These AP 8th Class Biology Important Questions 6th Lesson జీవ వైవిధ్యం – సంరక్షణ will help students prepare well for the exams.
AP Board 8th Class Biology 6th Lesson Important Questions and Answers జీవ వైవిధ్యం – సంరక్షణ
ప్రశ్న 1.
70 సం||ల క్రితం ఉన్న జంతువులకు, ఇప్పుడు కనిపించే జంతువులలో భేదాలు ఏమిటి ? అవి కనిపించకుండా పోవటానికి కారణాలు ఏమిటి ?
జవాబు:
70 సం||రాల క్రితం ఉండే పులులు, చిరుతలు, కొండ్రిగాడు, ముళ్ళపందులు వంటి జంతువులు నేడు కనిపించటం కరువైపోయింది. వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వీటికి ప్రధాన కారణం గతంలో ఉన్న దట్టమైన అడవులు.
ప్రశ్న 2.
మీ ప్రాంతంలో ఏదైనా జాతి అంతరించి పోయిందా ? వాటి గురించి తెలుసుకొని రాయండి.
జవాబు:
మా ప్రాంతాలలో రాబందులు అంతరించిపోయాయి. ఒకప్పుడు మృతకళేబరాలను అనటానికి వచ్చే ఈ పెద్ద పక్షులు నేడు కనిపించటం లేదు. అదేవిధంగా పిచ్చుకల సంఖ్య కూడ గణనీయంగా తగ్గి కనిపించుట లేదు.
ప్రశ్న 3.
ఈ జీవులు అంతరించి పోవటానికి కారణాలు చర్చించండి.
జవాబు:
1. అధిక మోతాదులో వాడిన D.D.T. వలన రాబందుల గుడ్లు పెంకు పలచబడి వాటి ఉత్పత్తి సామర్థ్యం తగ్గిందని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు.
2. నేటి కాలంలో బాగా అభివృద్ధి చెందిన మొబైల్ వాడకం వలన సెల్ టవర్ రేడియేషన్ పిచ్చుకల ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీశాయని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు.
3. వీటితోపాటుగా మారుతున్న జీవన విధానాల వలన, చెట్లు నరకటం, పూరి గుడిసెలు తగ్గటం వంటి చర్యలు కూడా పిచ్చుకలు అంతరించటానికి మరికొన్ని కారణాలు.
ప్రశ్న 4.
మన రాష్ట్రానికే పరిమితమైన ఒక ఎండమిక్ జాతిని పేర్కొనండి.
జవాబు:
‘జెర్డాన్స్ కర్’ ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక ఎండిమిక్ జాతి.
ప్రశ్న 5.
క్రింది చిత్రాలలో ఏ జంతువు మన దేశానికి ఎండమిక్ జాతి అవుతుంది?
జవాబు:
పై చిత్రాలలో బెంగాల్ టైగర్ మన దేశానికి చెందిన ఎండమిక్ జాతి.
ప్రశ్న 6.
మీ తల్లిదండ్రులను అడిగి వారి బాల్యంలో గల వివిధ రకాల వరి రకాల గురించి తెలుసుకోండి.
జవాబు:
మా తల్లిదండ్రుల బాల్యంలో క్రింది వరి రకాలు కలవు.
- స్వర్ణ
- మసూరి
- నంబర్లు
- హంస
- పాల్గుణ
ప్రశ్న 7.
ఆపదలో ఉన్న ఈ క్రింది జంతు, వృక్ష జాతులను గుర్తించి పేర్లు రాయండి.
జవాబు:
ప్రశ్న 8.
ఆంధ్రప్రదేశ్ లోని అంతరించిపోతున్న రెండు జంతువులు ఏమిటి ? వాటి గురించి రాయండి.
జవాబు:
అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం (IUCN) మరియు జంతుశాస్త్ర సంఘం, లండన్ (ISL) విడుదల చేసిన జాబితా ప్రకారం ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, కర్నూల్ జిల్లాలోని నంధ్యాల, కొన్ని ప్రాంతాలలో ఉండే సాలీడు-గూటి టారంటలా (Gooty-tarantula) అలాగే కర్నూల్ లోని పుల్లెందు పక్షుల సంరక్షణ కేంద్రంలోని బట్టమేక పక్షి (Great indian bustard) అత్యంత ఆపదలో ఉన్న జీవులుగా పేర్కొన్నారు.
ఎ) గూటీ టారంటలా సాలీడు :
1) శాస్త్రీయంగా ఫిసిలో తీరియా మెటాలికా అని పిలువబడే గూటీ టారంటలా సాలీడు ఆన్ లైన్ ద్వారా అమెరికా, యూరప్ మార్కెట్లలో అమ్ముడవుతోంది.
2) ఆవాసాలను ధ్వంసం చేయడం, అడవులను నరికివేయడం, వంట చెరకు సేకరణ మొదలైన కార్యక్రమాలు ఈ సాలీళ్ల సంఖ్య తగ్గడానికి కారణమవుతున్నాయి.
