Students can go through AP Board 7th Class Social Notes 6th Lesson విజయనగర సామ్రాజ్యం to understand and remember the concept easily.
AP Board 7th Class Social Notes 6th Lesson విజయనగర సామ్రాజ్యం
→ విజయనగర సామ్రాజ్యం క్రీ.శ. 1336 నుండి క్రీ.శ. 1646 వరకు 200 సంవత్సరాలకు పైగా భారతదేశ చరిత్రలో గొప్ప స్థానాన్ని ఆక్రమించింది.
→ 14, 16 శతాబ్దాలలో మొత్తం దక్షిణ భారతదేశంలో విస్తరించిన, ప్రపంచంలో రెండవ అతి పెద్ద రాజధాని నగరం కల సామ్రాజ్యపు రాజధాని.
→ లండన్, పారిస్ కంటే పెద్దదిగా పేరుగాంచింది. విజయనగర సామ్రాజ్యానికి ‘హంపి’ రాజధానిగా ఉండేది.
→ విజయనగరం ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజ్యం.
→ క్రీ.శ. 1336లో సంగమ వంశానికి చెందిన మొదటి హరిహర రాయలు మొదటి బుక్క రాయలు చేత విద్యారణ్య స్వామి వారి ప్రోత్సాహముతో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది.
→ మొదటి హరిహర, బుక్కరాయలు మొదటగా వరంగల్లుకు చెందిన కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రుని ఆస్థానంలో క్రీ.శ. 1323లో పని చేశారు.
→ క్రీ.శ. 1336లో విజయనగరము అనే కొత్త నగరాన్ని ‘తుంగభద్ర’ నదికి దక్షిణ ఒడ్డున స్థాపించారు.
→ హంపి వద్ద ఉన్న శిథిలాలు 1805లో ఇంజనీర్, పూరాతత్వవేత్త అయిన కల్నల్ కొలిన్ మెకంజీ కాలంలో వెలుగులోకి వచ్చాయి.
→ సంగమ రాజవంశంలో గొప్ప పాలకుడు ‘రెండవ దేవరాయలు’.
→ రెండవ దేవరాయలను ప్రౌఢ దేవరాయలు అని కూడా అంటారు.
→ రెండవ దేవరాయలు కళింగ సైన్యాన్ని ఓడించాడు. కొండవీడును స్వాధీనం చేసుకుని రాజమండ్రి వరకు తన అధికారాన్ని సుస్థిరం చేశాడు.
→ సంగమ రాజవంశం తరువాతి రెండవ రాజవంశం సాళువ రాజవంశం.
→ సాళువ వంశం సాళువ నరసింహరాయలచే స్థాపించబడింది.
→ తుళువ రాజవంశం విజయనగర సామ్రాజ్యంలోని మూడవ రాజవంశం.
→ శ్రీకృష్ణ దేవరాయలు విజయ నగరాన్ని పాలించిన పాలకులలో చాలా శక్తివంతమైన పాలకుడు.
→ తుళువ వంశ స్థాపకుడు వీర నరసింహరాయలు.
→ శ్రీకృష్ణ దేవరాయలు తుళువ వంశానికి చెందినవాడు.
→ శ్రీకృష్ణ దేవరాయలు విదేశీ వాణిజ్యం యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకుని ఓడల ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసాడు.
→ ‘దివానీ’ యుద్ధంలో ముస్లిం సైన్యాలు శ్రీకృష్ణదేవరాయల చేత నిర్ణయాత్మకంగా ఓడించబడ్డాయి.
→ క్రీ.శ. 1520లో ఆదిల్ షాను ఓడించి రాయచూర్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
→ శ్రీకృష్ణ దేవరాయలు పోర్చుగీసు మరియు అరబ్ వ్యాపారులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాడు.
→ సాహిత్యం, కళలను గొప్పగా పోషించి, శ్రీకృష్ణదేవరాయలు ‘ఆంధ్ర భోజుడు’ అని పిలువబడ్డాడు.
→ “దేశ భాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు పలికాడు.
→ అష్ట దిగ్గజములు అని పిలువబడే ఎనిమిది మంది ప్రముఖ పండితులు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండేవారు.
→ ‘ఆంధ్ర కవితా పితామహుడు’ అని అల్లసాని పెద్దనను పిలిచేవారు. అతని రచనల్లో ‘మను చరిత్ర’, ‘హరికథాసారం’ ముఖ్యమైనవి.
→ శ్రీకృష్ణ దేవరాయలు స్వయంగా కవి. తెలుగులో ‘ఆముక్త మాల్యద’ సంస్కృతంలో జాంబవతి కళ్యాణం, ఉషా పరిణయం ఈయన ముఖ్యమైన రచనలు.
