AP Board 7th Class Social Solutions Chapter 8 భక్తి – సూఫీ

SCERT AP 7th Class Social Study Material Pdf 8th Lesson భక్తి – సూఫీ Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Social Solutions 8th Lesson భక్తి – సూఫీ

7th Class Social 8th Lesson భక్తి – సూఫీ Textbook Questions and Answers

కింది తరగతులలోని విషయ పునశ్చరణ

AP Board 7th Class Social Solutions Chapter 8 భక్తి – సూఫీ 2
పటాన్ని పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
చిత్రంలో మీరేమి గమనించారు?
జవాబు:
హిందూ ధర్మ సాధువులు / సన్యాసులు మరియు ఇస్లాం మతబోధకులు ప్రజలకు ధర్మనిరతి గురించి, సత్ప్రవర్తన గురించి బోధ చేస్తున్నారు.

ప్రశ్న 2.
వారేమి బోధిస్తున్నారు?
జవాబు:
ప్రజలకు ధర్మ బోధన చేస్తున్నారు. అలాగే భగవంతుని చేరు మార్గము, సత్ప్రవర్తన విధానము, మోక్ష మార్గము, మానవ జీవిత సాఫల్యత, భూత దయ, దేవుని యందు ప్రేమ, భక్తి మొదలైనవి బోధిస్తున్నారు.

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

I. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
భక్తి ఉద్యమం యొక్క ప్రధాన లక్షణాలేవి?
జవాబు:
భక్తి ఉద్యమ ప్రధాన లక్షణాలు :

  1. భగవంతుడు ఒక్కడే.
  2. మోక్షాన్ని సాధించే మార్గాలలో భక్తి ప్రముఖమైనది.
  3. భక్తి అనగా తనకు తాను దేవునికి సమర్పించుకోవడం.
  4. మానవులందరిలో సమానత్వాన్ని నొక్కి చెపుతుంది.
  5. కులం, తెగ, వర్గం వంటి వ్యత్యాసాలను తిరస్కరించింది.
  6. భక్తి ఉద్యమకారులు వివిధ ప్రదేశాలకు ప్రయాణం చేస్తూ, అక్కడి స్థానిక భాషలలో భక్తి భావనలను ప్రచారం చేస్తూ బోధనలు చేసేవారు.

AP Board 7th Class Social Solutions Chapter 8 భక్తి – సూఫీ

ప్రశ్న 2.
మీరాబాయి ఎవరు? భక్తి ఉద్యమానికి ఆమె చేసిన సేవలు ఏమిటి?
జవాబు:
మీరాబాయి :

  1. మధ్యయుగ కాలంలోని మరొక ముఖ్యమైన భక్తి ఉద్యమకారిణి మీరాబాయి.
  2. బాల్యం నుంచి ఆమె శ్రీకృష్ణుని భక్తురాలు. వివాహం తరువాత కూడా ఆమె శ్రీకృష్ణ భక్తిని కొనసాగిస్తూ గొప్ప గాయకురాలిగా పేరు పొందింది.
  3. రాజకుటుంబంలో జన్మించినప్పటికి చాలా సాధారణంగా జీవించింది. సమాజంలోని అన్ని వర్గాలలో కృష్ణ భక్తితత్వాన్ని ప్రచారం చేసింది.
  4. భక్తి పారవశ్యంతో ఆమె పాడే భజనలను వినడానికి అన్ని మతాలకు చెందిన సాధువులు రాజస్థాన్లోని చిత్తోడ్ ప్రాంతాన్ని సందర్శించేవారు.
  5. మీరాబాయి సంత్ రవిదాస్ శిష్యురాలు.
  6. శతాబ్దాలుగా మీరా భజనలు జనబాహుళ్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.

