Students can go through AP Board 6th Class Maths Notes 1st Lesson మన చుట్టూ ఉండే సంఖ్యలు to understand and remember the concept easily.
AP Board 6th Class Maths Notes 1st Lesson మన చుట్టూ ఉండే సంఖ్యలు
→ శ్రీనివాస రామానుజన్ (22.12.1887 – 26.04.1920),
సంఖ్య సిద్ధాంతంలో భారతీయ మేధావి. ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ (ఇంగ్లాండ్) కు ఎన్నికైన మొదటి భారతీయుడు. 1729 రామానుజన్’ సంఖ్య, ప్రతి సంవత్సరం జాతీయ గణిత దినోత్సవం అతని పుట్టినరోజు (డిసెంబరు 22) న జరుపుకుంటారు.
→ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 లను అంకెలు అంటాం. ఈ 10 అంకెలను ఉపయోగించి అన్ని సంఖ్యలను రాస్తాము.
→ సంఖ్యలోని ప్రతి అంకె విలువ, అది సంఖ్యలోని స్థానంను బట్టి ఆధారపడి ఉంటుంది. కుడినుండి ఎడమకు జరిగిన అంకెస్థాన విలువ 10 రెట్లు పెరుగుతుంది.
→ స్థాన విలువల పట్టిక (లక్షల వరకు) :
→ సంఖ్యలను క్రమం అమర్చడం కూడా స్థాన విలువల ఆధారంగానే చేస్తాము. సంఖ్యలను ఆరోహణ క్రమం, అవరోహణ క్రమంలలో అమర్చుతారు.
→ ఆరోహణ క్రమం : సంఖ్యలను కనిష్ఠ సంఖ్య నుండి గరిష్ఠ సంఖ్యకు అమర్చడం.
ఉదాహరణ : 9, 576, 28, 106, 28, 116, 37, 596, 1,25,765
→ అవరోహణక్రమం : సంఖ్యలను గరిష్ఠ సంఖ్య నుండి కనిష్ఠ సంఖ్యకు అమర్చడం.
ఉదాహరణ : 1, 25, 765, 37, 596, 28, 116, 28, 106, 9,576
→ సంఖ్యామానం – పద్ధతులు :
- హిందూ సంఖ్యామానం
- అంతర్జాతీయ సంఖ్యామానం
పై రెండు పద్ధతులలోను సంఖ్యలను రాయడానికి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 మరియు 9 అనే అంకెలనే ఉపయోగిస్తారు.
→ హిందూ సంఖ్యామానం-స్థాన విలువల పట్టిక :
1 కోటి = 10 పది లక్షలు
= 100 లక్షలు
1000 పదివేలు
= 10,000 వేలు
= 1,00,000 వందలు
= 10,00,000 పదులు
= 1,00,00,000 ఒకట్లు
→ అంతర్జాతీయ సంఖ్యామానం – స్థాన విలువల పట్టిక :
హిందూ సంఖ్యామానం = అంతర్జాతీయ సంఖ్యామానం
- 1 లక్ష = 100 వేలు
- 10 లక్షలు, = 1 మిలియన్
- 1 కోటి = 10 మిలియన్లు
- 10 కోట్లు = 100 మిలియన్లు
- 100 కోట్లు = 1 బిలియన్
→ ఒక సంఖ్యను ఒక స్థానానికి సవరించడం లేదా అంచనా వేయడం ఆ సంఖ్యలోని కుడివైపుగల అంకె పై ఆధారపడి ఉంటుంది. ఒక సంఖ్యను పదులకు సవరించుటకు :
- ఒకట్ల స్థానంలోని అంకె 5 కన్నా తక్కువైనచో ఒకట్ల స్థానాన్ని సున్నతో పూరించండి. మిగతా అంకెలను అలాగే ఉంచండి.
ఉదా : 5,473 ను దగ్గరి పదులకు సవరించి 5,470గా రాస్తాము. - ఒకట్ల స్థానంలోని అంకె 5 లేదా 5 కన్నా ఎక్కువైన పదులస్థానంలోని అంకెకు ‘1’ కలిపి ఒకట్ల స్థానంలో ‘0’ను రాయాలి.
ఉదా : 5,637ను దగ్గరి పదులకు సవరించి 5, 640గా రాస్తాము.
→ ఒక సంఖ్యను వందలకు సవరించుటకు :
(i) పదుల స్థానంలోని అంకె 5 కన్నా తక్కువ అయినచో వందల స్థానంలోని అంకెను అలాగే ఉంచి, పదులు, ఒకట్ల స్థానంలోని అంకెల స్థానంలో ‘0’ను రాయాలి.
ఉదా : 64,329ని దగ్గరి వందలకు సవరించి 64,300గా రాస్తాము.
(ii) పదులస్థానంలో 5 గాని, 5 కన్నా ఎక్కువగాని ఉన్నచో వందలస్థానంలోని అంకెకు ‘1’ కలపాలి. పదులు, ఒకట్ల స్థానాలలో సున్నా రాయాలి.
ఉదా :
- 64,356ను దగ్గరి వందలకు సవరించి 64,400గా రాస్తాము.
- 64,365ను దగ్గరి వందలకు సవరించి 64,400 గా రాస్తాము.
→ చతుర్విద ప్రక్రియలైన సంకలనం (+), వ్యవకలనం (-), గుణకారం (×), భాగహారముల ఫలితాలను సవరించడం ద్వారా అంచనా వేయవచ్చును.
→ నీటి ప్రవాహాన్ని కొలవడానికి మనం క్యూసెక్ మరియు టి.యం. సిలను వాడతాం. ‘ క్యూసెక్ = క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్
= 28.316 లీటర్ల ప్రవాహం సెకనుకు ఒక వెయ్యి మిలియన్ క్యూబిక్ ఫీట్ = 1 టి.యం.సి.
= 2831.6 కోట్ల లీటర్లు.
→ బరువులను కొలవడానికి సాధారణంగా గ్రాము, కిలోగ్రాము, క్వింటాల్ లను ఉపయోగిస్తాము.
- 1 గ్రాం = 1 గ్రా.
- 1 కిలోగ్రాం = 1000 గ్రా.
- 1 క్వింటాలు = 100 కి.గ్రా. = 1,00,000 గ్రా.
- 1 టన్ను = 1000 కి.గ్రా. = 10,00,000 గ్రా.
- 1 మెగాటన్ను = 1,00,00,00,000 కి.గ్రా. = 10,00,00,00,00,000 గ్రా.
- 1 గిగాటన్ను = 10,00,00,00,00,000 కి.గ్రా. = 1,00,00,00,00,00,00,000 గ్రా.
→ పొడవులను కొలచుటకు మనం మిల్లీమీటరు (మి.మీ.), సెంటీమీటరు (సెం.మీ.), మీటరు (మీ.) మొదలగు ప్రమాణాలను ఉపయోగిస్తాము.
- 10 మిల్లీమీటర్లు = 1 సెం.మీ.
- 100 సెంటీమీటర్లు = 1 మీటరు
- 1000 మీటర్లు = 1 కి.మీ.
→ క్రింది పట్టికను గమనించి ఖాళీలను సరియైన సంఖ్యలతో పూరించి, అక్షరాలలో రాయండి. (జి నెం. 2) సందర్భం సంఖ్య.