→ విజయనగరంలో విఠలస్వామి, హజారా రామస్వామి ఆలయాలను కూడా శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడు.
→ విజయనగరంలో తన తల్లి నాగలాంబ జ్ఞాపకార్థం నాగలాపురం అనే కొత్త నగరాన్ని కూడా నిర్మించాడు.
→ విజయనగర సామ్రాజ్యం యొక్క నాల్గవ మరియు చివరి రాజవంశం అరవీడు / అరవీటి రాజవంశం.
→ తళ్ళికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం క్షీణించింది.
→ విజయనగర రాజుల పాలనలో రాజు సంపూర్ణ అధికారాన్ని కల్గి ఉండేవాడు.
→ ఈ సామ్రాజ్యాన్ని మండలాలు, నాడులు, స్థలాలు, గ్రామాలుగా విభజించారు.
→ మండల పాలకుని ‘మండలేశ్వరుడు’ లేదా ‘నాయక్’ అని పిలిచేవారు.
→ సాధారణంగా ఉత్పత్తిలో 1/6 (ఆరవ వంతు) వ భూమి శిస్తుగా నిర్ణయించారు.
→ సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులను నాయకులు లేదా పాలిగార్లు అని పిలిచేవారు.
→ పాలిగార్ల సేవలకు బదులుగా వారికి భూమి మంజూరు చేయబడింది. ఈ భూములను ‘అమరం’ అని పిలిచేవారు.
→ విజయనగర సామ్రాజ్యంలో కోటలను, సాయుధ దళాలను నియంత్రించే సైనిక అధికారులను అమర నాయకులు అంటారు.
→ సైనికుల జీతాలు సాధారణంగా నగదు రూపంలో చెల్లించేవారు.
→ వీరు యుద్ధంలో విష వాయువులను గుర్తించడానికి “పక్షులను” ఉపయోగించేవారు.
→ కుమార కంపన భార్య గంగాదేవి ‘మధురా విజయం’ అనే ప్రసిద్ధ రచన చేసింది.
→ వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తిగా కొనసాగింది.
→ “వరాహ” అనునది ప్రధాన బంగారు నాణెం.
→ మలబార్ తీరంలో అనేక నౌకాశ్రయాలు ఉండేవి. వాటిలో ప్రధానమైనది ‘కన్ననూర్’.
→ పశ్చిమాన అరేబియా, పర్షియా, దక్షిణాఫ్రికా మరియు పోర్చుగల్ మరియు తూర్పున బర్మా, మలయా ద్వీపకల్పం మరియు చైనాతో వాణిజ్య సంబంధాలు వృద్ధి చెందాయి.
→ పత్తి, పట్టు, సుగంధ ద్రవ్యాలు, బియ్యం, ఇనుము, సురేకారం మరియు చక్కెర ఎగుమతులలో ప్రధాన వస్తువులు.
→ గుర్రాలు, ముత్యాలు, రాగి, పగడము, పాదరసం, చైనా పట్టు మరియు వెల్వెట్ వస్త్రాలను దిగుమతి చేసుకొన్నారు.
→ ఓడల నిర్మాణ కళ అభివృద్ధి చెందింది.
→ శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో పోర్చుగీసు యాత్రికులైన డువార్టే బార్బోసా మరియు డొమింగో పేర్లు విజయనగరాన్ని సందర్శించారు.
→ దేవరాయ-II కాలంలో ఇటాలియన్ యాత్రికుడు నికోలో కాంటి మరియు పర్షియన్ యాత్రికుడు అబ్దుల్ రజాట్లు విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించారు.
→ విఠల స్వామి దేవాలయము, హజారా రామాలయం దేవాలయాలు కాంచీపురంలోని వరద రాజ దేవాలయము మరియు ఏకాంబర నాథ దేవాలయాలు విజయనగర రాజుల నిర్మాణ శైలి గొప్పతనానికి ఉదాహరణలుగా నిలుస్తాయి.
→ తిరుపతిలో శ్రీకృష్ణదేవరాయలు మరియు అతని రాణుల యొక్క లోహ చిత్రాలు లోహాల పనితనానికి ఉదాహరణలు.
→ ఈ కాలంలో కర్ణాటక సంగీత సాంప్రదాయం అభివృద్ధి చెందింది.
→ విద్యారణ్య స్వామి ‘సంగీత సర్వస్వం’ అనే గ్రంథాన్ని రాశారు.
→ ప్రౌఢ దేవరాయలు రాసిన ‘మహానాటక సుధానిధి’ అను రచన కూడా సంగీతానికి చెందినదే.
→ కర్ణాటక సంగీత త్రయం దీక్షితార్, శ్యామశాస్త్రి మరియు త్యాగరాజ స్వామి తంజావూరు ఆస్థానానికి చెందినవారు.
