These AP 10th Class Social Studies Important Questions 18th Lesson స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) will help students prepare well for the exams.
AP Board 10th Class Social 18th Lesson Important Questions and Answers స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)
10th Class Social 18th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium
1. భారతదేశంలో ఎన్నికల నిర్వహణ బాధ్యతను ఎవరికి అప్పగించారు?
జవాబు:
ఎన్నికల సంఘానికి.
2. భారతదేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏది?
జవాబు:
ఆంధ్రప్రదేశ్.
3. అలీన విధాన రూపశిల్పి ఎవరు?
జవాబు:
జవహర్‌లాల్ నెహ్రు.
5. మహారాష్ట్రలో, బొంబాయి మహారాష్ట్ర వాసులకే చెందాలని ఆందోళన చేసిన పార్టీ ఏది?
జవాబు:
శివసేన.
6. నేషనల్ కాన్ఫరెన్స్ అనే ప్రాంతీయ పార్టీ ఏ రాష్ట్రానికి చెందినది?
జవాబు:
జమ్ము & కాశ్మీర్
7. జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ ఏది?
జవాబు:
370.
8. మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది? 4. దక్షిణాదిన ఏ రాజకీయ పార్టీ హిందీ వ్యతిరేక ఉద్యమం చేపట్టింది ? జ. DMK
జవాబు:
వ్యవసాయరంగం.
9. పంచశీల సూత్రాలను రూపొందించిన వారు ఎవరు?
జవాబు:
జవహర్‌లాల్ నెహ్రు.
10. ఏ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అంతకు ముందెన్నడూ చవిచూడని ఫలితాలను చవి చూసింది?
జవాబు:
1967 ఎన్నికలు.
11. అస్సోంలోని ఖాసి, జైంతియా, గారో గిరిజన ప్రాంతాల తో 1969లో ఏర్పడిన కొత్త రాష్ట్రమేది?
జవాబు:
మేఘాలయ.
12. 1971లో భారత్ ఎవరికోసం పాకిస్థాన్‌తో యుద్ధం చేయవలసి వచ్చింది?
జవాబు:
బంగ్లాదేశ్.
13. 1956లో రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏర్పడిన రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని?
జవాబు:
14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు.
14. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచటానికి చేపట్టిన విప్లవం ఏది?
జవాబు:
హరిత విప్లవం.
15. అఖిల భారత జమ్ము & కాశ్మీర్ కాన్ఫరెన్స్ కు నాయకుడు ఎవరు?
జవాబు:
షేక్ మొహ్మద్ అబ్దుల్లా.
16. ప్రజల, హక్కులకు ఏ సందర్భంలో పరిమితులు విధించబడతాయి?
జవాబు:
అత్యవసర పరిస్థితులలో
17. బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమం నాయకుడు ఎవరు?
జవాబు:
ముజిబుర్ రెహ్మన్.
18. బ్రిటిషు పాలనలో కూడా క్రియాశీలకంగా ఉండి, తెలుగు మాట్లాడే ప్రజలను ఐక్యం చేసే ప్రయత్నం చేసిందెవరు?
జవాబు:
ఆంధ్ర మహాసభ.
19. ఎన్నికల సంఘం ఏ సమస్యను అధిగమించటానికి పార్టీలకూ గుర్తులు కేటాయిస్తుంది?
జవాబు:
నిరక్షరాస్యత.
20. మొదటి మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించింది?
జవాబు:
కాంగ్రెసు.
21. పార్లమెంట్ రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించింది?
జవాబు:
1956
22. ఏ తమిళ హీరోను తనకు మద్దతుగా DMK ఉపయోగించుకుంది?
జవాబు:
M. G. రామచంద్రన్ (MGR)
23. S.V.Dని విస్తరింపుము.
జవాబు:
సంయుక్త విధాయక దళ్
24. బ్యాంకుల జాతీయికరణ చేసిన ప్రధాని ఎవరు?
జవాబు:
ఇందిరాగాంధీ
25. రాజభరణాలను రద్దు చేసిన ప్రధాని ఎవరు?
జవాబు:
ఇందిరాగాంధీ.
26. 1973లో అరబ్ – ఇజ్రాయెల్ యుద్ధంతో వేటి ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగాయి?
జవాబు:
ముడిచమురు ధరలు.
27. JP ఉద్యమ నాయకుడు ఎవరు?
జవాబు:
జయప్రకాష్ నారాయణ్.
28. లోక్ సభకు ఇందిరాగాంధీ ఎన్నికను ఏ కోర్టు రద్దు చేసింది?
జవాబు:
అలహాబాద్.
29. జమ్ము కాశ్మీర్ సంస్థానానికి రాజు ఎవరు?
జవాబు:
రాజా హరిసింగ్
30. రెండవ పంచవర్ష ప్రణాళికలో ఏ రంగంకు ప్రాధాన్యత ఇచ్చారు?
జవాబు:
పారిశ్రామిక రంగంకు
31. స్విట్జర్లాండ్ లో మహిళలకు ఓటుహక్కు లభించిన సంవత్సరం ఏది?
జవాబు:
1971.
32. భారత్, పాకిస్తాన్ ల మధ్య మొదటిసారి యుద్ధం జరిగిన సంవత్సరం ఏది?
జవాబు:
1947.
33. మొట్టమొదటి రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ సంఘమును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసారు?
జవాబు:
1953.
34. స్వాతంత్రం వచ్చిన మొదటి 30 సంవత్సరములలో భారత రాజకీయ వ్యవస్థలో ఆధిపత్యం గల పార్టీ ఏది?
జవాబు:
భారత జాతీయ కాంగ్రెస్.
35. తూర్పు పాకిస్తాన్‌గా పిలువబడిన దేశం ఏది?
జవాబు:
బంగ్లాదేశ్.
36. 1971 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెసు నినాదం ఏమిటి?
జవాబు:
గరీబీ హఠావో.
37. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనుసంధాన భాష ఏది?
జవాబు:
ఇంగ్లీషు.
38. హిందీ వ్యతిరేక ఉద్యమం ఏ రాష్ట్రంలో ప్రారంభమయ్యింది?
జవాబు:
తమిళనాడు.
39. ‘గరీబీ హరావో’ నినాదాన్ని ఇచ్చినది ఎవరు?
జవాబు:
ఇందిరాగాంధీ.
40. భారత దేశ అధికార భాష ఏది?
జవాబు:
హిందీ.
41. మొదటి సార్వత్రిక ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి?
జవాబు:
1952.
42. భారతదేశ మొదటి ప్రధాన మంత్రి ఎవరు?
జవాబు:
జవహర్‌లాల్ నెహ్రు.
43. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోరుతూ 58 రోజులపాటు నిరాహారదీక్ష చేసినది ఎవరు?
జవాబు:
పొట్టి శ్రీరాములు.
44. ప్రణాళిక సంఘం ఏ సంవత్సరంలో ఏర్పరిచారు?
జవాబు:
1950లో
45. భారతదేశం, చైనాతో యుద్ధం చేసిన సంవత్సరం ఏది?
జవాబు:
1962.
46. నెహ్రు చనిపోయిన సంవత్సరం?
జవాబు:
1964.
47. నెహ్రూ మరణానంతరం భారత ప్రధాని ఎవరు?
జవాబు:
లాల్ బహదూర్ శాస్త్రి.
48. విదేశాలలో మరణించిన భారత ప్రధాని ఎవరు?\
జవాబు:
లాల్ బహదూర్ శాస్త్రి.
49. లాల్ బహాదుర్ శాస్త్రి ఏ సంవత్సరంలో మరణించారు?
జవాబు:
1966.
50. హిందీని అధికార భాషగా చట్టం చేసిన సంవత్సరం?
జవాబు:
1963.
51. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
1953, అక్టోబర్ 1న
52. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
1956, నవంబర్ 1న
53. పంజాబ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
1966.
54. పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధాని నగరం ఏది?
జవాబు:
చంఢీఘర్.
55. భారత రాజ్యాంగానికి 42వ సవరణ చేసిన సంవత్సరం.
జవాబు:
1976.
56. ఫజల్ అలి, కె.ఎం. ఫణిక్కర్. హృదయనాథ్ కుంజు, జయప్రకాష్ నారాయళ్లలో మొదటి SRCలో సభ్యులు కాని వారు ఎవరు?
జవాబు:
జయప్రకాష్ నారాయణ్.
57. నెహ్రు మొగ్గుచూపిన వ్యవసాయ విధానంలో ఇమిడి యున్న అంశం కానిది.
→ భూ సంస్కరణలు
→ వ్యవసాయ సహకార సంఘాలు
→ ్థానిక స్వపరిపాలన
→ భూమిని దానంగా ఇవ్వటం.
జవాబు:
భూమిని దానంగా ఇవ్వటం.
58. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) బీహార్ ( ) a) కుర్ని, కొయిరి
ii) మధ్యప్రదేశ్ ( ) b) లోథ్
iii) కర్ణాటక ( ) c) ఒక్కళి
iv) తమిళనాడు ( ) d) వెల్లాల
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d
59. క్రింది వానిని సరిగా జతపరచండి.
