AP 7th Class Science Notes Chapter 7 మొక్కలలో ప్రత్యుత్పత్తి

Students can go through AP Board 7th Class Science Notes 7th Lesson మొక్కలలో ప్రత్యుత్పత్తి to understand and remember the concept easily.

AP Board 7th Class Science Notes 7th Lesson మొక్కలలో ప్రత్యుత్పత్తి

→ తమలాంటి కొత్త జీవుల్ని ఉత్పత్తి చేయడాన్ని, సంఖ్యను పెంచడాన్ని ప్రత్యుత్పత్తి అంటారు.

→ మొక్కలలో విత్తనాలతో జరిగే ప్రత్యుత్పత్తిని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు.

→ మొక్కలలో విత్తనాల ప్రమేయం లేకుండా జరిగే ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు.

→ అలైంగిక ప్రత్యుత్పత్తిలో శాఖీయోత్పత్తి ఒకటి.

→ కృత్రిమ శాఖీయోత్పత్తి పద్ధతులలో నేలంటు, అంటుకట్టడం ముఖ్యమైనవి.

→ పుష్పం అనేది మొక్క యొక్క లైంగిక భాగం.

→ పుష్పభాగములు పుష్పములో నాలుగు వలయాలుగా అమర్చబడి ఉంటాయి. అవి రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి, అండకోశం.

AP 7th Class Science Notes Chapter 7 మొక్కలలో ప్రత్యుత్పత్తి

→ కేసరావళి పుష్పంలోని పురుష ప్రత్యుత్పత్తి భాగం. అండకోశం పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం.

→ నాలుగు వలయాలూ ఉన్న పుష్పాలను సంపూర్ణ పుష్పాలు అంటారు.

→ నాలుగు వలయాలలో ఏదైనా వలయం లేని పుష్పాలను అసంపూర్ణ పుష్పాలు అంటారు.

→ సాధారణంగా కేసరావళి, అండకోశం చాలా మొక్కల్లో ఒకే పుష్పంలో ఉంటాయి. ఈ రకమైన పుష్పాలను ద్విలింగ పుష్పాలు అంటారు.

→ కానీ కొన్ని పుష్పాలలో కేసరావళి కాని లేదా అండకోశం కాని ఉంటాయి. ఈ రకమైన పుష్పాలను ఏకలింగ పుష్పాలు అని అంటారు.

→ కేసరావళి మాత్రమే ఉండే ఏకలింగ పుష్పాలను మగ పుష్పాలు అంటారు.

→ అండకోశం మాత్రమే ఉండే ఏకలింగ పుష్పాలను స్త్రీ పుష్పాలు అంటారు.

→ పరాగరేణువులను పరాగకోశాల నుండి కీలాగ్రానికి బదిలీ చేసే ప్రక్రియను పరాగ సంపర్కం అంటారు.
A) పరాగరేణువులు ఒకే పుష్పంలోని పరాగకోశం నుండి, అదే పుష్పంలోని కీలాగ్రానికి చేరినట్లయితే, దానిని స్వపరాగ సంపర్కం అంటారు.
B) ఒక పుష్పంలోని పరాగకోశం నుండి విడుదలైన పరాగరేణువులు మరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరినప్పుడు జరిగే పరాగ సంపర్కాన్ని ‘పరపరాగ సంపర్కం’ అంటారు.
C) ఫలదీకరణం తరువాత అండాశయం పెద్దదై ఫలంగా మారుతుంది.
D) అండాలు విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి.

→ విత్తన వ్యాప్తి అనే ప్రక్రియ మొక్కలు సహజంగా అనువైన ప్రదేశాలలో తమ సంతతిని అభివృద్ధి చేసే ప్రక్రియ.

AP 7th Class Science Notes Chapter 7 మొక్కలలో ప్రత్యుత్పత్తి

→ ప్రత్యుత్పత్తి : తమలాంటి కొత్త జీవుల్ని ఉత్పత్తి చేయడాన్ని ప్రత్యుత్పత్తి అంటారు.

→ శాఖీయ వ్యాప్తి : మొక్కలు శాఖీయ భాగాలైన వేరు, కాండం, పత్రం ద్వారా జరిగే వ్యాప్తిని శాఖీయ వ్యాప్తి అంటారు.

→ ఏకలింగ పుష్పాలు , : కొన్ని పూలలో కేసరావళి గాని లేదా అండకోశం కాని ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. ఇటువంటి పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు.
ఉదా : బొప్పాయి.

→ ద్విలింగ పుష్పాలు : సాధారణంగా కేసరావళి మరియు అండకోశం చాలా మొక్కలలో ఒకే పుష్పంలో ఉంటాయి. ఈ రకమైన పుష్పాలను ద్విలింగ పుష్పాలు అంటారు.
ఉదా : మందార.

→ కేసరాలు : మొక్కలలోని పురుష ప్రత్యుత్పత్తి అవయవాలను కేసరాలు అంటారు. ఇవి పుష్పంలోని మూడవ వలయం. సాధారణంగా పొడవుగా, మృదువుగా ఉండే నిర్మాణాలు.

→ అండకోశం : పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాన్ని అండకోశం అంటారు. ఇది సన్నని నాళం వంటి నిర్మాణము. దీనిలో అండాశయం, కీలం మరియు కీలాగ్రం అనే భాగాలు ఉంటాయి.

→ పరాగ కోశాలు : ప్రతి కేసరం పైన ఉబ్బిన పెట్టె వంటి నిర్మాణం ఉంటుంది. దీనినే పరాగకోశం అంటారు. దీనిలో పరాగ రేణువులు ఉత్పత్తి అవుతాయి.

→ పరాగ రేణువులు : మొక్కలలోని పురుష సంయోగ బీజాన్ని పరాగ రేణువులు అంటారు. ఇవి పరాగ కోశంలో ఉత్పత్తి అవుతాయి.

AP 7th Class Science Notes Chapter 7 మొక్కలలో ప్రత్యుత్పత్తి

→ అండాశయం : పుష్పాసనం (పైన ఉబ్బిన నిర్మాణాన్ని అండాశయం అంటారు. దీనిలో అండాలు ఉంటాయి.

→ ఫలదీకరణం : స్త్రీ, పురుష సంయోగ బీజాల కలయికను ఫలదీకరణ అంటారు.

→ సంయుక్తబీజం ఫలదీకరణ ఫలితంగా ఏర్పడే ద్వయస్థితిక కణాన్ని సంయుక్త బీజం అంటారు. ఇది మొక్కగా అభివృద్ధి చెందును.

→ విత్తనాల వ్యాప్తి : విత్తనాలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి విస్తరించటాన్ని విత్తన వ్యాప్తి అంటారు. ఇది మొక్కల మనుగడ అవకాశాన్ని పెంచుతుంది.

AP 7th Class Science Notes Chapter 7 మొక్కలలో ప్రత్యుత్పత్తి 1