3) ఆవాసాల సంరక్షణ, క్షేత్ర స్థాయిల్లో అవగాహన, జాతీయ అటవీ సంరక్షణ చట్టం, జాతీయ, అంతర్జాతీయ వ్యాపార చట్టాలు పటిష్టంగా అమలుచేయడం ద్వారా ఈ జాతుల సంరక్షణకు కృషి చేయాలని సూచిస్తున్నారు.
బి) బట్టమేక పిట్ట :
1) బట్టమేక పక్షులు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నప్పటికీ వీటి సంఖ్య కేవలం 50 నుండి 249 వరకు మాత్రమే ఉన్నట్లు అంచనా.
2) అడవులను నరికివేసి వ్యవసాయ భూములుగా మార్చటం వల్ల వీటికి ఆపద ఏర్పడింది.
3) సౌత్ కొరియాలోని ‘జేజూ’లో జరిగిన అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘ సమావేశంలో (ZSL మరియు IUCN) ప్రమాదం అంచున ఉన్న జీవజాతుల గురించిన జాబితాను విడుదల చేసింది.
ప్రశ్న 9.
ప్రజల్లో జీవవైవిధ్యంపై అవగాహన కలిగించుటకు కొన్ని నినాదాలు లేదా ఒక కరపత్రం చేయండి.
జవాబు:
నినాదాలు :
జీవ హింస – మహాపాపం
జీవించు – అన్ని జీవులనూ జీవించనివ్వు
బ్రతికే హక్కు – అన్ని జీవులకూ ఉంది
జీవులను కాపాడుదాం – జీవవైవిధ్యాన్ని నిలబెడదాం
జీవులు లేని ప్రకృతి – జీవం లేని ప్రకృతి
కరపత్రం : నానాటికీ మన చుట్టూ ఉన్న చాలా రకాల జీవులు అంతరించిపోతున్నాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే, ఇవి అంతరించటానికి ప్రధాన కారణం మానవ చర్యలే. ఈ ప్రకృతిలో మనతోపాటు ప్రతి జీవికీ జీవించే హక్కు ఉంది. దానిని మనం ధిక్కరించరాదు. భూమిపై అన్ని జీవరాశులు ఉన్నప్పుడే జీవుల మధ్య తులాస్థితి ఉంటుంది. మన జీవనం సక్రమంగా ఉంటుంది. కావున మనం జీవిద్దాం, ఇతర జీవులను జీవించనిద్దాం.
ప్రశ్న 10.
కంప్రెస్ట్ కార్డ్ బోర్డ్ ఎలా తయారవుతుంది ? దాని ప్రయోజనం ఏమిటి ?
జవాబు:
కంప్రెస్ట్ కార్డ్ బోర్డ్ :
- ఇది చెక్కపొట్టు, కర్రముక్కలతో కలిపి చేసిన గుజ్జుతో తయారవుతుంది.
- ఈ గుజ్జుకు రసాయన సల్ఫేట్లు కలిపి సెల్యులోజును తయారుచేస్తారు.
- గుజ్జును రెండు పొరలుగా పేర్చి వాటి మధ్యలో కర్రపొట్టును చేర్చుతారు.
- దీనిని గట్టిగా అదిమి (కంప్రెస్) పెట్టి ఆరబెడతారు.
- ఇలా తయారయిన కార్డ్ బోర్డ్ కర్రలా గట్టిగా బలంగా ఉంటుంది.
ప్రయోజనం :
1. ‘కంప్రెస్ట్ కార్డ్ బోర్డ్’ తయారీకి చెక్కముక్కలు, చెక్కపొట్టు అవసరం.
2. కాబట్టి చెట్టును నరకవలసిన అవసరం ఉండదు.
3. ఇది అడవుల నరికివేత తగ్గించటంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రశ్న 11.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని జాతీయ పార్కులు మరియు సంరక్షణ కేంద్రాల గురించి సమాచారం సేకరించండి.
జవాబు:
ప్రశ్న 12.
రీసైకిల్డ్ కాగితాన్ని వృథా వార్తాపత్రికల నుంచి ఎలా తయారుచేస్తారు ? (లేదా) కాగితాన్ని పునఃచక్రీయ పద్ధతిలో తయారుచేసే విధానాన్ని రాయండి.
జవాబు:
రీసైకిల్డ్ కాగితాన్ని వృథా వార్తాపత్రికల నుంచి తయారుచేయడం
కావలసిన వస్తువులు : రెండు ప్లాస్టిక్ తొట్టెలు, కర్ర గరిటె, నీరు, శుభ్రమైన నూలు దుస్తులు, పాత వార్తా పత్రికలు, వైర్ స్క్రీన్, కొలపాత్ర, ప్లాస్టిక్ చుట్ట, బ్లెండర్ (mixer) బరువైన పుస్తకాలు, రోలర్.
తయారీ పద్ధతి :
1) కత్తిరించిన న్యూస్ పేపర్ ముక్కలను నీటితో నిండిన తొట్టెలో వేసి ఒక రోజు నానబెట్టాలి.
2) పిండి రుబ్బే దానిలో (బ్లెండర్) రెండు కప్పులు నానబెట్టిన కాగితం, ఆరు కప్పుల నీటిని చేర్చండి. మెత్తని గుజ్జు తయారయ్యేలా రుబ్బి శుభ్రమైన తొట్టెలో వేయాలి.
