Students can go through AP Board 8th Class Biology Notes 3rd Lesson సూక్ష్మజీవుల ప్రపంచం 2 to understand and remember the concept easily.
AP Board 8th Class Biology Notes 3rd Lesson సూక్ష్మజీవుల ప్రపంచం 2
→ సూక్ష్మజీవులలో ఎక్కువ ఉపయోగకరమైనవి. కొన్ని మాత్రం అపాయకరం.
→ ఇంటిని, ఇంటి పరిసరాలను, పరిశ్రమలను పర్యావరణాన్ని ఇవి శుద్ధి చేస్తాయి.
→ భూమిలో కర్బన సంబంధ వ్యర్థాలను కుళ్ళింపచేసి, ఉపయోగకరమైన పోషకాలుగా మార్చి నేలను సారవంతం చేస్తాయి.
→ కొన్ని మాత్రం మొక్కలలో, జంతువులలో, మానవులలో వ్యాధులు కలుగచేస్తాయి.
→ పాశ్చరైజేషన్ ద్వారా పాలను శుద్ధిచేసి ఎక్కువ కాలం నిల్వచేయవచ్చు.
→ రైజోబియం అనే బాక్టీరియా లెగ్యూమినేసి (చిక్కుడు జాతి) మొక్కల వేర్లపై వున్న బొడిపెలలో వుండి నత్రజని స్థాపన చేసి మొక్కలకు పోషకాలను అందిస్తుంది.
→ కిణ్వనం : ఆక్సిజన్ లేకుండా శ్వాసక్రియ జరిగితే దానిని ‘కిణ్వనం’ అంటారు.
→ వాహకం : సూక్ష్మజీవుల రవాణాకు ఉపయోగపడే జీవి.
→ సహజీవనం : ఇచ్చి పుచ్చుకునే విధంగా జీవులు రెండు మూడు కలసి ఒక దానిపై ఒకటి ఆధారపడి జీవించటం. ఉదా : (1) విప్ప చెట్టుపై పెరిగే చిన్న మొక్కలు (2) మొసలి పొలుసులను, దంతాలను శుభ్రపరిచే పక్షి.
→ పాశ్చరైజేషన్ : వేడి చేసి సూక్షజీవులను చంపే పద్దతి.
→ సూక్ష్మ జీవశాస్త్రం : సూక్ష్మజీవుల నిర్మాణం ప్రవర్తన, ఫలితాల గురించి చర్చించే శాస్త్రం.
→ మశూచి : ఇది వైరస్ వల్ల వచ్చే వ్యాధి. సాధారణంగా దీనిని అమ్మ తల్లి, తట్టు అని పిలుస్తారు. (Small pox, Chicken pox)
→ వాక్సిన్ : సూక్షజీవుల వల్ల వచ్చే వ్యాధులు రాకుండా ముందుగానే ఇచ్చే సూది మందు లేదా నోటి చుక్కలు.
→ వ్యాధికారకం : వ్యాధిని కలుగచేసే సూక్ష్మక్రిమి.