AP 7th Class Social Notes Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం

Students can go through AP Board 7th Class Social Notes 9th Lesson భారత రాజ్యాంగం – పరిచయం to understand and remember the concept easily.

AP Board 7th Class Social Notes 9th Lesson భారత రాజ్యాంగం – పరిచయం

→ బ్రిటిషు పార్లమెంటు చేసిన చట్టాలలో, భారత ప్రభుత్వ చట్టం-1935 చాలా ముఖ్యమైన చట్టం.

→ 1928వ సంవత్సరంలో భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడానికి భారత జాతీయ కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఒక కమిటీని ఏర్పాటు చేసాయి.

→ ఈ కమిటీ చైర్మన్ గా మోతీలాల్ నెహ్రూ వ్యవహరించారు.

→ ఈ కమిటీ తన నివేదికను 1929వ సం||లో సమర్పించింది.

→ దీనిని నెహ్రూ నివేదిక అని పిలుస్తారు. ఇది మొదటి రాజ్యాంగపత్రంగా పరిగణించబడుతుంది.

→ 1931వ సం||లో, కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం స్వతంత్ర భారతదేశం యొక్క రాజ్యాంగం ఎలా ఉండాలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

→ నెహ్రూ నివేదిక మరియు కరాచీ తీర్మానం రెండూ సార్వత్రిక వయోజన ఓటు హక్కు స్వేచ్ఛ మరియు సమానత్వ హక్కుకు కట్టుబడి ఉన్నాయి.

AP 7th Class Social Notes Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం

→ భారత జాతీయ కాంగ్రెస్ ను 1885వ సంవత్సరంలో స్థాపించారు.

→ రాజ్యాంగాన్ని రూపొందించడానికి, ఎన్నుకోబడిన ప్రతినిధుల చేత ఏర్పడిన సభనే ‘రాజ్యాంగ సభ’ అంటారు.

→ 1946 కెబినేట్ మిషన్ ప్లాన్ ప్రకారం రాజ్యాంగ సభకు జూలై, 1946లో ఎన్నికలు జరిగాయి.

→ బ్రిటిషు పాలనలో ఉన్న రాష్ట్రాలు లేదా ప్రాంతాల నుండి 292 మంది సభ్యులను ఎన్నుకున్నారు.

→ స్వదేశీ సంస్థానాలు అన్ని కలిసి 93 మంది సభ్యులను సిఫార్సు చేసాయి.

→ ఢిల్లీ, అజ్మీర్ – మేవాడ్, కూర్గ్ మరియు బ్రిటిషు బెలూచిస్తాన్ నుండి నలుగురు సభ్యులను ఎన్నుకున్నారు.

→ దీంతో భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య 389కి చేరుకున్నది.

→ ఈ 389 మంది సభ్యులలో 26 మంది షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు, 9 మంది మహిళా సభ్యులు కలరు.

→ 1947 ఆగస్టులో దేశ విభజనతో రాజ్యాంగ సభను భారత రాజ్యాంగ సభ మరియు పాకిస్తాన్ రాజ్యాంగ సభగా విభజించారు.

→ భారత రాజ్యాంగ సభలో 299 మంది సభ్యులున్నారు.

→ డా|| బాబు రాజేంద్రప్రసాద్ రాజ్యాంగ సభ అధ్యక్షునిగా, తరువాత మొదటి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.

→ రెండోసారి రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి డా॥ బాబు రాజేంద్రప్రసాద్ (1950-1962).

→ 1947, ఆగస్టు 29న డా|| B.R. అంబేద్కర్ అద్యక్షతన, ఏడుగురు సభ్యులతో కూడిన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసారు.

→ ముసాయిదా రాజ్యాంగాన్ని తయారుచేసి 1948లో రాజ్యాంగ సభకు సమర్పించారు.

→ ముసాయిదా రాజ్యాంగంలో 315 ప్రకరణలు మరియు ‘8’ షెడ్యూలు ఉన్నాయి.