I. మత కల్లోలాలు జరిగిన ప్రాంతం – II.రాష్ట్రం
i) రాంచి ( ) a) బీహార్
ii) అహ్మదాబాద్ ( ) b) గుజరాత్
iii) జలగావ్ ( ) c) మహారాష్ట్ర
iv) అలీఘర్ ( ) d) ఉత్తరప్రదేశ్
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d
60. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్నింటిని సమైక్య పరిచింది ఎవరు?
జవాబు:
జయప్రకాష్ నారాయణ్.
61. రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టం 1956కు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించి సరైన వ్యాఖ్యలను ఎంచుకోండి.
i) 1953 ఆగస్ట్” SRC వేసారు.
ii) భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించవలసిందిగా ఈ సంఘాన్ని కోరారు.
iii) ఈ సంఘం నివేదిక ఆధారంగా 1956లో రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టం చేసారు.
A) (i) & (ii)
B) (ii) & (iii)
C) (i) & (iii)
D) (i), (ii) & (iii).
జవాబు:
D (i), (ii) & (iii)
62. 1968 – 69లో పంజాబు ప్రజల ఆందోళనకు కారణం ఏమిటి?
జవాబు:
ఉమ్మడి రాజధాని చండీఘర్ ని తమకు ఇవ్వాలని.
63. బ్యాంకుల జాతీయికరణ, గరీబీ హఠావో, ధరల నియంత్రణ, రాజభరణాల రద్దులలో ఇందిరాగాంధీ చేపట్టిన సంస్కరణ కానిది.
జవాబు:
ధరల నియంత్రణ.
64. ఈ క్రింది సంఘటనలను కాలక్రమంలో ఉంచండి.
i) బంగ్లాదేశ్ ఏర్పడిన సంవత్సరం
ii) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు
iii)మొదటి సార్వత్రిక ఎన్నికలు
iv) హిందీ అధికార భాషా చట్టం.
జవాబు:
iii, ii, iv, i
65. ప్రస్తుతం మైసూర్ రాష్ట్రాన్ని ఎలా పిలుస్తున్నారు?
జవాబు:
కర్ణాటక.
66. అత్యవసర పరిస్థితి సమయంలో ప్రజలను అసంతృప్తికి గురిచేసిన చర్య కానిది.
→ పౌరహక్కుల ఉల్లంఘన
→ మురికివాడల తొలగింపు
→ వెట్టి చాకిరీ నిర్మూలన
→ బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు
జవాబు:
వెట్టిచాకిరీ నిర్మూలన.
67. భారతదేశ స్వాతంత్ర్య అనంతర చరిత్రలో తొలి సంవత్సరాలలో దేశ నాయకత్వం ముందున్న ప్రధాన సవాల్.
ఎ) దేశ ఐక్యతను కాపాడటం
బి) దేశ సమగ్రతను కాపాడటం.
సి) సామాజిక, ఆర్థిక మార్పులను తీసుకురావడం.
డి) పైవన్నీ
జవాబు:
డి) పైవన్నీ
68. “ఒక వ్యక్తి – ఒక ఓటు మరియు ఒక ఓటు – ఒకే విలువ” అన్న నినాదాన్ని ఇచ్చింది ఎవరు?
జవాబు:
అంబేద్కర్
69. జాతీయ ఓటర్ల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
జవాబు:
జనవరి 25 న.
70. ప్రచ్ఛన్న యుద్ధం ఏ దేశాల మధ్య మొదలయ్యింది?
జవాబు:
USA – USSR
71. ‘పంచశీల సూత్రాలు’ ఏయే దేశాల మధ్య ఒప్పందం అంటార?
జవాబు:
భారత్ – చైనా.
72. భారతదేశంలో అత్యవసర పరిస్థితి ఏ సంవత్సరంలో విధించారు?
జవాబు:
1975.
73. క్రింది వానిలో సరికాని జతను గుర్తించుము.
→ భారత్ × సాకిస్తాన్ యుద్ధం – 1965
→ భారత్ ×చైనా యుద్ధం – 1962
→ భారత్ ×చైనా యుద్ధం – 1968
→ భారత్ × పాకిస్తాన్ యుద్ధం – 1971
జవాబు:
భారత్ × చైనా యుద్ధం – 1968
74. 1947లో దేని ఆధారంగా దేశ విభజన జరిగింది?
జవాబు:
మతం ఆధారంగా.
75. చక్కని సంస్థాగత చట్టాన్ని ఏర్పరచడంలో భాగంగా మనదేశం ఏర్పాటు చేసుకున్న స్వతంత్ర వ్యవస్థ కానిది ఏది?
→ ఎన్నికల సంఘం
→ కంట్రోలర్ & ఆడిటర్ జనరల్
→ ప్రణాళిక సంఘం
→ న్యాయ వ్యవస్థ
జవాబు:
ప్రణాళిక సంఘం.
76. 1952లో లోకసభలోని (మొదటి లోకసభలోని) స్థానాలు ఎన్ని?
జవాబు:
489.
77. 1952 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుచుకున్న స్థానాల శాతం ఎంత?
జవాబు:
74%.
78. ఆంధ్ర మహాసభ (AMS) ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
1930 లో.
79. పొట్టి శ్రీరాములు ఎప్పటి నుండి, ఎప్పటి వరకు నిరాహార దీక్ష చేసారు?
జవాబు:
19 అక్టోబరు 1952 నుండి 15 డిసెంబరు 1952 వరకు.
80. ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతం ఏ రాష్ట్రంలో భాగంగా ఉండేది?
జవాబు:
మద్రాసు రాష్ట్రంలో.
81. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం ఏది?
జవాబు:
1951 – 56.
82. జమ్ము & కాశ్మీర్ రాష్ట్రంని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ విభజన ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది?
జవాబు:
31 అక్టోబరు 2019 నుండి.
83. జమ్ము & కాశ్మీర్ కి సంబంధించిన ‘ఢిల్లీ’ ఒప్పందాన్ని అంగీకరించిన నాయకుడెవరు?
జవాబు:
షేక్ మొహమ్మద్ అబ్దుల్లా.
84. అవామీలీగ్ నాయకుడెవరు?
జవాబు:
షేక్ ముజిబుర్ రెహ్మాన్.
85. ప్రైవేట్ బ్యాంకుల జాతీయకరణ చేసిన సంవత్సరం.
జవాబు:
1969.
86. రాజభరణాల రద్దు చేసిన సంవత్సరం.
జవాబు:
1971.
87. మిని రాజ్యాంగం అని ఏ రాజ్యాంగ సవరణని పేర్కొంటారు?
జవాబు:
42వ సవరణని (1976)
88. ముజిబుర్ రెహ్మాన్ మద్దతుదారులు తూర్పు పాకిస్తాన్లో చేపట్టిన ఉద్యమం ఏది ?
జవాబు:
ముక్తిబాహిని.
10th Class Social 18th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
1956 లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నప్పుడు, గిరిజన భాషలను ఎందుకు పట్టించుకోలేదు ?
జవాబు:
గిరిజనులు దేశంలో చెల్లాచెదురుగా అక్కడక్కడ ఉన్నారు. కనుక వారికి ఒక ప్రాంతంలో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కుదరదు. అందువలన గిరిజన భాషలను పట్టించుకోలేదు.
ప్రశ్న 2.
నెహ్రూ ప్రవేశపెట్టిన ఏవైనా రెండు గ్రామీణ అభివృద్ధి పథకాలను రాయండి.
జవాబు:
వ్యవసాయ రంగంలోని మార్పును నెహ్రూ కేవలం ఆర్థిక అంశంగా చూడలేదు. దానిని గ్రామీణ రంగ రాజకీయ, సామాజిక, ఆర్థిక మార్పుగా పరిగణించాడు. ఇందులో మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి.
- భూసంస్కరణలు
- వ్యవసాయ సహకార సంఘాలు
- స్థానిక స్వపరిపాలన
3 రకాల భూసంస్కరణలను ప్రతిపాదించారు.
- జమిందారీ వ్యవస్థ రద్దు
- కౌలు విధానాల సంస్కరణ
- భూ పరిమితి విధానాలు
ప్రశ్న 3.
ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సూచించేలా గుర్తులు కేటాయించుటకు గల ముఖ్య ఉద్దేశ్యమేమిటి ?
జవాబు:
నిరక్షరాస్యతా సమస్యను అధిగమించటానికి ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలు, అభ్యర్థులను సూచించేలా రోజువారీ జీవితం నుంచి కొన్ని గుర్తులను ఉపయోగించాలనే వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈ పద్ధతి ఇప్పటికీ అమలులో ఉంది.
ప్రశ్న 4.
భారతదేశంలో హరిత విప్లవం ఎందుకు తప్పనిసరి?
జవాబు:
- ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం ద్వారా పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడం కోసం.
- సక్రమ నీటి నిర్వహణ పద్ధతుల కోసం భారతదేశంలో హరిత విప్లవం తప్పనిసరి.
ప్రశ్న 5.
ఏక పార్టీ విధానానికి, బహుళ పార్టీ విధానానికి గల తేడా ఏమి?
జవాబు:
- ఏకపార్టీ విధానం – ఒక పార్టీ ఉండడం.
- బహుళపార్టీ విధానం – ఎక్కువ పార్టీలు ఉండడం.
ప్రశ్న 6.
భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికల నిర్వహణలో నిరక్షరాస్యతా సమస్యను ఎన్నికల సంఘం ఏ విధంగా అధిగమించింది?
జవాబు:
- ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు సూచించే కొన్ని గుర్తులను రోజువారీ జీవితం నుంచి కేటాయించింది.
- ప్రతి ఒక్క అభ్యర్థికి బయటవైపు వారికి కేటాయించిన గుర్తును అంటించబడిన వేరు వేరు బ్యాలెట్ పెట్టెలను ఏర్పాటు చేసింది.
ప్రశ్న 7.
స్వాతంత్ర భారత తొలి సంవత్సరములలో నాయకుల ముందున్న ప్రధాన సవాళ్ళు ఏవి?
జవాబు:
- దేశ ఐక్యత, సమగ్రతలను కాపాడటం.
- సామాజిక, ఆర్థిక మార్పులను తీసుకొనిరావడం.
- పేదరికం
- నిరుద్యోగం
- నిరక్షరాస్యత
ప్రశ్న 8.
స్విట్జర్లాండ్ లో మహిళలకు ఓటుహక్కు ఎప్పుడు వచ్చింది?
జవాబు:
స్విట్జర్లాండ్ లో మహిళలకు ఓటుహక్కు 1971లో వచ్చింది.
ప్రశ్న 9.
మొదటి సార్వత్రిక ఎన్నికల నిర్వహణ బాధ్యతను ఎవరికి అప్పగించారు?
జవాబు:
మొదటి సార్వత్రిక ఎన్నికలను నిర్వహించే బాధ్యతను ఎన్నికల సంఘానికి అప్పగించారు.
ప్రశ్న 10.
భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
జవాబు:
భారతదేశంలో 1952 లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.
ప్రశ్న 11.
భారతదేశ మొదటి ప్రధానమంత్రి ఎవరు?
జవాబు:
జవహర్‌లాల్ నెహ్రూ భారతదేశ మొదటి ప్రధానమంత్రి.
ప్రశ్న 12.
బ్రిటిష్ కాలంలో దేశం ఏ విధంగా విభజింపబడి ఉంది?
జవాబు:
బ్రిటిష్ కాలంలో దేశం ప్రెసిడెన్సీలు (కలకత్తా, మద్రాస్, బాంబే) గాను, సెంట్రల్ ప్రావిన్సెస్, బీదర్ వంటి అనేక పెద్ద రాష్ట్రాలుగానూ విభజింపబడి ఉండేది.
ప్రశ్న 13.
మద్రాసులో ఏ ఏ భాషలు మాట్లాడే ప్రజలు ఉండేవాళ్లు?
జవాబు:
తమిళం, మళయాళం, కన్నడ, తెలుగు, గోండి, ఒడియా భాషలు మాట్లాడేవాళ్లు ఉండేవాళ్లు.
ప్రశ్న 14.
దేని ఆధారంగా దేశ విభజన జరిగింది?
జవాబు:
మతం ఆధారంగా దేశ విభజన జరిగింది.
ప్రశ్న 15.
ఆంధ్ర మహాసభ దేని కొరకు ప్రయత్నించింది?
జవాబు:
మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు మాట్లాడే ప్రజలను ఒక్కతాటి కిందకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది.
ప్రశ్న 16.
ఆంధ్ర మహాసభ, భాషా ప్రాతిపదిక రాష్ట్రాల కొరకు చేసిన ఉద్యమంలో ఏ పద్ధతులను ఉపయోగించింది?
జవాబు:
ఆంధ్ర మహాసభ, భాషా ప్రాతిపదిక రాష్ట్రాల కొరకు చేసిన ఉద్యమంలో విన్నపాలు, దరఖాస్తులు, వీధులలో కవాతులు, నిరాహార దీక్షలు వంటి పద్ధతులను ఉపయోగించింది.
ప్రశ్న 17.
పొట్టి శ్రీరాములు ఎవరు?
జవాబు:
ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోరుతూ 58 రోజులు నిరాహారదీక్ష చేసి 1952 అక్టోబరులో చనిపోయారు.
ప్రశ్న 18.
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని (ఎస్.ఆర్.సి) ఎప్పుడు వేశారు? ఇందులోని సభ్యులెవరు?
జవాబు:
1953 ఆగష్టులో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని వేశారు. దీనిలో ఫజల్ అలీ, కె.ఎం. ఫణిక్కర్, హృదయనాథ్ కుంజులు సభ్యులుగా ఉన్నారు.
ప్రశ్న 19.
1956 రాష్ట్రాల పున్యవస్థీకరణ చట్టం ప్రకారం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి?
జవాబు:
1956లో పార్లమెంటు ఆమోదించిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం భారతదేశంలో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి.
ప్రశ్న 20.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సందర్భంలో పరిగణనలోకి తీసుకోని భాషలేవి?
జవాబు:
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సందర్భంలో గోండి, సంథాలి లేదా ఒరావన్ వంటి గిరిజన భాషలను పరిగణనలోకి తీసుకోలేదు.
ప్రశ్న 21.
మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ అంశం మీద కేంద్రీకరించబడింది?
జవాబు:
మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయం మీద కేంద్రీకరించి ఆహార ఉత్పత్తిని పెంచటానికి, రవాణా, ప్రసారాల రంగాల మెరుగుదలకు, సామాజిక సేవల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చింది.
ప్రశ్న 22.
1962లో ఏ దేశంతో యుద్ధానికి తలపడవలసి వచ్చింది?
జవాబు:
1962లో మనం చైనాతో యుద్ధం చేయవలసి వచ్చింది.
ప్రశ్న 23.
1967 ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయం పొందిన రాష్ట్రాలేవి?
జవాబు:
బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, మద్రాస్, కేరళలో కాంగ్రెస్ పరాజయం పొందింది.
ప్రశ్న 24.
ప్రత్యేక తెలంగాణా వాదుల ఆరోపణ ఏమిటి?
జవాబు:
ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు నాయకత్వం వహించారు. “అభివృద్ధి ఫలాలు రాష్ట్రంలోని కొన్ని వర్గాలకే చెందుతున్నాయన్నది వీళ్ల ప్రధాన ఆరోపణ.
ప్రశ్న 25.
ఏ ఏ ప్రాంతాలతో ‘మేఘాలయ’ రాష్ట్రం ఏర్పడింది?
జవాబు:
1969లో అసోంలోని ఖాసి, జైంతియా, గారో గిరిజన ప్రాంతాలతో మేఘాలయ రాష్ట్రం ఏర్పడింది.
ప్రశ్న 26.
‘గరీబీ హటావో’ అని ఎవరు, ఎప్పుడు అన్నారు?
జవాబు:
1971 సార్వత్రిక ఎన్నికలలో ఇందిరాగాంధీ ఈ ‘గరీబీ హటావో’ అన్న నినాదాన్ని ఉపయోగించి ఘనవిజయం సాధించారు.
ప్రశ్న 27.
రాజ్యాంగసభ ప్రాముఖ్యతనిచ్చిన అంశాలేమిటి?
జవాబు:
రాజ్యాంగ సభ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, హోదా, అవకాశాలలో సమానత్వాన్ని కోరుకుంది. ‘ఆధునిక భారతదేశ నిర్మాణంలో సామాజిక, ఆర్థిక మార్పునకు అది ప్రముఖ స్థానాన్ని ఇచ్చింది.
ప్రశ్న 28.
ప్రణాళికల మూలంగా నెహ్రూ ఏమి ఆశించాడు?
జవాబు:
ప్రణాళికాబద్ధ అభివృద్ధి ద్వారా కులం, మతం, ప్రాంతం వంటి విభజన ధోరణులు తగ్గి భారతదేశం బలమైన, ఆధునిక దేశంగా ఎదుగుతుందని అతడు ఆశించాడు.
ప్రశ్న 29.
హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ఎవరు, ఎందుకు చేశారు?
జవాబు:
1963లో అధికార భాషా చట్టాన్ని ఆమోదించినప్పుడు హిందీని మిగిలిన దేశం మీద రుద్దడానికి ఎత్తుగడగా భావించి, డి.ఎం.కె తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా హిందీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టింది.
ప్రశ్న 30.
క్రింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
1970 దశాబ్దం ప్రథమాంకంలో తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగాదేశ్లో ఆందోళనలు చోటు చేసుకున్నాయి. పశ్చిమ పాకిస్తాన్ తమపై సవతితల్లి ప్రేమ కనపరచటంపై నిరసనలు చెలరేగాయి, తమ బెంగాలీ అస్థిత్వాన్ని చాటుకోటానికి ఉద్యమాలు మొదలయ్యాయి. సార్వత్రిక ఎన్నికలలో ముజిబుర్ రెహ్మాన్ నాయకత్వంలోని పార్టీ గెలుపొందింది. కానీ అతడిని అరెస్టు చేసి పశ్చిమ పాకిస్తాన్ కి తీసుకెళ్లారు. తూర్పు పాకిస్తాన్లో సైనిక అణచివేత కాలం మొదలయ్యింది. అక్కడ నుంచి తరలి వచ్చిన లక్షలాది కాందిశీకులకు భారతదేశం వసతి కల్పించి ఆహారాన్ని అందించాల్సి వచ్చింది. ఈలోగా బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమం మొదలయ్యింది. దీంట్లో భారతదేశ సహాయాన్ని కోరారు. 1971లో భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలయ్యింది.
