తెలియని ఖండాలు ఏవి?
జవాబు:
ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణా అమెరికా, అంటార్కిటికా.

ప్రశ్న 2.
వాళ్ళకు తీర ప్రాంతాలు తెలిసి, లోపలి ప్రాంతాలు తెలియని ఖండాలు ఏవి?
జవాబు:
ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, యూరప్.

9th Class Social Textbook Page No.206

ప్రశ్న 3.
1400 లలో ఆసియాతో వ్యాపారాన్ని యూరపు దేశాలైన పోర్చుగల్, స్పెయిన్ కాకుండా ఇటలీ ఎందుకు నియంత్రిస్తోంది?
జవాబు:
1400 సం||నాటికి యూరపు, ఆసియాల మధ్య చాలా వరకు వ్యాపార మార్గాలను ముస్లిం రాజ్యాలు నియంత్రించసాగాయి. ప్రత్యేకించి ఒట్టోమన్ సామ్రాజ్యం యూరప్ క్రైస్తవ శక్తులతో నిరంతరం యుద్ధాలు చేస్తుండేది. ఇటలీ దేశస్థులు అరబ్బు వ్యాపారస్తులతో కుదుర్చుకున్న ఒప్పంద ఫలితంగా వాళ్ళు ఆసియా నుండి సరుకులు తెచ్చి అలెగ్జాండ్రియా దగ్గర వాళ్లకి అమ్మేవాళ్ళు. పశ్చిమ యూరపులో హాలెండ్, స్పెయిన్, పోర్చుగల్, ఇంగ్లాండ్ వంటి దేశాల వ్యాపారస్తులు, ప్రభుత్వాలు, ఈ వ్యాపార ప్రాముఖ్యతను గుర్తించారు. దాంతో భారతదేశం, చైనా వంటి దేశాలకు ఇటలీ వ్యాపారస్తుల నియంత్రణలో ఉన్న ప్రాంతాల నుంచి కాకుండా తేలికగా, త్వరగా చేరుకునే మార్గాలను అన్వేషించసాగారు.)

AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

ప్రశ్న 4.
ఆసియాకి మరో మార్గాన్ని కనుక్కోవటానికి పోర్చుగల్, స్పెయిన్ దేశాలు ఎందుకు అంత ఆసక్తి కనపరిచాయి?
జవాబు:
భారతదేశం, చైనా, ఇండోనేషియా వంటి దేశాలు. ఇటలీ వ్యాపారస్తుల నియంత్రణలో ఉండటం, కొన్ని ప్రాంతాలలో ఇటలీ ఒప్పందం కుదుర్చుకొని వ్యాపారలావా దేవీలు కొనసాగించడం వల్ల ఈ మార్గాలు కాకుండా తేలికగా, త్వరగా చేరుకొనే మార్గాలను అన్వేషించారు. ఉదా : పోర్చుగీసు వాళ్ళు ఆఫ్రికా చుట్టుముట్టి భారతదేశానికి దారి కనుక్కోటానికి ప్రయత్నించారు. అట్లాంటిక్ మహా సముద్రాన్ని దాటటం ద్వారా భారతదేశం చేరుకోవచ్చో లేదో తెలుసుకోవాలని స్పెయిన్ ప్రయత్నించింది. అనుభవజ్ఞులైన నావికులు, ఓడలు ద్వారా ఆసియాను అన్వేషణ చేశారు.

9th Class Social Textbook Page No.208

ప్రశ్న 5.
1800 నాటి దక్షిణ అమెరికా పటాన్ని చూసి వివిధ వలస రాజ్యా లను, పాలిత దేశాలను గుర్తించండి.
జవాబు:
దక్షిణ అమెరికా వలస రాజ్యా లు :
పోర్చుగీసు, స్పెయిన్, డచ్, యు.కె.

