AP 7th Class Science Notes Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి

Students can go through AP Board 7th Class Science Notes 9th Lesson ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి to understand and remember the concept easily.

AP Board 7th Class Science Notes 9th Lesson ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి

→ వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రవహించే ఒక శక్తి స్వరూపమే ఉష్ణం.

→ వెచ్చదనం లేదా చల్లదనం యొక్క స్థాయిని ఉష్ణోగ్రత అని అంటారు.

→ ఉష్ణోగ్రతను డిగ్రీ సెల్సియస్, డిగ్రీ ఫారన్ హీట్ లేదా కెల్విన్ ప్రమాణములో, థర్మామీటర్ అనే పరికరాన్ని ఉపయోగించి కొలుస్తారు.

→ ఉష్ణోగ్రత యొక్క SI ప్రమాణం కెల్విన్ (K).

→ సెల్సియస్ లేదా సెంటీగ్రేడ్ ను °C అని రాస్తారు.
ఉదా : 20°C.

→ ఫారన్ హీటు °F అని రాస్తారు. ఉదా : 45°F

→ కెల్వినను K గా రాస్తారు. ఉదా : 100 K.

AP 7th Class Science Notes Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి

→ ఉష్ణాన్ని తమగుండా ప్రసరింపచేయగల పదార్థ స్వభావాన్ని ‘ఉష్ణవాహకత్వం’ అంటారు.

→ ఉష్ణవాహకత్వం ఆధారంగా పదార్థాలు రెండు రకాలు అవి : 1) ఉత్తమ ఉష్ణవాహకాలు 2) అధమ ఉష్ణ వాహకాలు (బంధకాలు)

→ తమగుండా ఉష్ణాన్ని ప్రసరింపచేసే పదార్థాలను ఉత్తమ ఉష్ణ వాహకాలు అని అంటారు. ఉదాహరణకు అల్యూమినియం, ఇనుము, రాగి మొదలైనవి.

→ తమగుండా ఉష్ణాన్ని సులభంగా ప్రసరింపచేయనివ్వని పదార్థాలను అధమ ఉష్ణ వాహకాలు లేదా ఉష్ణబంధకాలు అంటారు.
ఉదా : నీరు, గాలి, బట్టలు, గాజు, కార్క్ ప్లాస్టిక్.

→ ఉష్ణం మూడు విధానాల్లో బదిలీ చేయబడుతుంది. అవి

  1. ఉష్ణవహనం,
  2. ఉష్ణ సంవహనం
  3. ఉష్ణవికిరణం

→ వాహకం ద్వారా వేడి కొన నుండి చల్లని కొన వైపు ఉష్ణం బదిలీ చేసే ప్రక్రియను ఉష్ణవహనం అని అంటారు.

→ అణువుల చలనం ద్వారా ఉష్ణజనకం నుంచి ఉపరితలానికి ఉష్ణాన్ని బదిలీ చేసే ప్రక్రియను ఉష్ణసంవహనం అని అంటారు.

→ ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ఉష్ణబదిలీకి దోహదపడే ఇటువంటి పదార్థాలను యానకాలు అని అంటారు.

→ ఉష్ణం తరంగాల రూపంలో బదిలీ చేయబడే ప్రక్రియను “ఉష్ణ వికిరణం” అంటారు.

→ సిక్స్ యొక్క గరిష్ట మరియు కనిష్ట ఉష్ణమాపకమును ఒక రోజులో ఒక ప్రాంతం యొక్క గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలను లెక్కించడానికి ఉపయోగిస్తారు.

→ మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 37°C (98.4 °F).

→ వేడి చేసినప్పుడు గాలి వ్యాకోచిస్తుంది. ఫలితంగా ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి, తేలిక అవుతుంది. అందువల్ల చల్లని గాలి కంటే వేడి గాలి తేలికగా ఉంటుంది.

AP 7th Class Science Notes Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి

→ ఏదైనా ఉపరితలంపై గాలి ద్వారా ప్రయోగించబడే బలాన్ని గాలి పీడనం అంటారు.