1) తూర్పు పాకిస్తాన్లో ఎప్పుడు ఆందోళనలు చోటు చేసుకున్నాయి.
జవాబు:
1970 దశాబ్దం ప్రమాంకంలో తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్)లో ఆందోళనలు చోటు చేసుకున్నాయి.
2) సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీ గెలుపొందింది?
జవాబు:
సార్వత్రిక ఎన్నికలలో ముజిబుర్ రెహ్మాన్ నాయకత్వంలోని పార్టీ గెలుపొందింది.
3) భారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
జవాబు:
1971లో భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది.
ప్రశ్న 31.
రాజ్యాంగంలోని 370వ అధికరణ యొక్క ప్రత్యేకత ఏమి?
జవాబు:
- రాజ్యాంగంలోని 370వ అధికరణంలో కాశ్మీరీలు భారతదేశ పూర్తి పౌరులుగా ఉంటారని తెలుపబడింది.
- మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆ రాష్ట్రం అధిక స్వయంప్రతిపత్తి, అధికారాలు కలిగి ఉంటుంది.
- రాష్ట్ర మౌలిక స్వభావాన్ని కాపాడటానికి ఉద్దేశించిన అనేక అంశాలు ఈ ఆర్టికల్ 370లో కలవు.
ప్రశ్న 32.
“ప్రాథమిక విద్యకు, ప్రజారోగ్యానికి తక్కువ ప్రాధాన్యత నివ్వడం అతిపెద్ద లోపమని నిస్సందేహంగా చెప్పవచ్చు. పై వ్యాఖ్యపై వ్యాఖ్యానించండి.
జవాబు:
- స్వాతంత్ర్యానంతరం మనదేశం ప్రాథమిక విద్యకు, ప్రజారోగ్యానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది.
- అయితే దేశ అభివృద్ధికి విద్య, ప్రజారోగ్యం పెద్ద అవసరాలు
- కావున వాటికి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం అతి పెద్ద లోపమని చెప్పవచ్చు.
10th Class Social 18th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
భారతదేశంలో భూసంస్కరణలు ఎలా అమలు చేశారు ? అవి ప్రజలకు ఎలా ఉపయోగపడ్డాయి?
జవాబు:
- భారతదేశమంతటా భూసంస్కరణలను మనఃస్పూర్తిగా అమలు చేయలేదు.
- జమిందారీ వ్యవస్థను రద్దు చేశారు కానీ, భూమి లేని వాళ్ళకి భూపంపిణీ జరగలేదు.
- గ్రామీణ ప్రాంతాలలో ధనికులు, శక్తిమంతులు భూమిలోని అధిక భాగాలపై నియంత్రణ కొనసాగిస్తూనే ఉన్నారు.
- దళితులు ఇంకా భూమిహీనులుగానే ఉన్నారు.
- కానీ వెట్టిచాకిరీ నిర్మూలన, అంటరానితనం నిషేధం వల్ల ప్రయోజనం పొందారు.
ప్రశ్న 2.
హరితవిప్లవ ఫలాలు ఏవి?
జవాబు:
హరితవిప్లవం వలన కలిగిన ఫలితాలు:
- వ్యవసాయం క్రింద సాగుచేసే భూమి పెరిగింది.
- రెండు పంటల విధానం అమలులోనికి వచ్చింది.
- నీటిపారుదల వ్యవస్థ బాగా పురోభివృద్ధి చెందింది.
- హెక్టారుకి వచ్చే పంట దిగుబడి పెరిగింది.
- క్రిమిసంహారక మందులు అధిక దిగుబడిని ఇచ్చే వంగడాల వాడకం బాగా పెరిగింది.
ప్రశ్న 3.
భారతదేశంలోని అన్ని భాషలు సమాన హోదా కలిగి ఉన్నాయా? ప్రతిస్పందించండి.
జవాబు:
- భారతదేశంలోని అన్ని భాషలు సమాన హోదా కలిగిలేవు; కల్పించాలి.
- అనేక గిరిజన (గోండు, సంథలి, ఒరావన్ మొదలైనవి), అట్టడుగు సమాజంలోని ప్రజల భాషలను … పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది.
- రాజ్యాంగం ప్రకారం పౌరులకు తమ భాష, సంస్కృతిని రక్షించుకునే హక్కు ఉంది. భాషాపరమైన అల్ప సంఖ్యాకుల రక్షణకు చర్యలు (ప్రకరణలు) తీసుకోబడ్డాయి.
- సమాజంలో శక్తిమంత (ఎక్కువ మంది) ప్రజానీకం మాట్లాడే భాషలను (హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ మొ||నవి) మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం అభిలషనీయం కాదు.
- అన్ని భాషలకు సమాన హోదా ఉండాలి. దీనివల్ల భాషా ఉద్యమాలు తలెత్తవు. దేశ ఐక్యత, సమగ్రతలు కాపాడబడతాయి.
ప్రశ్న 4.
రాజ్యాంగానికి చేసిన 42 వ సవరణలోని అంశాలేమిటి?
(లేదా)
42వ రాజ్యాంగ సవరణ ఉద్దేశాలు ఏమిటి?
జవాబు:
రాజ్యాంగానికి చేసిన 42 వ సవరణ అనేక మార్పులను తీసుకువచ్చింది. ఈ సవరణ ఉద్దేశాలు :
- ఎన్నికల వివాదాలలో న్యాయస్థానాలకు చోటు లేకుండా చెయ్యటం.
- రాష్ట్ర ప్రభుత్వాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని బలపరచటం.
- సామాజిక, ఆర్థిక మార్పునకు ఉద్దేశించిన చట్టాలకు న్యాయస్థానాల నుంచి సాధ్యమైనంత రక్షణను కల్పించటం. న్యాయ వ్యవస్థ పార్లమెంటుకు లోబడి ఉండేలా చేయటం.
- ‘లౌకిక, సామ్యవాదం’ అనే పదాలను రాజ్యాంగంలోని ప్రవేశికలో చేర్చుట జరిగింది.
ప్రశ్న 5.
దేశ అభివృద్ధికి, స్వాతంత్రానికి, స్త్రీ, పురుషులకు సమాన అవకాశాలు వాళ్ల సమాన భాగస్వామ్యం అవసరమన్న దృక్పథంతో మీరు ఏకీభవిస్తారా?
జవాబు:
- అవును. నేను ఈ దృక్పథంతో ఏకీభవిస్తాను.
- కారణమేమనగా, అన్ని రంగాలలోను స్త్రీలు సగభాగం పాలు పంచుకుంటున్నారు.
ప్రశ్న 6.
భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికల నిర్వహణలో నిరక్షరాస్యతా సమస్యను ఎన్నికల సంఘం ఏ విధంగా అధిగమించింది?
జవాబు:
నిరక్షరాస్యతా సమస్యను అధిగమించడానికి ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను, అభ్యర్థులను సూచించేలా రోజువారీ , జీవితం నుంచి కొన్ని గుర్తులను ఉపయోగించటం అన్న వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈ సృజనాత్మక, వినూత్న ప్రయోగం కారణంగా సుదీర్ఘ వివరణల అవసరం లేకుండా బొమ్మను గుర్తిస్తే సరిపోయింది. ఇదే విధానం ఇప్పటికీ కొనసాగుతోంది. దీనిని మరింత సులభతరం చేయడానికి మొదటి ఎన్నికలలో ప్రతి అభ్యర్థికి బయటవైపు వాళ్ల గుర్తు అంటించిన వేరు వేరు బ్యాలెట్ పెట్టెలు కేటాయించారు. తాను ఎంచుకున్న అభ్యర్థి బ్యాలెట్ పెట్టెలో ఓటరు తన ఓటును వేస్తే సరిపోతుంది.
ప్రశ్న 7.
క్రింది పేరాను చదివి, మీ సొంత మాటలలో వ్యాఖ్యానించండి.
ప్రాథమిక విద్యకు, ప్రజారోగ్యానికి తక్కువ ప్రాధాన్యతను ఇవ్వటం పెద్ద లోపం అని నిస్సందేహంగా పేర్కొనవచ్చు. ఇది భారతదేశాన్ని చాలాకాలం పాటు పీడిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో నూతన శకాన్ని ఆరంభించిన చైనా, కొరియా భారతదేశంతో పోలిస్తే ఈ రెండు అంశాల్లో ఎంతో ప్రగతిని సాధించాయి.
జవాబు:
- ప్రాథమిక విద్య మరియు ప్రజారోగ్యం అనేవి అత్యంత ముఖ్యమైన అంశాలు
- ఈ అంశాలకు ఏ దేశంలోనైనా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది.
- దురదృష్టవశాత్తూ భారతదేశంలో ఈ రెండు రంగాలు అనుకున్నంత ప్రగతిని సాధించలేకపోయాయి.
- ఈ రంగాలలో ఆశించిన లక్ష్యాలను సాధించేటందుకు ప్రభుత్వాలు కీలకపాత్ర పోషించాలి.
ప్రశ్న 8.
