AP 7th Class Social Notes Chapter 11 రహదారి భద్రత

Students can go through AP Board 7th Class Social Notes 11th Lesson రహదారి భద్రత to understand and remember the concept easily.

AP Board 7th Class Social Notes 11th Lesson రహదారి భద్రత

→ రహదారి ప్రమాదాలు అనగా ఏదైనా ఆకస్మిక సంఘటన వలన వాహనం లేదా ప్రయాణీకులు ప్రమాదవశాత్తు గాయపడటం లేదా మరణించడం మరియు భౌతిక ఆస్తులకు నష్టం కలగటం వంటివి.

→ నేటి ప్రపంచంలో రోడ్డు మరియు రవాణా ప్రతి మనిషి జీవితంలో అంతర్భాగంగా మారాయి.

→ ప్రస్తుత రవాణా వ్యవస్థ, దూరాలను తగ్గించింది కానీ మరోవైపు అది జీవితాలను ప్రమాదంలో పడవేసింది.

→ ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడం మరియు కోట్లాదిమంది తీవ్రమైన గాయాలపాలవడానికి కారణమవుతున్నాయి.

→ అవగాహనా రాహిత్యం మరియు అజాగ్రత్త వల్ల ప్రజలు ఎక్కువ ప్రమాదాలకు గురియగుచున్నారు.

→ భారతదేశంలోని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వశాఖ ప్రతి సంవత్సరం జనవరి నెలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తుంది.

→ రహదారులపై గేదెలు, మేకలు, గొర్రెలు వంటి జంతువులను యథేచ్ఛగా వదిలివేయుట. దమ్ము చక్రాలతో ట్రాక్టర్లను నడుపుట వంటివి రహదారి ప్రమాదాలకు కారణాలు.

AP 7th Class Social Notes Chapter 11 రహదారి భద్రత

→ ట్రాఫిక్ గుర్తులు 3 రకాలు :

  1. తప్పనిసరిగా పాటించవలసిన గుర్తులు,
  2. సమాచార గుర్తులు,
  3. హెచ్చరిక గుర్తులు.

→ తప్పనిసరిగా పాటించవలసిన గుర్తులు ఎర్ర వృత్తాలు ఏమి చేయకూడదో తెలుపుతాయి.

→ సమాచార గుర్తులు – నీలం రంగు దీర్ఘచతురస్రంలోని గుర్తులు తెలియజేస్తాయి.

→ హెచ్చరిక గుర్తులు – ముక్కోణం లోపల ఉన్న గుర్తులు హెచ్చరిస్తాయి.

→ ట్రాఫిక్ లైట్ రంగు సంకేతాలు – ఎరుపు – ఆగండి, ఆరెంజ్ – వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి; ఆకుపచ్చ – వాహనం ముందుకు వెళ్ళడానికి.

→ ఫుట్ పాత్, పాదచారుల ఉపయోగం కోసం రహదారికి ఇరువైపుల వేయబడింది.

→ ఒకే రహదారిపై ట్రాఫిక్ యొక్క రెండు దిశలను వేరు చేయడానికి రహదారిని రెండు భాగాలుగా విభజించారు. దీనిని రోడ్ డివైడర్ అంటారు.

→ జీబ్రా క్రాసింగ్ అంటే పాదచారులు రహదారిని సురక్షితంగా దాటే ప్రదేశం.

→ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం నేరం.

→ రహదారి భద్రత : రహదారి వాడకంలో వినియోగదారుల భద్రతను సూచిస్తుంది.

→ ఫుట్ పాత్ : రహదారికి ఇరువైపులా పాదచారులు నడవటానికి వీలుగా ఉండే దారి.

→ ఎరుపురంగు : గీత ముందు ఆగాలని సూచిస్తుంది.

→ ఆరెంజ్ రంగు : వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తుంది.

→ ఆకుపచ్చ రంగు : వాహనాన్ని కదిలించమని సూచిస్తుంది.

→ ట్రాఫిక్ విద్య : ట్రాఫిక్ నియమ నిబంధనలు సరళంగా, స్పష్టంగా తెలియజేయటం.

→ ట్రామా కేర్ : స్వల్ప లేక తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రులకు హాస్పిటల్ కి తీసుకువెళ్ళిన వెంటనే ఇచ్చే తక్షణ చికిత్స.

→ ప్రథమ చికిత్స : ప్రమాదానికి గురైన వ్యక్తికి పూర్తి వైద్య సహాయం అందేలోగా ఇచ్చే ప్రాథమిక వైద్యం.

→ రోడ్డు డివైడర్ : ఇది సిమెంట్ దిమ్మలతో లేదా పెయింట్ తో రోడ్డును రెండు లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా విభజించేది.

→ జీబ్రా క్రాసింగ్ : ఇవి రోడ్డుకు సమాంతరంగా చిత్రించిన ప్రత్యామ్నాయ నలుపు మరియు తెలుపు చారలు. సాధారణంగా వీటిని జీబ్రా క్రాసింగ్ అని పిలుస్తారు. ఇది పాదచారులు రోడ్డును ఒక వైపు నుండి మరొక వైపుకు దాటడానికి ఉద్దేశించబడింది.

→ రైల్వే క్రాసింగ్ : రహదారి, రైల్వే లైనను కలిసే ప్రదేశం.

AP 7th Class Social Notes Chapter 11 రహదారి భద్రత

→ ట్రాఫిక్ : వ్యక్తులు, వస్తువులు, వాహనాలు మరియు పాదచారులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పయనించేటప్పుడు ఏర్పడే రద్దీ.

→ పాదచారి : కాలి నడకన ప్రయాణించే వ్యక్తి.

→ రోడ్డు ప్రమాదం : ఒక వాహనం మరొక వాహనాన్ని లేదా వస్తువును ఢీ కొట్టడం.

→ కెర్బ్ డ్రిల్ : చిన్న పిల్లలు రహదారిని దాటుటకు ఆచరించాల్సిన పద్ధతి.

→ డ్రైవింగ్ లైసెన్స్ : వాహనాలను నడిపే నియమ నిబంధనలను పరిశీలించి ఇచ్చే అనుమతి పత్రం. వాహనదారులు దీనిని తప్పక పొందవలసి ఉంటుంది.

→ R.T.A. కార్యాలయం : Regional Transport Authority Office రీజనల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ అధికారి వారి కార్యాలయము.

AP 7th Class Social Notes Chapter 11 రహదారి భద్రత 1

AP 7th Class Social Notes Chapter 11 రహదారి భద్రత 2