These AP 8th Class Social Important Questions 1st Lesson పటాల అధ్యయనం – విశ్లేషణ will help students prepare well for the exams.
AP Board 8th Class Social 1st Lesson Important Questions and Answers పటాల అధ్యయనం – విశ్లేషణ
ప్రశ్న 1.
పూర్వకాలంలో వారు పటాలను ఎలా తయారుచేసేవారు?
జవాబు:
నాటి భౌగోళిక శాస్త్రవేత్తలు విరివిగా ప్రయాణాలు చేసి వాటికి సంబంధించిన వివరాలను పుస్తకాల రూపంలో నమోదు చేసేవారు. పటాలను తయారు చేసేవారు. వీటిని ఆధారంగా చేసుకుని పటాలను తయారు చేసేవారు. ఇవి వాస్తవ దూరంగా ఉండి పెద్దగా వాడుకలోనికి రాలేదు. కానీ, చరిత్రకారులు వీటిని ఉపయోగించి పటాలను తిరిగి తయారు చేసేవారు.
ప్రశ్న 2.
ఎవరెస్టు శిఖరానికి ఆ పేరు ఎట్లు వచ్చింది?
జవాబు:
1802లో విలియం లాంటన్ ఒక ప్రముఖ సర్వేను చెన్నై నుండి ప్రారంభించారు. ఇది హిమాలయాల వరకు రేఖాంశాలను, ఇతర ఎత్తులను తెలుసుకోవడానికి ఉద్దేశించబడినది. ఈ సర్వే జార్జి ఎవరెస్ట్ చే పూర్తి చేయబడింది. ఈ సర్వేలోనే ‘ఎవరెస్ట్’ అన్ని శిఖరాలలోకి ఎత్తైనది అని ప్రపంచానికి వెల్లడైంది. కాబట్టి ఆ శిఖరానికి ఆయన పేరు పెట్టడం జరిగింది.
ప్రశ్న 3.
పటాలకు, చిత్రాలకు మధ్య గల భేదమేమి?
జవాబు:
పటం :
ముఖ్యమని భావించే అంశాలను చూపించడానికి భౌగోళిక శాస్త్రజ్ఞులు పటాలను ఉపయోగిస్తారు.
చిత్రం :
చిత్రం పటం వలే ఆ ప్రాంతంలోని నిజమైన అంశాలను కాక కేవలం కంటికి కనిపించే వాటిని మాత్రమే చూపిస్తుంది.
ప్రశ్న 4.
నిర్దేశిత పటాలను ఎట్లు చదవాలి?
జవాబు:
- ఒకే అంశంపై కేంద్రీకరించబడే పటాలను నిర్దేశిత పటాలు అంటారు.
- వీటిని చదవడానికి మనకు పటాలలో ఉపయోగించే గుర్తులు, రంగులు, వివిధ ఆచ్ఛాదనలు తెలిసి ఉండాలి.
ఉదా : ముదురు ఊదా : కొండలు, నలుపు : సరిహద్దులు
అప్పుడు మాత్రమే నిర్దేశిత పటాలను మనం చదవగలగుతాం.
ప్రశ్న 5.
ఐసోలైన్స్ అంటే ఏమిటి?
జవాబు:
సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నింటినీ కలిపే వాటిని ఐసోలైన్స్ అంటారు.
ప్రశ్న 6.
కాంటూరు రేఖల వలన ఉపయోగమేమి?
జవాబు:
కాంటూరు రేఖల వలన ఒక ప్రాంతపు ఎత్తును, పల్లాన్ని సులభంగా తెలుసుకోవచ్చును.
ప్రశ్న 7.
పూర్వకాలం నాటి పటం తయారీదారుల పేర్లను తెలపండి.
జవాబు:
గ్రీకులు, అరబ్బులు, చైనీయులు, సుమేరియన్లు, బాబిలోనియన్లు మరియు యూరోపియన్లు మొదలైనవారు పూర్వకాలం ఆనాటి పటం తయారీదారులు.
ప్రశ్న 8.
