Students can go through AP Board 8th Class Social Notes 23rd Lesson క్రీడలు : జాతీయత, వాణిజ్యం to understand and remember the concept easily.
AP Board 8th Class Social Notes 23rd Lesson క్రీడలు : జాతీయత, వాణిజ్యం
→ ఆటలు అనేక కారణాల వలన ఆడతాం.
→ మన ఊరి ప్రజలు కబడ్డీ ఆడినట్లు ఒకప్పుడు ఇంగ్లాండులోని గ్రామస్తులు ఖాళీ మైదానాలలో క్రికెట్ ను ఆడేవాళ్ళు.
→ సాంప్రదాయ ఆటలకు ప్రజల నుంచి మద్దతు, ప్రోత్సాహం కరువయ్యాయి.
→ క్రికెట్ ను ఇంగ్లాండులో కనుగొన్నారు. బ్రిటిషు పాలిత దేశాలలో ఇది విస్తరించింది.
→ ఫుట్ బాల్, హాకీ వంటివి బృంద ఆటలు.
→ భారతీయులు ఆడిన క్రికెట్ బొంబాయిలో పుట్టింది. దీనిని మొదట చేపట్టినవారు పార్శీలు.
→ మొట్టమొదటి క్రికెట్టు క్లబ్ ను 1848లో బొంబాయిలో స్థాపించారు.
→ పార్శీ జింఖానా ఏర్పాటు భారతదేశంలో మతం ఆధారంగా జింఖానాలు ఏర్పరచింది.
→ 1970 దశకంలో క్రికెట్ మార్పులకు గురయ్యింది.
→ క్రికెట్ ను సొమ్ము చేసుకోగల ఆటగా, పెద్ద ఎత్తున ఆదాయాలు సమకూర్చే ఆటగా, ఆస్ట్రేలియన్ టీ.వీ సామ్రాట్టు అయిన కెర్రీ పాకర్ గుర్తింపు తెచ్చాడు.
→ భారతదేశంలో హాకీ కూడా జనాదరణ పొందింది.
→ క్రీడలు మానసిక వికాసంతో పాటు శారీరకాభివృద్ధిని పెంపొందిస్తాయి.
→ భిన్న సంస్కృతులు కలిగిన మన దేశానికి జాతీయ సమైక్యతను పెంపొందించడానికి క్రీడలు ఇతోధికంగా దోహదం చేస్తున్నాయి.
→ వలస పాలన (క్రీడ) : వలసపాలకుల ద్వారా మన దేశానికి వచ్చిన క్రీడ (క్రికెట్)
→ ప్రపంచ వాణిజ్యం : అంతర్జాతీయంగా జరిగే వాణిజ్యం.
→ జాతీయవాదం : నేను, నా దేశం ఒకే జాతి అనే భావన.
→ ప్రాయోజకులు : ఏదైనా ఒక కార్యక్రమాన్ని సమర్పించినవారు.