3) తొట్టెను 1/4వ వంతు నూరిన పేపర్ గుజ్జు మిశ్రమం (Paper pulp) తో నింపాలి.
4) పొడిగా, బల్లపరుపుగా ఉన్న తలంపై ఒక వస్త్రాన్ని పరచాలి. తడి పేపర్ గుజ్జు కింద వైర్ స్క్రీన్ ను ఉంచాలి. స్క్రీన్‌ను మెల్లగా బయటికి తీసి పేపర్ గుజ్జును ఒత్తుతూ అందులోని నీటిని తీసివేయాలి.
5) జాగ్రత్తగా వస్త్రం ఫైన స్క్రీన్ ను బోర్లించాలి. గట్టిగా క్రిందికీ ఒత్తి స్క్రీన్ ను తీసివేయాలి.
6) కాగితపు గుజ్జు మిశ్రమంపై మరో గుడ్డ , వస్త్రంను పరచాలి. గుడ్డపై ఒక ప్లాస్టిక్ షీట్ ను పరిచి దానిపై బరువు కోసం పుస్తకాలను పేర్చాలి.
7) కొన్ని గంటల తరువాత పుస్తకాలు, గుడ్డను తీసి పేపరును ఎండలో ఆరనివ్వాలి.
8). హెయిర్ డ్రయర్‌ను ఉపయోగించి కూడా పేపరును ఆరబెట్టవచ్చును.
9) రంగులు గల పేపర్‌ను తయారుచేయడానికి కాగితపు గుజ్జుకు వంటకాల్లో ఉపయోగించే రంగు చుక్కలను కలపాలి. ఏర్పడిన కాగితాన్ని ఇస్త్రీ చేసి కావలసిన పరిమాణంలో, ఆకారంలో కత్తిరించుకోవాలి.
10) అందమైన గ్రీటింగ్ కార్డులు, ఫైల్ కవర్లు, బ్యాగులు మొదలగునవి రీ సైకిల్డ్ పేపరను ఉపయోగించి తయారు చేయవచ్చును.
ప్రశ్న 13.
మీకు తెలిసిన ఏవైనా నాలుగు ఔషధ మొక్కల పేర్లు మరియు వాటి ఉపయోగాలు తెలపండి.
జవాబు:
మా ప్రాంతంలో నాకు తెలిసిన ఔషధ మొక్కలు
- తులసి – దగ్గును నివారిస్తుంది
- వేప – యాంటీ సెప్టిక్
- పసుపు – యాంటిసెప్టిక్ మరియు సౌందర్య లేపనాల తయారీ
- సర్పగంధి – పాము కాటు నివారణ మందుల తయారీలో ఉపయోగపడుతుంది.
ప్రశ్న 14.
జతపరచండి మరియు కింది ప్రశ్నకు జవాబివ్వండి.
జవాబు:
1 – డి, 2 – సి, 3 – ఎ, 4 – బి
ప్రశ్న 15.
పక్షులు ఆహారం, నివాసం కొరకు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళే విధానాన్ని ఏమంటారు. ఇలా వెళ్ళే పక్షుల పేర్లు వ్రాయండి.
జవాబు:
పక్షులు ఆహారం, నివాసం మరియు సంతానోత్పత్తికి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్ని వలసపోవడం అంటారు. ఉదా : సైబీరియన్ కొంగ, పెలికన్ పక్షులు.
ప్రశ్న 16.
మీ ప్రదేశంలోని జీవ వైవిధ్యాన్ని పరిరక్షణకై ఏవైనా 2 నినాదాలు రాయండి.
జవాబు:
1. ప్రకృతిలో జీవించు – జీవజాతులను పరిరక్షించు ,
2. వృక్షోరక్షతి రక్షితః –
3. ప్రకృతిలో ప్రతిజీవి అపురూపం – వాటిని సంరక్షించడం మన కర్తవ్యం.
ప్రశ్న 17.
కింది పేరాను చదవండి.
“ఒక్కోసారి రాత్రివేళల్లో కూడా కొన్ని పక్షులు ఆకాశంలో గుంపులుగా ఎగురుతూ కనిపిస్తాయి. కొన్ని పక్షులకు శాశ్వత నివాసం ఉండదు. ఇవి గుంపులు గుంపులుగా ఒక చోటు నుండి మరో చోటుకు ఆవాసం, ఆహారం కోసం వెళుతుంటాయి. దీనినే వలస అంటారు. ఈ పక్షులనే “వలసపక్షులు” అంటారు. ఈ వలస పక్షులు వర్షాకాలంలో మన రాష్ట్రంలోని కొల్లేరు, పులికాట్ సరస్సులకు వస్తాయి. ఈ సరస్సుల దగ్గరున్న గ్రామాలలోని చెట్లపై ఇవి నివసిస్తూ ఉంటాయి. ప్రస్తుతం చెట్లను నరికివేయడం వలన నివాసాలు అందుబాటులో లేకపోవడంతో వలస పక్షుల సంఖ్య తగ్గిపోయింది.
