Students can go through AP Board 7th Class Social Notes 7th Lesson మొఘల్ సామ్రాజ్యం to understand and remember the concept easily.
AP Board 7th Class Social Notes 7th Lesson మొఘల్ సామ్రాజ్యం
→ ఢిల్లీ సుల్తానులలో చివరి పాలకుడైన ఇబ్రహీం లోడీని క్రీ.శ. 1526లో పానిపట్టు యుద్ధంలో ఓడించి బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
→ క్రీ.శ. 1530లో బాబర్ మరణించెను.
→ మొఘల్ అనే పదం ‘మంగోల్’ అనే పదం నుంచి వచ్చింది.
→ బాబర్ తరువాత అతని కుమారుడు హుమాయూన్ సింహాసనానికి వచ్చెను.
→ షేర్షా క్రీ.శ. 1539లో చౌసా యుద్ధంలో మరియు క్రీ.శ. 1540లో జరిగిన కనౌజ్ యుద్ధంలో హుమాయూనన్ను ఓడించి ఇరాను తరిమివేసెను.
→ క్రీ. శ. 1555లో హుమాయూన్ తిరిగి ఢిల్లీని ఆక్రమించుకొనెను. క్రీ. శ. 1556లో మరణించెను.
→ షేర్షా సూర్ ఒక ఆప్షన్ నాయకుడు.
→ షేర్షా ఢిల్లీలో సూర్ రాజవంశాన్ని స్థాపించాడు.
→ షేర్షా తన సామ్రాజ్యాన్ని కాబూల్ నుండి బెంగాల్ మరియు మాళ్వా వరకు విస్తరించాడు.
→ అక్బర్ సంరక్షకుడు బైరాం ఖాన్.
→ క్రీ. శ. 1556లో రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బర్, హేముని ఓడించినాడు.
→ మేవాడ్ పాలకుడైన మహారాణా ప్రతాప్, అక్బతో జీవితాంతం పోరాటం చేసాడు.
→ బీర్బల్, అక్బర్ సన్నిహితుడు. గొప్ప గాయకుడు మరియు కవి.
→ అహ్మద్ నగర్ రాణి అయిన చాంద్ బీబీ అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన మహిళ.
→ జహంగీర్ అసలు పేరు ‘సలీమ్’.
→ షాజహాన్ జహంగీర్ కుమారుడు.
→ ఔరంగజేబు కాలంలో గురుతేజ్ బహదూర్, గురుగోవింద్ సింగ్ మరియు శివాజీ మొదలగువారు తిరుగుబాట్లు చేశారు.
→ ఔరంగజేబు క్రీ. శ. 1685లో బీజాపూర్, క్రీ.శ. 1687లో గోల్కొండను జయించాడు.
→ మొఘల్లది కేంద్రీకృత పరిపాలన, చక్రవర్తికే అన్ని అధికారాలు ఉండేవి.
→ అక్బర్ తన సామ్రాజ్యాన్ని అనేక సుబాలుగా విభజించి ప్రతి సుబాకు ఒక ‘సుబేదార్’ను నియమించాడు.
→ అక్బర్ తన రాజ్యా న్ని ’15’ సుబాలుగా విభజించాడు.
→ సుబాలను ‘సర్కారులుగా’, సర్కారులను ‘పరగణాలుగా విభజించాడు.
→ అక్బరు భూమిని సర్వే చేయించి, పండించిన పంట ప్రకారం పన్ను నిర్ణయించే వ్యవసాయ పద్ధతిని ప్రవేశపెట్టాడు.
→ భూమిని నాలుగు రకాలుగా విభజించి 1/3వ వంతు పంటను పన్నుగా వసూలు చేశారు.
→ అక్బర్ పాలనలో షేర్షా పరిపాలనా ముద్ర కొంత వరకు ప్రస్ఫుటమవుతుంది.
→ సైనిక విధానంలో అక్బర్ మన్సబ్ దారీ వ్యవస్థను ప్రవేశపెట్టాడు.
→ మన్నబ్ అంటే హోదా లేదా ర్యాంక్. ఇది 1) ర్యాంక్, 2) జీతాలు, 3) సైనిక బాధ్యతలు నిర్ధారించడానికి ఉపయోగించిన గ్రేడింగ్ పద్ధతి.
→ రాజపుత్రులలో ‘శిశోడియా’ వంశస్తులు మొఘలుల అధికారాన్ని అంగీకరించలేదు.
→ ఔరంగజేబు మరణానంతరము సామ్రాజ్యము విచ్ఛిన్నమైంది.
→ మొఘలులు సున్ని మతస్తులు. అక్బర్ మత సహనాన్ని పాటించాడు.
→ జిజియా పన్ను మరియు యాత్రికుల పన్నులను అక్బర్ రద్దు చేసాడు.
→ జిజియా పన్ను మరియు యాత్రికులపై పన్నులను ఔరంగజేబు తిరిగి విధించాడు.
