AP 7th Class Social Notes Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం

Students can go through AP Board 7th Class Social Notes 10th Lesson రాష్ట్ర ప్రభుత్వం to understand and remember the concept easily.

AP Board 7th Class Social Notes 10th Lesson రాష్ట్ర ప్రభుత్వం

→ భారతదేశంలో మనకు రెండు స్థాయిలలో ప్రభుత్వం ఉంది. ఒకటి కేంద్రంలో, మరొకటి రాష్ట్రంలో ఉంది.

→ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర పరిపాలనకు బాధ్యత వహిస్తుంది.

→ రాష్ట్ర ప్రభుత్వం మూడు అంగాల ద్వారా పరిపాలన నిర్వహిస్తుంది.
అవి

  1. శాసన నిర్మాణ శాఖ,
  2. కార్య నిర్వాహక శాఖ,
  3. న్యాయ శాఖ. గవర్నరు.

→ శాసనసభ మరియు శాసన మండలిలను కలిపి శాసన నిర్మాణ శాఖ అంటారు.

→ చట్టాలను తయారుచేయడం శాసన నిర్మాణ శాఖ యొక్క ప్రాథమిక విధి.

→ భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నరు ఉంటారు.

→ ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రి మండలి సిఫారసు మేరకు రాష్ట్రపతి అయిదు సంవత్సరాల పదవీ కాలానికి గవర్నర్ ని నియమిస్తారు.

→ ఆర్టికల్ 158 (33) ప్రకారం రెండు లేక ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్ గా నియమించవచ్చు.

AP 7th Class Social Notes Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం

→ అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది.

→ MLA – శాసన సభ సభ్యుడు.

→ MLC – శాసన మండలి సభ్యుడు.

→ శాసన మండలి పరోక్షంగా ఎన్నుకోబడిన వారితో పనిచేస్తుంది.

→ 6 సంవత్సరాల పదవీ కాలం ముగిసిన 1/3 వ వంతు సభ్యులు పదవీ విరమణ చేయగా కొత్త సభ్యులు ఎన్నికవుతారు.

→ ఆర్టికల్ 171 (1) ప్రకారం ఒక రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య, ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 1/4 వ వంతుకు మించరాదు.

→ 1/12 వ వంతు మంది సభ్యులు ఉపాధ్యాయులచే ఎన్నుకోబడతారు.

→ శాసన సభకు ఆర్థికపర అంశాలలో ఎక్కువ అధికారాలు కలవు.

→ గవర్నర్ రాష్ట్రానికి అధిపతి.

→ గవర్నర్ అనుమతి తర్వాత మాత్రమే అన్ని బిల్లులు చట్టంగా మారతాయి.

→ ఆర్టికల్ 163 (1) ప్రకారం గవర్నర్ తన విధులను నిర్వర్తించడంలో సహాయపడడానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి ఉండాలి.

→ ముఖ్యమంత్రి క్యాబినెట్ సభ్యులకు వివిధ మంత్రిత్వ శాఖలను కేటాయిస్తారు.

→ హైకోర్టు రాష్ట్ర స్థాయిలో అత్యున్నత న్యాయ విభాగం. రాష్ట్రంలోని చట్టాల అమలుకు బాధ్యత వహిస్తుంది.

→ భారత రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు, పదవీకాలం – 62 సంవత్సరాలు.

→ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధులు/అధికారాలు మూడు జాబితాలుగా విభజించబడ్డాయి.

  1. కేంద్ర జాబితా,
  2. రాష్ట్ర జాబితా,
  3. ఉమ్మడి జాబితా.

→ సాధారణంగా అధికార పక్షానికి చెందిన సభ్యుడు రాష్ట్ర శాసనసభ లేక శాసనమండలిలో బిల్లును ప్రవేశపెడతారు.

→ ఆర్థిక బిల్లును గవర్నరు ముందస్తు అనుమతి పొందిన తరువాత మాత్రమే శాసనసభలో ప్రవేశపెడతారు.

→ రెండు సభల ఆమోదం, గవర్నర్ ఆమోదం తెలిపి సంతకం చేసిన తరువాతనే బిల్లు చట్టంగా మారుతుంది.

→ చట్టాన్ని ‘గెజిట్’లో ప్రచురిస్తారు.

→ జిల్లా కలెక్టర్, జిల్లా పరిపాలనకు అధిపతి.

AP 7th Class Social Notes Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం

→ జిల్లా స్థాయిలో ఉన్న కోర్టును జిల్లా కోర్టు అంటారు.

→ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాలలో లోక్ అదాలత్ ఒకటి.

→ లోక్ అదాలత్ కు లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ – 1987 ప్రకారం- చట్టబద్ధమైన హోదా ఇవ్వబడింది.

→ తహసీల్దార్ మండల స్థాయిలో ముఖ్య పరిపాలనా కార్యనిర్వాహణాధికారి.

→ గ్రామ రెవెన్యూ అధికారి గ్రామ స్థాయి పరిపాలనలో ముఖ్య పరిపాలనా కార్యనిర్వాహక అధికారి.

→ ప్రభుత్వం : ప్రభుత్వం అనేది రాజ్యం యొక్క ఒక లక్షణం. ఒక చట్టపరమైన నిర్మితి లేదా వ్యవస్థ. వివిధ విభాగాలతో నిర్దేశింపబడిన అధికార విధులను ప్రభుత్వం కొనసాగిస్తుంది.