ఎ) వలస పక్షులు అని వేటిని అంటారు ? అవి ఎందుకు వలసపోతాయి ?
బి) మనదేశానికి పక్షుల వలస తగ్గిపోవడానికి కారణం ఏమి ?
జవాబు:
ఎ) ఆహారం కోసం ఆవాసం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళే పక్షులను వలస పక్షులు అంటారు.
బి) పక్షులు వలస వచ్చే ప్రాంతాల గ్రామాలలో చెట్లను కొట్టివేయడం వల్ల ఆవాసాలు తగ్గి పక్షుల వలస తగ్గిపోతున్నది.
ప్రశ్న 18.
కాగితాన్ని పొదుపుగా వాడుకొనేందుకు నీవు తీసుకొనే జాగ్రత్తలు ఏమిటి ?
జవాబు:
1. కాగితాలను అవసరమైతేనే వాడాలి. రీసైకిల్ చేయబడిన కాగితాన్ని వాడాలి.
2. ప్రభుత్వ లావాదేవీలన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలోకి మారితే పేపర్ల వినియోగం చాలావరకు తగ్గుతుంది.
ప్రశ్న 19.
కింది తెలిపిన సమాచారాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రతిరోజు ఒకేరకమైన పక్షులు కనిపిస్తున్నాయా ? ప్రత్యేకించి కొన్ని కాలాలలో హఠాత్తుగా ఏమైనా మార్పులు ఏర్పడినాయా? కొత్తరకం పక్షులు ఎక్కడి నుండి వచ్చాయి ? ఈ విధంగా కొత్త పక్షులు మన ప్రాంతానికి ఆహారం, నివాసం కొరకు వస్తుంటాయి. దీనినే ‘వలస’ అంటారు. ఇలాంటి పక్షులను వలస పక్షులు అంటారు. వర్షాకాలంలో ఎన్నో రకాల పక్షులు మనరాష్ట్రంలో కొల్లేరు, పులికాట్ సరస్సులకు వలస వస్తాయి. ఇవి సమీప గ్రామాలలోని చెట్లపై గూళ్లు కట్టుకొంటాయి. పూర్వపు రోజుల్లో పక్షుల రాకను శుభసూచకం అని నమ్మేవారు. కానీ ప్రస్తుతం చెట్లు నరికివేతకు గురవుతుండటం వల్ల పక్షులు గూళ్ళు కట్టుకోవడానికి అనువైన స్థలాలు లేక అవి తమ విడిదిని మార్చుకొంటున్నాయి.
1. పై సమాచారం ఏ అంశాన్ని తెలియజేస్తోంది ?
జవాబు:
పక్షుల వలసపై పర్యావరణ ప్రభావం
2. వేరే ప్రాంతం నుండి కొత్త పక్షులు మన ప్రాంతానికి రావడాన్ని ఏమంటారు ?
జవాబు:
పక్షుల వలస
3. పక్షుల వలస రావాలంటే ఏమి చేయాలి ?
జవాబు:
వాటికి ఆవాసాలైన చెట్లను నరకకుండా పరిరక్షించాలి. సరస్సుల పర్యావరణాన్ని మానవ కార్యకలాపాలు కలుషితం , కాకుండా చూడాలి.
4. నీకు తెలిసిన కొన్ని వలస పక్షుల పేర్లు రాయండి ?
జవాబు:
పెలికన్ పక్షులు, సైబీరియన్ కొంగ.
1 మార్కు ప్రశ్నలు
ప్రశ్న 1.
జీవవైవిధ్యం అంటే ఏమిటి ?
జవాబు:
జీవవైవిధ్యం : మొక్కలు, జంతువుల్లో కనపడే వైవిధ్యాలను జీవవైవిధ్యం అంటారు.
ప్రశ్న 2.
అంతరించిన జాతులు అంటే ఏమిటి?
జవాబు:
అంతరించిన జాతులు : భూమి పైనున్న ఆవరణ వ్యవస్థలలో పూర్తిగా కనబడకుండా అంతరించిపోయిన జాతులను అంతరించిన జాతులు అంటారు. ఉదా : డైనోసార్లు, హంసల్లాంటి తెల్ల కొంగలు మొదలయినవి. ఇక ఇలాంటి జీవులను మనం తిరిగి భూమిపై చూడలేము.
ప్రశ్న 3.
ఆపదలో ఉన్న జాతులు అని వేటిని అంటారు.
జవాబు:
భూమిపైనున్న ఆవరణ వ్యవస్థలలో సంఖ్యాపరంగా బాగా తక్కువగా ఉన్న జాతులను ఆపదలో ఉన్న జాతులు అంటారు. అవి నివసించే ప్రాంతాలు మానవుని వల్ల నాశనం చేయబడటం వల్ల అవి నివాసం కోల్పోయి ఆపదలో ఉన్నాయి.
ప్రశ్న 4.
ఎండమిక్ జాతులు అనగానేమి?
జవాబు:
భూమిపై ఒక ప్రత్యేక ఆవాసానికి పరిమితమైన జాతులను ఎండమిక్ జాతులు అంటారు.