సాంప్రదాయ సంకేతాలు అంటే ఏమిటి?
జవాబు:
పూర్వకాలం నాటి నుండి పటాల తయారీదారులు తమ సౌలభ్యం కోసం కొన్ని గుర్తులను ఉపయోగించేవారు. వాటినే సాంప్రదాయ సంకేతాలు అంటారు.
ప్రశ్న 9.
ఈ ప్రక్క నీయబడిన చిత్రాన్ని గమనించి మీ అభిప్రాయాన్ని రాయండి.
జవాబు:
- ఈ పటం బైబిలును అనుసరించి ప్రపంచ నమూనా.
- ఇది చుట్టూ సముద్రంచే ఆవరించబడి, మూడు ఖండాలుగా విభజించబడినది.
- అవి ఆసియా, ఐరోపా మరియు ఆఫ్రికా.
- వీటిలో ఆసియా జెరూసలెంను కలిగి ఉన్న కారణంగా ప్రాముఖ్యతను సంతరించుకుని ఆ పటంలో సగభాగాన్ని ఆక్రమించింది.
- జెరూసలెం క్రీస్తు జన్మస్థలం. కావున అది పై భాగంలో చూపబడినది.
ప్రశ్న 10.
ప్రక్కనీయబడిన చిత్రాన్ని పరిశీలించి, ‘మెర్కేటర్ ప్రక్షేపణ’ పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.
జవాబు:
- గెరార్డస్ మెర్కేటర్ ప్రఖ్యాతి గాంచిన భౌగోళిక శాస్త్రవేత్త మరియు కార్టో గ్రాఫర్.
- ఈయన ప్రక్షేపణ ప్రకారం భూమధ్యరేఖ నుండి ధృవాల వైపుకు వెళ్ళేకొలదీ ప్రదేశాల ఆకారాలు పెద్దవిగా కనబడతాయి.
ఉదా : 1. గ్రీన్‌లాండ్ వాస్తవానికి చిన్నదైనా, ప్రపంచ పటంలో ఆఫ్రికా ఖండం అంత కనబడుతుంది. వాస్తవానికి ఆఫ్రికా గ్రీన్‌లాండ్, కన్నా 14 రెట్లు పెద్దది. గ్రీన్ లాండ్ అర్జెంటీనా దేశమంత మాత్రమే ఉంటుంది.
2. అలాస్కా – బ్రెజిల్
3. ఫిలాండ్ – ఇండియా
ప్రశ్న 11.
అల్ ఇద్రిసి జీవితాన్ని గురించి సమాచారాన్ని సేకరించి ఒక చిన్న వ్యాసం వ్రాయండి.
జవాబు:
అప్రఫ్ అల్ ఇద్రిసి 1099లో జన్మించారు. ఆయన ముస్లిం భౌగోళిక శాస్త్రవేత్త. కార్టోగ్రాఫర్ మరియు యాత్రికుడు. రోజర్ – II అనే రాజు కొలువులో, సిసిలీలో నివసించేవారు. ఆయన చిన్నతనంలో చాలా జీవితం ఉత్తర ఆఫ్రికా, స్పెయిన్స్ లో ప్రయాణం చేశారు. ఆఫ్రికా, హిందూ మహాసముద్రం, దూర ప్రాచ్యానికి సంబంధించి ఇస్లాం వర్తకులు, అన్వేషకులు సేకరించి ఇచ్చిన సమారాన్ని క్రోడీకరించి ఇస్లాం పటాలను తయారుచేశారు. ఆయన దీనికి సంబంధించి ఒక గ్రంథాన్ని కూడా రచించారు. (ది టాబులా రోజియానా). ఈ పుస్తకాన్ని నార్మన్ రాజు అయినటువంటి రోజర్-II కోసం రచించారు. ఈయన సిసిలీలో 1165/1166లో మరణించారు.
ప్రశ్న 12.
ఈ క్రింది సమాచారాన్ని చదివి, ఈయబడిన ప్రశ్నలకు సమాధానమునిమ్ము.