పాలిత దేశాలు :
ఉరుగ్వే,
వెనిజులా,
ఈక్వెడార్,
బొలీవియా,
పెరు,
పరాగ్వే,
అర్జెంటైనా.
AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం 2

ప్రశ్న 6.
వలస ప్రాంతాల ప్రభుత్వాలలో అక్కడ స్థిరపడిన స్పానిష్ ప్రజలకు ప్రముఖ పాత్రను ఎందుకు ఇవ్వలేదు?
జవాబు:
స్పానిష్ ప్రజలకు వలస ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వలేదు. వలస దేశాల పరిపాలనలో కేథలిక్కు చర్చి. కూడా ముఖ్యపాత్ర పోషించేది. స్పెయిన్ కి చవకగా ప్రకృతి వనరులు, శ్రామికులను అందించేలా వలస ప్రాంతాల ఆర్థిక విధానాలను నియంత్రించారు, కానీ ఆ దేశాలు అభివృద్ధి చెందడానికి కాదు. స్పానిష్ ప్రజలకు ఉన్న ఆయుధాలు. మందుగుండు సామగ్రి వలస ప్రాంత ప్రభుత్వాలను భయపెట్టింది. స్పానిష్ వలస పాలనలో ఉన్న ప్రజలు అక్కడ ఎంతో కాలం క్రితం స్థిరపడిన స్పానిష్ ప్రజలతో సహ తమపై స్పానిష్ రాచరిక వర్గాల నియంత్రణను ద్వేషించసాగారు.

9th Class Social Textbook Page No.209

ప్రశ్న 7.
మీరు ఎనిమిదవ తరగతిలో నిజాం రాజ్యంలోని జమీందారీ వ్యవస్థ గురించి చదివారు. నిజాం రాష్ట్రంలోని జమీందారీ వ్యవస్థను దక్షిణ అమెరికాలోని హసియండాలతో పోల్చండి. వాటి మధ్య పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
జమీందారీ వ్యవస్థకు, హసియండాలతో పోలికలు, తేడాలు ఉన్నాయి.

పోలికలు :

  • జమీందారీ వ్యవస్థలోను, హసియండాలోను కూడా ఉండేవి వ్యవసాయ భూములే.
  • జమీందారుల అధీనంలోని భూములు, భూస్వాముల అధీనంలోని భూములు వేలల్లో ఉండేవి.
  • తరతరాలుగా అనుభవిస్తున్నారు.

భేదాలు :

  • జమీందారీ వ్యవస్థలోని భూముల్లో కొన్ని సారవంతమైనవి. మరికొన్ని ఎకరాలు నిస్సారమైనవి.
  • హసియండా భూములు బాగా ఖరీదైనవి, సారవంతమైనవి.
  • జమీందారీ భూములను చిన్నచిన్న రైతులు, కౌలుదార్లు వ్యవసాయం చేసేవారు.
    హసియండా భూముల్లో ఆఫ్రికా బానిసలు, స్వేచ్ఛలేని ఇండియన్లను నియమించుకునేవారు.
  • జమీందారుల భూముల్లో రకరకాల పంటలు, అడవులు, చెట్లు ఉండేవి.
    హసియండా వేలాది ఎకరాలలో విస్తరించి అందులో వెండి, రాగి గనులు, వ్యవసాయ భూములు, పచ్చిక బీళ్ళు, కర్మాగారాలు కూడా ఉండేవి.
  • జమీందారీ భూముల్లో భూ సంస్కరణ, భూ పరిమితి చట్టాలు వలన కొంత భూమి కోల్పోయారు. హసియండాలో భూములు కోల్పోలేదు.

ప్రశ్న 8.
లాటిన్ అమెరికాలోని వలస పాలిత ప్రాంతాల్లో దిగువ ప్రజల సమస్యల జాబితా తయారుచేయండి.
జవాబు:
1. హసియండాల యజమానులైన స్పానిష్ వలసవాదులు :
స్పెయిన్ నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళ చేతుల్లో ఆ దేశాల గనులు, భూములు ఉండేవి. వాళ్ళల్లో కొంతమంది పెద్ద భూస్వాములుగా ఉండేవాళ్ళు. వీళ్ళ కింద ఉండే విశాల భూభాగాన్ని “హసియండా” అనేవాళ్ళు. ఈ భూస్వాములు తమకింద పనిచేయటానికి, ఆఫ్రికా బానిసలను లేదా స్వేచ్ఛలేని ఇండియన్లని నియమించుకునే వాళ్ళు. వీరు అనేక బాధలు, కష్టాలు అనుభవిస్తూ, తమ శక్తిని ధారపోసి పనిచేసేవాళ్ళు.

