Students can go through AP Board 7th Class Science Notes 6th Lesson విద్యుత్ to understand and remember the concept easily.
AP Board 7th Class Science Notes 6th Lesson విద్యుత్
→ విద్యుత్ ఘటం విద్యుత్తును జనింపచేసే వనరు.
→ విద్యుత్ ఘటం రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చుతుంది.
→ రెండు కానీ అంతకంటే ఎక్కువ ఘటాలు కలిసినప్పుడు బ్యాటరీ ఏర్పడును.
→ ఘటములను శ్రేణిలో కలపడం: ఒక ఘటము యొక్క ధనధృవమును, రెండవ ఘటము యొక్క ఋణ ధృవంతో కలుపుతారు.
→ ఘటములను సమాంతరంగా కలపడం: ధనధృవాలన్నీ ఒక బిందువు వద్ద, ఋణ ధృవాలన్ని మరొక బిందువు వద్ద కలుపుతారు.
→ బల్బులను శ్రేణి పద్ధతిలో కలిపినప్పుడు విద్యుత్ ప్రసరణ మార్గం ఒకటే ఉంటుంది. బల్బులను సమాంతరంగా కలిపినప్పుడు అనేక విద్యుత్ ప్రసరణ మార్గాలు ఉంటాయి.
→ విద్యుత్ వాహకంగుండా విద్యుతను ప్రసరింప చేసినప్పుడు ఉష్ణ ఫలితాలు మరియు అయస్కాంత ఫలితాలు ఏర్పడతాయి. ఈ విద్యుత్ ప్రవాహం కారణంగా ఉష్ణం జనించడాన్ని విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితము అంటారు. విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితమును హీటర్, ఇస్త్రీ పెట్టె, సోల్డరింగ్ చేసే గన్, కెటిల్, ఎలక్ట్రిక్ కుక్కర్ మొదలైన వాటిలో ఉపయోగిస్తారు.
→ విద్యుత్ తీగగుండా ప్రసరించినప్పుడు అది అయస్కాంతం వలే ప్రవర్తిస్తుంది. దీనిని విద్యుత్ యొక్క అయస్కాంత ఫలితము అంటారు.
→ 1 కిలో వాటి = 1000 వాట్లు.
→ ఘటం : రసాయనిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరం.
→ బల్బు : విద్యుత్ శక్తిని కాంతి శక్తిగా మార్చే వస్తువు.
→ బ్యాటరీ : విద్యుత్ ఘటాల కలయికను బ్యాటరీ అంటారు.
→ శ్రేణిపద్ధతి : విద్యుత్ వలయంలో బల్బులు లేదా బ్యాటరీలను ఒకదానితో ఒకటి వరుసగా కలిపే పద్ధతి.
→ సమాంతర పద్ధతి : విద్యుత్ వలయంలో పరికరాల ధనధృవాలను ఒక బిందువుకు, ఋణ ధృవాలను మరొక బిందువుకు కలిపే పద్ధతి.
→ ఉష్ణఫలితం : విద్యుత్ ప్రవహించటం ద్వారా ఉష్ణము జనించే ప్రక్రియను ఉష్ణఫలితం అంటారు.
ఉదా : నిక్రోమ్
→ అయస్కాంత ఫలితం : తీగెల ద్వారా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు దాని చుట్టు అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. దీనినే అయస్కాంత ఫలితం అంటారు.
→ విద్యుదయస్కాంతం : విద్యుత్ ప్రవాహం వలన అయస్కాంతాలుగా ప్రవర్తించే పరికరాలను విద్యుదయస్కాంతాలు అంటారు. ఈ ఫలితాన్ని విద్యుదయస్కాంతం అంటారు.
→ M.C.B : మినియేచర్ సర్క్యూట్ బ్రేకరు MCB అంటారు.. ఇది విద్యుత్ వలయంలో స్వయం నియంత్రిత స్విలా పని చేస్తుంది.
→ విద్యుఘాతము : ఒక వ్యక్తి శరీరం గుండా విద్యుత్ ప్రయాణించడాన్ని విద్యుఘాతము అంటారు.
→ ఫ్లోరెసెంట్ ట్యూబ్ : తక్కువ విద్యుత్ ను వాడుకొనే విద్యుత్ జనకం. సాధారణ బల్బువలె వీటిలో నిక్రోమ్ తీగ ఉండదు.
→ కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ (CFL) : అతి తక్కువ విద్యుత్ను వాడుకొనే ఆధునిక బల్బు. ఇది L.E.D లు కల్గి ఉంటుంది.