→ గాలిపీడనాన్ని భారమితితో కొలుస్తారు.

→ వర్షపాతాన్ని రెయిన్ గేజ్ ఉపయోగించి మిల్లీమీటర్లలో కొలుస్తారు.

→ ఉష్ణోగ్రత, గాలిపీడనం, వర్షపాతం, గాలివేగం, ఆర్ధతను వాతావరణం యొక్క కొలవగలిగిన అంశాలు అంటారు.

→ గాలిలో ఉండే నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ధత అంటారు.

→ గాలి ఆర్ధతను కొలవడానికి హైగ్రోమీటర్ ఉపయోగిస్తారు.

→ అధిక ఉష్ణోగ్రత కారణంగా శరీరం ఎక్కువ నీరు కోల్పోవడాన్ని వడదెబ్బ అంటారు.

→ వడదెబ్బ తగిలిన వ్యక్తిని నీడలోనికి తీసుకెళ్ళి, నీటిని తాగించాలి.

→ మన పరిసరాలలో రోజువారి కలిగే గాలిలోని మార్పులను వాతావరణం అంటారు. దీనిలో ఉష్ణోగ్రత, అర్థత, వర్షపాతం వంటి అంశాలు ఉంటాయి.

→ గాలి పీడనాన్ని బారోమీటర్తో కొలుస్తారు.

→ వాతావరణ నివేదిక శాఖ వాతావరణ నివేదికలు రూపొందిస్తుంది. ఇది వర్షాలు, తుఫానుల వంటి ప్రమాదాల గురించి ముందస్తుగా హెచ్చరిస్తుంది.

→ వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రవేత్తలను ‘మెట్రాలజిస్టులు’ అంటారు.

→ 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం యొక్క సగటు వాతావరణ నమూనాను ఆ ప్రదేశం యొక్క “శీతోష్ణస్థితి” అంటారు.

AP 7th Class Science Notes Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి

→ శీతోష్ణస్థితి వాతావరణం కంటే భిన్నమైనది. ఇది దీర్ఘకాలిక వాతావరణ సగటు అంచనా.

→ భారతీయ వాతావరణ విభాగం (IMD) మన దేశ శీతోష్ణస్థితిపై అధ్యయనం చేస్తుంది.

→ శీతోష్ణస్థితి యొక్క కొలవగలిగే అంశాలలో అసాధారణ వైవిధ్యాన్ని “శీతోష్ణస్థితి మార్పు” అంటారు.

→ మార్చి 23న ప్రపంచ వాతావరణ దినోత్సవంగా జరుపుకుంటారు.

→ ఉష్ణము : వేడి వస్తువు నుండి చల్లని, వస్తువుకు ప్రవహించే ఒక శక్తి స్వరూపం.

→ ఉష్ణోగ్రత : వెచ్చదనం లేదా చల్లదనం యొక్క స్థాయిని ఉష్ణోగ్రత అంటారు.

→ డిగ్రీ సెల్సియస్ : ఇది ఉష్ణోగ్రత యొక్క ప్రమాణం. దీనిని ‘°C’ గా సూచిస్తారు. సాధారణ శరీర ఉష్ణోగ్రత 36.9°గా ఉంటుంది.

→ ఫారన్ హీట్ : ఉష్ణోగ్రత యొక్క మరొక ప్రమాణం ఫారన్‌హీట్. దీనిని °F గా సూచిస్తారు. సాధారణ శరీర ఉష్ణోగ్రత 98.4 °F గా ఉంటుంది.

→ కెల్విన్ : ఉష్ణోగ్రత యొక్క SI ప్రమాణం కెల్విన్. దీనిని K తో సూచిస్తారు. సాధారణ శరీర ఉష్ణోగ్రత కెల్విన్‌గా ఉంటుంది.