2. అమెరికాలో స్థిరపడిన చిన్న స్పానిష్ రైతులు :
అమెరికాలో స్థిరపడిన చిన్న స్పానిష్ రైతులు ఉండేవారు. కాని వలస ప్రాంతాల పరిపాలనలో అక్కడ స్థిరపడిన స్పెయిన్ ప్రజలకు ఎటువంటి పాత్ర లేదు. స్పెయిన్ కి చవకగా ప్రకృతి వనరులు, శ్రామికులను అందించేలా వలస ప్రాంతాల ఆర్థిక విధానాలను నియంత్రించారు. కాని ఆ దేశాలు అభివృద్ధి చెందటానికి కాదు.

3. స్థానిక అమెరికన్లు :
‘దక్షిణ అమెరికాలో అధికభాగం స్పెయిన్, పోర్చుగల్ అధీనంలోకి వచ్చింది. ప్రజలలో సగానికిపైగా ప్రజలు యూరోపియన్ల చేతుల్లో హతమయ్యారు. తద్వారా యూరప్ ప్రజల నియంత్రణలో, బ్రతికారు. చాలామంది స్థానిక అమెరికన్లు స్పానిష్ నియంత్రణలోకి వచ్చారు. భారీగా పన్నులు చెల్లించేవారు. గనులు, వ్యవసాయ క్షేత్రాలలో పనిచేయవలసి వచ్చేది. గుడులను విధ్వంసం చేసి చాలామందిని రోమన్ కాథలిక్కు మతానికి మార్చేశారు.

4. లాటిన్ అమెరికాలో స్థిరపడిన ఆఫ్రికా బానిసలు :
లాటిన్ అమెరికాలో స్థిరపడిన ఆఫ్రికా బానిసల జీవనం దుర్భరంగా ఉండేది. దక్షిణ అమెరికాలో చాలామంది హతమవ్వడం, రోగాల బారిన పడి చనిపోవడం వల్ల ఆఫ్రికా బానిసలను కొనసాగారు. తద్వారా వాళ్ళు జీవితాంతం నరకయాతన అనుభవించేవాళ్ళు. ఎదిరించే శక్తి లేక, సరైన ఆయుధాలు, నాయకత్వం లేకపోవడం వలన కటికచీకటి బతుకులు అనుభవించేవారు.

9th Class Social Textbook Page No.211

ప్రశ్న 9.
వలసపాలన నుంచి స్వాతంత్ర్యం పొందినప్పటికీ లాటిన్ అమెరికా దేశాలు ఇంకా ఎందుకు అభివృద్ధి చెందకుండా ఉండిపోయాయి?
జవాబు:

  1. పారిశ్రామిక దేశాలైన బ్రిటన్, అమెరికాలపై ఆధారపడి ఉండటం.
  2. సామాజిక, ఆర్థిక, అసమానతలు తీవ్రంగా ఉండడం.
  3. భూమి లేకపోవడం వల్ల పేదరికం ఎక్కువగా ఉండి ఈ దేశాలు అభివృద్ధి చెందకుండా ఉండిపోయాయి.

ప్రశ్న 10.
మన్రో సిద్ధాంతం లాటిన్ స్వాతంత్ర్యాన్ని ఏ విధంగా కాపాడింది ఇది వాటి స్వాతంత్ర్యాన్ని పరిమితం కూడా చేసిందా?
జవాబు:
1820 నాటికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు బలమైన ఆర్థిక, రాజకీయ శక్తిగా ఎదిగింది. అమెరికా అధ్యక్షుడు జేమ్స్. మన్రో తయారుచేసిన ‘మన్రో సిద్ధాంతం ప్రకారం అమెరికా ఖండాలలో యూరప్ దేశాలు ఏవీ వలస ప్రాంతాలను ఏర్పరచుకోకూడదు. అందుకు ప్రతిగా ఇతర ఖండాలలో యూరపు వ్యవహారాల్లో కానీ, వలస ప్రాంతాలలో కానీ అమెరికా జోక్యం చేసుకోదు. వాటి స్వాతంత్ర్యాన్ని పరిమితం చేయలేదు.

AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

ప్రశ్న 11.
మన్రో సిద్ధాంతం వల్ల బ్రిటన్ ఏ విధంగా లాభపడింది?
జవాబు:
బలమైన నౌకాదళం ఉన్న బ్రిటన్ మన్రో సిద్ధాంతాన్ని సమర్ధించింది. అమెరికా ఖండాలలోని దేశాలు యూరపు శక్తుల రాజకీయ అధీనంలో లేకపోతే వాటికి ఇంగ్లాండుతో వ్యాపారం చేయడానికి, వాటి పారిశ్రామిక ఉత్పత్తులను కొనే స్వేచ్ఛ ఉంటుంది.

9th Class Social Textbook Page No.215

12. పాశ్చాత్య దేశాలు చైనా నుంచి దిగుమతి చేసుకున్న ముఖ్యమైన వస్తువులు పట్టు, తేయాకు.

13. చైనాలో పాశ్చాత్య దేశాలు అమ్మటానికి ప్రయత్నించిన ఉత్పత్తి నల్లమందు.

14. చైనాలో వ్యాపారాన్ని ప్రభావితం చేయటానికి ప్రయత్నించిన ఆసియా దేశం జపాన్.

9th Class Social Textbook Page No.216

ప్రశ్న 15.
1913 నాటి ఆఫ్రికా పటాన్ని చూసి ఆఫ్రికాని ఏ మేరకు యూరపు దేశాలు తమ వలస ప్రాంతాలుగా మార్చుకున్నాయో చూడండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం 1

ప్రశ్న 16.
కింద పట్టికలో ఆఫ్రికాలోని కొన్ని దేశాల పేర్లు ఉన్నాయి. 1913లో వీటిని వలసగా చేసుకొని పాలించిన దేశం పేరును ఎదురుగా రాయండి.
జవాబు:

ఆధునిక దేశం 1913 నాటికి వలసగా చేసుకొని పాలించిన దేశం
దక్షిణ ఆఫ్రికా ఇంగ్లాండ్
ఈజిప్టు ఇంగ్లాండ్
నైజీరియా ఫ్రాన్స్
ఘనా ఇంగ్లాండ్
లిబియా ఇటలీ
అల్జీరియా ఫ్రాన్స్
అంగోలా పోర్చుగీసు
కాంగో బెల్జియం

ప్రాజెక్టు

ప్రశ్న 1.
మీరు బ్రిటన్ పౌరులైతే వలసపాలనను సమర్థిస్తారా? ఎందుకు? భారతదేశ పౌరులుగా వలస పాలనకు మద్దతు ఇస్తారా? వ్యతిరేకిస్తారా? మీ దృక్పథాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
బ్రిటన్ పౌరుడిని అయితే వలస పాలనను సమర్థిస్తాను. ఎందుకంటే ప్రపంచ పోటీని తట్టుకోడానికి, వర్తక వాణిజ్యాలలో, ముందుండడానికి, విశాల సామ్రాజ్యం మా అధీనంలో ఉండడానికి, బ్రిటన్ ప్రపంచంలో బలమైన రాజ్యమని ప్రపంచ ప్రజలు జేజేలు పలకడానికి సమర్థిస్తాను.

భారతదేశ పౌరులుగా వలస పాలనను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే దాస్య బతుకులు, చీకటి పాలన వద్దని, పరదేశీయుల చేతుల్లో భారతమాత చిక్కరాదని, అపార సహజ వనరులు, ముడి పదార్థాలు, సుగంధ ద్రవ్యాలు విలువైన వస్తువులు వేరొక ప్రాంతానికి తరలించడం ఇష్టంలేక, అవమానాలు, బానిస బతుకులు మాకొద్దని, స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ఎంతో ముద్దని, త్యాగధనుల స్ఫూర్తి ఆదర్శాలు వెల్లివిరియాలని వలస పాలనను వ్యతిరేకిస్తాను.

పటనైపుణ్యం

ప్రశ్న 1.
ప్రపంచ పటంలో ఈ దిగువ దేశాలను గుర్తించుము.
1. మెక్సికో
2. అమెరికా
3. చైనా
4. నెదర్లాండ్స్
5. ఇండోనేషియా
6. టర్కీ
7. స్పెయిన్
8. వెస్ట్ ఇండీస్
9. ఇటలీ
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం 3