పటాలలో ఎత్తు, పల్లాలను చూపడం : భూమిపై ఎత్తులు, పల్లాలు అంటే కొండలు, లోయలు, పీఠభూములు, మైదానాలు, నదీ పరీవాహక ప్రాంతాలు, రాళ్లు, ఇసుకతో కూడిన ప్రదేశాలు ఉంటాయి. పటాలు బల్లపరుపుగా ఉంటాయి. కాబట్టి వాటిలో ఎత్తు, పల్లాలను చూపించలేం. అందుకని వీటిని చూపించటానికి కాంటూరు రేఖలు అనే ప్రత్యేక సంకేతాలను ఉపయోగిస్తాం. సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నిటినీ కలిపే వాటిని కాంటూరు రేఖలు అంటారు. ఇంకోరకంగా చెప్పాలంటే ఒక కాంటూరు రేఖ మీద ఉన్న ప్రదేశాలన్నీ సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉంటాయి. కాంటూరు రేఖలను ఐసోలైన్స్ అని కూడా అంటారు.
1. భూమిపై ఎత్తు, పల్లాలు అంటే ఏమిటి?
జవాబు:
భూమిపై ఎత్తు, పల్లాలు అంటే కొండలు, లోయలు, పీఠభూములు, మైదానాలు, నదీ పరీభాహక ప్రాంతాలు, రాళ్లు, ఇసుకతో కూడిన ప్రదేశాలు మొదలగునవి.
2. పటాలలో ఎత్తు, పల్లాలను ఎందుకు చూపించలేము?
జవాబు:
పటాలు బల్ల పరుపుగా ఉంటాయి. కాబట్టి వాటిలో ఎత్తు, పల్లాలను చూపించలేము.
3. ప్రత్యేక సంకేతాలు అంటే ………………………
జవాబు:
కాంటూరు రేఖలు
4. …………. నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలిపే వాటిని కాంటూరు రేఖలు అంటారు.
జవాబు:
సముద్ర మట్టం
5. కాంటూరు రేఖలను …………………. అని కూడా అంటారు.
జవాబు:
ఐసోలైన్స్)
ప్రశ్న 13.
ఇచ్చిన వివరాలను పరిశీలించి ఈ క్రింది ప్రశ్నలకు జవాబులిమ్ము.
1. పోర్చుగీసు అన్వేషకులు ఎవరు?
జవాబు:
ఫెర్డినాండ్ మాజిలాన్, వాస్కోడిగామా, బార్త్ లోవ్ మ్యూడియాస్.
2. మార్కోపోలో గురించి నీకేమి తెలుసును?
జవాబు:
మార్కోపోలో ఇటలీ దేశస్థుడు. 1254లో జన్మించాడు. ఆసియా ఖండాన్ని, చైనా దేశాన్ని అన్వేషించాడు. 1324లో మరణించాడు.
3. అమెరికాను కనుగొన్నదెవరు?
జవాబు:
క్రిస్టోఫర్ కొలంబస్
4. మాజిలాన్ జీవితకాలం ఏది?
జవాబు:
1480 నుండి 1521 వరకు
5. మొదటగా ప్రపంచాన్ని చుట్టి వచ్చినదెవరు?
జవాబు:
ఫెర్డినాండ్ మాజిలాన్
ప్రశ్న 14.
మీ పాఠశాలకు సంబంధించి జనాభా పటాన్ని తయారుచేయుము.
జవాబు:
నేను గాంధీజీ మునిసిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ పాఠశాలలో చదువుతున్నాను. మా పాఠశాలలో 5 తరగతి గదులు, ఒక ప్రధానోపాధ్యాయుని గది, స్టాఫ్ రూమ్, వంట గది, టాయ్ లెట్లు ఉన్నాయి. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 176.
తరగతివారీగా | విద్యార్థులు |
1వ తరగతి | 44 |
2వ తరగతి | 40 |
3వ తరగతి | 42 |
4వ తరగతి | 28 |
5వ తరగతి | 22 |
ప్రశ్న 15.