లాల్ బహదూర్ శాస్త్రిలోని ఏ గుణాలు నీకు నచ్చాయి? ఎందుకు?
జవాబు:
లాల్ బహదూర్ శాస్త్రిలో నాకు నచ్చిన గుణాలు :
- సమస్య పరిష్కారం
- ప్రజాస్వామిక విలువలకు ప్రాధాన్యతనివ్వడం.
- హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని, ఆహార కొరతను ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించడం
ప్రశ్న 9.
ప్రాంతీయ పార్టీకి, జాతీయ పార్టీకి గల తేడాలు రాయండి.
జవాబు:
ప్రాంతీయ పార్టీ | జాతీయ పార్టీ |
• రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో 3% ఓట్లు లేదా 3 శాసన సభ స్థానాలు పొందిన పార్టీ | • సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాలలో పోలైన ఓట్లలో 6% చొప్పున పొందిన ఓట్లు లేదా 4 వేర్వేరు రాష్ట్రాల నుండి 11 లోకసభ సీట్లు |
ప్రశ్న 10.
భారతదేశ అవుట్ లైన్ పటం గీయండి.
జవాబు:
ప్రశ్న 11.
రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టం – 1956 గూర్చి రాయండి.
జవాబు:
- ఫజల్ అలీ అధ్యక్షతన రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ సంఘం ఏర్పాటు అయింది.
- భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల ఏర్పాటు అంశాన్ని పరిశీలించడం జరిగింది.
- 14 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయడం జరిగింది.
- ఈ చట్టంలో గిరిజన భాషలను పరిగణనలోకి తీసుకోలేదు.
- ఆధిపత్యం లేదా శక్తిమంత ప్రజానీకం మాట్లాడే భాషలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు.
ప్రశ్న 12.
ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఏర్పడింది?
జవాబు:
1953 ఆగష్టులో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని (ఎస్.ఆర్.సి) వేశారు. దీంట్లో ఫజల్ అలీ, కె.ఎం. ఫణిక్కర్, హృదయనాథ్ కుంజ్రులు సభ్యులుగా ఉన్నారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించవలసిందిగా ఈ సంఘాన్ని కోరారు. ఈ సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా 1956లో పార్లమెంటు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించింది. దీని ఆధారంగా 1956, నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.
ప్రశ్న 13.
భారతదేశమంతటా భూసంస్కరణలు ఏ విధంగా అమలు జరిగాయి?
జవాబు:
అయితే భారతదేశమంతటా భూసంస్కరణలు మనస్పూర్తిగా అమలు చేయలేదు. జమీందారీ వ్యవస్థను రద్దు చేశారు. కానీ, భూమి లేనివాళ్లకి భూ పంపిణీ జరగలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ధనికులు, శక్తిమంతులు భూమిలోని అధిక భాగాలపై ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉన్నారు. దళితులు ఇంకా భూమి హీనులుగానే ఉన్నారు.
ప్రశ్న 14.
భారతదేశ విదేశీ విధానం ఏమిటి?
జవాబు:
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలోనే ప్రచ్ఛన్న యుద్ధం మొదలయ్యి ప్రపంచమంతా రష్యా కూటమి (USSR) లేదా అమెరికా కూటమి (USA) గా విడిపోతోంది. జవహర్‌లాల్ నెహ్రూ ఏ శిబిరంలోనూ చేరకుండా రెండింటికీ సమదూరంలో ఉంటూ విదేశీ విధానంలో స్వతంత్రంగా వ్యవహరించసాగాడు. అదే సమయంలో స్వాతంత్ర్యం పొంది అదే విధానాన్ని కొనసాగించాలనుకుంటున్న ఇండోనేషియా, ఈజిప్టు, యుగోస్లేవియా వంటి దేశాలతో అతడు చేతులు కలిపాడు. వీళ్లంతా కలిసి అలీనోద్యమాన్ని నిర్మించారు.
ప్రశ్న 15.
పంచశీల సూత్రాలనగానేమి? వీటిని ఎవరు రూపొందించారు?
జవాబు:
పంచశీల అంటే ఐదు సూత్రాలు. ఇవేమంటే :
- ప్రతి రాజ్యంలోని ప్రాంతీయ సమగ్రత (Territorial integrity) నూ, సార్వభౌమత్వాన్ని, పరస్పరం గౌరవించాలి.
- ఒక రాజ్యంపై మరొక రాజ్యం దురాక్రమణ చేయరాదు.
- ఒక రాజ్యం ఆంతరంగిక వ్యవహారాల్లో మరొక రాజ్యం జోక్యం చేసుకోరాదు.
- రాజ్యాల పరస్పర శ్రేయస్సు, సమానత్వం ఆధారంగా స్నేహ సంబంధాలను నెలకొల్పాలి.
- రాజ్యాలు శాంతియుత సహజీవనాన్ని పాటించాలి.
పై సూత్రాలతో కూడిన ఒక ఒప్పందాన్ని, 28 జూన్ 1954న భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ) చైనా ప్రధాని (చౌ-ఎన్-లై) (Chou-En-Lai) సంయుక్తంగా ప్రకటించి ఆమోదించారు.
ప్రశ్న 16.
హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ఏ విధంగా పరిష్కరించారు?
జవాబు:
అప్పటి ప్రధాని శాస్త్రి హిందీ అనుకూలవాదనని సమర్థించినప్పటికీ, హిందీ వ్యతిరేక శిబిరంలోని ఉద్వేగాలను శాంత పరచటానికి అనేక మినహాయింపులను ప్రకటించాడు. వీటిల్లో కొన్ని : ప్రతి రాష్ట్రానికి తన సొంత భాష కలిగి ఉండే హక్కు ఉంది, అది ప్రాంతీయ భాష కావచ్చు లేక ఇంగ్లీషు కావచ్చు. ప్రతి వ్యవహారమూ ఇంగ్లీషు అనువాదంతో ప్రాంతీయ భాషలలో ఉండవచ్చు. కేంద్రం-రాష్ట్రాల మధ్య వ్యవహార భాషగా ఇంగ్లీషు కొనసాగుతుంది. సివిల్ సర్వీసు పరీక్షలు కేవలం హిందీలోనే కాకుండా ఇంగ్లీషులో కూడా నిర్వహిస్తారు.
ప్రశ్న 17.
1971లో బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమానికి సహాయం చేసే సామర్థ్యం భారతదేశానికి ఏ విధంగా వచ్చింది?
జవాబు:
1971లో భారతదేశం-పాకిస్థాన్ మధ్య యుద్ధం మొదలయ్యింది. భారతదేశం నిర్ణయాత్మకంగా జోక్యం చేసుకుని బంగ్లాదేశ్ కు విముక్తి సాధించి, స్వతంత్ర దేశంగా ఏర్పడేలా సహాయపడింది. భారతదేశం తన సైనిక బలాన్ని పెంచుకోవటం వల్లనే కాకుండా అలీన దేశంగా తన స్థితిని నైపుణ్యంతో ఉపయోగించుకుని రెండు అగ్రరాజ్యాలు యుద్ధంలో జోక్యం చేసుకోకుండా చెయ్యటం వల్ల ఇది సాధ్యమయ్యింది.
ప్రశ్న 18.
అత్యవసర పరిస్థితి కాలంలో జరిగే మార్పులు ఏమిటి?
జవాబు:
- అనేక ప్రాథమిక హక్కులను నిలిపివేస్తారు.
- పార్లమెంట్ ఏ అంశంపైనైనా శాసనము చేయవచ్చు.
- కేంద్ర కార్యనిర్వాహక వర్గ సలహాల మేరకు రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం పాలనను కొనసాగించవలసి ఉంటుంది.
- ఎటువంటి మార్పులనైనా రాష్ట్రపతి ప్రవేశపెట్టవచ్చు.
ప్రశ్న 19.
ప్రచ్ఛన్న యుద్దమనగానేమి?
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధానంతరం అమెరికా అధ్వర్యంలోని పాశ్చాత్య రాజ్యాలకు అనగా కమ్యూనిస్టేతర రాజ్యాలకు, రష్యా ఆధిపత్యంలోనున్న కమ్యూనిస్టు రాజ్యాలకు మధ్యగల పరస్పర ద్వేషం, అనుమానాలు, ఉద్రిక్తతలు ప్రచ్ఛన్న యుద్ధంగా పిలువబడ్డాయి.
ప్రశ్న 20.
భారతదేశ పటంలో ఈ క్రింది ప్రాంతాలను గుర్తించండి.
1) కలకత్తా
2) మద్రాస్
3) బాంబే
4) మహారాష్ట్ర
5) పంజాబు
6) గుజరాత్
7) కర్ణాటక
8) మైసూరు
జవాబు:
ప్రశ్న 21.
అధికార వికేంద్రీకరణ అంటే ఏమిటి?
జవాబు:
- వివిధ స్థాయిలలో అధికారాలను పంపిణీ చేయడాన్ని అధికార వికేంద్రీకరణ అంటాం.
- దీనివలన ఏ స్థాయికి ఆ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం సులభతరం అవుతుంది.
- అధికారాలు కేంద్రీకృతమై ఉంటే నిర్ణయాలు తీసుకోవడానికి చాలా సమయం పట్టడము మరియు వివిధ స్థాయిలలో ఫైల్స్ ఉండిపోయి తుది నిర్ణయాలకు ఇబ్బందులు ఏర్పడవచ్చు.