ఉదా : 1. కంగారూలు ఆస్ట్రేలియాలోనే వుంటాయి.
2. కోపిష్టి మదపుటేనుగులు ఆఫ్రికా అడవులలోనే ఉంటాయి.
3. ఒంగోలు జాతి గిత్తలు మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటాయి. కానీ ఈ మధ్య వీటిని కృత్రిమ గర్భధారణ ద్వారా బ్రెజిల్ లో పెంచుతున్నారు)
ప్రశ్న 5.
భూమిపై అధిక జీవవైవిధ్యం ఎక్కడ కనిపిస్తుంది ?
జవాబు:
భూమిపై అధిక జీవవైవిధ్యం అడవులలో మాత్రమే కనిపిస్తున్నది. అడవులలో ఒకే జాతి మొక్కలు, జంతువుల మధ్య వైవిధ్యం కనబడుతుంది.
ప్రశ్న 6.
వలస అనగానేమి?
జవాబు:
వాతావరణ ప్రతికూలతల వల్ల ప్రత్యుత్పత్తి జరుపుకొనటానికి పక్షులు వాటి సహజ నివాసం వీడి మరొక చోటుకు (మారటాన్ని) వెళ్ళటాన్ని ‘వలస’ అంటారు.
ప్రశ్న 7.
రామగుండంలో పులులు ఎందుకు అంతరించాయి ?
జవాబు:
1. ఇక్కడ థర్మల్ పవర్ కేంద్రం ఏర్పాటు వల్ల వేల ఎకరాల అటవీ భూమి తగ్గిపోయింది.
2. అందుకే పులుల సంఖ్య తగ్గింది.
ప్రశ్న 8.
మన దేశంలో పులులు ఎక్కడైనా కనిపిస్తున్నాయా ?
జవాబు:
అవును. శ్రీశైలం అడవులలో కనిపిస్తున్నాయి.
ప్రశ్న 9.
అడవిని, అడవి జీవులను కాపాడటంలో టైగర్ ప్రాజెక్ట్ ఎలా ఉపయోగపడింది ?
జవాబు:
1. పులిని కాపాడాలంటే. అడవిని కాపాడాలి.
2. అడవిని కాపాడితే అది జీవవైవిధ్యపు నిల్వగా మారి ఎన్నో రకాల మొక్కలు, జంతువులు, పక్షులకు ఆవాసంగా మారుతుంది.
3. ఇలా అడవిని సంరక్షించటం అంటే పులుల సంరక్షణే !
ప్రశ్న 10.
ఇదివరకు పులులు ఉండి, ఇప్పుడు తగ్గితే అది జింకలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ?
జవాబు:
1. పులుల ఆహారం ఎక్కువగా జింకలే.
2. పులులు’ తగ్గితే జింకల జనాభా పెరుగుతుంది.
ప్రశ్న 11.
జింకల సంఖ్య పెరిగితే మొక్కల పరిస్థితి ఏమిటి ?
జవాబు:
1. జింకలు గడ్డిని, మొక్కలను, వేరుశనగ, కందిచెట్లను తింటాయి.
2. పులులు తగ్గి, జింకల సంఖ్య పెరగటం వల్ల, అవి మొక్కలను తింటాయి కాబట్టి మొక్కల సంఖ్య బాగా తగ్గుతుంది.
ప్రశ్న 12.
మన రాష్ట్రానికే పరిమితమైన ఒక ఎండమిక్ జాతిని పేర్కొనండి.
జవాబు:
‘జెర్డాన్స్ కర్’ ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక ఎండమిక్ జాతి.
ప్రశ్న 13.
ప్రకృతిలో మిమ్మల్ని అధికంగా ఆకర్షించినదేది?
జవాబు:
ప్రకృతిలో మా ఊరి చెరువు, దాని ప్రక్కన ఉన్న దేవాలయం నన్ను అధికంగా ఆకర్షించాయి. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా, అందంగా, హాయిగా ఉంటుంది.
లక్ష్యాత్మక నియోజనము
ప్రశ్న 1.
ప్రపంచం అంతటా రోజుకు ………….. జాతులు అంతరించిపోతున్నాయి.
ఎ) 26
బి) 27
సి) 28
డి) 30
జవాబు:
బి) 27
ప్రశ్న 2.
నెమళ్ళకు ……………… ఆహారం అంటే ఎంతో ఇష్టం
ఎ) చీమలు
బి) సాలీడు
సి) పాములు
డి) పిల్ల నెమళ్ళు
జవాబు:
సి) పాములు
ప్రశ్న 3.
‘పులుల లోయగా’ ఒకప్పుడు ఈ పట్టణం వద్ద నున్న అడవి పిలవబడింది.
ఎ) మంచిర్యాల
బి) కరీంనగర్
సి) అడ్డతీగల
డి) చిత్తూరు
జవాబు:
ఎ) మంచిర్యాల
ప్రశ్న 4.
ఏనుగుల బీభత్సం ఎక్కువగా ఏ జిల్లాలో ఉంటుంది? )
ఎ) చిత్తూరు
బి) ఖమ్మం
సి) వరంగల్
డి) రంగారెడ్డి
జవాబు:
ఎ) చిత్తూరు
ప్రశ్న 5.