→ ఔరంగజేబు ప్రజల నైతిక జీవనాన్ని పరిశీలించడానికి ‘ముతావాసిబ్’ అనే మతాధికారులను నియమించాడు.
→ అక్బర్ క్రీ. శ. 1575లో ఫతేపూర్ సిక్రీ వద్ద ‘ఇబాదత్ ఖానా’ అనే ప్రార్ధనా మందిరాన్ని నిర్మించాడు.
→ 1582 లో దీన్-ఇ-ఇలాహి అనే నూతన మతాన్ని అక్బర్ ప్రకటించాడు.
→ దీన్-ఇ-ఇలాహి అంటే ‘అందరితో శాంతి’ లేదా ‘విశ్వజనీన శాంతి’,
→ దీన్-ఇ-ఇలాహి మతంలో ’18’ మంది మాత్రమే చేరారు.
→ మొఘలులచే నియమించబడిన ప్రజాపనుల విభాగం సామ్రాజ్యంలో విస్తృతమైన రహదారి వ్యవస్థను రూపొందించింది.
→ వ్యవసాయ పన్ను ద్వారా వచ్చే ఆదాయం ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉండేది.
→ షేర్షా సూర్ పాలనలో ప్రవేశపెట్టిన రూపాయి (వెండి నాణెం) మరియు దామ్ (రాగి నాణెం)లను మొఘలులు కొనసాగించారు.
→ మొఘల్ వ్యవస్థలో చెప్పుకోదగినది అక్బర్ కాలం నాటి రెవెన్యూ పాలన ‘జల్ట్’.
→ 1/3వ వంతు నుండి సగం వరకు భూమిశిస్తుగా నిర్ణయించారు.
→ అక్బర్ తన మత గురువు షేక్ సలీం ‘చిస్తి’ గౌరవార్థం రాజధానిని ఆగ్రా నుండి సిక్రీకి మార్చాలనుకున్నాడు.
→ ‘ఫతే’ అనగా విజయం
→ అక్బర్ ‘ఫతేబాద్’ అనే నగరాన్ని నిర్మించాడు. ఇదే ‘ఫతేపూర్ సిక్రి’.
→ అక్బర్ గుజరాత్ విజయాలకు జ్ఞాపకార్థంగా బులంద్ దర్వాజాను నిర్మించాడు.
→ ఎర్రకోట షాజహాన్ కాలం నాటి మొఘలుల సృజనాత్మక శైలికి తార్కాణం.
→ షాజహాన్ తన భార్య అయిన ముంతాజ్ ప్రేమకు గుర్తుగా తాజ్ మహల్ నిర్మించాడు.
→ ఖురాన్, ఫత్వా-ఇ-ఆలంగిరి మొదలైన ఇస్లామిక్ చట్టాలను స్వదేశీ భాషలలో బోధించటానికి ‘మక్తాబ్’ పాఠశాలలను నిర్మించారు మొఘలులు.
→ పర్షియన్ భాష అధికార భాషగా చలామణి అయినది.
→ బాబర్ ‘బాబర్ నామా’ను రచించాడు.
→ అబుల్ ఫజల్ ‘అయిన్-ఇ-అక్బరీ’, ‘అక్బర్ నామా’ అనే గ్రంథాలను రచించాడు.
→ తుజుక్-ఇ-జహంగీరీ అనే గ్రంథం జహంగీర్ ఆత్మకథ.
→ ప్రముఖ హిందీ కవి తులసీదాస్ రామాయణాన్ని ‘రామచరిత మానస్’ అనే పేరుతో హిందీలో రచించాడు.
→ మొఘలుల కాలంలో మినియేచర్ చిత్రకళ ప్రారంభమైంది.
→ అక్బర్ ఆస్థానంలో ‘తాన్ సేన్’ అనే సంగీత కళాకారుడు కలడు.
→ అక్బర్ ఆస్థానంలో 36 మంది సంగీతకారులు ఉన్నట్లు అబుల్ ఫజల్ పేర్కొన్నాడు.
→ మొఘల్ సామ్రాజ్యం క్రీ. శ. 1857లో బహదూర్ షా-II కాలంలో పతనమైంది.
→ జహంగీర్ పోషణలో చిత్రకళ అత్యున్నత స్థాయికి చేరుకుంది.
→ మరాఠా రాజ్య స్థాపకుడు. ‘శివాజీ’.
→ శివాజీ పూనే సమీపంలో శివనేరి కోటలో జన్మించాడు.
→ శివాజీ తండ్రి షాజీ భోంస్లే, తల్లి జిజియా బాయి.
→ శివాజీ సమర్థ రామదాస్ మరియు ఇతర మహారాష్ట్ర సాధువుల బోధనలచే ప్రభావితుడైనాడు.
→ శివాజీ దాదాజీ కొండదేవ్, తానాజీ మాల్ సురే వద్ద యుద్ధ విద్యలనభ్యసించాడు.
