Students can go through AP Board 7th Class Science Notes 1st Lesson ఆహారంతో ఆరోగ్యం to understand and remember the concept easily.
AP Board 7th Class Science Notes 1st Lesson ఆహారంతో ఆరోగ్యం
→ మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజాలు. అదనంగా, ఆహారంలో పీచుపదార్థాలు మరియు మీరు కూడా ఉంటాయి.
→ కార్బోహైడ్రేట్లు మరియు క్రొవ్వులు ప్రధానంగా మన శరీరానికి శక్తిని అందిస్తాయి.
→ శరీరం యొక్క పెరుగుదల మరియు నిర్వహణ కొరకు ప్రోటీన్లు అవసరం.
→ ఖనిజాలు మరియు విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి.
→ సమతుల్య ఆహారం మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన పరిమాణంలో, తగినంత మొత్తంలో పీచుపదార్థాలు, నీటిని కూడా అందిస్తుంది.
→ మన ఆహారంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాల లోపం చాలాకాలం పాటు కొనసాగితే అది కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలకు కారణం కావచ్చు.
→ క్యాషియార్కర్, మరాస్మస్, రక్తహీనత, గాయిటర్, బెరిబెరి, స్కర్వీ, రికెట్స్ మొదలైనవి బాగా తెలిసిన పోషకాహారలోప వ్యాధులు.
→ ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు మరియు పరిశుభ్రత మన ఆరోగ్య సంరక్షణలో ప్రధాన పాత్ర వహిస్తాయి. డా జంక్ ఫుడ్ అనేక ఆరోగ్య రుగ్మతలకు కారణమవుతుంది. దీన్ని తప్పించాలి.
→ పిండిపదార్థాలు : ఇవి మన శరీరానికి శక్తిని ఇచ్చే ప్రధాన వనరులు. కాబట్టి వీటిని శక్తి పోషకాలు అంటారు. ఇవి మనం తీసుకొనే అనేక ఆహారపదార్థాలలో అధిక భాగాన్ని ఆక్రమిస్తాయి.
→ మాంసకృత్తులు : కండరాలు మరియు ఇతర శరీర అవయవాలు ఏర్పడటానికి అవసరమయ్యే పోషకాలు. కాబట్టి, వాటిని శరీర నిర్మాణ పోషకాలు అంటారు.
→ క్రొవ్వులు : మన శరీరానికి క్రొవ్వు ఇంధన వనరుగా ఉపయోగపడుతుంది. కాబట్టి క్రొవ్వులను శక్తిని ఇచ్చే పోషకాలు అని అంటారు.
→ పీచుపదార్థాలు : చిలగడ దుంపలో ఉండే దారాల వంటి పోగులను పీచుపదార్థాలు అంటారు. ఇవి జీర్ణవ్యవస్థలో ఆహార కదలికకు తోడ్పడి మలబద్దకాన్ని నివారిస్తాయి.
→ సమతుల ఆహారం : అన్ని పోషకాలు అవసరమైన పరిమాణంలో కలిగి ఉన్న ఆహారాన్ని సమతుల ఆహారం అంటారు. ఇది మన శరీరం సమర్థవంతంగా పనిచేయటానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.
→ విటమిన్లు : శరీరానికి అవసరమయ్యే సూక్ష్మపోషకాలు. ఇవి కొవ్వులలో కరిగే వాటిగాను, నీటిలో కరిగే వాటిగాను ఉంటాయి.
→ ఖనిజ లవణాలు . : శరీరానికి అవసరమయ్యే కాల్షియం, ఇనుము వంటి మూలకాలను ఖనిజ లవణాలు అంటారు.
→ మలబద్దకం : మల విసర్జనలోని అసౌకర్యాన్ని మలబద్దకం అంటారు. పీచుపదార్థాలను అధికంగా తీసుకోవటం వలన ఈ సమస్యను అధిగమించవచ్చు.
→ పోషకాహార లోపం : పోషకాల లోపం వలన మన శరీరం యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. శరీరంలో పోషకాలు లేకపోవడాన్ని పోషకాహార లోపం అంటారు.
→ ఊబకాయం : అధిక పోషకాలు తీసుకోవటం వలన బాగా లావుగా తయారుకావడాన్ని ఊబకాయం అంటారు.
→ జంక్ ఫుడ్ : పిజ్జా, బర్గర్స్, చిప్స్, ఫాస్టఫుడ్స్, నూడుల్స్, కూల్ డ్రింక్స్ మొదలైన వాటిని జంక్ ఫుడ్స్ అంటారు. ఇవి సులభంగా జీర్ణంకావు మరియు జీర్ణవ్యవస్లకు హానికరం.
→ న్యూనతా వ్యాధులు : పోషకాహార లోపం వలన కలిగే వ్యాధులను న్యూనతా వ్యాధులు అంటారు.
ఉదా : రేచీకటి.
→ గాయిటర్ : ఆహారంలో అయోడిన్ లోపం వలన అవటుగ్రంథి పరిమాణంలో పెద్దదిగా మారుతుంది. దీనిని గాయిటర్ అంటారు.
→ రక్తహీనత : శరీరంలో ఐరన్ తగ్గటం వలన రక్త ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనిని రక్తహీనత అంటారు.
→ స్కర్వి : విటమిన్-సి లోపం వలన చిగుళ్ళ నుండి రక్తం కారుతుంది. ఈ వ్యాధిని స్కర్వి అంటారు.
→ బెరిబెరి : విటమిన్-బి లోపం వలన కలిగే న్యూనతా వ్యాధి.
→ రికెట్స్ : విటమిన్-డి లోపం వలన ఎముకలు మెత్తబడి వంపు తిరుగుతాయి. ఈ వ్యాధిని ‘రికెట్స్’ అంటారు.
→ S.HIP : School Health Programme
→ N.D.D : National Deworming Day.