AP 6th Class Maths Notes 7th Lesson బీజ గణిత పరిచయం

Students can go through AP Board 6th Class Maths Notes 7th Lesson బీజ గణిత పరిచయం to understand and remember the concept easily.

AP Board 6th Class Maths Notes 7th Lesson బీజ గణిత పరిచయం

→ చరరాశి : బీజగణితంలో మనం ప్రధానంగా తెలియని రాశులను బీజీయ అక్షరాలతో సూచిస్తాము. ఈ బీజీయ అక్షరాలను చరరాశులు అంటారు. ఈ చరరాశులను ఆంగ్ల అక్షరాలు l, m, n, p, q, x, y, Z, ………… లతో సూచిస్తాము.

→ చరరాశిని ఏదేని ఒక అక్షరంతో ఏదేని ఒక సంఖ్య కోసం ఉపయోగిస్తారు.

→ చరరాశి వేర్వేరు సందర్భాలలో వేర్వేరు విలువలను కలిగి ఉంటుంది. చరరాశికి ఖచ్చితమైన విలువ ఉండదు అయితే ఇవి కూడా సంఖ్యలే.

→ సంఖ్యా పరిక్రియలైన సంకలనం (+), వ్యవకలనం(-), గుణకారం (×), భాగహారం (+) వీటికి కూడా వర్తిస్తాయి.

→ రేఖాగణితం, క్షేత్రమితి, అంకగణితమునకు సంబంధించిన సూత్రాలలో చరరాశులను ఉపయోగిస్తాము. ఉదా : దీర్ఘచతురస్ర వైశాల్యం A = l × b
ఇక్కడ A వైశాల్యానికి, దీర్ఘచతురస్ర పొడవుకు, పే దీర్ఘచతురస్ర వెడల్పుకు ప్రాతినిథ్యం వహిస్తాయి.

→ సామాన్య సమీకరణాలు : బీజగణితంలోని నిబంధనను సమానత్వ గుర్తును ఉపయోగించి రాయడాన్ని సమీకరణం అంటారు.

ఉదా :
(1) x కన్నా 4 పెద్దదైన సంఖ్య 6.
x + 4 = 6
(2) ఒక సంఖ్య యొక్క 3 రెట్లు 15 అవుతుంది. .
3x = 15

AP 6th Class Maths Notes 7th Lesson బీజ గణిత పరిచయం

→ సమీకరణానికి L.H.S మరియు R.H.S :
పై x + 4 = 6 అనే సమీకరణంలో మనం సమానత్వ గుర్తును చూడవచ్చును.
ఈ సమానత్వ గుర్తుకు ఎడమ చేతివైపు గల సమాసాన్ని LHS (Left Hand Side) అని, కుడిచేతివైపు గల సమాసాన్ని RHS (Right Hand Side) అని అంటారు. సమీకరణం అనగా LHS విలువ, RHS విలువ సమానం అయ్యేది. . . . . x + 4 = 6 లో LHS = x + 4
RHS = 6

→ ఏ చరరాశి విలువకు ఒక సమీకరణం యొక్క LHS మరియు RHS లు సమానం అగునో దానిని సమీకరణ సాధన అంటారు. దీనినే సమీకరణ మూలం అని కూడా అంటారు.
x + 4 = 6 లో x = 2 అయిన
2 + 4 = 6
6 = 6
L.H.S = R.H.S
కావున x + 4 = 6 యొక్క
సాధన (మూలం) x = 2