AP 8th Class Physical Science Notes 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

Students can go through AP Board 8th Class Physical Science Notes 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం to understand and remember the concept easily.

AP Board 8th Class Physical Science Notes 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

→ భూమిపై నిట్టనిలువుగా ఉన్న వస్తువుకు ఏర్పడే నీడలో అతి తక్కువ పొడవు గల నీడ ఉత్తర – దక్షిణ దిశలలో ఏర్పడుతుంది.

→ ప్రాంతీయ మధ్యాహ్న వేళలోనే వస్తువుకు అతి తక్కువ పొడవు గల నీడ ఏర్పడుతుంది.

→ చంద్రుడు ఆకాశంలో తను కనిపించిన ప్రదేశంలో మళ్ళీ కనిపించడానికి ఒకరోజు కంటే దాదాపు 50 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది.

→ సూర్య చంద్రులకు ఆకాశంలో ఒక పూర్తి భ్రమణానికి పట్టే కాలాలు వేర్వేరుగా ఉంటాయి.

→ చంద్రుని ఆకారంలో కలిగే మార్పును చంద్రకళలు అంటారు.

→ అమావాస్య రోజున సూర్యుడు, చంద్రుడు భూమికి ఒకేవైపున ఉంటాయి.

AP 8th Class Physical Science Notes 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

→ పౌర్ణమిరోజున సూర్యుడు, చంద్రుడు భూమికి చెరొకవైపున ఉంటాయి.

→ చంద్రునిపై వాతావరణం లేదు.

→ చంద్రునిపై శబ్దాలను వినలేము.

→ భూమి యొక్క నీడ చంద్రునిపై పడినపుడు, చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

→ కొన్ని పౌర్ణమి రోజులలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

→ చంద్రుని నీడ భూమిపై పడటం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కొన్ని అమావాస్య రోజులలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

→ ధృవ నక్షత్రం భూమి యొక్క అక్షం దిశలో ఉన్నందున అది తిరుగుతున్నట్లు కనిపించదు.

→ అనేక కోట్ల గెలాక్సీలను “విశ్వం” అంటారు.

→ కోట్ల నక్షత్రాలు గల పెద్ద పెద్ద గుంపులను “గెలాక్సీ” అంటారు.

→ మన సౌరకుటుంబంలో 8 గ్రహాలున్నాయి.

→ మన సౌరకుటుంబంలోని ఎనిమిది గ్రహాలలో భూమిపైన మాత్రమే జీవం ఉంది.

→ సౌర కుటుంబంలో అతిచిన్న గ్రహం బుధుడు.

AP 8th Class Physical Science Notes 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

→ సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహం బృహస్పతి.

→ శుక్ర గ్రహం మరియు యురేనస్ గ్రహం తూర్పు నుండి పడమరకు తిరుగుతుంది. మిగిలిన గ్రహాలన్నీ పడమర నుండి తూర్పువైపు తిరుగుతాయి.

→ బుధుడు, శుక్రుడు, భూమి మరియు అంగారకుడులను “అంతరగ్రహాలు” అంటారు.

→ గురుడు, శని, యురేనస్ మరియు నెప్ట్యూన్ గ్రహాలను “బాహ్యగ్రహాలు” అంటారు.

→ అంగారకుడు, బృహస్పతి గ్రహాల కక్ష్యల మధ్య ఉండి సూర్యుని చుట్టూ తిరుగుతున్న అంతరిక్ష వస్తువులను ఆస్టరాయిడ్లు అంటారు.

→ సూర్యుని సమీపిస్తున్న కొలదీ తోకచుక్క తోక పరిమాణం పెరుగుతుంది.

→ అప్పుడప్పుడు భూవాతావరణంలోకి చొరబడే చిన్న వస్తువులు ఉల్కలు.

→ భూమిని చేరే ఉల్కలను “ఉల్కాపాతం” అంటారు.

→ భారతదేశం ప్రయోగించిన మొదటి కృత్రిమ ఉపగ్రహం (భూమికి) ఆర్యభట్ట.

→ కృత్రిమ ఉపగ్రహాల వలన వాతావరణ ముందస్తు అధ్యయనం, రేడియో మరియు టి.వి. ప్రసారాలు, టెలీ కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్ మొదలైన ఉపయోగాలు కలవు.

→ అంతరిక్ష వస్తువులు : నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడు, తోకచుక్కలు, ఉల్కలు మొదలగునవి.

→ ప్రాంతీయ మధ్యాహ్న సమయం (local noon) : ఏ సమయంలో వస్తువుకు అతి తక్కువ పొడవు నీడ ఏర్పడుతుందో ఆ సమయాన్ని, ఆ ప్రదేశం యొక్క “ప్రాంతీయ మధ్యాహ్న సమయం (local noon)” అంటారు.

→ ఉత్తర – దక్షిణ దిక్కులు : భూమి పై నిట్టనిలువుగా ఉంచబడిన వస్తువు యొక్క అతి తక్కువ పొడవైన నీడ సూచించే దిశలను ఉత్తర – దక్షిణ దిక్కులు అంటారు.

