Students can go through AP Board 6th Class Social Notes 6th Lesson తొలి నాగరికతలు to understand and remember the concept easily.
AP Board 6th Class Social Notes 6th Lesson తొలి నాగరికతలు
→ 19వ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వేదకాలంలోనే ప్రారంభమైనదని విశ్వసించేవారు.
→ 1920 హరప్పా, మొహంజోదారో, ప్రాంతంలో జరిపిన తవ్వకాల వలన మనదేశ చరిత్ర రెండువేల సం॥రాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిసింది.
→ హరప్పా నాగరికత క్రీ.పూ. 2500-1700 సం||రాల మధ్య వికసించింది.
→ హరప్పా నాగరికత సుమారు 1500 ప్రదేశాలలో బయటపడింది.
→ హరప్పా నాగరికత కాలం నాటికి నగరాలన్నియు ప్రణాళికాబద్ధంగా నిర్మించబడినవి.
→ హరప్పా నగరంలో ఆరు పెద్ద ధాన్యాగారాలు మరియు కార్మికులకు నివాస సముదాయాలు కలవు.
→ లోథాల్ నగరంలో అతి పెద్ద నౌకాశ్రయం కలదు.
→ సింధు నాగరికత కాలంలో మంచి ప్రణాళికాబద్ధమైన భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ కలదు.
→ హరప్పా ప్రజలు ఎండిన మరియు బాగా కాల్చిన ఇటుకలతో ఇళ్ళు కట్టుకునేవారు.
→ పత్తి మరియు నూలు వస్త్రాలను నేయడం ఆ కాలంలలోని ప్రధాన వృత్తులు.
→ పత్తిని మొట్టమొదట పండించింది వీరే.
→ లోథాల్ నౌకాశ్రయం ద్వారా మెసపటోమియా, ఈజిప్టు మరియు ఇరాన్ దేశాలతో సింధూ ప్రజలు బాగా వ్యాపారం చేసేవారు.
→ వ్యవసాయం ప్రధాన వృత్తి. గోధుమ, బార్లీ, ఆముదాలు, బఠానీలు, కాయధాన్యాలు పండించేవారు.
→ నాట్యం, చదరంగం ఆడటం, సంగీతం, గోళీలు, పాచికలు ఆడటం సింధూ ప్రజల వినోదాలు.
→ సింధూ ప్రజలు పశుపతి (శివుడు) మరియు అమ్మతల్లిని పూజించేవారు.
→ స్వస్తిక్ (ఈ) గుర్తును సాధారణంగా ఉపయోగించేవారు.
→ సింధూ ప్రజల లిపిని ఇంతవరకు అర్థం చేసుకోలేకపోయారు.
→ ప్రామాణికమైన తూనికలను, కొలతలను మొట్టమొదట ఉపయోగించింది హరప్పా ప్రజలే.
→ ఆర్యుల దండయాత్రలు సింధూ నాగరికత పతనానికి కారణమనే సిద్ధాంతం కలదు. అయితే ‘మార్టిమర్ వీలర్’ అనే చరిత్రకారుడు దీనిని అంగీకరించలేదు.
→ ఆర్యుల పుట్టుపూర్వోత్తరాల గురించి అనేక సిద్ధాంతాలు కలవు.
→ వేద సాహిత్యము ఆవిర్భవించిన కాలాన్ని వేదకాలం అందురు.
→ ఆర్యుల నాగరికత సింధూ మరియు సరస్వతి నదీ మైదాన ప్రాంతాలలో వికసించింది.
→ ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం వేద సాహిత్యం.
→ సంస్కృత భాషలో వేదమనగా ఉన్నతమైన జ్ఞానం, ఆత్మజ్ఞానమే వేదము.
→ వేదాలను శృతులు అని కూడా అంటారు.
→ వేద సాహిత్యములో నాలుగు ప్రముఖ వేదాలు కలవు, అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము.
→ ఆధునిక కాలంలో స్వామి దయానంద సరస్వతి “వేదకాలానికే మరలా వెళ్ళాలి” అని పిలుపునిచ్చారు.
→ తొలి వేదకాలము క్రీ.పూ. 1500 – 1000 వరకు.
→ మలి వేదకాలము క్రీ.పూ. 1000 – 600 వరకు.
→ తొలి వేదకాలంలో సమాజానికి ప్రాథమిక అంగం కుటుంబం, తండ్రి కుటుంబానికి పెద్ద. తొలి వేదకాలంలో సమాజంలో స్త్రీలకు గౌరవం ఉండేది. స్త్రీలు వేదాధ్యాయనం చేసేవారు.