→ శాసన నిర్మాణ శాఖ : చట్టాలు శాసనాలను తయారు చేసే శాఖ.

→ కార్యనిర్వాహక శాఖ : చట్టాలను శాసనాలను అమలు చేయు శాఖ.

→ న్యాయశాఖ : ప్రభుత్వం చేసిన చట్టాలు శాసనాలను వ్యాఖ్యానించడంతో పాటు వాటిని పరిరక్షించడం, అమలుకు బాధ్యత వహించు శాఖ.

→ సాధారణ ఎన్నికలు : శాసన సభ(ల) పదవీ కాలం పూర్తయిన తరువాత ఎన్నిక కోసం నిర్వహించే ఎన్నికలు.

→ : ఇది శాసనపరమైన/చట్టపరమైన ప్రతిపాదనల ముసాయిదా.

→ MLA : శాసన సభ సభ్యుడు (Member of Legislative Assembly).

→ MLC : శాసన మండలి సభ్యుడు (Member of Legislative Council).

→ ఎన్నికల సంఘం : దేశంలో / రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించు రాజ్యాంగబద్ధ సంస్థ.

→ మెజారిటీ : ఎక్కువ ఓట్లు / సీట్లు వచ్చినవారు.

AP 7th Class Social Notes Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం

→ అధికార పార్టీ : ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభకు (చట్ట సభలకు) జరిగిన ఎన్నికల్లో మెజారిటి పొంది, అధికారం పొందిన పార్టీ.

→ ప్రతిపక్ష పార్టీ : రాజకీయంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువగానీ పార్టీలు అధికార పార్టీని వ్యతిరేకించే పార్టీలు.

→ సార్వత్రిక వయోజన ఓటు హక్కు : ఒక నిర్దిష్ట వయస్సు (18 సం||) నిండిన పౌరులందరికి ఏవిధమైన వివక్షత లేకుండా ఓటు హక్కు కల్పించడం.

→ రహస్య ఓటింగ్ విధానం : ఎన్నికల సమయంలో ఓటరు తను ఓటు వేసే విషయంలో గోప్యతను కల్గి ఉండటం.

→ లోక్ అదాలత్ : ప్రజా న్యాయ స్థానం, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగంలో ఒకటి.

→ సివిల్ వివాదాలు : వ్యక్తుల మధ్య ఒప్పందాలు/నియమాల ఉల్లంఘన వల్ల ఏర్పడే వివాదం.
ఉదా : భూ, ఆస్తి, విడాకులు, అద్దె మొదలైనవి.

→ క్రిమినల్ వివాదాలు : చట్ట ఉల్లంఘనకు పాల్పడితే పోలీసులు పెట్టే కేసులు. ఉదా : దొంగతనం, లంచం, హత్య, దోపిడీ, లంచాలు ఇవ్వటం మొదలైనవి.

→ మేజిస్టీరియల్ అధికారాలు : న్యాయ, శాంతి భద్రతలకు సంబంధించిన అధికారాలు.

→ సుప్రీం కోర్టు : దేశంలోని అత్యున్నత న్యాయస్థానం.

→ హైకోర్టు : రాష్ట్రంలోని అత్యున్నత న్యాయస్థానం.

→ జిల్లా కోర్టు : జిల్లా స్థాయిలో అత్యున్నత న్యాయస్థానం.

→ CPC : సివిల్ ప్రొసీజర్ కోడ్.

→ CrPC : క్రిమినల్ ప్రొసీజర్ కోడ్.

→ నియోజక వర్గం : ఒక ప్రాంత పరిధిలో నివసిస్తున్న ఓటర్లందరూ తమ ప్రతినిధులను ఎన్నుకునే ఒక నిర్దిష్ట ప్రాంతం.

→ ద్విసభా వ్యవస్థ : రెండు శాసనసభలతో కూడిన ప్రభుత్వాన్ని ద్విసభా వ్యవస్థ అంటారు.

→ గెజిట్ : ప్రభుత్వ చర్యలు మరియు నిర్ణయాలను తెలియజేసే అధికారిక ప్రచురణ.

→ సమన్స్ : సభ సభ్యులందరినీ సమావేశపరచటం.

→ ప్రోరోగ్ : సభను నిరవధికంగా వాయిదా వేయడం.

→ బ్యూరోక్రసి : ప్రభుత్వ ఉద్యోగులు కీలక విధాన నిర్ణేతలుగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థ.

AP 7th Class Social Notes Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం

→ సయోధ్య / రాజీ కుదుర్చుకోవడం : న్యాయస్థానాల ప్రమేయం లేకుండా మధ్యవర్తుల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడం.

→ సర్వే రాళ్ళు : భూ సరిహద్దులను నిర్ణయించడం కొరకు ఏర్పాటు చేయబడిన గుర్తులు.

→ మ్యానిఫెస్టో : ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ప్రకటించే హామీల పత్రం.

→ సమావేశపరచడం : శాసనసభ సభ్యులందరినీ సమావేశపరచడం.

→ సంకీర్ణం : ప్రభుత్వ ఏర్పాటు కోసం రాజకీయ పార్టీలు కలవడం.

AP 7th Class Social Notes Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం 1

1.
AP 7th Class Social Notes Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం 2

2.
AP 7th Class Social Notes Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం 3