→ రాజ్యాంగ సభ చేత 1949, నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదించబడి, 1950, జనవరి 26న అమల్లోకి వచ్చింది.

→ డా|| బి. ఆర్. అంబేద్కరను “భారత రాజ్యాంగ పిత”గా అభివర్ణిస్తారు.

→ డా|| బి.ఆర్. అంబేద్కర్ 1947లో స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖామంత్రిగా నియమించబడ్డారు.

→ డా|| బి.ఆర్. అంబేద్కర్ 14 ఏప్రిల్, 1891న సెంట్రల్ ప్రావిన్సెస్లో జన్మించారు.

→ భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకొంటాము.

→ రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని తయారుచేయడానికి 2 సంవత్సరాల, 11 నెలల 18 రోజులు పట్టింది.

→ రాజ్యాంగం కలిగి ఉన్న ఉపోద్ఘాతమును ‘రాజ్యాంగ పీఠిక’ అంటారు.

→ 13 – 12 – 1946 న రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో జవహర్‌లాల్ నెహ్రూ “లక్ష్యాల తీర్మానం”ను ప్రతిపాదించాడు. ఇదే రాజ్యాంగ పీఠికకు మూల ఆధారం.

AP 7th Class Social Notes Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం

→ ‘సామ్యవాదం’, ‘లౌకిక’ పదాలు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో చేర్చబడ్డాయి.

→ హక్కులు అనేవి వ్యక్తుల సహేతుకమైన వాదనలు.

→ ప్రాథమిక హక్కులనేవి ఒక దేశం తన పౌరులను రక్షించడానికి రాజ్యాంగం ప్రకారం గుర్తించబడినవి.

→ భారత రాజ్యాంగంలో 3వ భాగంలో, ఆర్టికల్ 14 నుండి 32 వరకు ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నాయి.

→ సమానత్వపు హక్కు (ప్రకరణ 14-18) అంటరానితనం రద్దు, బిరుదులు రద్దు అనే అంశాలు కలవు.

→ స్వేచ్ఛా హక్కు (ప్రకరణ 19-22) ఆరు రకాలైన స్వేచ్చలకు హామీ ఇస్తుంది.

→ పీడనాన్ని నిరోధించే హక్కు (ప్రకరణ 23-24) వెట్టి చాకిరి, బాల కార్మిక వ్యవస్థను నిషేధిస్తుంది.

→ మత స్వాతంత్ర్యపు హక్కు (ప్రకరణ 25-28) మత వ్యవహారాల్లో ప్రభుత్వం తటస్థంగా ఉంటుంది.

→ విద్యా సాంస్కృతికపు హక్కు (ప్రకరణ 29-30) మత, భాషా ప్రాతిపదికన విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకునే హక్కు.

→ రాజ్యాంగ పరిహారపు హక్కు (ప్రకరణ 31-32) అన్ని ప్రాథమిక హక్కులను పరిరక్షించే హక్కు.

→ సమాచార హక్కు చట్టాన్ని (RTI) భారత పార్లమెంట్ 2005లో ఆమోదించింది.

→ 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత పార్లమెంట్ ఆమోదంతో రాజ్యాంగంలో విద్యను ప్రాథమిక హక్కుగా చెప్పే 21-A ప్రకరణను చేర్చారు.

→ బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని 2009లో భారత పార్లమెంటు ఆమోదించింది. ఈ చట్టం ఏప్రిల్ 1, 2010న అమల్లోకి వచ్చింది.

→ పౌరులందరి నైతిక బాధ్యతలుగా ‘విధులను’ నిర్వచించారు.

→ ప్రాథమిక విధులను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఎ, భాగం-43. లో పొందుపరిచారు.

→ ఈ ప్రాథమిక విధులు ‘రష్యా’ రాజ్యాంగం నుండి స్వీకరించబడ్డాయి.

→ విలువలు వ్యక్తుల ప్రవర్తనను నిర్ణయించే అంతర్గత ప్రమాణాలు. ఇవి మన చర్యలను ప్రేరేపిస్తాయి.

