AP 7th Class Science Notes Chapter 10 మన చుట్టూ జరిగే మార్పులు

Students can go through AP Board 7th Class Science Notes 10th Lesson మన చుట్టూ జరిగే మార్పులు to understand and remember the concept easily.

AP Board 7th Class Science Notes 10th Lesson మన చుట్టూ జరిగే మార్పులు

→ సహజంగా జరుగుతున్న మార్పులు సహజ మార్పులు.

→ రాత్రి పగలు ఏర్పడటం, శిశువు వయోజనుడుగా మారటం సహజ మార్పులు.

→ మానవ ప్రమేయంతో జరిగే మార్పులు మానవ ప్రమేయ మార్పులు.

→ అన్నం వండుట, భవంతులు నిర్మించుట, లడ్డు తయారీ మానవ ప్రమేయ మార్పులు.

→ తక్కువ సమయం పట్టే మార్పులు వేగవంతమైన మార్పులు.

→ పేపర్ కాల్చుట, కేకు కోయుట, టపాసులు పేల్చటం వేగవంతమైన మార్పులు.

→ ఎక్కువ సమయం పట్టే మార్పులు నెమ్మదైన మార్పులు.

AP 7th Class Science Notes Chapter 10 మన చుట్టూ జరిగే మార్పులు

→ మొక్క వృక్షంగా మారటం, ఇనుము తుప్పు పట్టటం నెమ్మదైన మార్పులు.

→ కొత్తగా ఏర్పడిన పదార్థం తిరిగి మొదటి పదార్థంగా మార్పు చెందే విధానాన్ని ద్విగత మార్పు అంటారు.

→ మంచునీరుగా మారడం, నీరు ఆవిరిగా మారడం ద్విగత మార్పు.

→ ప్రయోగపరిస్థితులు మార్చినప్పుడు తిరిగి మొదటి పదార్థాన్ని పొందలేనటువంటి మార్పులను అద్విగత మార్పులు అంటారు.

→ పండ్లు పక్వానికి రావడం అద్విగత మార్పు.

→ నిర్ణీత సమయంలో పునరావృతమయ్యే మార్పులను ఆవర్తన మార్పులు అంటారు.

→ క్రమానుగతంగా జరగని మార్పులను మరియు అంచనా వేయలేని మార్పులను అనావర్తన మార్పులు అంటారు.

→ రాత్రి పగలు ఏర్పడడం, ఋతువులు మారడం ఆవర్తన మార్పులు.

→ పూలు పండ్లుగా మారడం, పాలు పెరుగుగా మారడం ఉపయోగకరమైన మార్పులు.

→ ఒక పదార్థం యొక్క పరిమాణం, రంగు మరియు ఆకారంలో మాత్రమే మార్పు జరిగి పదార్థ సంఘటనలో మార్పు జరగని మార్పుని భౌతిక మార్పు అంటారు.

→ వేడిచేసి ద్రావణాల నుంచి కరిగిన ఘన పదార్థాలను వేరుచేసే ప్రక్రియను స్పటికీకరణ అంటారు.

→ పదార్ధ సంఘటనలో మార్పు జరిగి క్రొత్త పదార్ధం ఏర్పడే మార్పును రసాయనిక మార్పు అంటారు.
ఇనుము తుప్పు పట్టడం : ఇనుము + గాలిలోని ఆక్సిజన్ + తేమ → తుప్పు (ఐరన్ ఆక్సైడ్)

AP 7th Class Science Notes Chapter 10 మన చుట్టూ జరిగే మార్పులు

→ ఒక లోహంపై జింక్ పూత పూయడాన్ని గాల్వనీకరణం అంటారు.

→ గాల్వనీకరణ ప్రక్రియ ద్వారా లోహాలు తుప్పుపట్టకుండా నిరోధించవచ్చు.

→ గాల్వనీకరణ ప్రక్రియకు క్రోమియం లేదా జింక్ వాడతాము.

→ పదార్థాలు ఆక్సిజన్ తో చర్య పొందడాన్ని ఆక్సీకరణము అంటారు.

→ కూరగాయలను కత్తిరించినపుడు ఇవి ఆక్సీకరణం చెంది రంగు మారతాయి.

→ కొన్ని రకాల మార్పులు పర్యావరణంపై తీవ్ర దుష్ఫలితాలు ఏర్పరుస్తున్నాయి.

→ గ్లోబల్ వార్మింగ్, ఆమ్లవర్షాలు, ఆయిల్‌ కు వంటివి పర్యావరణంలోని హానికర ఫలితాలు.

→ ప్లాస్టిక్ పర్యావరణానికి పెనుప్రమాదంగా మారింది. ”

→ మనం చేసే పనులు ప్రకృతికి, మానవాళికి హాని లేకుండా చూచుకోవాలి.

→ ద్విగత మార్పు : కొత్తగా ఏర్పడిన పదార్థం తిరిగి మొదటి పదార్థంగా మారుటను ద్విగత మార్పు అంటారు.
ఉదా : మైనం కరుగుట.

→ అద్విగత మార్పు : కొత్తగా ఏర్పడిన పదార్థం తిరిగి మొదటి పదార్థంగా మారకపోతే అటువంటి చర్యలను అద్విగత మార్పు అంటారు.
ఉదా : పేపరును మండించటం.

AP 7th Class Science Notes Chapter 10 మన చుట్టూ జరిగే మార్పులు

→ ఆవర్తన మార్పు : ఒక నిర్ణీత సమయంలో పునరావృతం అయ్యే మార్పులను ఆవర్తన మార్పులు అంటారు.
ఉదా : సూర్యోదయం.

→ అనావర్తన మార్పు : నిర్ణీత సమయంలో పునరావృతం కాని మార్పులను అనావర్తన మార్పు అంటారు.
ఉదా : గోడకు సున్నం వేయటం.

→ భౌతిక మార్పు : ఒక పదార్థం యొక్క పరిమాణం, రంగు మరియు ఆకారాలలో మాత్రమే మార్పు జరిగి పదార్థ సంఘటనలో మార్పు జరగకపోతే వాటిని భౌతిక మార్పు అంటారు.
ఉదా : మంచు కరగటం

→ స్పటికీకరణ : వేడి చేసి ద్రావణాల నుంచి కరిగిన ఘన పదార్థాలను వేరు చేసే ప్రక్రియను స్పటికీకరణ అంటారు.

→ రసాయన మార్పు : పదార్థ సంఘటనలో మార్పు జరిగి, క్రొత్త పదార్థం ఏర్పడే మార్పులను ‘రసాయనిక మార్పు’ అంటారు.

→ గాల్వనీకరణం : ఒక లోహంపై జింక్ లేదా క్రోమియం పూత వేయడాన్ని గాల్వనీకరణం అంటారు. ఈ ప్రక్రియ లోహాన్ని వాతావరణం నుండి రక్షిస్తుంది.

AP 7th Class Science Notes Chapter 10 మన చుట్టూ జరిగే మార్పులు

→ తుప్పు పట్టడం : లోహాలు వాతావరణంలోని ఆక్సిజన్తో చర్యపొంది లోహపు ఆక్సైడు ఏర్పర్చడాన్ని తుప్పు పట్టడం అంటారు. దీనిని ప్రధానంగా ఇనుములో గమనించవచ్చు.

→ గ్లోబల్ వార్మింగ్ : వాయు కాలుష్యం వలన భూ ఉష్ణోగ్రత పెరగడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. దీనికి ప్రధానంగా CO2, CO లు కారణమౌతున్నాయి.

AP 7th Class Science Notes Chapter 10 మన చుట్టూ జరిగే మార్పులు 1