- అధికార వికేంద్రీకరణ వలన కొంతమేరకు వ్యవస్థాగత అవినీతిని అరికట్టవచ్చు.
ప్రశ్న 22.
భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు పునఃవ్యవస్థీకరణ చేయడానికి అప్పటి నాయకులకు ఉన్న అపోహలు ఏవి?
జవాబు:
- మతం ఆధారంగా దేశ విభజన జరగడంతో నాయకుల మనసులో భారతదేశ భద్రత, సుస్థిరత పట్ల అనుమానాలు, భయాలు కలుగసాగాయి.
- భాషా ప్రాతిపదికన రాష్ట్రాల్ని పునఃవ్యవస్థీకరిస్తే దేశం ముక్కలు కావడానికి ఇది దారితీస్తుందని భయపడసాగారు.
- కాంగ్రెస్ పార్టీ భాషాప్రాతిపదికపై సంఘటితమై ఉన్నప్పటికీ, ఆ ఆధారంగా దేశాన్ని పునఃసంఘటితం చేస్తామని మాట ఇచ్చినప్పటికీ వెంటనే పూనుకోలేదు.
ప్రశ్న 23.
“ప్రపంచంలో ముంచుకొస్తున్న కొత్త సాంకేతిక విజ్ఞానాలను ప్రత్యేకించి కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్ సాంకేతిక విజ్ఞానాన్ని భారతదేశం అవలంబించడం వల్ల అభివృద్ధిలో దూసుకుపోగలదని చెప్పవచ్చు.” వ్యాఖ్యానించండి.
జవాబు:
- ప్రపంచంలో ముంచుకొస్తున్న కొత్త సాంకేతిక విజ్ఞానాలను ప్రత్యేకించి కంప్యూటరు, టెలికమ్యూనికేషన్ సాంకేతిక , విజ్ఞానాన్ని భారతదేశం అవలంబించాలని రాజీవ్ గాంధీ గట్టిగా నమ్మాడు.
- ప్రస్తుతం భారతదేశంలో ‘టెలికాం విప్లవం’ అనబడుతున్న దానిని అతడే ఆరంభించాడు.
- ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో దేశంలో టెలిఫోనిక్ నెట్ వర్క్ వేగంగా, విస్తరించడానికి దోహదపడుతుంది.
- మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, E-mail, Voicemail, Facebook, Twitter తదితరాలు అందుబాటులోకి వచ్చాయి.
ప్రశ్న 24.
జమ్ము & కాశ్మీరు రాష్ట్రానికి ప్రత్యేకంగా స్వయంప్రతిపత్తి కల్పించడం సమర్థనీయమేనని మీరు భావిస్తున్నారా?
జవాబు:
- భారత సమాఖ్యలో ఇతర సంస్థానాలలాగా కాకుండా జమ్మూ & కాశ్మీరు చేరిన పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
- 1947 చివరినాటికి పాకిస్తాన్ మద్దతుతో రజాకార్ల దాడుల నేపథ్యంలో భారతదేశంలో విలీనం అయితేనే సైన్యం అందుబాటులోకి వస్తుంది.
- ఆ సమయంలో రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి, అది స్వయంప్రతిపత్తితో కొనసాగడం గురించి విస్తృత చర్చలు జరిగాయి.
- ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370తో అధిక స్వయంప్రతిపత్తి, అధికారాలు పొందడం సమర్థనీయమని అనుకుంటున్నాను.
ప్రశ్న 25.
బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందడానికి భారత్ సహకరించడం సమంజసమేనని భావిస్తున్నారా? వివరణ ఇవ్వండి.
జవాబు:
- పాకిస్తాన్ లో భాగంగా ఉన్న తూర్పు పాకిస్తాన్ పై అది సవతితల్లి ప్రేమ కనపరచడంపై నిరసనలు చెలరేగాయి.
- సార్వత్రిక ఎన్నికలలో గెల్చిన ముజిబుర్ రెహ్మాన్ ను అరెస్ట్ చేసి పాకిస్తాన్ తీసుకెళ్ళడంతోపాటు తూర్పు పాకిస్తాన్ లో సైనిక అణచివేతకాలం మొదలైంది.
- తమ బెంగాలీ అస్థిత్వాన్ని చాటుకోవడానికి ఉద్యమాలు, లక్షలాది కాందిశీకులకు భారత్ వసతి, ఆహారం అందించింది.
- “ముక్తి బాహిని” ఉద్యమం చేస్తూ తూర్పు పాకిస్తాన్ ప్రజలు భారత సహాయాన్ని కోరితే నిర్ణయాత్మకంగా జోక్యం చేసుకొని బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడే సహాయం చేశాం.
- ఆ పరిస్థితులలో భారత్, తూర్పు పాకిస్తాన్ కి సహకరించడం సమంజసమేనని భావిస్తున్నాను.
ప్రశ్న 26.
స్థానిక స్వపరిపాలన వల్ల గ్రామాలు, పట్టణాలు, నగరాలు అభివృద్ధి చెందుతాయని మీరు భావిస్తున్నారా.? అభిప్రాయం తెల్పండి.
జవాబు:
- స్థానిక స్వపరిపాలన వలన గ్రామాలు మరియు పట్టణాలు, నగరాలు తప్పనిసరిగా అభివృద్ధి చెందుతాయి.
- దీనికి రాష్ట్రాల సహకారం ఎంతో అవసరం.
- స్థానిక సంస్థలకు అధికారాలు, విధులు, నిధులు అందజేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదే.
- 1992లో పి.వి. నరసింహారావు ప్రభుత్వంలో 73వ రాజ్యాంగ సవరణ గ్రామాలకు, 74వ సవరణ పట్టణాలు, నగరాలకు స్థానిక స్వపరిపాలన కట్టబెట్టింది.
- అవినీతిలేని, ఆశ్రిత బంధుప్రీతి రహిత, ప్రజాహిత స్థానిక ప్రభుత్వాల పనితీరుతో వృద్ధిని చూడగలం.
10th Class Social 18th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
క్రింది పేరాను చదివి, అర్థం చేసుకొని వ్యాఖ్యానించుము.
ఐక్యతను, దేశ సమగ్రతను కాపాడి, నిలపటంలో కూడా భారతదేశం విజయవంతమైంది. దేశంలోని అంతులేని వైవిధ్యత కారణంగా అది విచ్ఛిన్నం కావటానికి అనువైన దేశమని అందరూ భావించారు. అలా కాకపోవటం అన్నది ఇతర దేశాలకు చక్కని గుణపాఠంగా ఉపయోగపడుతుంది.
జవాబు:
భారతదేశమునకు స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. ఇది గమనించిన వాళ్ళు అందరూ భారతదేశం విచ్చిన్నం అవుతుందని భావించారు. కాని వారిని ఆశ్చర్యపరుస్తూ భారతదేశం ఈ క్రింది విధానాల ద్వారా ఐక్యతను దేశ సమగ్రతను కాపాడటంలో విజయవంతం అయినది.
- భారతదేశంలో వివిధ భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు వారి మధ్య భేదాలు రాకుండా భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసింది.
- దేశంలో వివిధ మతాలవారు ఉన్నారు. ఎటువంటి మతపరమైన అల్లర్లు జరుగకుండా అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతను ఇస్తూ లౌకికవాదాన్ని అనుసరిస్తున్నది.
- పాలకులను ఎన్నుకోవడంలో ధనిక, పేదా తేడాలు చూపించకుండా వయోజనులందరికీ ఓటుహక్కును కల్పించింది.
- దేశ ఆర్థికాభివృద్ధి కోసం ప్రణాళికా సంఘాన్ని నెలకొల్పాం.
- సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వర్గాల పట్ల నిజమైన శ్రద్ధ కనబరచడం జరిగింది.
- పండుగలను అందరూ కలసిమెలసి జరుపుకోవడం దేశ ఐక్యతకు ప్రధాన నిదర్శనం.
ప్రశ్న 2.
క్రింది పాఠ్యభాగాన్ని చదివి, ప్రశ్నకు జవాబు వ్రాయండి.
దీనితో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. దేశంలో శాంతి భద్రతలకు అవసరమంటూ ప్రభుత్వం అనేక అణిచివేత చర్యలకు పాల్పండింది. అనేక ప్రాథమిక హక్కులను నిలిపివేశారు. ఏకారణం లేకుండా అరెస్టు చెయ్యటం, హింసించటం, పౌరహక్కులకు భంగం కలిగించటం వంటి అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ కాలంలో ధరల నియంత్రణ, నల్ల బజారు, వెట్టి చాకిరీలకు వ్యతిరేకంగా సాగే ఉద్యమాలను ప్రజలు స్వాగతించారు. అయితే ఇదే కాలంలో చేపట్టిన మురికివాడల తొలగింపు జనాభా నియంత్రణ పేరుతో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించటం వంటి కార్యక్రమాలు ప్రజల కోపానికి కారణమయ్యాయి. అయితే పౌరహక్కులు లేనందువల్ల ప్రజలు తమ అసంతృప్తిని వెల్లడి చేసే మార్గాలు లేకపోయాయి. దాంతో దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం ప్రభుత్వానికి లేకుండా పోయింది.