→ ఉత్తమ వాహకాలు : తమగుండా ఉష్టాన్ని ప్రసరింపజేసే పదార్థాలను ఉత్తమ ఉష్ణవాహకాలు అంటారు.
ఉదా : అల్యూమినియం, ఇనుము, రాగి మొదలైనవి.

→ అధమ వాహకాలు : తమగుండా ఉష్ణాన్ని సులభంగా ప్రసరింపజేయని పదార్థాలను అధమ ఉష్ణవాహకాలు లేదా ఉష్ణ బంధకాలు అంటారు.
ఉదా : గాజు, చెక్క ప్లాస్టిక్.

→ ఉష్ణ వహనం : వాహకం వేడి కొన నుండి చల్లని కొన వైపు ఉష్ణం బదిలీ చేసే ప్రక్రియను ఉష్ణవహనం అంటారు. ఎక్కువగా ఘనరూప వాహకాలలో ఇటువంటి ఉష్ణప్రసరణ ఉంటుంది.

→ ఉష్ణ సంవహనం : కణాల చలనం ద్వారా ఉష్ణజనకం నుండి ఉపరితలానికి బదిలీ చేసే ప్రక్రియను ఉష్ణసంవహనం అంటారు. ఇక్కడ ఉష్ణం సంవహన ప్రవాహాలు అని పిలువబడే ప్రవాహాల ద్వారా బదిలీ చేయబడుతుంది. ద్రవాలు మరియు వాయువులలో ఉష్ణము, సంవహన పద్ధతిలో ప్రసారమవుతుంది.

→ ఉష్ణ వికిరణం : ఉష్ణం తరంగాల రూపంలో బదిలీ చేయబడే ప్రక్రియను “ఉష్ణవికిరణం’ అంటారు. ఈ పద్దతిలో యానకం అవసరం లేదు. సూర్యుని నుండి ఉష్ణం భూమికి వికిరణ రూపంలోనే చేరుతుంది.

→ వ్యాకోచం : వేడి చేయటం వలన పదార్థ పరిమాణంలో వచ్చే పెరుగుదలను వ్యాకోచం అంటారు. ఈ సంకోచం : వేడిని కోల్పోవటం వలన వ్యాకోచించిన పదార్థం యథాస్థాయికి చేరడాన్ని సంకోచం అంటారు.

→ ఉష్ణమాపకం : ఉష్ణోగ్రతను కొలవటానికి ఉపయోగించే పరికరాన్ని ఉష్ణమాపకం అంటారు. ఇది వివిధ డిగ్రీ స్కేలును కల్గి ఉండవచ్చు.

→ గాలి పీడనం : వస్తువుల తలాలపై గాలి కలిగించే ఒత్తిడిని గాలి పీడనం అంటారు. సాధారణ గాలి పీడనం విలువ 76 cm.

AP 7th Class Science Notes Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి

→ వాతావరణం యొక్క కొలవగలిగే అంశాలు : వాతావరణానికి సంబంధించిన అనేక అంశాలను మనం కొలవగలము. అవి అత్యధిక ఉష్ణోగ్రత, అత్యల్ప ఉష్ణోగ్రత, ఆర్ధత, వర్షపాతం, గాలి వేగం మొదలైనవి.

→ వాతావరణం : ఉష్ణోగ్రత, ఆర్ధత, వర్షపాతం, గాలివేగం లాంటి అంశాలలో రోజువారీ కలిగే మార్పులను వాతావరణం అంటారు. ఇది మారుతూనే ఉంటుంది. ఈ మార్పులు చాలా త్వరగా జరుగుతాయి.

→ ఆర్థత : గాలిలో ఉన్న నీటి ఆవిరి పరిమాణాన్ని అర్థత అంటారు. దీనిని హైగ్రోమీటర్ అనే పరికరంతో కొలుస్తారు.

→ శీతోష్ణస్థితి : 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువకాలం యొక్క సగటు వాతావరణ నమూనాను ఆ ప్రదేశం యొక్క ‘శీతోష్ణస్థితి’ అంటారు.

AP 7th Class Science Notes Chapter 9 ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి 1