→ శివాజీ తన 19వ ఏట బీజాపూర్ సుల్తాన్ మహ్మద్ ఆదిల్ షా మరణానంతరం తోరణదుర్గంను జయించాడు.
→ బీజాపూర్ సుల్తాన్ శివాజీని అణచివేయడానికి తన సేనాధిపతి అఫలాఖానను పంపించాడు. కాని శివాజీ అతనిని సంహరించాడు.
→ ఔరంగజేబు శివాజీని, అణచడానికి తన సేనాని షయిస్తఖానను దక్కను పంపించాడు. కాని శివాజీ ఇతనిని కూడా ఓడించాడు.
→ ఔరంగజేబు తర్వాత రాజా జైసింగ్ నాయకత్వంలో పెద్ద సైన్యాన్ని శివాజీ పైకి పంపగా, శివాజీ ఓడింపబడ్డాడు.
→ రాయగఢ్ లో శివాజీకి ‘ఛత్రపతి’ బిరుదు ఇవ్వబడింది.
→ శివాజీకి పరిపాలనలో అష్టప్రధానులు అనే మంత్రులు సహాయపడ్డారు.
→ అష్టప్రధానులలో ప్రధానమంత్రిని ‘పీష్వా’ అని పిలిచేవారు.
→ శివాజీ మరణానంతరం ఏర్పడిన సంక్షోభంను పీష్వాలు విజయవంతంగా అధిగమించారు.
→ సుబాలు : మొఘల్ సామ్రాజ్యంలోని విభాగాలు (రాష్ట్రాలు).
→ సుబేదార్ : ‘సుబాకు’ అధికారి.
→ సర్కారులు : సుబా యొక్క భాగాలు (జిల్లాలు).
→ పరగణాలు : సర్కారు యొక్క భాగాలు (మండలాలు / తాలూకాలు)
→ రూపాయి : వెండి నాణెం
→ దామ్ : రాగి నాణెం
→ మన్సబ్దార్ : సైనిక హోదా (ర్యాంక్) కలిగి అక్బర్ పరిపాలన బాధ్యతను పంచుకునే అధికారులు.
→ సున్నీ మతం : ఇస్లాంలోని ఒక సంప్రదాయ మతం.
→ జిజియా పన్ను : ముస్లిం పాలనలో హిందువులు’ చెల్లించే పన్ను.
→ ముతావాసిబ్ : ప్రజల నైతిక జీవనాన్ని పరిశీలించడానికి ఔరంగజేబు నియమించిన మత అధికారులు.
→ దీన్-ఇ-ఇలాహి : “అందరితో శాంతి” లేదా “విశ్వజనీన శాంతి”, అక్బర్ ప్రకటించిన నూతన మతము.
→ జబ్త్ : అక్బర్ కాలంలో తోడర్మల్ ప్రవేశపెట్టిన రెవెన్యూ విధానము.
→ ఫతే : ఫతే అనగా విజయం.
→ బులంద్ దర్వాజ : గుజరాత్ విజయాలకు జ్ఞాపకార్థంగా అక్బర్ నిర్మించిన కట్టడము.
→ తాజ్ మహల్ : షాజహాన్ తన భార్య జ్ఞాపకార్థం పాలరాతితో కట్టించిన సమాధి.
→ ఖురాన్ : ఇస్లాంల పవిత్ర గ్రంథము.
→ మక్తాబ్ : ఖురాన్, ఇస్లామిక్ చట్టాలను బోధించే పాఠశాల.
→ నవరత్నాలు : అక్బర్ ఆస్థానంలోని (కవులు) కళాకారులు తొమ్మిది మందిని నవరత్నాలు అంటారు.
→ ఛత్రపతి : శివాజి (మహరాజ్)కి రాయగఢ్ లో ఇవ్వబడిన బిరుదు.
→ పీష్వా : శివాజి పరిపాలనలో ప్రధాన మంత్రిని పీష్వా అంటారు.
→ అష్ట ప్రధానులు : శివాజి పాలనలో సహాయపడే ఎనిమిది మంది మంత్రులు (అధికారులు).
→ రాజపుత్రులు : ఉత్తర భారతదేశంలో ధైర్యసాహసాలు కలిగిన శక్తివంతమైన రాజవంశములు.
→ పోరాట యోధుడు : ధైర్యుడైన లేదా అనుభవజ్ఞుడైన సైనికుడు లేదా పోరాట యోధుడు.
→ రీజెంట్ : ఒక చక్రవర్తి మైనర్ లేదా అసమర్ధుడు అయినప్పుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలించడానికి నియమించబడిన వ్యక్తి.
→ మత విశ్వాసి : మత విశ్వాసాన్ని విశ్వసించే లేదా ఆచరించే వ్యక్తి.
→ గెరిల్లా యుద్ధం : కొంత మంది సైనికుల ఆకస్మిక దాడి, ఒక యుద్ధ వ్యూహం.
→ వ్యవసాయిక : వ్యవసాయ భూముల యాజమాన్యం మరియు వాడకానికి సంబంధించినది.
1.
3.
4.