ప్రశ్న 3.
భక్తి ఉద్యమం మరియు సూఫీ ఉద్యమం నుండి ప్రస్తుత సమాజం ఏమి నేర్చుకోవచ్చు?
జవాబు:
భక్తి ఉద్యమం మరియు సూఫీ ఉద్యమం నుండి ప్రస్తుత సమాజం నేర్చుకోవలసినవి :

  1. కుల, మత అసమానతలను పారద్రోలాలని.
  2. శ్రామికులకు (శ్రమకు) గౌరవం ఇవ్వాలని.
  3. ప్రాంతీయ భాషలను అభివృద్ధి చేయాలని.
  4. నిరాడంబర పూజా విధానాన్ని, జీవన విధానాన్ని అనుసరించాలని.
  5. క్రమశిక్షణతో కూడిన జీవనం సాగించాలని.
  6. పరమత సహనం కలిగి ఉండాలని.
  7. తోటివారి పట్ల దయ, సోదరభావం కల్గి ఉండాలని.

ప్రశ్న 4.
పే సంఖ్య 47 లోని మధ్యయుగ భారతీయ సమాజంపై భక్తి ఉద్యమ ప్రభావం అనే అంశాన్ని చదివి మీ స్వంత మాటలలో వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. నాటి సమాజంలో ఉన్న కులవివక్షతను పారద్రోలాలని భక్తి ఉద్యమకారులందరూ ప్రవచించారు.
  2. పరమత సహనం కల్గి ఉండటంను ప్రోత్సహించింది.
  3. ‘దేవుడు ఒక్కడే’ అనే భావన దాదాపు అందరు ఆమోదించి, బోధించారు.
  4. సమాజంలోని విభిన్న వర్గాల వారందరూ సమభావంతో, సోదర భావంతో మెలగాలని భక్తి ఉద్యమ సాధకులు బోధించారు.
  5. మానవ సేవే మాధవ సేవ అనే విశాల మానవతావాద దృక్పథాన్ని పెంపొందించింది.

ప్రశ్న 5.
సిక్కు మత స్థాపకులు ఎవరు? సిక్కుమతంలోని ప్రధాన సూత్రాలేవి?
జవాబు:
సిక్కు మత స్థాపకుడు – గురునానక్,

సిక్కు మత ప్రధాన సూత్రాలు :

  1. ఇతడు దేవుడు ఒక్కడే అని మరియు సోదర భావాన్ని కలిగి ఉండాలని విశ్వసించాడు.
  2. సాధారణ ప్రజల భాషలో తన బోధనలు చేశాడు. గురునానక్ అనుచరులను సిక్కులుగా పిలుస్తారు.
  3. దేవుడు ఒక్కడే, మానవులందరూ ప్రత్యక్షంగా దేవునితో అనుసంధానం కాగలరు అనేవి గురునానక్ బోధనలలో విశేష ప్రాచుర్యం పొందినవి.
  4. కుల వ్యవస్థను నిరసించడం, కులం మరియు లింగ భేదం లేకుండా అందరూ సమానమేనని బోధించడం గురునానక్ బోధనలలోని ప్రగతిశీల అంశాలు.

AP Board 7th Class Social Solutions Chapter 8 భక్తి – సూఫీ

ప్రశ్న 6.
భక్తి సాధువులు చేసిన సామాజిక సేవలను ప్రశంసిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
భక్తి సాధువులు చేసిన సామాజిక సేవలు :

  1. సమాజంలోని కుల, మత భేదాలను రూపుమాపడానికి భక్తి సాధువుల కృషి అభినందనీయం.
  2. సామాజిక, ఆర్థిక అంతరాలను తొలగించి సమతాభావాన్ని నెలకొల్పటంలో భక్తి సాధువులు వారికి వారే సాటి.
  3. ప్రజలలో ఆశావాదమును నింపి నిరాశ, నిస్పృహలను పారద్రోలారు.
  4. ప్రాంతాల ఐక్యతను గురించి ప్రజలకు వివరించారు.
  5. సోదరభావంను ప్రజలలో పెంపొందించారు.
  6. మానవతా వాదానికి పెద్ద పీట వేసారు.