కొల్లేరు సరస్సు ఏ జిల్లాలో ఉంది?
ఎ) పశ్చిమగోదావరి
బి) వరంగల్
సి) శ్రీకాకుళం
డి) విజయనగరం
జవాబు:
ఎ) పశ్చిమగోదావరి
ప్రశ్న 6.
పాండా సంరక్షణ బాధ్యతను తీసుకున్న సమాఖ్య
ఎ) IUWC
బి) NGC
సి) WWF
డి) ZSL
జవాబు:
సి) WWF
ప్రశ్న 7.
మన దేశంలో బిల్లులు ఎక్కువగా ……………. కనుమలలో ఉన్నాయి.
ఎ) తూర్పు
బి) పశ్చిమ
సి) ఉత్తర
డి) దక్షిణ
జవాబు:
బి) పశ్చిమ
ప్రశ్న 8.
శ్రీశైల అభయారణ్యం ……………. సంరక్షణ కోసం కేటాయించారు.
ఎ) సింహాల
బి) జింకల
సి) పాముల
డి) పులుల
జవాబు:
డి) పులుల
ప్రశ్న 9.
రాబందుల ఆహారం ………………..
ఎ) మృత కళేబరాలు
బి) లేళ్ళు
సి) కుందేళ్ళు
డి) నక్కలు
జవాబు:
ఎ) మృత కళేబరాలు
ప్రశ్న 10.
టైగర్ ప్రాజెక్టు ………….. సం||లో ప్రారంభించారు.
ఎ) 1971
బి) 1972
సి) 1973
డి) 1974
జవాబు:
బి) 1972
ప్రశ్న 11.
హైదరాబాద్ లో ప్రపంచ జీవవైవిధ్య సదస్సు జరిగిన సంవత్సరం
ఎ) 2010
బి) 2012
సి) 2015
డి) 2011
జవాబు:
బి) 2012
ప్రశ్న 12.
ప్రపంచంలో అంతరించిపోతున్న 100 జంతువుల ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కి చెందినవి
ఎ) 2
బి) 4
సి) 6
డి) 8
జవాబు:
ఎ) 2
ప్రశ్న 13.
గూటీ టారంటలా సాలీడు ఏ జిల్లాలో కన్పిస్తుంది ?
ఎ) కర్నూలు
బి) కడప
సి) అనంతపురం
డి) చిత్తూరు
జవాబు:
ఎ) కర్నూలు
ప్రశ్న 14.
బట్టమేక పక్షిని సంరక్షించే పుల్లెందు పక్షుల సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉన్నది ?
ఎ) కడప
బి) ప్రకాశం
సి) కర్నూలు
డి) అనంతపురం
జవాబు:
సి) కర్నూలు
ప్రశ్న 15.
జీవ వైవిధ్యానికి దారితీసేవి
ఎ) జీవుల మధ్య పోలికలు
బి) జీవుల మధ్య భేదాలు
సి) జీవుల మధ్య పోరాటాలు
డి) జీవుల అలవాట్లు
జవాబు:
బి) జీవుల మధ్య భేదాలు
ప్రశ్న 16.
E.O. విల్సన్ అభిప్రాయం ప్రకారం ప్రపంచమంతటా సంవత్సరానికి ఎన్ని జాతులు అంతరించిపోతున్నాయి?
ఎ) 100
బి) 1000
సి) 10,000
డి) 1,00,000
జవాబు:
సి) 10,000
ప్రశ్న 17.
W.W.F ను విస్తరించి వ్రాయగా
ఎ) వరల్డ్ వైడ్ ఫండ్
బి) వరల్డ్ వైడ్ ఫెడరేషన్
సి) వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్
డి) వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్
జవాబు:
డి) వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్
ప్రశ్న 18.
I.U.W.C విస్తరించి వ్రాయగా
ఎ) ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్
బి) ఇండియన్ యూనియన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్
సి) ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వెల్త్ కన్జర్వేషన్
డి) ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కమిటీ
జవాబు:
ఎ) ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్
ప్రశ్న 19.
అంతరించిపోతున్న మొక్కలు, జంతువుల సమాచారాన్ని తెల్పేది
ఎ) రెడ్ డేటా బుక్
బి) గ్రీన్ డేటా బుక్
సి) బ్లూడేటా బుక్
డి) బ్లాక్ డేటా బుక్
జవాబు:
ఎ) రెడ్ డేటా బుక్
ప్రశ్న 20.
ఎండమిక్ జాతులు అనగా
ఎ) అంతరించిపోతున్న జాతులు
బి) అరుదైన జాతులు
సి) ఒక ప్రాంతానికి పరిమితమైన జాతులు
డి) అంతరించిపోయిన జాతులు
జవాబు:
సి) ఒక ప్రాంతానికి పరిమితమైన జాతులు
ప్రశ్న 21.
ఈ క్రింది వానిలో ఎండమిక్ జాతి
ఎ) ఏనుగు
బి) సింహం
సి) కంగారు
డి) పులి
జవాబు:
సి) కంగారు
ప్రశ్న 22.