అత్యవసర పరిస్థితిలో ఏ విధమైన మార్పులు వచ్చాయి?
జవాబు:
- ప్రజాస్వామ్యం లేకుండా పోయింది.
- శాంతి భద్రతల అవసరమంటూ ప్రభుత్వం అనేక అణచివేత చర్యలకు పాల్పడింది.
- ప్రాథమిక హక్కులు నిలిపివేయబడ్డాయి.
- జనాభా నియంత్రణ పేరుతో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించబడ్డాయి.
- పౌర హక్కులు లేనందువల్ల ప్రజలు తమ అసంతృప్తిని వెల్లడి చేసే మార్గాలు లేకపోయాయి.
ప్రశ్న 3.
క్రింది పట్టికను చదివి, క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.
విషయం | సంబంధిత వ్యక్తి | సంవత్సరాలు |
1. అలీనోద్యమము | నెహ్రూ | 1955 – 1961 |
2. హరిత విప్లవం | M.S. స్వామినాథన్ | 1964 – 1967 |
3. అత్యవసర పరిస్థితి | ఇందిరాగాంధీ | 1975 – 1977 |
4. ప్రణాళికలు | నెహ్రూ | 1951 |
5. పంచశీల | నెహ్రూ | 1954 |
i) పంచశీల ఒప్పందంపై సంతకాలు చేసిన రెండు దేశాలు ఏవి?
ii) భారతదేశంలో ప్రణాళికలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
iii) అత్యవసర పరిస్థితిని విధించిన ప్రధానమంత్రి ఎవరు?
iv) హరిత విప్లవం అనగానేమి?
జవాబు:
i) చైనా, భారతదేశము.
ii) 1951
iii) ఇందిరా గాంధీ.
iv) అధిక దిగుబడి రకాలు, క్రిమి సంహారకాలు, మెరుగైన యాజమాన్య పద్ధతులు ఉపయోగించి ఆహార ధాన్యాల దిగుబడులను బాగా పెంచడం.
ప్రశ్న 4.
అత్యవసర పరిస్థితి కాలంలో భారతదేశం యొక్క పరిస్థితిని వర్ణించండి.
జవాబు:
- దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది.
- అనేక ప్రాథమిక హక్కులను నిలిపివేశారు.
- పౌరహక్కులకు భంగం వాటిల్లింది.
- ప్రజలు తమ అసంతృప్తిని వెల్లడి చేసే మార్గాలు సైతం లేకుండా పోయాయి.
- మురికివాడలు తొలగించబడ్డాయి.
- జనాభా నియంత్రణ పేరుతో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయబడ్డాయి.
ప్రశ్న 5.
క్రింద ఇవ్వబడ్డ పట్టికను చదివి, ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.
అంశము | వివరాలు |
ఓటు హక్కు | స్విట్జర్లాండ్ మహిళలు 1971లో పొందారు. |
ఎన్నికల చిహ్నాలు | నిరక్షరాస్యుల కొరకు. |
కాంగ్రెస్ విజయం | 1952, 1957, 1962 ఎన్నికలు |
ఆంధ్ర మహాసభ | మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగువారి ఐక్యత కోసం |
రాష్ట్ర పునర్విభజన చట్టం | 1956 |
మొదటి పంచవర్ష ప్రణాళిక | వ్యవసాయం |
D.M.K. | తమిళనాడు |
1) తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
1953
2) తొలి సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం ఎదుర్కొన్న ఒక సవాలును పేర్కొనండి.
జవాబు:
నిరక్షరాస్యత
3) ఏ పంచవర్ష ప్రణాళికయందు వ్యవసాయానికి ప్రాధాన్యత యివ్వబడింది?
జవాబు:
మొదటి పంచవర్చ ప్రణాళిక
4) స్వాతంత్ర్యానంతరం మూడు తొలి దశాబ్దాలలో భారత రాజకీయాలపై ఆధిపత్యం వహించిన పార్టీ ఏది?
జవాబు:
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ
ప్రశ్న 6.
కింది పట్టికను పరిశీలించి, విశ్లేషించండి.
1952, 1962 ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు గెలుచుకున్న స్థానాలు
రాజకీయ పార్టీ | 1952 | 1962 |
1. భారత జాతీయ కాంగ్రెస్ | 364 | 361 |
2. భారత కమ్యూనిస్ట్ పార్టీ | 16 | 29 |
3. స్వతంత్రులు | 37 | 20 |
4. సోషలిస్ట్ పార్టీ | 12 | 06 |
5. ఇతరులు | 38 | 27 |
జవాబు:
పట్టికలో 1952, 1962 ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు, అవి గెలుచుకున్న స్థానాల గురించిన సమాచారం పొందుపరచబడింది.
- భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 1952 ఎన్నికలలో 364 స్థానాలు సాధించగా, 1962 ఎన్నికలలో 361 స్థానాలు గెలుచుకుంది.
- భారత కమ్యూనిస్టు పార్టీ 1952 ఎన్నికలలో 16 స్థానాలను గెలుచుకొంది. ఈ పార్టీ 1962 ఎన్నికలలో కొంచెం పుంజుకొని 29 స్థానాలను సాధించింది.
- 1952 ఎన్నికలలో 37 స్థానాలను సాధించిన స్వతంత్రులు 1962 ఎన్నికలలో బలం కోల్పోయి 20 స్థానాలకే పరిమితమయ్యారు.
- 1952 ఎన్నికలలో 12 స్థానాలను గెలుచుకొన్న సోషలిస్టు పార్టీ 1962 ఎన్నికలలో 6 స్థానాలు మాత్రమే గెలవగలిగింది.
- ఇక ఇతరుల విషయానికి వస్తే వీరు 1952 ఎన్నికలలో 38 స్థానాలు పొందారు. 1962 ఎన్నికలలో వీరు సాధించిన స్థానాల సంఖ్య 27కే పరిమితమైంది.
పై పట్టిక రాజకీయ వ్యవస్థలో ఏకపార్టీ ఆధిపత్యాన్ని వెల్లడి చేస్తోంది. 1952, 1962లలో జరిగిన ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అఖండ విజయాలు సాధించింది. ఇతర పార్టీలు కాంగ్రెస్ ని సవాలు చేయగలిగే సంఖ్యలో స్థానాలను గెలుచుకోలేకపోయాయి. ఇతర ఏ పార్టీ కూడా కాంగ్రెస్ కి సమీపంలో లేదు. ఈ విధంగా పై పట్టిక అప్పటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని తెలియజేస్తోంది.
ప్రశ్న 7.
ప్రస్తుత పరిస్థితులలో మెరుగైన ప్రజాస్వామ్యానికి, నీతివంతమైన ప్రభుత్వం ఏర్పాటుకు తగు సూచనలు చేయండి.
జవాబు:
- ప్రతి ఓటరు ఓటింగ్ లో పాల్గొనాలి.
- నిజాయితీపరులను ఎన్నుకోవడానికి ప్రాధాన్యతకు ఇవ్వాలి.
- ఎన్నుకోబడిన నాయకులు ప్రభుత్వం జవాబుదారీతనం కలిగి ఉండాలి.
- ఎన్నికలు పారదర్శకంగా ఉండాలి.
- సామాజిక తనిఖీ జరగాలి.
- రీకాల్ పద్ధతిని అమలు చేయాలి.
- పార్టీ ఫిరాయింపుల చట్టంను సమర్థవంతంగా అమలు చేయాలి.
- అక్షరాస్యత రేటు పెంచడం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించాలి.
- ప్రజాస్వామ్యం ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
ప్రశ్న 8.
“స్వాతంత్ర్యానంతరం మొదటి ముప్పై సంవత్సరాలు అత్యవసర పరిస్థితితో ముగిసినప్పటికీ, లాభనష్టాల పట్టిక తయారుచేస్తే తప్పులు కంటే ఒప్పులే ఎక్కువ ఉన్నాయి.” — వ్యాఖ్యానించండి.
జవాబు:
మొదటి ముప్పై సంవత్సరాలు అత్యవసర పరిస్థితితో ముగిసినప్పటికీ, లాభనష్టాల పట్టిక తయారు చేస్తే తప్పులు కంటే ఒప్పులే ఎక్కువ ఉన్నాయి.
- స్థిరమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పటం ఈ కాలంలో సాధించిన అత్యంత ముఖ్యమైన విషయంగా పేర్కొనవచ్చు.
- అదే సమయంలో స్వాతంత్ర్యం పొందిన ఇతర దేశాలతో భారతదేశాన్ని పోలిస్తే భిన్న ప్రయోజనాలు కలిగిన పార్టీలతో పోటీతో కూడిన బహుళపార్టీ వ్యవస్థ క్రమేపీ రూపొందటం అన్నది నిజమైన విజయంగా పేర్కొనాలి.
- ఇతర దేశాలలో లాగా కాకుండా భారతదేశంలో క్రమం తప్పకుండా, భయంలేని, స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరగటమే కుకుండా ప్రభుత్వాలు, నాయకులు కూడా మార్పుకి లోనయ్యారు.
- భారత రాజ్యాంగం పౌరహక్కులను ఇవ్వటమే కాకుండా వాటిని కాపాడటానికి వ్యవస్థాగత నిర్మాణం కూడా రూపొందించింది.