AP 8th Class Physical Science Notes 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

→ నీడడియారం/సౌర గడియారం : ‘భూమి పై నిట్టనిలువుగా ఉంచిన కర్ర యొక్క నీడ ఆధారంగా సమయాన్ని తెలియచేయు దానిని నీడ గడియారం / సౌరగడియారం అంటారు.

→ ఉత్తరాయణం : సూర్యుడు ఉదయించే స్థానం రోజు రోజుకీ ఉత్తర దిక్కుగా కదులుటను “ఉత్తరాయణం” అంటారు.

→ దక్షిణాయణం : సూర్యుడు ఉదయించే స్థానం రోజురోజుకీ దక్షిణ దిక్కుగా కదులుటను “దక్షిణాయణం” అంటారు.

→ చంద్రకళలు : చంద్రుని ఆకారంలో కలిగే మార్పును “చంద్రకళలు” అంటారు.

→ గెలాక్సీ : లక్షలు, కోట్లు, నక్షత్రాలు గల పెద్ద గుంపులను “గెలాక్సీ” అంటారు.

→ విశ్వం : అనేక కోట్ల గెలాక్సీలను “విశ్వం” అంటారు.

→ నక్షత్ర రాశి : వివిధ జంతువులు, మనుషుల ఆకారంలో గల నక్షత్రాల చిన్న చిన్న గుంపులను “నత్రరాశి” అంటారు.

→ సౌరకుటుంబం : సూర్యుడు మరియు దానిచుట్టూ తిరిగే అంతరిక్ష వస్తువులను అన్నింటిని కలిపి “సౌరకుటుంబం” అంటారు.

→ గ్రహాలు : సూర్యుని చుట్టూ పరిభ్రమించే వాటిని “గ్రహాలు” అంటారు.

→ ఉపగ్రహాలు : గ్రహాల చుట్టూ పరిభ్రమించే వాటిని “ఉపగ్రహాలు” అంటారు.

→ కక్ష్య : ప్రతిగ్రహం సూర్యుని చుట్టూ పరిభ్రమించే ఒక ప్రత్యేకమైన మార్గాన్ని “కక్ష్య” అంటారు.

→ పరిభ్రమణ కాలం : ఒక గ్రహం సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే కాలాన్ని “పరిభ్రమణ కాలం” అంటారు.

→ భ్రమణ కాలం : ఒక గ్రహం తనచుట్టూ తాను ఒకసారి తిరగడానికి పట్టే కాలాన్ని “భ్రమణ కాలం” అంటారు.

→ కృత్రిమ ఉపగ్రహాలు : మానవ నిర్మిత ఉపగ్రహాలను “కృత్రిమ ఉపగ్రహాలు” అంటారు.

→ చంద్రగ్రహణం : సూర్యుని కిరణాలు చంద్రుని మీద పడకుండా భూమి అడ్డు వచ్చినపుడు “చంద్రగ్రహణం” అంటారు.

→ సూర్యగ్రహణం : సూర్యుడు కనపడకుండా భూమికి చంద్రుడు అడ్డువస్తే “సూర్యగ్రహణం” అంటారు.

AP 8th Class Physical Science Notes 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

→ ఆస్టరాయిడ్లు : కుజుడు, బృహస్పతి గ్రహ కక్ష్యల మధ్యగల విశాలమైన ప్రదేశంలో అనేక చిన్న చిన్న శిలలు సూర్యుని చుట్టూ పరిభ్రమించే వాటిని “ఆస్టరాయిడ్లు” అంటారు.

→ తోక చుక్కలు : అంతరిక్షం నుండి పడే కొన్ని శకలాలు సూర్యునిచుట్టూ పొడవైన దీర్ఘవృత్తాకార కక్ష్యలలో తిరుగుతాయి. వీటినే “తోకచుక్కలు” అంటారు.

→ ఉల్కలు : అప్పుడప్పుడు భూ వాతావరణంలోకి ప్రకాశిస్తూ చొరబడే చిన్న వస్తువులను “ఉల్కలు” అంటారు.

→ అంతర గ్రహాలు : బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు మిగిలిన గ్రహాల కంటే సూర్యునికి అతి దగ్గరగా ఉన్నాయి. వీటిని “అంతరగ్రహాలు” అంటారు.

→ బాహ్యగ్రహాలు : గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలను “బాహ్యగ్రహాలు” అంటారు.

→ ధృవనక్షత్రం : ఆకాశంలో ఉత్తరదిశగా అతికాంతివంతంగా కనిపించే నక్షత్రమే ధృవనక్షత్రం.

→ ఉల్కాపాతం : ఒక్కొక్కప్పుడు ఉల్కలు చాలా పెద్దవిగా ఉండి అవి మండి ఆవిరయ్యేలోపలే భూమిమీద పడిపోతాయి. ఇలా భూమిని చేరిన ఉల్కను ‘ఉల్కాపాతం’ అంటారు.

AP 8th Class Physical Science Notes 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం 1