ప్రశ్న 7.
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ భక్తి సాధువులను గూర్చి వ్రాయండి.
జవాబు:
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ భక్తి సాధువులు :
1) ఆదిశంకరాచార్య :
కేరళలోని ‘కాలడి’ గ్రామంలో జన్మించారు. వీరు అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించారు. వీరు దేశ నలుదిక్కులు అనగా ఉత్తరాన బదరీ, దక్షిణాన శృంగేరి, తూర్పున పూరీ, పడమర ద్వారకలలో నాలుగు శక్తి పీఠాలను ఏర్పాటు చేశారు.

2) రామానుజాచార్య :
వీరు దక్షిణ భారతదేశంలోని శ్రీపెరంబుదూలో క్రీ.శ. 1017లో జన్మించారు. విశిష్టాద్వైతాన్ని ప్రబోధించారు. “శ్రీభాష్యం”అనే పేరుతో బ్రహ్మ సూత్రాలను వ్యాఖ్యానించారు.

3) మధ్వాచార్యులు :
కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ తీరంలో జన్మించారు. వీరు ద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యం లోకి తెచ్చారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ ప్రపంచం అనేది భ్రమ కాదు వాస్తవం. బ్రహ్మ, ఆత్మ మరియు పదార్థాలనేవి ప్రకృతిలో ప్రత్యేకమైనవి.

4) వల్లభాచార్య :
ముఖ్యమైన వైష్ణవ సన్యాసి. వీరు తెలుగు ప్రాంతానికి సంబంధించిన వారు. శుద్ధ అద్వైతంను ప్రబోధించారు. బ్రహ్మ సూత్రాలకు వీరు భాష్యం రచించారు. వీరి బోధనలను పుష్టి మార్గం లేదా భగవదనుగ్రహ మార్గంగా చెప్పవచ్చు.

5) బసవేశ్వరుడు :
కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త, కవి మరియు సామాజిక సంస్కర్త. వీరు ‘వీరశైవ’ సంప్రదాయాన్ని ప్రచారం చేశారు. ఈయన రచనలను ‘వచనములు’ అంటారు.

6) మొల్ల :
ఈమెను మొల్లమాంబ అని కూడా పిలుస్తారు. రామాయణాన్ని తెలుగులో వ్రాసిన మొల్ల శ్రీకృష్ణదేవరాయలకి సమకాలీకురాలని పరిశీలకుల అభిప్రాయం.

7) అన్నమయ్య :
వీరు కడప జిల్లాలోని తాళ్ళపాక గ్రామంలో జన్మించారు. వీరిని పదకవితా పితా మహుడు అంటారు. ఈయన శ్రీవేంకటేశ్వరుడిని కీర్తిస్తూ 32 వేల సంకీర్తనలు రాశారని ప్రతీతి.

ప్రశ్న 8.
సూఫీ సాధువులు మరియు వారి బోధనల గురించి వ్రాయండి.
జవాబు:
ఎ) ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ :

  1. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ భారతదేశానికి చెందిన గొప్ప సూఫీ సాధువు.
  2. భారతదేశంలో చిస్తీ పద్ధతి వీరి ద్వారా స్థాపించబడింది.
  3. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ క్రీ.శ. 1143 లో పర్షియాలోని సీయిస్థాన్ లో జన్మించారు. వీరు క్రీ.శ. 1192లో భారతదేశాన్ని సందర్శించారు.
  4. ప్రేమ, విశ్వమానవ సౌభ్రాతృత్వం అనే అంశాలను ప్రచారం చేశారు.
  5. మొయినుద్దీన్ చిస్తీ దర్గా రాజస్థాన్ లోని అజ్మీర్ లో ఉన్నది. ఈ పవిత్ర స్థలంలో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ పవిత్ర సమాధి ఉంది.

