AP 8th Class Biology Notes Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

Students can go through AP Board 8th Class Biology Notes 11th Lesson మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది? to understand and remember the concept easily.

AP Board 8th Class Biology Notes 11th Lesson మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

→ మానసికంగా, శారీరకంగా, సామాజికంగా బాగా ఉండే స్థితినే ఆరోగ్యం అంటారు.

→ వ్యక్తిగత ఆరోగ్యం అతని / ఆమె పరిసరాలు లేదా ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

→ వ్యాధిని కలిగి ఉండే కాలాన్ని బట్టి దీర్ఘకాలిక లేదా స్వల్పకాలిక వ్యాధులుగా విభజించవచ్చు.

→ వ్యాధి జనకాలు ఏకకణ (సూక్ష్మజీవులు), బహుకణ జీవుల వర్గానికి చెందినవై ఉంటాయి.

→ వ్యాధి జనకాల వర్గాన్ని (రకాన్ని) బట్టి వ్యాధిని నయం చేయడం ఆధారపడి ఉంటుంది.

→ వ్యాధి జనతాలు నీటి ద్వారా, గాలి ద్వారా, స్పర్శ ద్వారా, వాహకాల ద్వారా వ్యాప్తి చెందుతాయి.

→ వ్యాధిని నయం చేయడం కన్నా వ్యాధి నివారణే ముఖ్యం.

→ పరిసరాల పరిశుభ్రత, సామాజిక ఆరోగ్య పరిశుభ్రతా కార్యక్రమాలు అమలుపరచడం వలన వ్యాధి సంక్రమణని తగ్గించవచ్చు.

→ టీకాల ద్వారా కూడా వ్యాధులను నియంత్రించవచ్చు.

→ వ్యాధి నివారణకు సామాజిక ఆరోగ్య వ్యవస్థ మరియు టీకాలు అందరికీ అందుబాటులో ఉండాలి.

AP 8th Class Biology Notes Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

→ ఆరోగ్యం : ప్రమాదకరమైన వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి మానసికంగా, శారీరకంగా, సామాజికంగా బాగా ఉండే స్థితినే ఆరోగ్యం అంటారు.

→ వ్యాధి : మన శరీరంలోని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అవయవ వ్యవస్థలు తమ విధులను సక్రమంగా నిర్వహించకపోవటం.

→ ప్రమాదకరమైన వ్యాధి : కొన్ని సందర్భాలలో ప్రాణహాని కలిగించు వ్యాధిని ప్రమాదకరమైన వ్యాధి అంటారు.

→ దీర్ఘకాలిక వ్యాధి : ఒక్కసారి సంక్రమించిందంటే ఎక్కువ కాలం లేదా జీవితాంతం ఉండే వ్యాధిని దీర్ఘకాలిక వ్యాధి అంటారు.

→ వాహకాలు : వ్యాధిని ఒకరి నుంచి వేరొకరికి వ్యాప్తి చేయు జీవులు.

→ సాంక్రమిక వ్యాధులు : సూక్ష్మజీవుల వలన వచ్చే వ్యాధులను సాంక్రమిక వ్యాధులు అంటారు.

→ ఆసాంక్రమిక వ్యాధులు : శరీర అంతర్భాగాలలో మార్పు వలన వచ్చే వ్యాధులను ఆసాంక్రమిక వ్యాధులు అంటారు.

→ అసంత్రామ్యత : ఒక వ్యాధి పలుసార్లు గురైనప్పుడు ఆ వ్యాధిని ఎదుర్కొనే శక్తి ఉంటుంది. దీనినే అసంక్రామ్యత అంటారు.

→ వ్యాధి నిరోధకత : వ్యాధిని ఎదుర్కొనే శక్తిని వ్యాధి నిరోధకత అంటారు.

AP 8th Class Biology Notes Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది 1