→ రాజ్యాంగం : దేశం యొక్క స్వభావం, ప్రభుత్వ రూపం, పౌరుల హక్కులు మరియు విధులను తెలియజేసే నిబంధనలతో కూడిన ప్రాథమిక చట్టం.

→ సర్వసత్తాక : బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం.

→ సామ్యవాదం : సమాజంలో సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ అసమానతలు తగ్గించడం ద్వారా సామాజిక న్యాయం అందించటం.

→ లౌకికవాదం : మత వ్యవహారాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా తటస్థంగా ఉండటం.

→ ప్రజాస్వామ్యం : ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులచే ప్రభుత్వం నడపబడటం.

→ గణతంత్ర వ్యవస్థ : రాజ్యా ధినేత ప్రతి ఎన్నికల ద్వారా ఎన్నుకోబడితే అది గణతంత్ర వ్యవస్థ.

→ ప్రకరణ : (అధికరణ) రాజ్యాంగంలోని ఒక నిర్దిష్ట అంశంపై నిర్దిష్ట నియమం లేదా సూత్రాన్ని సూచిస్తుంది.

→ భాగం : ఒక భావనకు సంబంధించిన ప్రకరణల సముదాయమును సూచిస్తుంది.

→ షెడ్యూలు : ప్రకరణలలో పేర్కొనబడని అదనపు సమాచారం లేదా వివరాలను సూచిస్తుంది.

→ ప్రాథమిక హక్కులు : ఒక దేశం తన పౌరులను రక్షించడానికి రాజ్యాంగం ప్రకారం గుర్తించబడినవి.

→ హక్కులు : వ్యక్తుల సహేతుకమైన వాదనలు.

→ విధులు : పౌరుల యొక్క నైతిక బాధ్యతలు

→ రాజ్యాంగ సభ : రాజ్యాంగాన్ని రూపొందించడానికి, ఎన్నుకోబడిన ప్రతినిధులచే ఏర్పడిన సభ.

→ ముసాయిదా కమిటి : ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేసే కమిటి. అంటే రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించక ముందు సభ సూచనలను గ్రంథస్తం చేయటం.

AP 7th Class Social Notes Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం

→ రాజ్యాంగ పీఠిక : రాజ్యాంగానికి ముందు మాట, ఉపోద్ఘాతం లాంటిది.

→ వయోజన ఓటు హక్కు : ఒక నిర్దిష్ట వయస్సు కల్గిన వారికి కల్పించే ఓటు హక్కు.

→ రాజ్యాంగ సవరణ : ఒక దేశ రాజ్యాంగాన్ని సవరించడం.

→ సౌభ్రాతృత్వం : సోదర భావంతో కలిసి ఉండటం.

→ ప్రావిన్స్ : బ్రిటిష్ పాలనలో, భారతదేశంలోని పరిపాలనా విభాగం.

→ స్వదేశీ సంస్థానం : ఇవి బ్రిటిష్ కాలంలో స్వదేశీ రాజ్యాలు.

→ పౌరుడు : ఒక రాష్ట్రం లేదా దేశంలో సభ్యుడు మరియు అక్కడ చట్టపరమైన హక్కులు ఉన్న వ్యక్తి.

→ పౌరసత్వం : ఒక నిర్దిష్ట దేశంలో పౌరుడికి ఉన్న స్థానం లేదా స్థితి.

→ సమాఖ్య : కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య అధికార పంపిణీ.

→ ద్వంద్వ ప్రభుత్వం : రెండు వ్యవస్థలకు పాలనాధికారం ఉన్న ప్రభుత్వ విధానం.

AP 7th Class Social Notes Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం 1

1.
AP 7th Class Social Notes Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం 2

2.
AP 7th Class Social Notes Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం 3

3.
AP 7th Class Social Notes Chapter 9 భారత రాజ్యాంగం – పరిచయం 4