బి) నిజాముద్దీన్ ఔలియా (1235-1325) :

  1. నిజాముద్దీన్ ఔలియా చిస్తీ సాధువులలో అత్యంత ప్రసిద్ధి గాంచినవాడు.
  2. ఇతను బాబా ఫరీద్ యొక్క శిష్యుడు. భగవంతుని సాక్షాత్కారానికి దారితీసే ప్రేమకు ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చాడు.
  3. భగవంతుని యెడల ప్రేమ అనగా మానవత్వంతో కూడిన ప్రేమ అని చెప్పాడు.
  4. ఆ విధంగా ఇతను విశ్వవ్యాప్త ప్రేమ మరియు సోదరభావం అనే సందేశాన్ని వ్యాప్తి చేసాడు.
  5. ఫరీదుద్దీన్-గంజ్-ఇ-షకర్, షేక్ నిజ్మతుల్లా మరియు ఖ్వాజా పీర్ మహమ్మద్ మొదలగువారు ఇస్లాంలోని ఇతర ప్రముఖ సూఫీ సాధువులు.

AP Board 7th Class Social Solutions Chapter 8 భక్తి – సూఫీ

II. బహుళైచ్ఛిక ప్రశ్నలు

1. విశిష్టాద్వైతమును బోధించింది ఎవరు?
ఎ) రామానుజ
బి) శంకరాచార్య
సి) రామానందుడు
డి) కబీర్
జవాబు:
ఎ) రామానుజ

2. సగుణ భక్తిని వ్యాప్తి చేసినవారు
ఎ) మీరాబాయి
బి) శంకరదేవుడు
సి) బసవేశ్వరుడు
డి) పైవన్నీ
జవాబు:
డి) పైవన్నీ

3. సిక్కు మత స్థాపకుడు ఎవరు?
ఎ) గురునానక్
బి) శంకరాచార్య
సి) రామానందుడు
డి) అక్బర్
జవాబు:
ఎ) గురునానక్

4. “భగవంతుడు ఒక్కడే” అనే భావనకు అర్థం ఏమిటి?
ఎ) దేవుడు ఒక్కడే
బి) ఒకే దేవుని మీద నమ్మకం
సి) ఒకే దేవుని ప్రార్ధించడం
డి) పైవన్నీ
జవాబు:
డి) పైవన్నీ

5. భక్తి ఉద్యమం ఏ శతాబ్దంలో ప్రారంభమైనది?
ఎ) క్రీ.శ. 6వ
బి) క్రీ.శ. 7వ
సి) క్రీ.శ. 8వ
డి) క్రీ.శ. 9వ
జవాబు:
సి) క్రీ.శ. 8వ

II. జతపరుచుము.

గ్రూప్ -ఎ గ్రూప్-బి
1. ఆళ్వారులు అ) భగవత్ స్వరూపాన్ని ఆకారంలో పూజించడం
2. హిందూ రచనలు ఆ) విష్ణువుని పూజించడం
3. సగుణ భక్తి ఇ) నిరాకారంగా దైవాన్ని పూజించడం
4. నిర్గుణ భక్తి ఈ) నాయనార్లు
5. శైవము ఉ) రామాయణం, భగవద్గీత

జవాబు:

గ్రూప్ -ఎ గ్రూప్-బి
1. ఆళ్వారులు ఆ) విష్ణువుని పూజించడం
2. హిందూ రచనలు ఉ) రామాయణం, భగవద్గీత
3. సగుణ భక్తి అ) భగవత్ స్వరూపాన్ని ఆకారంలో పూజించడం
4. నిర్గుణ భక్తి ఇ) నిరాకారంగా దైవాన్ని పూజించడం
5. శైవము ఈ) నాయనార్లు

7th Class Social Studies 8th Lesson భక్తి – సూఫీ InText Questions and Answers

7th Class Social Textbook Page No.39

ప్రశ్న 1.
మీ తల్లిదండ్రులు/టీచర్ సాయంతో ఆదిశంకరాచార్యుల బోధనలను పాఠశాల లైబ్రరీ నుండి సేకరించి తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
శ్రీ ఆదిశంకరాచార్యుల బోధనలు :

