Students can go through AP Board 7th Class Social Notes 12th Lesson మన పరిసరాలలో ఉన్న మార్కెట్లు to understand and remember the concept easily.
AP Board 7th Class Social Notes 12th Lesson మన పరిసరాలలో ఉన్న మార్కెట్లు
→ రద్దీగా ఉండే వ్యక్తులు, వివిధ రకాల వస్తువులు, పండ్లు, కూరగాయలు మరియు ఆ వస్తువులను కొనుగోలు చేసే వినియోగదారులు మరియు వాటిని విక్రయించే దుకాణాలు ఉండే ప్రాంతం.
→ పని చేసే విధానం ఆధారంగా మార్కెట్లను రెండు రకాలుగా విభజిస్తారు. అవి
- భౌతిక మార్కెట్లు,
- ఈ-మార్కెట్లు.
→ భౌతిక మార్కెటు అనేది కొనుగోలుదారులు, అమ్మకందారులు భౌతికంగా కలిసి వారికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసే ప్రాంతం.
→ అమ్మకందారులు మరియు కొనుగోలుదారులు స్థానికంగా ఒక నిర్ణీత ప్రాంతానికి పరిమితమైతే వాటిని స్థానిక మార్కెట్లు అంటారు.
→ స్థానిక మార్కెట్ల కంటే ఎక్కువ విస్తృతి కలిగి వుండి ఆయా ప్రాంతాలలో లేదా రాష్ట్రాల సముదాయంలో మాత్రమే లభించే వస్తువులను కలిగి వుండే మార్కెట్లను ప్రాంతీయ మార్కెట్లు అంటారు.
→ జాతీయ మార్కెట్ అనునది దేశంలోని అన్ని ప్రాంతాలలో వస్తువులు మరియు సేవల కోసం వర్తకం జరిగే మార్కెట్.
→ వివిధ దేశాల మధ్య జరిగే వస్తువులు మరియు సేవల వ్యాపారాన్ని అంతర్జాతీయ మార్కెట్ అంటారు.
→ రైతుబజార్లు జనవరి 1999లో ప్రారంభించబడినవి.
→ పట్టణ ప్రాంతాలలోని వివిధ అంతస్థులలోని దుకాణాలు, పెద్ద బహుళ అంతస్థుల ఎయిర్ కండీషన్డ్ భవనాలు. వీటినే షాపింగ్ మాల్స్ అంటారు.
→ పట్టణాలలో లేదా నగరాలలోని వివిధ ప్రాంతాలలో ఒకే ప్రాంగణంలో అన్ని రకాల వస్తువులను విక్రయించే దుకాణాలు ఉంటాయి. వీటిని షాపింగ్ కాంప్లెళ్లు అంటారు.
→ శ్రీనగర్‌లో ఫ్లోటింగ్ మార్కెట్లో అత్యంత సుందరమైన దాల్ సరస్సులో ఉ|| 5-7 వరకు కూరగాయల వ్యాపారం పడవల ద్వారా జరుగుతుంది.
→ ఈ పడవలను స్థానిక భాషలో ‘షికారా’ అంటారు.
→ మనం మన వద్ద వున్న చరవాణి ద్వారా లేదా అంతర్జాలంతో అనుసంధానమైన కంప్యూటర్ ద్వారా ఆదేశాలు ఇచ్చి మనకు నచ్చిన అనేక రకాలైన వస్తువులను ఇంటి నుండి బయటకు వెళ్ళకుండానే కొనుగోలు చేయవచ్చు. ఈ రకమైన మార్కెట్ ను ఈ-కామర్స్ లేదా ఆన్లైన్ మార్కెట్ అంటారు. ఎలక్ట్రానిక్ కామర్స్ లేదా ఈ-కామర్స్ అనునది ఒక వ్యాపార వేదిక.
→ వినియోగదారుడు అనగా తన వ్యక్తిగత ఉపయోగం కోసం లేదా స్వయం ఉపాధి ద్వారా తన జీవనోపాధిని సంపాదించుకోవడం కోసం, ఒక ఉత్పత్తిని కొనుగోలు చేసే లేదా ఒక సేవను వినియోగించుకొనే వ్యక్తి. వినియోగదారుని హక్కులను రక్షించడానికి రూపొందించిన చట్టాలను వినియోగదారుల రక్షణ చట్టాలు అంటారు.
→ వినియోగదారుల రక్షణ చట్టం ఆగస్టు 9, 2019న ఆమోదించబడింది.
→ వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమీషన్ (ఎన్.సి.డి. ఆర్.సి) 1988 లో స్థాపించబడినది.
→ ఎన్.సి.డి.ఆర్.సి ప్రధాన కార్యా లయం కొత్త ఢిల్లీలో ఉంది.
→ వినియోగదారుల హెల్ప్ లైన్ నంబర్ : నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-114000 లేదా 14404.
→ ప్రతి సంవత్సరం డిసెంబరు 24ను భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవంగా జరుపుకుంటారు.
