AP 7th Class Social Notes Chapter 13 ప్రపంచ పరివర్తనలో మహిళలు

Students can go through AP Board 7th Class Social Notes 13th Lesson ప్రపంచ పరివర్తనలో మహిళలు to understand and remember the concept easily.

AP Board 7th Class Social Notes 13th Lesson ప్రపంచ పరివర్తనలో మహిళలు

→ భారతదేశంలో 83, 6% మంది శ్రామిక మహిళలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు.

→ మన సమాజంలో మగ పిల్లలకు ఇచ్చినంత ప్రాధాన్యత ఆడపిల్లలకు ఉండదు.

→ 2015లో బాలికల సర్వతోముఖాభివృద్ధికిగాను ‘బేటీ బచావో బేటీ పఢావో’ అనే కార్యక్రమం ప్రారంభించారు.

→ పాఠశాలకు వెళ్ళడం అనేది బాలికల యొక్క ప్రాథమిక హక్కు.

→ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం 1993లో సారాను నిషేధించింది.

→ మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాము.

→ కాదంబరి గంగూలి, చంద్రముఖి బసు భారతదేశంలోని మొదటి ఇద్దరు మహిళా గ్రాడ్యుయేట్లు.

→ జానకి అమ్మాళ్ పద్మశ్రీ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త.

AP 7th Class Social Notes Chapter 13 ప్రపంచ పరివర్తనలో మహిళలు

→ అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ కల్పనా చావ్లా.

→ కల్పనా చావ్లా 2003లో STS – 107 మిషన్ వైఫల్యం కారణంగా మరణించింది.

→ మహిళల వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో 7,000 పరుగుల మార్కును అధిగమించిన మహిళా క్రికెటర్ ‘మిథాలీరాజ్.

→ మిథాలీ రాజ్ కు ‘లేడీ సచిన్’ అనే ట్యాగ్ ఉంది.

→ మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా మిథాలీరాజ్ ప్రసిద్ధి పొందింది.

→ ఈమెకు ‘ఖేల్ రత్న’ పురస్కారం కూడా లభించింది.

→ ప్రాంజల్ పాటిల్ భారతదేశంలో మొదటి దృష్టి లోపం ఉన్న IAS అధికారిణి.

→ సీమారావు దేశంలోనే తొలి మహిళా కమాండో ట్రైనర్.

→ సీమారావు బ్రూస్ లీ అభివృద్ధి చేసిన మార్షల్ ఆర్ట్స్ లో జీత్ కునే డోలో శిక్షణ పొందిన ప్రపంచంలోని 10 మంది మహిళలలో ఒకరు.

→ ‘రాజ్ కుమారి దేవి’ SHG సేవలకుగాను 2019లో పద్మశ్రీ అవార్డు ఇచ్చారు.

→ ‘వందనాశివ’ ఒక పర్యావరణ వేత్త మరియు పర్యావరణ హక్కుల కార్యకర్త, – స్థానిక విత్తనాలను రక్షించటానికి ‘నవధాన్య’ అనే జాతీయ ఉద్యమం ఏర్పడటానికి ‘వందనాశివ’ ప్రయత్నాలు దారితీశాయి.

→ 1993లో రైట్ లైబ్లీ హుడ్ అవార్డును మరియు 2010 సిడ్ని శాంతి బహుమతిని (వందనా శివ) అందుకున్నారు.

→ లక్ష్మీ అగర్వాల్ యాసిడ్ దాడి భాదితురాలు.

→ లక్ష్మీ అగర్వాల్ NGO ఛన్‌ ఫౌండేషన్ కు డైరెక్టర్.

→ లక్ష్మీ అగర్వాల్ US ప్రథమ మహిళ మిచెల్ ఒబామాచే 2014లో ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డును అందుకుంది.

→ ఈమె NDTV ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా ఎంపికైంది.

→ నందిని హరినాథ్ ఇస్రో శాటిలైట్ సెంటర్ లో రాకెట్ శాస్త్రవేత్త.

→ ఈమె MOM ప్రాజెక్ట్ మేనేజర్, మిషన్ డిజైనర్ మరియు డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు.

→ ఈమె ఇస్రోలో 20 ఏళ్ళుగా 14 మిషన్లలో పనిచేసారు.

→ UNO ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసిన వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి పరిష్కారాలను అందించే యువజన సలహా సంఘ సభ్యులు ‘యంగో’లోని 7గురు సభ్యులలో ఒకరిగా ఎంపికైన యువతి ‘అర్చనా సోరెంగ్’.

→ మహనాజ్ అమి రచించిన పుస్తకం – ‘ఎంచుకునే దారిలో’.

→ లింగ వివక్షత : లింగాధారంగా వివక్షతను చూపుట. స్త్రీని తక్కువగాను, పురుషులను ఎక్కువగాను చూడటాన్ని లింగ వివక్షత అంటారు.

→ శారీరక వైకల్యం : శరీరంలోని ఏదైనా భాగం సరిగా పని చేయకపోవటం లేదా అసలు పని చేయకపోవటం.

→ పరివర్తన : ఆలోచనల్లో, మూస పద్ధతులలో మార్పు.

→ మహిళా ఉద్యమం : మూస పద్ధతులలో మార్పు తీసుకురావడానికి మహిళలు వ్యక్తిగతంగా మరియు సమష్టి పోరాటం చేయడమే మహిళా ఉద్యమం.

→ ఆత్మ గౌరవం : వ్యక్తిగతంగా (ఏ వివక్ష చూపకుండా) గౌరవింపబడటం. తనకు తాను గౌరవప్రదంగా ఉండటం.

→ మహిళా సాధికారత : మహిళలు స్వయంగా (ఇతరులపై ఆధారపడకుండా) విభిన్న సమస్యలపై నిర్ణయాలు తీసుకొనుట మరియు వారు కోరుకున్న లక్ష్యాలను సాధించటానికి, కొనసాగించటానికి మరింత స్వేచ్ఛ కల్గి ఉండటం. ఇది రాజకీయ మరియు ఆర్థిక సాధికారతలుగా పేర్కొన్నారు.

→ గిరిజనులు : కొండ (అటవీ) ప్రాంతంలో నివసించేవారు.

AP 7th Class Social Notes Chapter 13 ప్రపంచ పరివర్తనలో మహిళలు

→ SHG : స్వయం సహాయక బృందం (Self Help Group)

→ NGO : Non Government Organisation.

→ ISRO : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

→ మూస పద్ధతి : ఒక నిర్దిష్ట వర్గము లేదా వ్యక్తుల గురించి సాధారణీకరించిన నమ్మకం. ఇది ఒక నిర్దిష్ట సమూహంలోని వ్యక్తి గురించి ప్రజలకు ఉండే భావన.

→ వివక్ష : వ్యక్తులు, సమూహాలు, తరగతులు లేదా ఇతర వర్గాల ఆధారంగా వ్యక్తుల మధ్య అన్యాయమైన వ్యత్యాసాలను చూపే చర్య.

→ లింగ సమానత్వము : స్త్రీలు, పురుషులు అనే భేదభావం లేకుండా సామాన్య హక్కులు, బాధ్యతలు మరియు అవకాశాలు ఉండుట.

→ స్ఫూర్తిదాయక మహిళలు: ఇతరులను ప్రభావితం చేసే వ్యక్తిత్వం ఉన్నవారు.

AP 7th Class Social Notes Chapter 13 ప్రపంచ పరివర్తనలో మహిళలు 1