Students can go through AP Board 8th Class Physical Science Notes 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు to understand and remember the concept easily.
AP Board 8th Class Physical Science Notes 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు
→ కొన్ని వస్తువులను ఇతర వస్తువులతో రుద్దినపుడు ఆవేశాన్ని పొందుతాయి.
→ ఆవేశాలు రెండు రకాలు : 1) ధనావేశం 2) ఋణావేశం
→ సజాతి ఆవేశాలు వికర్షించుకొంటాయి. విజాతి ఆవేశాలు ఆకర్షించుకుంటాయి.
→ వస్తువులను ఒకదానితో ఒకటి రుద్దినపుడు వెలువడే విద్యుత్ ఆవేశాలు స్థిర ఆవేశాలు.
→ ఆవేశాలు చలించినపుడు ప్రవాహ విద్యుత్ గా మారుతుంది.
→ విద్యుదర్శిని ద్వారా వస్తువు ఆవేశం కలిగి ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చును.
→ ఒక వస్తువు పై ఉన్న ఆవేశాన్ని గుర్తించడానికి “ఆకర్షణ ధర్మం” సరైన పరీక్ష కాదు.
→ ఆవేశం కలిగి ఉన్న వస్తువు నుండి భూమికి ఆవేశాలను బదిలీ చేసే ప్రక్రియను ‘ఎర్తింగ్’ అంటారు.
→ మేఘాలకు భూమికి మధ్య లేదా మేఘాలకు మేఘాలకు మధ్య జరిగే ఉత్సర్గం వల్ల పిడుగులు (మెరుపులు) ఏర్పడతాయి.
→ మెరుపులు, పిడుగులు ఆస్తి, ప్రాణ నష్టం కలిగిస్తాయి.
→ తటిద్వాహకం పిడుగుల నుండి భవనాలను రక్షిస్తుంది.
→ భూమిలో ఒక్కసారిగా వచ్చే కంపనాలను ‘భూకంపం’ అంటారు.
→ భూపటలంలో ఏర్పడే కదలికల వల్ల భూకంపాలు వస్తాయి.
→ భూకంపాన్ని ముందుగా ఊహించలేం.
→ భూకంపాలు భూమిలోని పలకల హద్దుల వద్ద ఏర్పడతాయి. వాటిని భూకంప ప్రమాద ప్రాంతాలు అంటారు.
→ భూకంపం వల్ల విడుదలయ్యే శక్తిని రిక్టర్ స్కేలుతో కొలుస్తారు. రిక్టర్ స్కేలుపై 7 కాని అంతకన్నా ఎక్కువ నమోదు జరిగితే తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది.
→ భూకంపాల నుండి రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
→ పిడుగుల నుండి రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
→ సహజ దృగ్విషయాలు : మెరుపులు, ఉరుములు, వరదలు, తుపానులు, భూకంపాలు, సునామి మరియు అగ్ని పర్వతాలు పేలడం వంటివి సంభవించే వాటిని ‘సహజ దృగ్విషయాలు’ అంటారు.
→ పటలం : భూమిలో ఉండే పొరలలో పై పొరను (భూమి ఉపరితలం) పటలం’ అంటారు.
→ భూ పలకలు : భూమి ఉపరితలంలోని భూమి ఒకే పొరగా కాకుండా విడి విడి ముక్కలుగా ఉంటుంది. ఈ ముక్కలను పలకలు అంటారు.
→ భూకంపం : భూమి కొద్దిసేపు కదలడాన్ని ‘భూకంపం’ అంటారు.
→ ఆవేశం : రెండు వస్తువులను రాపిడికి గురి చేసినపుడు ఎలక్ట్రాన్ల బదిలీ వలన ఆ రెండు వస్తువుల పై ఆవేశం ఏర్పడుతుంది.
→ ధనావేశం : రెండు వస్తువులను రాపిడికి గురిచేసినపుడు ఎలక్ట్రాన్లను కోల్పోయిన వస్తువు పొందే అవేశాన్ని ‘ధనావేశం’ అంటారు.
→ ఋణావేశం : రెండు వస్తువులను రాపిడికి గురిచేసినపుడు ఎలక్ట్రాన్లను గ్రహించిన వస్తువు పొందే ఆవేశాన్ని ‘ఋణావేశం’ అంటారు.
→ విద్యుదర్శిని : వస్తువు ఆవేశాన్ని కలిగి ఉందా లేదా అని తెలుసుకొనుటకు ఉపయోగించే పరికరాన్ని ‘విద్యుదర్శిని’ అంటారు.
→ మెరుపు : రెండు లేదా అంతకన్నా ఎక్కువ మేఘాల మధ్య ఉత్సర్గం జరిగి పెద్ద ఎత్తున వెలుగు (కాంతి)తో పాటు ధ్వని ఉత్పత్తి అవుతుంది. దీనిని ‘మెరుపు’ అంటారు.
→ తటిద్వాహకం : పిడుగు (మెరుపు)ల నుండి పెద్ద పెద్ద భవనాలను, కట్టడాలను రక్షించడానికి, పిడుగుల నుండి వచ్చే విద్యుదావేశాలను భూమికి పంపించే దానిని ‘తటి ద్వాహకం (Lightning Conductors)’ అంటారు.
→ ఉత్సర్గం : పిడుగులు (మెరుపులు) ఏర్పడే ప్రక్రియను ‘విద్యుత్ ఉత్సర్గం’ అంటారు.
→ రిక్టర్ స్కేలు : భూకంపం వల్ల విడుదలయ్యే శక్తిని లేదా భూకంప తీవ్రతను సూచించే దానిని ‘రిక్టర్ స్కేలు’ అంటారు.
→ ఉరుము : ఆకాశంలో మెరుపులు ఏర్పడినపుడు వచ్చే ధ్వనిని ‘ఉరుము’ అంటారు.
→ సునామి : సముద్రాల అడుగు భాగాలలో వచ్చే భూకంపాలను సునామి’ అంటారు.
→ భూకంపలేఖిని : భూకంపం యొక్క కంపన తరంగాలను లెక్కగట్టే దానిని ‘భూకంప లేఖిని’ అంటారు.
→ భూకంపదర్శిని : భూకంపం సంభవించిన సమయాన్ని గుర్తించేది ‘భూకంపదర్శిని’.
→ భూ అంతర్భాగ : భూపటలంలోని పలకల రాపిడి లేదా ఢీ కొనడం వలన భూ అంతర్భాగ కదలికలు కదలికలు ఏర్పడతాయి.
→ సెస్మిక్ తరంగాలు : భూ అంతర్భాగంలో కదలికలు వలన భూ ఉపరితలం పైకి వచ్చే తరంగాలను ‘సెస్మిక్ లేదా భూకంప తరంగాలు’ అంటారు.
→ సెస్మిక్ ప్రాంతాలు : భూమి లోపల గల పలకల కదలిక వల్ల భూ ఉపరితలంపై ఈ పలకలకు దరిదాపుల్లో ఉండే బలహీన ప్రాంతాలను ‘సెస్మిక్ లేదా భూకంప ప్రభావిత ప్రాంతాలు’ అంటారు.
→ భ్రామక పరిమాణ స్కేలు : భూకంప తీవ్రతను కచ్చితంగా కొలిచే సాధనం.
→ ఎర్తింగ్ : ఆవేశం కలిగి ఉన్న వస్తువు నుండి భూమికి ఆవేశాలను బదిలీ చేసే ప్రక్రియను ఏర్తింగ్’ అంటారు.