Students can go through AP Board 8th Class Physical Science Notes 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం to understand and remember the concept easily.
AP Board 8th Class Physical Science Notes 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం
→ ఈ భూమికి ముఖ్యమైన, శక్తివంతమైన సహజ కాంతివనరు సూర్యుడు.
→ కాంతి జనకం, అపారదర్శక పదార్థాల వలన నీడలు ఏర్పడతాయి.
→ కాంతి ఋజుమార్గంలో ప్రయాణించును.
→ కాంతి ఏదేని ఉపరితలంపై పడి, తిరిగి అదే యానకంలోకి ప్రయాణించుటను “కాంతి పరావర్తనం” అంటారు.
→ కాంతి పరావర్తన లక్షణాలు :
- పతనకోణం విలువ పరావర్తన కోణం విలువకు సమానం.
- పతన కిరణం, పతన బిందువు వద్ద తలానికి గీసిన లంబం మరియు పరావర్తన కిరణాలు ఒకే తలంలో ఉంటాయి.
→ ఫ్రెంచ్ న్యాయవాది, ఔత్సాహిక గణిత శాస్త్రవేత్త అయిన “పియరి. డి. ఫెర్మాట్” అను శాస్త్రవేత్త ‘కాంతి తక్కువ సమయం పట్టే మార్గంలోనే ప్రయాణిస్తుంది’ అని తెలియజేశాడు.
→ పతన కిరణం, పరావర్తన కిరణం మరియు లంబం ఉన్నటువంటి తలాన్ని “పరావర్తన తలం” అంటారు.
→ సమతల దర్పణంతో ఏర్పడ్డ ప్రతిబింబం యొక్క పరిమాణం, దూరం, పార్శ్వ విలోమం వంటి లక్షణాలు కలిగి ఉంటాయి.
→ సమతల దర్పణంలో ఏర్పడ్డ ప్రతిబింబ పరిమాణం, వస్తు పరిమాణాలు సమానం.
→ వస్తువుతో పోల్చినపుడు దర్పణంలోని ప్రతిబింబం మన కంటి వద్ద తక్కువ కోణం చేయడం వలన అది వస్తువు కన్నా చిన్నదిగా కనిపిస్తుంది.
→ సమతల దర్పణం వలన ఏర్పడిన ప్రతిబింబం పార్శ్వవిలోమం పొందుతుంది.
→ ఫెర్మాట్ నియమం : కాంతి కనిష్ఠ కాలమార్గంలో ప్రయాణిస్తుంది.
→ పరావర్తనం : నిరోధక తలం పై పతనమైన కాంతి వెనుతిరిగి అదే యానకంలోకి ప్రయాణించుట కాంతి లక్షణం.
→ పతనకిరణం : ఒక వస్తువు నుండి వచ్చిన కాంతి కిరణం దర్పణం పై పడితే, ఆ కిరణం పతన కిరణం అగును.
→ పరావర్తన కిరణం : దర్పణం పైన పడిన కాంతి కిరణము పరావర్తనం చెందితే దాన్ని పరావర్తన కిరణం అంటారు.
→ లంబం : పతన కిరణం ఏర్పరచిన పతన కోణం వద్ద తలానికి లంబంగా గీయబడిన రేఖ.
→ పతన కోణం : పతన బిందువు వద్ద పతన కిరణానికి, లంబానికి మధ్య గల కోణం.
→ పరావర్తన కోణం : పతన బిందువు వద్ద పరావర్తన కిరణకోణానికి, లంబానికి మధ్య గల కోణం.
→ పరావర్తన తలం : పతన కిరణం, పరావర్తన కిరణం, పతన బిందువు మరియు లంబములను కలిగి ఉండు ఉమ్మడి తలం.
→ పార్శ్వవిలోమం : దర్పణం వలన ఏర్పడు ప్రతిబింబంలో వస్తువు కుడి, ఎడమలు తారుమారుగా కనిపించు లక్షణం.
→ వస్తుదూరం : దర్పణం యొక్క వక్రతా కేంద్రం, వస్తువుకు గల దూరాన్ని “వస్తుదూరం” అంటారు.
→ ప్రతిబింబ దూరం : ఇది దర్పణపు వక్రతా కేంద్రం, ప్రతిబింబానికి గల దూరం.
→ ప్రధానార్ధం : వక్రతా కేంద్రం మరియు దర్పణ కేంద్రం గుండా పోతున్నట్లుగా సమాంతరంగా గీయబడిన రేఖ.
→ దర్పణ కేంద్రం : ఇది దర్పణం యొక్క మధ్య బిందువు.
→ నాభి : ప్రధాన్వానికి సమాంతరంగా ప్రయాణించే ‘కిరణాలు దర్పణం వల్ల పరావర్తనం చెంది ప్రధానాక్షం పై ఒక బిందువు వద్ద కేంద్రీకరింపబడు బిందువు.
→ నాభ్యంతరం : నాభి నుండి దర్పణ కేంద్రానికి గల దూరం.