AP 7th Class Social Notes Chapter 8 భక్తి – సూఫీ

Students can go through AP Board 7th Class Social Notes 8th Lesson భక్తి – సూఫీ to understand and remember the concept easily.

AP Board 7th Class Social Notes 8th Lesson భక్తి – సూఫీ

→ భక్తి ఉద్యమం 8వ శతాబ్దంలో మొదలై 17వ శతాబ్దం వరకు కొనసాగింది.

→ భక్తి అంటే దేవుని యందు ప్రేమ.

→ భక్తి రెండు రకాలుగా ఉంటుంది. అది సగుణ భక్తి, నిర్గుణ భక్తి.

→ సగుణ భక్తి అనగా భగవంతుని ఒక ఆకారంలో పూజించడం.

→ నిర్గుణ భక్తి అనగా భగవంతుని నిరాకారంగా పూజించడం.

→ భక్తి ఉద్యమాన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించారు.

→ ఆదిశంకరాచార్యులు కేరళలోని కాలడి గ్రామంలో జన్మించారు. వీరు అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించారు.

→ వివేక చూడామణి, సౌందర్యలహరి, శివానందలహరి, ఆత్మబోధలు ఆదిశంకరాచార్యుల వారి రచనలు.

AP 7th Class Social Notes Chapter 8 భక్తి – సూఫీ

→ రామానుజాచార్యులు శ్రీ పెరంబుదూలో క్రీ.శ. 1017లో జన్మించాడు.

→ రామానుజాచార్యులు విశిష్టాద్వైతాన్ని ప్రబోధించారు. శ్రీభాష్యం పేరుతో బ్రహ్మ సూత్రాలమ వ్యాఖ్యానించారు.

→ మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ద్వైతమనగా రెండు అని అర్థం. దీని ప్రకారం బ్రహ్మ మరియు ఆత్మ రెండూ వేర్వేరు అంశాలు.

→ వల్లభాచార్యుల ఆలోచనా విధానాన్ని శుద్ద అద్వైతమంటారు.

→ రామానందుడు ప్రయాగలో జన్మించారు.

→ రామానందుని శిష్యుడు కబీర్.

→ హిందూ ముస్లింల సమైక్యత కొరకు ప్రయత్నించిన మొదటి సాధువుగా కబీర్ ని చెప్పవచ్చు.

→ సంత్ రవిదాస్ బెనారస్లో నివసించారు. “హరిలో అందరూ, అందరిలోనూ హరి” అనేది వీరి బోధనల సారాంశం.

→ మీరాబాయి రాజ కుటుంబంలో జన్మించి కృష్ణ భక్తి తత్వాన్ని ప్రచారం చేసింది.

→ మీరాబాయి సంత్ రవిదాస్ యొక్క శిష్యురాలు.

→ చైతన్య మహాప్రభుని ‘శ్రీ గౌరంగ’ అని కూడా పిలుస్తారు.

→ శంకర దేవుడు అస్సాం ప్రాంత సాధువు.

→ శంకరదేవుడు సాంఘిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు సమావేశమవడానికి సత్రాలు లేక మఠములు మరియు నామ ఘర్లను ప్రారంభించాడు.

AP 7th Class Social Notes Chapter 8 భక్తి – సూఫీ

→ సిక్కు మత స్థాపకుడు గురునానక్, కబీర్ బోధనలను ఈయన విశేషంగా అభిమానించాడు.

→ గురునానక్ లాహోర్ సమీపంలోని ‘తల్వండి’ గ్రామంలో క్రీ.శ. 1469లో జన్మించాడు.

→ జ్ఞానేశ్వర్ ‘భగవత్ దీపిక’ పేరుతో భగవద్గీతకు వ్యాఖ్యానాన్ని రాశాడు. దీనినే ‘జ్ఞానేశ్వరి’ అని కూడా అంటారు.

→ జ్ఞానేశ్వర్ మరాఠీ భాషలో బోధనలు చేశాడు.

→ మొల్లమాంబ ప్రసిద్ధ తెలుగు కవయిత్రి. రామాయణాన్ని తెలుగులో రాసింది.

→ తాళ్ళపాక అన్నమాచార్యగా ప్రసిద్ధిగాంచిన అన్నమయ్య కడప జిల్లాలోని తాళ్ళపాక గ్రామంలో జన్మించాడు.

→ అన్నమయ్యను పద కవితా పితామహుడు అంటారు.

→ అన్నమయ్య శ్రీవేంకటేశ్వరుడిని కీర్తిస్తూ 32 వేల సంకీర్తనలు రాశారని ప్రతీతి.

→ ఇస్లాం మతంలోని సాంఘిక మత సంస్కరణ ఉద్యమాన్ని ‘సూఫీ ఉద్యమం’ అంటారు.

