Students can go through AP Board 8th Class Social Notes 22nd Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు to understand and remember the concept easily.
AP Board 8th Class Social Notes 22nd Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు
→ పూర్వకాలంలో నాటకాలే ప్రధాన వినోద మార్గాలుగా ఉండేవి.
→ తెలుగులో వరవిక్రయం, సత్యహరిశ్చంద్ర, కన్యాశుల్కం వంటి నాటకాలను సినిమాలుగా తీశారు.
→ మాటలు లేని సినిమాలను మూకీలని, మాటలున్న వాటిని టాకీలని అనేవారు.
→ తెలుగులో మొదటి మూకీ ‘భీష్మప్రతిజ్ఞు’, మొదటి టాకీ ‘భక్త ప్రహ్లాద’.
→ తెలుగు చిత్ర పరిశ్రమకు రఘుపతి వెంకయ్య ఆద్యుడు.
→ టెలివిజన్ రాకతో సినిమాలు చూడటానికి సినిమాహాళ్ళకి వెళ్ళవలసిన పని లేకుండా పోయింది.
→ అల్లూరి సీతారామరాజు సినిమా వ్యాపారపరంగా ఎంతో లాభాలు ఆర్జించింది.
→ శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రఖ్యాతి గాంచారు.
→ కొమురం భీం ఆదిలాబాదుకు చెందిన గోండు జాతి ఆదివాసి.
→ సమాజం సినిమాను, సినిమా సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
→ రాష్ట్రంలో 2000కు పైగా సినిమాహాళ్ళు ఉన్నాయి.
→ ముద్రణా మాధ్యమంలో దిన, వార, పక్షం, నెల పత్రికలు ఇంకా అనేక ఇతర పత్రికలు ఉన్నాయి.
→ తెలుగులో మొట్టమొదటి దినపత్రిక ‘కృష్ణా పత్రిక’.
→ బ్రిటిషు పాలనలో సంఘ సంస్కర్తలు సమాజంలో మార్పుల కోసం ఉద్యమించారు.
→ ప్రొజెక్టరు : ఒక తెరపై చిత్రాలను చూపించే స్లెలను ఉంచు పరికరం.
→ వ్యాఖ్యానం : వివరించి చెప్పుట
→ కంపోజ్ : ఏదైనా సంగీతానికి, పద్యానికి లేదా కవితకు సంబంధించి పూర్తిగా కళాత్మకంగా సృష్టించటం.
→ గెజెట్ : (ప్రభుత్వ) జర్నల్ లేదా వార్తాపత్రిక.
→ ప్రచురణ : ఏవేని అంశాలను పత్రికలలోకాని, ఇతర వాటిలో కాని ప్రచురించటం.