  1. వీరు అద్వైత సిద్ధాంతంను ప్రబోధించారు.
  2. జీవుడే బ్రహ్మం – బ్రహ్మమే జీవుడు. ఇద్దరికీ తేడా లేదు. చుట్టూ కనిపించేదంతా మాయ మాత్రమే (బ్రహ్మ సత్యం జగన్మిధ్య).
  3. అజ్ఞానం నుంచి బయటపడటానికి తనను తాను తెలుసుకోగలగాలి.
  4. శాస్త్రం, యుక్తి, అనుభవం, కర్మలు అనే విషయాలు అద్వైత వేదాంతానికి మూల స్తంభాలు.
  5. మనుషులందరూ ఒకటే అన్న విశాల మార్గంను బోధించారు.
  6. వీరిని అందుకే జగద్గురు శంకరాచార్యులు అని కూడా పిలుస్తారు.

7th Class Social Textbook Page No.45

ప్రశ్న 2.
గురునానక్ రాసిన గురుగ్రంథ సాహెబ్ గురించి సమాచారాన్ని సేకరించండి.
జవాబు:

  1. గురు గ్రంథ సాహెబ్ ను ‘ఆది గ్రంథ్’ అని కూడా అంటారు.
  2. సిక్కు మతస్తుల పవిత్ర గ్రంథం.
  3. గురునానక్ ఈ గ్రంథాన్ని రచించారు.
  4. పదవ సిక్కు గురు గోవింద్ సింగ్ ఆది గ్రంథను తన వారసురాలిగా ప్రకటించాడు. (మానవులను గురువుగా ప్రకటించే విధానానికి స్వస్తి పలికాడు)
  5. ఈ గ్రంథం పదిమంది గురువుల జీవన విధానంగా పరిగణించబడుతుంది.
  6. సిక్కు మత ప్రార్థనల కొరకు ఆధారముగా ఉంది.
  7. గురు గ్రంథ సాహెబ్ గ్రంథము 1430 పుటలు కలిగిన గ్రంథము.
  8. ఈ గ్రంథం స్తోత్రం రూపంలో ఉంటుంది.

AP Board 7th Class Social Solutions Chapter 8 భక్తి – సూఫీ

7th Class Social Textbook Page No.51

ప్రశ్న 3.
హిందూ మరియు ఇస్లాం మత సంస్కర్తల బోధనలలోని పోలికలతో జాబితా తయారు చేయండి.
జవాబు:
హిందూ, ఇస్లాం మతాలకు చెందిన సంస్కర్తలలోని పోలికలు :

  1. అప్పటి సమాజంలోని కుల, మత అసమానతలను హిందూ, ఇస్లాం సంస్కర్తలు ఇరువురూ తీవ్రంగా వ్యతి రేకించారు.
  2. సమాజంలోని అట్టడుగు వర్గాల వారిని, వివిధ కుల వృత్తుల వారు కూడా భగవత్ కృపకు అర్హులే అని చాటి చెప్పారు.
  3. భగవంతుడు ఒక్కడే అని, అన్ని మతాలు, అందరు సంస్కర్తలూ గొంతెత్తి చాటారు.
  4. ఏకేశ్వరోపాసన, నిరాడంబర పూజా విధానాన్ని ఇరువురూ ప్రచారం చేసారు.
  5. దైవాన్ని స్తుతించడంలో పాటలు, పద్యాలు, ఖవ్వాలీ మొ|| సంగీతానికి ప్రాధాన్యత ఇచ్చారు.
  6. సేవాభావాన్ని, మానవతా దృక్పథాన్ని పెంపొందించారు.
  7. ఆయా మతాలలోని మూఢ నమ్మకాలు, దురాచారాలను పారద్రోలారు.

ఆలోచించండి – ప్రతిస్పందించండి.