→ వాసా (ధోవతి) ఆదివాసా (శరీరము పై భాగానికి కప్పుకొనేది) ప్రస్తుతం మన వేషధారణను పోలి ఉండేవి.
→ మూడు రకాలైన సంగీత వాయిద్యాలు ఉపయోగించేవారు.
→ విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే గురుకులాలు ఉండేవి.
→ ఆర్యులు దేవుడు ఒక్కడే అని నమ్మేవారు.
→ తొలివేదకాలంలో ఎటువంటి వివక్షత లేదు.
→ ఆర్యుల తెగ నాయకుడిని ‘రాజన్’ అంటారు.
→ రాజుకు పరిపాలనా విషయములో సలహాలు ఇచ్చేందుకు ‘సభ’, ‘సమితి’ అను రెండు సభలు ఉండేవి.
→ మలివేదకాలంలో రాజు మరింత శక్తిమంతుడైనాడు, సభ, సమితులు తమ ప్రాధాన్యతను కోల్పోయాయి.
→ మలివేదకాలంలో ఆశ్రమ వ్యవస్థ, వర్ణవ్యవస్థ ప్రారంభమైనవి.
→ రామాయణం, మహాభారతం అనేవి రెండు భారతదేశ గొప్ప ఇతిహాసాలు.
→ రామాయణాన్ని ఆదికావ్యం అంటారు. దానిని సంస్కృతంలో వాల్మీకి రచించారు.
→ మహాభారతాన్ని వేదవ్యాసుడు రచించారు.
→ నాగరికత : మానవుని యొక్క సాంఘిక, సాంస్కృతిక రంగాలలో ఉన్నతమైన స్థితి.
→ ఉపఖండం : ఖండంలో ఉన్న విశాలమైన భాగం
→ వాణిజ్యం : వస్తువులు మరియు సేవల అమ్మకం మరియు కొనుగోలు చేసే ప్రక్రియ.
→ వేదాలు : హిందూ మత పవిత్ర గ్రంథాలు.
→ బ్రాహ్మణాలు : వేదాలపై విపులంగా చేసిన వ్యాఖ్యానాలు.
→ ఉపనిషత్తులు : హిందూ మతం యొక్క పవిత్ర గ్రంథాలు.
→ వస్తు మార్పిడి పద్ధతి : డబ్బుకు బదులు వస్తువులను పరస్పరం మార్చుకొనే విధానం.
→ అమ్మతల్లి : సింధూ ప్రజలు పూజించిన దేవత.
→ గొప్పస్నానవాటిక : ప్రజలు అందరూ స్నానాలు చేయడానికై విశాలమైన కొలను. ఇది మొహంజోదారోలో బయల్పడింది.
→ సరస్వతి నది : థార్ ఎడారిలో ఇంకిపోయిన నదినే సరస్వతి నది అంటారు. ఋగ్వేదంలో సరస్వతి నది గురించి పలుమార్లు ప్రస్తావించడం జరిగింది.
→ అరణ్యకాలు : విద్యావాదము, క్రతువులు, సంస్కారాల గురించి తెలియజేయునవి.
→ తొలి వేదకాలము : క్రీ.పూ. 1500 – 1000 వరకు
→ మలి వేదకాలము : క్రీ.పూ. 1000 – 600 వరకు
→ వాసా : వేదకాలంలోని ధోవతి (దుస్తులు)
→ ఆదివాసా : వేదకాలంలోని శరీరము పై భాగానిని కప్పుకొనేది.
→ రాజన్ : ఆర్యుల తెగ నాయకుడిని రాజన్ అంటారు.
→ సభ, సమితి : రాజుకు పరిపాలనా విషయములో సలహాలు ఇచ్చే రెండు సభలు.
→ సతీసహగమనం : భర్త మరణిస్తే అతనితో పాటు భార్యను కూడా చితిలో కాల్చడం.
→ బహుభార్యత్వము : ఒక మగవాడు ఒకరి కంటే ఎక్కువ భార్యలు కల్గి ఉండటం.
→ వేద కాలం : వేద సాహిత్యము ఆవిర్భవించిన కాలాన్ని వేదకాలం అందురు.
→ ఇతిహాసాలు : రామాయణం, మహాభారతం అనేవి భారతదేశ రెండు గొప్ప ఇతిహాసాలు.