→ సూఫీ అనే పదం ‘సాఫ్’ అనే అరబిక్ పదం నుంచి గ్రహించబడింది. సాఫ్ అనగా స్వచ్ఛత లేదా శుభ్రత.

→ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ భారతదేశానికి చెందిన గొప్ప సూఫీ సాధువు.

→ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ద్వారా భారతదేశంలో ‘చిస్తీ’ పద్దతి స్థాపించబడింది.

→ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ క్రీ.శ. 1143లో పర్షియాలోని ‘సీయిస్థాన్’లో జన్మించారు.

→ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ క్రీ.శ. 1192లో భారతదేశాన్ని సందర్శించారు.

→ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ వారి దర్గా రాజస్థాన్‌లోని ‘అజ్మీర్’లో ఉన్నది.

→ నిజాముద్దీన్ ఔలియా చిస్తీ సాధువులలో అత్యంత ప్రసిద్ధి గాంచినవాడు.

→ గోదాదేవి తిరుప్పావైని రచించెను.

→ వహదాత్-ఉల్-ఉజూద్ అనగా ఏకేశ్వరోపాసనని సూఫీతత్వం విశ్వసిస్తుంది.

→ జీవుడు దేవుడిలోని అంశ అని విశిష్టాద్వైతం చెప్పింది.

→ భక్తి : భక్తి అనగా దేవుని యందు ప్రేమ.

→ సగుణ భక్తి : భగవంతుని ఒక ఆకారంలో పూజించడం.

→ నిర్గుణ భక్తి : భగవంతుని నిరాకారంగా పూజించడం.

→ ద్వైత సిద్ధాంతం : ద్వైతమనగా రెండు. బ్రహ్మ మరియు ఆత్మ. రెండూ వేర్వేరు అంశాలని చెప్పే సిద్ధాంతం. జీవుడు వేరు మరియు దేవుడు వేరు.

→ అద్వైత సిద్ధాంతం : అంతా ఒక్కటే “బ్రహ్మం’ అని చెప్పే సిద్ధాంతం. బ్రహ్మం ఒక్కటే అంతా నిండి వుంది. జీవుడే దేవుడు.

→ విశిష్టాద్వైత సిద్ధాంతం : జీవుడు దేవుడిలోని అంశ.

→ బ్రహ్మ సూత్రాలు : వ్యాసుడు లేదా బాదరాయణుడు రచించాడు. బ్రహ్మ సూత్రాలనే వేదాంత సూత్రం అని కూడా అంటారు.

→ వచనములు : బసవేశ్వరుని రచనలను వచనములంటారు.

→ మఠములు : సన్యాస జీవితం గడుపు సాధువులుండు నివాసాలు.

AP 7th Class Social Notes Chapter 8 భక్తి – సూఫీ

→ గురు గ్రాంథ్ సాహెబ్ : సిక్కుల పవిత్ర గ్రంథం. దీనిని గురునానక్ రచించారు.

→ సూఫీ ఉద్యమం : ఇస్లాం మతంలోని సాంఘిక, మత సంస్కరణోద్యమం.

→ సూఫీ : సూఫీ పదం సాఫ్ అనే అరబిక్ పదం నుంచి గ్రహించబడింది. దీని అర్థం స్వచ్ఛత లేదా శుభ్రత.

→ సౌభ్రాతృత్వం : ప్రజలందరి మధ్య ‘సోదర భావం’.

→ ఉపనిషత్తులు : వీటికి వేదాంతాలు అని పేరు. ఇవి వేదాలలో చివరి భాగాలుగా చెప్పబడినవి.

→ నిగూఢార్థం : ప్రత్యేక ఆసక్తి లేదా జ్ఞానంతో కొందరు సాధకులు తెలుసుకున్న తత్వజ్ఞానం.

→ సమతా వాదం : అందరూ సమానమేనన్న ఆలోచనా విధానం.

→ పరవశం : వ్యక్తి తనను తాను మరచిపోయే భావాతీత స్థితి.

→ మోక్షం : భౌతిక విషయాలకు అతీతమైన చైతన్యాన్ని పొంది ఆత్మ భగవత్ సాన్నిధ్యాన్ని చేరడం.

AP 7th Class Social Notes Chapter 8 భక్తి – సూఫీ 1

1.
AP 7th Class Social Notes Chapter 8 భక్తి – సూఫీ 2

2.
AP 7th Class Social Notes Chapter 8 భక్తి – సూఫీ 3

3.
AP 7th Class Social Notes Chapter 8 భక్తి – సూఫీ 4

4.
AP 7th Class Social Notes Chapter 8 భక్తి – సూఫీ 5