7th Class Social Textbook Page No.43

ప్రశ్న 1.
కబీర్ ప్రకారం “దేవుని ఎదుట అందరూ సమానమే” ఈ వాక్యాన్ని మీరు సమర్థిస్తారా? కారణాలు తెలపండి.
జవాబు:
“దేవుని ఎదుట అందరూ సమానమే” అన్న కబీర్ వాక్యాన్ని నేను సమర్ధిస్తాను, ఎందుకంటే

  1. మానవులందరి పుట్టుక / సృష్టి భగవంతుని ద్వారా చేయబడింది, భగవంతుని దృష్టిలో అందరూ సమానమే.
  2. ఏ వ్యక్తి కావాలని తనకు తానుగా ఆయా కులాల్లో, మతాల్లో జన్మించలేదు, జన్మించలేరు కూడా.
  3. దేవుడు ఒక్కడే అయినపుడు దేవుని చేత సృష్టించబడిన మానవులంతా కూడా సమానమే (ఒక్కటే).
  4. కులం, మతం అనేవి మనిషి పుట్టిన తరువాత ఏర్పడినవి. వీటిని మనుషులే సమాజంలో ఏర్పాటు చేసుకున్నారు.

7th Class Social Textbook Page No.47

ప్రశ్న 2.
నామ్ దేవ్ ప్రకారం దైవాన్ని పూజించడానికి విస్తృతమైన పూజా విధానం, క్రతువులను ఆచరించడం వంటివి అవసరం లేదు. ఆయన ఇలా అనడానికి కారణం ఏమై ఉండవచ్చు?
జవాబు:
దైవానికి ఏకాగ్రతతో మనస్సు సమర్పించటం ద్వారా మోక్షాన్ని సాధించవచ్చని, విస్తృతమైన పూజా విధానం, క్రతువులను ఆచరించడం అవసరం లేదని నామ్ దేవ్ బోధించారు. కారణం, దైవం స్వచ్ఛమైన మనస్సు, నిర్మలమైన ప్రేమ, నిశ్చలమైన బుద్దినే కోరుకుంటుంది కాని ఆడంబరంతో కూడిన పూజా తంతు కాదు. ప్రేమతో, నిర్మలమైన మనస్సుతో దైవాన్ని స్మరిస్తే చాలు. ఆ భగవంతుడు చలించిపోయి కరుణిస్తాడు. అంతేగాని ఖరీదైన వస్తువులు, నైవేద్యాలు కాదు. మనస్పూర్తిగా, ఆర్తితో నిండిన గొంతుతో స్వామిని పిలిస్తే చాలు, పిలిచే మనస్సు మనకుండాలి గాని తరలిరాడా భగవంతుడు.

7th Class Social Textbook Page No.49

ప్రశ్న 3.
“భక్తి అనేది నిజాయితీ, దయ, ప్రేమ మరియు సేవాతత్పరతలను పెంపొందిస్తుంది.” చర్చించుము.
జవాబు:

  1. భక్తి అనేది నిజాయితీ, దయ, ప్రేమ మరియు సేవాతత్పరత మొదలగు గుణాలను పెంపొందిస్తుందనుటలో ఏ మాత్రం సందేహం లేదు.
  2. దేవుని పట్ల నమ్మకం కల్గియున్నవారు కచ్చితంగా ప్రతి చోట భగవంతుడున్నాడని భావించి నిజాయితీతో వ్యవహరిస్తారు.
  3. దేవుని పట్ల భక్తి కల్గియున్నవారు ప్రతి జీవిలోను భగవంతుణ్ణి దర్శించి భూత దయ కల్గి ఉంటారు.
  4. జాలి, దయల యొక్క క్రియా రూపం ప్రేమను పంచటమే, భగవత్ భక్తుల హృదయాలు కచ్చితంగా ప్రేమతో నిండి ఉంటాయి.
  5. కొంతమంది భక్తులు, సాధువులు, గురువులు భగవంతుని చేరుటకు సేవా మార్గాన్ని ఎంచుకొని మానవాళికి ఎన్నో సేవలు అందిస్తున్నారు.