→ మార్కెట్ : రద్దీగా ఉండే వ్యక్తులు, వివిధ రకాల వస్తువులు, పండ్లు, కూరగాయలు మరియు ఆ వస్తువులను కొనుగోలు చేసే వినియోగదారులు మరియు వాటిని విక్రయించే దుకాణాలు ఉండే ప్రాంతం.
→ భౌతిక మార్కెట్ : కొనుగోలుదారులు, అమ్మకందారులు భౌతికంగా కలిసి వారికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసే ప్రాంతం.
→ స్థానిక మార్కెట్లు : కొనుగోలుదారులు మరియు అమ్మకందారులు స్థానికంగా వస్తువులు ఉత్పత్తి అయ్యే ఒక నిర్ణీత ప్రాంతానికి పరిమితమైతే వాటిని స్థానిక మార్కెట్లు అంటారు.
→ ప్రాంతీయ మార్కెట్లు : స్థానిక మార్కెట్ల కంటే ఎక్కువ విస్తృతిని కలిగి ఉండి ఆయా ప్రాంతాలలో లేదా రాష్ట్రాల సముదాయంలో మాత్రమే లభించే వస్తువులను కల్గి ఉండే మార్కెట్లు.
→ జాతీయ మార్కెట్లు : జాతీయ మార్కెట్ అనునది దేశంలోని అన్ని ప్రాంతాలలో వస్తువులు మరియు సేవల కోసం వర్తకం జరిగే మార్కెట్. ఉదాహరణకు తీరప్రాంత రాష్ట్రాలలో లభించే చేపలను దేశవ్యాప్తంగా అమ్మడం.
→ అంతర్జాతీయ మార్కెట్లు : వివిధ దేశాల మధ్య జరిగే వస్తువులు మరియు సేవల వ్యాపారాన్ని అంతర్జాతీయ మార్కెట్ అంటారు.
→ పొరుగు మార్కెట్లు : మన ఇంటి పక్కన లేదా వీధి చివరలో కన్పించే దుకాణాలు.
→ వారాంతపు సంత : ప్రతి వారం ఒక నిర్దిష్టమైన రోజున ఉదయాన్నే ఏర్పాటు చేయబడి సాయంత్రం మూసివేయబడే మార్కెట్.
→ క్రెడిట్ కార్డు : ఋణ సౌలభ్యాన్ని వినియోగించుకొని వస్తువులు కొనుగోలు చేయుటకు ఆర్థిక సంస్థలు జారీ చేసే కారు.
→ రైతు బజారు : రైతులే నేరుగా వినియోగదారులకి తమ ఉత్పత్తులు అమ్ముకునే మార్కెట్.
→ షాపింగ్ మాల్స్ : పట్టణ ప్రాంతాలలోని వివిధ అంతస్థులలోని దుకాణాలు, పెద్ద బహుళ అంతస్థుల ఎయిర్ కండీషన్ భవనాలు.
→ ఈ షాపింగ్ కాంప్లెక్స్ : పట్టణాలు మరియు నగరాలలోని వివిధ ప్రాంతాలలో ఒకే ప్రాంగణంలో దాదాపు అన్ని రకాల వస్తువులను విక్రయించే దుకాణాలు.
→ ఫ్లోటింగ్ మార్కెట్ : నీటిలో తేలియాడే మార్కెట్స్.
→ వినియోగదారుల రక్షణ చట్టాలు : వినియోగదారుని హక్కులను రక్షించడానికి రూపొందించిన చట్టాలు.
→ ఉత్పత్తిదారుడు : ఆహారం, వస్తువులు లేదా సామగ్రిని తయారుచేసే ఒక వ్యక్తి, ఒక కంపెనీ లేదా ఒక దేశం.
→ కొనుగోలుదారు : వ్యాపార రీత్యా వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయువారు.
→ వ్యాపారి : కొనుగోలు మరియు విక్రయించే వ్యక్తి.
→ టోకు వర్తకుడు : వ్యక్తులకు లేదా సంస్థలకు పెద్ద మొత్తంలో వస్తువులు విక్రయించు వ్యక్తి లేదా సంస్థ.
→ చిల్లర వర్తకుడు : చిన్న మొత్తంలో ప్రజలకు వస్తువులు విక్రయించే వ్యక్తి లేదా వ్యాపారం.
→ వినియోగదారుడు వస్తువులను కొనుగోలు చేసే లేదా సేవలను వినియోగించుకునే వ్యక్తి.
→ క్రెడిట్ : కొనుగోలు చేసిన వస్తువులకు తరువాత చెల్లించే ఏర్పాటు.
→ వృత్తి : జీవనోపాధికై చేసే పని లేదా ఉద్యోగం.
→ సంస్థ : వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే యంత్రాంగం.
→ వేదిక : ప్రజల ఫిర్యాదులను విని తీసుకోవాల్సిన చర్యలను సూచించే న్యాయస్థానాలు.
→ అయోగ్యత : అనైతిక లేదా అన్యాయమైన.