ఈ క్రింది వానిలో విదేశీ ఆక్రమణ జాతికి ఉదాహరణ
ఎ) హైదరాబాదు కాకి
బి) హైదరాబాదు పావురం
సి) హైదరాబాదు పిచ్చుక
డి) హైదరాబాదు చిలుక
జవాబు:
బి) హైదరాబాదు పావురం
ప్రశ్న 23.
గుట్టపుడెక్క దేనికి ఉదాహరణ ?
ఎ) ఆపదలో ఉన్న జాతి
బి) అంతరించిపోతున్న జాతి
సి) విదేశీయ ఆక్రమణ జాతి
డి) అరుదైన జాతి
జవాబు:
సి) విదేశీయ ఆక్రమణ జాతి
ప్రశ్న 24.
పూర్వకాలంలో భారతదేశంలో ఎన్ని రకాల వరి వంగడాలు సాగులో ఉన్నాయి?
ఎ) 10,000
బి) 20,000
సి) 40,000
డి) 50,000
జవాబు:
డి) 50,000
ప్రశ్న 25.
పూర్వకాలంలో ఎన్ని రకాల మొక్కల జాతులను మానవుడు ఆహారంగా ఉపయోగించాడు?
ఎ) 5,000
బి) 10,000
సి) 15,000
డి) 20,000
జవాబు:
ఎ) 5,000
ప్రశ్న 26.
మనదేశంలో ఎన్ని పులి సంరక్షక కేంద్రాలున్నాయి ?
ఎ) 23
బి) 25
సి) 27
డి) 29
జవాబు:
సి) 27
ప్రశ్న 27.
పులులను సంరక్షించుకోవటం ద్వారా వీనిని కాపాడుకోవచ్చు.
ఎ) అడవులు
బి) గడ్డిమైదానాలు
సి) పర్వత ప్రాంతాలు లోయలు
డి) ఆవరణ వ్యవస్థలు
జవాబు:
డి) ఆవరణ వ్యవస్థలు
ప్రశ్న 28.
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ కలదు ?
ఎ) అస్సోం
బి) గౌహతి
సి) మేఘాలయ
డి) షిల్లాంగ్
జవాబు:
బి) గౌహతి
ప్రశ్న 29.
పాకాల వన్య సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు ?
ఎ) కరీంనగర్
బి) ఖమ్మం
సి) వరంగల్
డి) ఆదిలాబాదు
జవాబు:
సి) వరంగల్
ప్రశ్న 30.
ఒకటన్ను పేపర్ తయారు చేయడానికి ఎన్ని వృక్షాలని నరికివేయవలసి ఉంటుంది ?
ఎ) 17
బి) 22
సి) 25
డి) 27
జవాబు:
ఎ) 17
ప్రశ్న 31.
మనదేశానికి పక్షులు యిక్కడ నుండి వలస వస్తాయి.
ఎ) సైబీరియా
బి) మంగోలియ
సి) చైనా
డి) కజకిస్థాన్
జవాబు:
ఎ) సైబీరియా
ప్రశ్న 32.
అడవుల నరికివేత తగ్గించుటలో ఉపయోగపడే కలప
ఎ) టేకు
బి) కంప్రెస్ట్ కార్డ్ బోర్డ్
సి) బైండింగ్ కార్డ్ బోర్డ్
డి) క్బార్డ్
జవాబు:
బి) కంప్రెస్ట్ కార్డ్ బోర్డ్
ప్రశ్న 33.
కోరింగ జంతు సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు ?
ఎ) తూర్పు గోదావరి
బి) పశ్చిమ గోదావరి
సి) కృష్ణా
డి) విజయనగరం
జవాబు:
ఎ) తూర్పు గోదావరి
ప్రశ్న 34.
రేడియేషన్ వల్ల ప్రస్తుతం అంతరిస్తున్న పక్షి జాతి
ఎ) కాకి
బి) రాబందు
సి) పిచ్చుక
డి) కొంగలు
జవాబు:
సి) పిచ్చుక
ప్రశ్న 35.
ఇటీవల మనదేశంలో అంతరిస్తున్న పక్షి జాతి
ఎ) నెమళ్ళు
బి) రాబందులు
సి) కాకులు
డి) కొంగలు
జవాబు:
బి) రాబందులు
ప్రశ్న 36.
భారత ప్రభుత్వం టైగర్ ప్రాజెక్టును ప్రారంభించిన సంవత్సరం
A) 1978
B) 1979
C) 1988
D) 1972
జవాబు:
D) 1972
ప్రశ్న 37.
కింది వాటిలో జాతుల వైవిధ్యాన్ని వివరించునది.
A) ఇవ్వబడిన ప్రాంతంలో ఉండే ఆపదలో వున్న జాతుల జనాభా
B) ఇవ్వబడిన ప్రాంతంలో ఉండే వివిధ రకాల జాతులు
C) ఇచ్చిన ప్రాంతంలో అంతరించిపోయిన జాతులు లేకపోవటం
D) ఇవ్వబడిన ప్రాంతానికి స్థానికము కాని జాతుల సంఖ్య
జవాబు:
B) ఇవ్వబడిన ప్రాంతంలో ఉండే వివిధ రకాల జాతులు
ప్రశ్న 38.