- న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘం, కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ వంటి స్వతంత్ర వ్యవస్థాగత ఏర్పాట్లతో భారతదేశం చక్కని సంస్థాగత చట్రాన్ని ఏర్పరిచింది. పాలనాధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించటం కూడా గొప్ప విజయమనే చెప్పుకోవాలి.
- సైనిక దళాలపై పౌర నియంత్రణను ఏర్పరచటం మరొక ముఖ్యమైన విషయం. మన పొరుగు దేశమైన పాకిస్తాన్‌తో పోలిస్తే ప్రజాస్వామిక సంస్థలలో భారతదేశం ఎంతో ముందుంది.
- ఐక్యతను, దేశ సమగ్రతను కాపాడి, నిలపటంలో కూడా భారతదేశం విజయవంతం అయ్యింది. దేశంలోని అంతులేని వైవిధ్యత కారణంగా అది విచ్చిన్నం కావటానికి అనువైన దేశమని అందరూ భావించారు, అలాకాకపోవటం అన్నది ఇతర దేశాలకు చక్కని గుణపాఠంగా ఉపయోగపడుతుంది.
- ఆర్థిక లక్ష్యాల విషయంలో ప్రణాళికా సంఘాన్ని నెలకొల్పటం, సమతుల ప్రాంతీయ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకోవటం అన్న అంశాలు చెప్పుకోదగినవి.
- సమాజంలోని ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వర్గాల పట్ల నిజమైన శ్రద్ధ కనబరిచారు.
- ఆహారం కోసం ఇతరులపై ఆధారపడిన స్థితి నుంచి కాలక్రమంలో ఆహార స్వయం సమృద్ధిని సాధించిన స్థితికి దేశం చేరుకుంది. ఇది పరిశ్రమలకు చక్కని పునాదిగా నిలచింది.
- అయితే ప్రాంతాల మధ్య సమాన అభివృద్ధి జరుగక కొన్ని ప్రాంతాలు ఇతర ప్రాంతాలకంటే ఎక్కువ అభివృద్ధి చెందాయి.
- అదేవిధంగా, ఉపాధి అవకాశాలు పెరగవలసినంతగా పెరగలేదు.
- ప్రాథమిక విద్యకి, ప్రజారోగ్యానికి తక్కువ ప్రాధాన్యతను ఇవ్వటం పెద్ద లోపమని నిస్సందేహంగా పేర్కొనవచ్చు. ఇది భారతదేశాన్ని చాలాకాలం పాటు పీడిస్తూ ఉంటుంది.
- కుల వ్యవస్థలోని గర్షించదగ్గ అంటరానితనం వంటి వాటిని తొలగించినప్పటికీ వివక్షత ఇంకా తీవ్రంగానే కొనసాగుతోంది. లింగ వివక్షత కూడా కొనసాగుతోంది.
ప్రశ్న 9.
క్రింది పటాన్ని పరిశీలించి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
1) పటంలో చూపబడిన అతిచిన్న ప్రాంతం ఏది?
జవాబు:
పటంలో చూపబడిన అతిచిన్న ప్రాంతం పాండిచ్చేరి.
2) మద్రాసు-మైసూరు రాష్ట్రాల మధ్య ఉన్న చిన్న రాష్ట్రం ఏది?
జవాబు:
మద్రాసు-మైసూరు రాష్ట్రాల మధ్య ఉన్న చిన్న రాష్ట్రం కూర్గ్.
3) పటంలో దక్షిణంవైపు ఉన్న రాష్ట్రం ఏది?
జవాబు:
పటంలో దక్షిణంవైపు ఉన్న రాష్ట్రం ట్రావన్ కోర్-కొచ్చిన్.
4) పటంలో తూర్పువైపు ఉన్న రాష్ట్రం ఏది?
జవాబు:
పటంలో తూర్పువైపు ఉన్న రాష్ట్రం ఆంధ్రరాష్ట్రం.
5) ఆంధ్రరాష్ట్ర సరిహద్దులను పేర్కొనండి.
జవాబు:
బంగాళాఖాతం, హైదరాబాద్, మైసూరు, తమిళనాడు.
ప్రశ్న 10.
1952, 1962 ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు గెలుచుకున్న స్థానాలు
పై రెండు గ్రామ్లు 1952, 1962లలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వివిధ పార్టీలు గెలుచుకున్న స్థానాలు తెలుపుతున్నాయి. వీటిని అధ్యయనం చేసి వ్యాఖ్యానించుము.
జవాబు:
1952 మరియు 1962 సంవత్సరాలలో జరిగిన ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు గెలుచుకున్న స్థానాలను పరిశీలించగా భారత రాజకీయ వ్యవస్థలో ఏకపార్టీ (భారత జాతీయ కాంగ్రెస్) ఆధిపత్యం స్పష్టంగా తెలియచేస్తుంది.
ఈ ఎన్నికలలో పోటీ చేసిన పార్టీలలో ఏ ఒక్క పార్టీకి కూడా ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందలేకపోయింది. దీనికంతటికి కారణం ఏమనగా భారతదేశంలో ద్విపార్టీ వ్యవస్థ లేకుండా బహుళ పార్టీ వ్యవస్థ అమలులో ఉండడమే. 1952లో ఎన్నికలు జరిగిన మొత్తం స్థానాలు 489, అందులో కాంగ్రెస్ పార్టీకి 364 స్థానాలు వచ్చాయి. మిగతా ప్రతిపక్ష పార్టీలన్నింటికి కలిపి 125 స్థానాలు వచ్చాయి. అనగా కాంగ్రెస్ పార్టీకి సుమారు 73 శాతం సీట్లు రాగా మిగిలిన అన్ని ప్రతిపక్ష పార్టీలన్నిటికి కలిపి 27 శాతం సీట్లు మాత్రమే వచ్చాయి.
1962 ఎన్నికలలో 494 స్థానాలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ 361 స్థానాలను గెలుచుకున్నది. మిగతా ప్రతిపక్ష పార్టీలు మరియు స్వతంత్రులు కలిపి 133 స్థానాలు మాత్రమే గెలుచుకున్నాయి. అనగా కాంగ్రెస్ పార్టీకి సుమారు 70 శాతం స్థానాలు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీలకు 30 శాతం స్థానాలు వచ్చాయి. పై స్లు పరిశీలించగా ఈ విషయాలు తెలియుచున్నవి.
ప్రశ్న 11.
నెహ్రూ చేపట్టిన చర్యలతో వ్యవసాయరంగంలో మార్పులు తీసుకురావచ్చుననే వాదనతో ఏకీభవిస్తారా? కారణాలు తెలియచేయండి.
జవాబు:
ఇందులో మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి : భూసంస్కరణలు, వ్యవసాయ సహకార సంఘాలు, స్థానిక స్వపరిపాలన, మూడు రకాల భూ సంస్కరణలను ప్రతిపాదించారు : జమీందారీ వ్యవస్థ రద్దు, కౌలు విధానాల సంస్కరణ, భూ పరిమితి : విధానాలు. వీటన్నిటి ప్రధాన ఉద్దేశం దున్నేవానికి భూమి చెందేలా చూసి మరింత ఉత్పత్తి చేయటానికి ప్రోత్సహించటం. సహకార సంఘాల ద్వారా ఆర్థికంగా లాభసాటి పరిమాణాన్ని చేరుకోవటమే కాకుండా విత్తనాలు, ఎరువులు, రసాయనాలు వంటి విలువైన ఉత్పాదకాలను అందించాలి. స్థానిక ప్రభుత్వాలు భూ సంస్కరణలు అమలు అయ్యేలా చూసి, గ్రామ ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా సహకార సంఘాలు నడిచేలా చూస్తాయి.
ప్రశ్న 12.
1967 తరువాత వచ్చిన కొత్త ప్రభుత్వాలు భారత రాజకీయ చరిత్రలో ఒక మైలురాయి వ్యాఖ్యానించండి.
జవాబు:
భారత రాజకీయ చరిత్రలో ఈ కొత్త ప్రభుత్వాలు ఒక మైలురాయిగా ఉంటాయి. ఒక విధంగా ప్రజాస్వామిక తిరుగుబాటును ఇది సూచిస్తుంది. మధ్యస్థాయి కులాలు – ఇవి భూ సంస్కరణల వల్ల ప్రయోజనం పొంది ఆర్థికంగా లాభపడ్డాయి – మొదటిసారిగా రాజకీయ అధికారాన్ని పొందాయి. ఈ కులాలు-హర్యానా, ఉత్తరప్రదేశ్ లో జాట్, బీహార్ లో కుర్మీ, కొయిరి, మధ్యప్రదేశ్ లో లోథ్, ఈ అన్ని రాష్ట్రాలలో యాదవ్, ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి, కమ్మ, కర్ణాటకలో ఒక్కళిగా, తమిళనాడులో వెల్లల. ఈ కులాలు ఆయా రాష్ట్రాలలో ఆధిపత్య కులాలుగా ఉండి జనాభా రీత్యా కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. ఇతర ఆధిపత్య (వెనకబడ్డ) కులాలు అధికారంలోకి రావటానికి డి.ఎం.కే పార్టీయే మంచి ఉదాహరణ.