అన్వేషించండి

7th Class Social Textbook Page No.39

ప్రశ్న 1.
సామాజిక సమానత్వాన్ని సాధించడంలో రామానుజాచార్యులు చేసిన కృషి ఏమిటి?
జవాబు:
శ్రీ రామానుజాచార్యుల కృషి, సామాజిక సమానత్వాన్ని సాధించడంలో :

  1. వీరు విశిష్టాద్వైతాన్ని బోధించారు.
  2. సంపూర్ణ సమర్పణ భావంతో మోక్షాన్ని సాధించవచ్చునని ప్రతి ఒక్కరికి బోధించారు.
  3. తిరుక్కోట్టియార్ నుంచి ఆదేశాన్ని కాదని ఆలయ గోపురం పై నుంచి ‘తిరుమంత్రాన్ని’ అందరికి వినపడేలా ప్రకటించారు. అంటే మానవులందరూ ఎటువంటి వర్గ తారతమ్యం లేకుండా మోక్షం పొందాలని ఉదార భావనతో ప్రకటించాడు.
  4. అస్పృశ్యత లాంటి సాంఘిక దురాచారాలను తొలగించటానికి సంస్కరణాత్మక పద్ధతులను ప్రవేశపెట్టారు.
  5. సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డు రాక ముందే వాటిని మార్చటం ప్రథమ కర్తవ్యంగా భావించారు.
  6. సమాజ శ్రేయస్సు ముఖ్యం, కానీ వ్యక్తిగత శ్రేయస్సు కాదని భావించారు.

7th Class Social Textbook Page No.41

ప్రశ్న 2.
రామానందుడు వర్గ వాదాన్ని ఎందుకు వ్యతిరేకించాడు? మీ ఉపాధ్యాయుని ద్వారా తెలుసుకోండి.
జవాబు:
సమాజం వివిధ వర్గాలుగా విభజించబడి ఉండటాన్ని రామానందుడు వ్యతిరేకించాడు. ఎందుకనగా మానవులందరూ భగవంతుని దృష్టిలో సమానమేనని (బిడ్డలని), అయితే మనుషుల మధ్య ఈ తేడాలు అనవసరమని భావించాడు. మనుషులందరూ భగవంతునిచే సృష్టించబడ్డారని, అందరూ మోక్షార్హులని, కుల, మత, జాతి, లింగ భేదాలు మానవ సృష్టియేనని భావించాడు.

AP Board 7th Class Social Solutions Chapter 8 భక్తి – సూఫీ

ప్రశ్న 3.
బసవేశ్వరుని గూర్చి సమాచారాన్ని ఇంటర్నెట్ నుండి సేకరించండి. దానిని గూర్చి మీ ఉపాధ్యాయునితో చర్చించండి.
జవాబు:
బసవేశ్వరుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త, ‘ కవి మరియు సామాజిక సంస్కర్త. అతను వీర శైవ సంప్రదాయాన్ని ప్రచారం చేశాడు. ఆయన రచనలను వచనములు అంటారు. అతను పుట్టుకతో లేదా సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రజలందరికి బోధించాడు. అతని ప్రసిద్ధ సూక్తి “మానవులంతా సమానమే, కులం లేదా ఉప కులం లేదు”.
బసవేశ్వరుడు

7th Class Social Textbook Page No.45

ప్రశ్న 4.
మీ ఉపాధ్యాయుల సహకారంతో సిక్కుమతంలో ఉండే పది మంది గురువుల పేర్లను సేకరించండి.
జవాబు:
సిక్కు మత గురువులు :

  1. గురునానక్
  2. గురు రామదాసు
  3. గురు హరరాయ్
  4. గురు గోవింద్ సింగ్
  5. గురు అంగద్
  6. గురు అర్జున్ సింగ్
  7. గురు హరకృష్ణ
  8. గురు అమరదాసు
  9. గురు హరగోవింద్
  10. గురుతేజ్ బహదూర్

ప్రాజెక్ట్ పని

ప్రశ్న 1.
భక్తి మరియు సూఫీ ఉద్యమాలకు చెందిన వివిధ సాధువుల యొక్క చిత్రాలను సేకరించండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 8 భక్తి – సూఫీ 1