భారతదేశంలో అధిక సంఖ్యలో ఎండమిక్ జాతులు వున్నాయి. ప్రపంచంలోని ఎండమిక్ జాతులైన ఉ భయచరాలలో దాదాపు 62%, బల్లుల్లో 50% భారతదేశంలో ఈ ప్రాంతంలో వున్నాయి.
A) హిమాలయాలు
B) పశ్చిమ కనుమలు
C) ఆరావళి
D) రాజస్థాన్ ఎడారి
జవాబు:
B) పశ్చిమ కనుమలు
ప్రశ్న 39.
“జాతి భావం” (Species Concept) కు సంబంధించిన వాక్యం
A) అన్ని జీవులకు వర్తించదు
B) లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులకు వర్తించును
C) ఆలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులకు వర్తించదు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
ప్రశ్న 40.
జాతీయపార్కు అనే దానికి సరియైన స్టేట్ మెంట్ గుర్తించండి.
1. ఒక విశాలమైన స్థలంలో వన్యజాతి జీవులను సహజమైన ఆవాసంలో సంరక్షించే ప్రదేశాలు
2. ఆయా జీవజాతుల ఆవాసాలపై ప్రభావం చూపకుండా ఉండేవిధంగా మానవ చర్యలను పరిమితంగా అనుమతించేవి
A) 1 మాత్రమే
B) 1 మరియు 2
C) 2 మాత్రమే
D) పై రెండు కాదు
జవాబు:
B) 1 మరియు 2
ప్రశ్న 41.
జతపరచుటలో సరైన సమాధానం గుర్తించండి.
A) 1-ఎ, 2-సి, 3-బి
B) 1-సి, 2-బి, 3-ఎ
C) 1 -బి, 2 – ఎ, 3-సి
D) 1-సి, 2-ఎ, 3-బి
జవాబు:
D) 1-సి, 2-ఎ, 3-బి
ప్రశ్న 42.
పర్యావరణ నిర్వహణ ఎందుకు అవసరం ?
A) మానవ మనుగడ కొనసాగింపు కొరకు
B) జంతువులు అంతరించకుండా
C) ప్రకృతి సమతుల్యత కొరకు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
ప్రశ్న 43.
రెడేటా పుస్తకం నందు కింది అంశాలు ఉంటాయి.
A) ఆపదలో ఉన్న అంతరించిపోతున్న జీవుల జాబితా ఉంటుంది
B) సాధారణ మరియు అపాయకరమైన జీవుల జాబితా ఉంటుంది
C) అరుదైన మరియు విదేశీ జాతులు ఉంటాయి
D) ఎండమిక్ జాతుల వివరాలు
జవాబు:
A) ఆపదలో ఉన్న అంతరించిపోతున్న జీవుల జాబితా ఉంటుంది
ప్రశ్న 44.
కింది వానిలో వలస పక్షిని గుర్తించండి
A) కాకి
B) ఫ్లెమింగో
C) గ్రద్ద
D) చిలుక
జవాబు:
B) ఫ్లెమింగో
ప్రశ్న 45.
రెడ్ డేటా బుక్ అనేది దీనిని ఉద్దేశించిననది
A) అంతరించిపోతున్న జంతువుల సమాచారం తెలిపేది
B) వలస పక్షుల గురించి తెలిపేది
C) వివిధ ప్రాంతాలలో నివసించే జంతువులను గురించి తెలిపేది
D) విలుప్తమైన జీవుల గురించి తెలిపేది
జవాబు:
A) అంతరించిపోతున్న జంతువుల సమాచారం తెలిపేది
ప్రశ్న 46.
నీ మిత్రుడు తన ఇంటి మిద్దె మీద పక్షుల కొరకు గూళ్ళు ఏర్పాటు చేసి అవి తాగేందుకు నీటిని కూడా వుంచాడు. దీనిపై నీ ప్రతిస్పందన
A) ఇది ప్రోత్సహించవలసిన చర్య కాదు
B) ఇది చాలా గొప్ప చర్య అతన్ని నేను అభినందిస్తాను
C) ఈ చర్యవల్ల పక్షులు దూరమవుతాయి
D) ఈ చర్యను నేను వ్యతిరేకిస్తాను
జవాబు:
(B) ఇది చాలా గొప్ప చర్య అతన్ని నేను అభినందిస్తాను
ప్రశ్న 47.
చిత్రంలో ఉన్న జీవి ప్రత్యేకత ఏమిటి ?
1) అత్యంత ఆపదలో ఉన్న కీటకం
2) దీనిని ‘గూటి టరాంటులా’ అంటారు.
3) ఇది హిమాలయాలలో ఉంటుంది.
4) దీనిని ‘బట్ట మేక’ పక్షి అంటారు.
పై వాక్యా లలో సరైనవి
A) 1, 2 మాత్రమే
B) 3, 4 మాత్రమే
C) 1, 4 మాత్రమే
D) 2, 4 మాత్రమే
జవాబు:
A) 1, 2 మాత్రమే