AP 10th Class Social Notes Chapter 6 ప్రజలు

Students can go through AP Board 10th Class Social Notes 6th Lesson ప్రజలు to understand and remember the concept easily.

AP Board 10th Class Social Notes 6th Lesson ప్రజలు

→ మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ ‘జనాభా పెరుగుదల’ను నిందిస్తుంటాం.

→ దేశంలోని జనాభాకు సంబంధించిన సమాచారాన్ని భారతదేశ జన గణన అందిస్తుంది.

→ ‘సెన్సెస్ ఆఫ్ ఇండియా’ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ సమాచార సేకరణ, నమోదులను నిర్వహిస్తుంది.

→ 2011లో భారతదేశ జనాభా 121,01,93,422. వీరిలో పురుషులు 62,37,24,248 మంది, స్త్రీలు 58,64,69,174 మంది.

→ ఒక దేశ జనాభాను వయస్సును బట్టి పిల్లలు (15 సం||ల లోపువారు), పనిచేసేవారు (15-59 సం||లు), వృద్ధులు (59 సం||లు పైబడినవారు) గా విభజిస్తారు.

→ జనాభాలో ప్రతి వెయ్యిమంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేది లింగ నిష్పత్తి.

AP 10th Class Social Notes Chapter 6 ప్రజలు

→ ఏడేళ్లు పైబడి ఉండి ఏదైనా భాషలో అర్థవంతంగా చదవటం, రాయటం చేయగలిగితే వారిని అక్షరాస్యులంటాం.

→ భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినపుడు జనాభాలో 12 శాతమే అక్షరాస్యులు.

→ ఒక దేశంలో లేదా ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలంలో ప్రజల సంఖ్యలో మార్పుని జనాభాలో మార్పు అంటాం.

→ ప్రతి దశాబ్దానికి అదనంగా చేరిన మనుషుల సంఖ్య, జనాభా పెరుగుదలను సూచిస్తుంది.

→ 1900 సం||తో పోల్చితే నేడు మరణాల శాతం గణనీయంగా తగ్గింది. జననాల శాతం ఎక్కువగా ఉండడానికి తగ్గుతున్న మరణాల శాతం తోడై జనాభా వేగంగా పెరగసాగింది.

→ మహిళలు పునరుత్పత్తి చివరి వరకు జీవించియుండి, ప్రస్తుత తీరు ప్రకారం పిల్లలను కంటే పుట్టే మొత్తం పిల్లలను “ఫెర్టిలిటీ శాతం” అంటాం. భారతదేశ ప్రస్తుత ఫెర్టిలిటీ శాతం 2.7, ఆంధ్రప్రదేశ్ లో ఇది 1.9 శాతం.

→ 2011లో భారతదేశ జనసాంద్రత 382.

→ ఐరోపా ఖండం జనాభా రానున్న శతాబ్దాలలో తగ్గనుందని భావిస్తున్నారు.

→ జనాభా పెరుగుదల : ఒక దశాబ్దానికి చేరిన అదనపు మనుషుల సంఖ్యను “జనాభా పెరుగుదల” అంటాం.
ఉదా : 2011 జనాభా నుండి 2001 జనాభాను తీసివేయగా వచ్చు జనాభాను జనాభా పెరుగుదల అంటాం.

→ జనసాంద్రత : ఒక చదరపు కిలోమీటరుకు సగటున నివసించే జనాభాను “జనసాంద్రత” అంటాం.

AP 10th Class Social Notes Chapter 6 ప్రజలు

→ లింగ నిష్పత్తి : జనాభాలో ప్రతి వెయ్యిమంది పురుషులకు ఎంత మంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేది లింగ నిష్పత్తి.
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీ, పురుష నిష్పత్తి 940 : 1000
– ఆంధ్రప్రదేశ్ లో 970 : 1000
– అమెరికా 1050 : 1000

→ ఫెర్టిలిటీ శాతం : ఒక మహిళ పునరుత్పత్తి వయస్సు చివరి వరకు జీవించి ఉండి, పుట్టే మొత్తం పిల్లలను “ఫెర్టిలిటీ శాతం” అంటాం.

→ జనాభా విస్తరణ : జనాభా ఏయే ప్రాంతాల్లో ఏ రకంగా ఉన్నదో తెలిపేదే జనాభా విస్తరణ. ఒక ప్రాంత జనసాంద్రత మనకు ఆ ప్రాంత జనాభా విస్తరణలో తెలియజేస్తుంది.

→ అక్షరాస్యత శాతం : ఏడేళ్ల పైన ఉండి ఏదైనా ఒక భాషలో అర్థవంతంగా చదవగలగడం / రాయగలగడం చేస్తే వారిని అక్షరాస్యులంటారు. జనాభాలో వీరి శాతాన్ని “అక్షరాస్యతా శాతం” అంటారు.

→ భ్రూణహత్య : మగ పిల్లవాడు కావాలనుకోవడం వలన గర్భంలో ఉంది ఆడపిల్ల అని తెలిస్తే గర్భంలోనే చంపేయడాన్ని “భ్రూణహత్య (అబార్షన్)” అంటాం.

AP 10th Class Social Notes Chapter 6 ప్రజలు