→ భరతనాట్యం భరత ముని చేత పరిచయం చేయబడింది.
→ సిద్ధేంద్ర యోగి ప్రవేశపెట్టిన ‘కూచిపూడి’, ‘పేరిణి’ నాట్యం కూడా ఈ కాలంలో ప్రాచుర్యం పొందాయి.
→ భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించిన ఇతివృత్తాలతో ‘యక్షగానమనే’ నృత్య రూపకం కూడా ప్రజాధరణ పొందింది.
→ ఆళియరామ రాయలు పాలనలో మహ్మదీయ సంయుక్త దళాలు కూటమిగా ఏర్పడి క్రీ.శ. 1565లో ‘తళ్ళికోట’ వద్ద అతనిని ఓడించాయి.
→ తళ్ళికోట యుద్ధాన్నే రాక్షస తంగడి యుద్ధం అని కూడా అంటారు.
→ విజయనగర రాజ్యానికి చివరి పాలకుడు మూడవ శ్రీరంగ రాయలు.
→ రెడ్డి రాజులు క్రీ.శ. 1325 నుండి 1448 వరకు వంద సంవత్సరాల పాటు తీరప్రాంతంతో పాటు మధ్య ఆంధ్రాను పాలించారు.
→ వీరి మొదటి రాజధాని “అద్దంకి’, తరువాత దానిని ‘కొండవీడు’కు మార్చారు.
→ ఆంధ్ర మహాభారతమును రచించిన కవిత్రయములో ఒకరైన ‘ఎర్రాప్రగడ’ ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉండేవాడు. ఆయనకు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఉంది.
→ అల్లావుద్దీన్ బహ్మన్‌షా క్రీ.శ. 1347లో బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు.
→ అల్లావుద్దీన్ బహ్మను హసన్ గంగూ అని కూడా పిలుస్తారు. ఇతని రాజధాని ‘గుల్బర్గా’.
→ అహ్మదాలిషా రాజధానిని గుల్బర్గా నుండి ‘బీదర్’కు మార్చాడు.
→ మూడవ మహ్మద్ షా విజయానికి కారణం ఆయన మంత్రి మహమూద్ గవాన్ సేవలు, సలహాలు.
→ మహమూద్ గవాన్ పర్షియన్ వ్యాపారి.
→ మూడవ మహమ్మద్ షా క్రీ.శ. 1482లో మరణించాడు.
→ మూడవ మహమ్మద్ షా తర్వాత బహమనీ సామ్రాజ్యం అహ్మద్ నగర్, బీరార్, బీదర్, బీజాపూర్, గోల్కొండ అనే ఐదు భాగాలుగా విడిపోయింది.
→ దో ఆబ్ (అంతర్వేది) : రెండు నదుల మధ్య ప్రాంతం.
→ అష్ట దిగ్గజములు : శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానమంధళి, ఎనిమిది మంది కవులు / పండితులు.
→ మండలేశ్వరుడు : మండల పాలకుడు.
→ అశ్విక దళం : గుర్రాలపై కూర్చొని యుద్ధం చేసే సైన్యంలోని ఒక దళం.
→ పాలిగార్లు : సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులు
→ అమరం : పాలిగార్ల సేవలకు బదులు మంజూరు చేయబడిన భూమి.
→ అమర నాయకులు : కోటలను, సాయుధ దళాలను నియంత్రించే సైనిక అధికారులు.
→ వరాహ : విజయనగర సామ్రాజ్యంలోని బంగారు నాణెం.
→ కన్ననూర్ : మలబార్ తీరంలోని ప్రధానమైన నౌకాశ్రయం.
→ రాయగోపురం : ఎత్తైన ఆలయ ముఖద్వారం.
→ కర్ణాటక సంగీత త్రయం : దీక్షితార్, శ్యామశాస్త్రి మరియు త్యాగరాజ స్వామి.
→ కస్టమ్ సుంకాలు : ఎగుమతులు, దిగుమతులపై పన్నులు.
→ నాడులు : మండలం యొక్క విభాగాలు (ప్రస్తుత జిల్లా స్థాయి)
→ అంతర్వేది : రెండు నదుల మధ్య ఉన్న భూభాగము.
→ ఫిరంగులు : యుద్ధాలలో ఉపయోగించే పెద్ద శక్తివంతమైన తుపాకులు.
→ నాయక : చక్రవర్తి తరపున పౌర మరియు సైనిక విధులను నిర్వర్తించేవారు.
→ వ్యాపారులు : అమ్మకము మరియు కొనుగోళ్ళు చేసేవారు.
→ దండయాత్ర : సాయుధ దళాల దాడి, ఆక్రమణ లేదా ముట్టడి.
1.
2.
3.
4.