ఇద్రిసి తయారుచేసిన పటంలో ‘దక్షిణం’ పై వైపు ఉండగా, గ్రీకులు తయారుచేసిన పటాలలో పై వైపు ఉత్తర దిశ ఎందుకు ఉంది?
జవాబు:
ఇస్లాం సాంప్రదాయాలు చాలా వరకు ప్రపంచంలోని ఇతర సాంప్రదాయాల కన్నా భిన్నంగా ఉంటాయి.
ఉదా : వారు వ్రాసే విధానం. అదేవిధంగా ఇద్రిసి పటంలో దక్షిణం పై వైపు ఉండి ఉండవచ్చు.
(లేదా)
సూర్యుని వైపు తిరిగి దానిని తూర్పుగా భావించి వారు కుడి చేతి వైపుకి ప్రాముఖ్యత యిచ్చి (అంటే దక్షిణానికి) దానిని పటంలో పైకి చూపించి ఉండవచ్చును.
ప్రశ్న 16.
ఈ క్రింది వివరణను చదివి దానికి సంబంధించి ఒక ప్రశ్నను వ్రాయుము.
“పటం తయారుచేసేవాళ్ళు ముఖ్యమనుకునే వాటిని చూపించే నమూనాగా పటాన్ని తయారుచేస్తారు. వీరు దేని – కోసం అన్న దాన్ని బట్టి వివిధ రకాల పటాలను తయారుచేస్తారు.”
జవాబు:
వివిధ రకాల పటాలను ఎందుకు తయారుచేస్తారు?
ప్రశ్న 17.
గ్రీకులు, రోమన్లు పటాల తయారీలో ఎందుకు ఆసక్తిని కలిగి ఉండేవారు?
జవాబు:
నాటి గ్రీకులకు, రోమన్లకు ప్రపంచ విజేతలు కావాలనే కోరిక ఎక్కువగా ఉండేది. అందుకే వారు పటాల తయారీలో ఎక్కువ ఆసక్తిని కలిగి ఉండేవారు.
ప్రశ్న 18.
బాబిలోనియన్ల మట్టి పలకపై ఉన్న ప్రపంచ పటాన్ని ప్రశంసించండి.
జవాబు:
బాబిలోనియన్ల మట్టి పలకపై ప్రపంచపటం పర్షియన్ల కాలం నాటిది. అది సమతలంగాను, గుండ్రంగాను ఉన్నది. లోపలి ‘0’ లో వారికి తెలిసిన అన్ని ప్రాంతాలను చర్చించారు. బాబిలోనియాను పలక మధ్యలో చిత్రించారు. బయటి భాగంలో ఉప్పు సముద్రాన్ని చిత్రించారు. దానిలో 7 త్రికోణాకారపు దీవులను చూపించారు.
వారి ఆలోచనా శక్తి, ఊహాశక్తి, దానిని తయారుచేసిన కళానైపుణ్యం చాలా ప్రశంసించతగినది.
ప్రశ్న 19.
అక్షాంశ, రేఖాంశాలను, గ్రిడ్ ను ఎవరు కనిపెట్టారు?
జవాబు:
హిప్పొర్కస్ గ్రీకు ఖగోళవేత్త (190-120 BC). ఈయన అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా ఒక ప్రాంతాన్ని తెలుసుకోవచ్చని భావించాడు. టాలమీ గ్రీకు ఖగోళవేత్త మరియు గణిత విద్యా పారంగతుడు. ఈయన ఈజిప్టులో జీవించాడు. ఈయన – కూడా ఈ అక్షాంశ, రేఖాంశ విధానాన్ని అవలంబించాడు. ఇది తరువాత తరం నాటి పటాల తయారీదార్లను అనుసరించేలా చేసింది. కావున టాలమీ ఈ పటాల రచనకు శాస్త్రీయత అనే పునాది వేశాడని భావించవచ్చు.
ప్రశ్న 20.
గ్రామ పటాల తయారీలో ఈ క్రింది రంగుల ద్వారా ఏయే అంశాలను సూచిస్తారో తెలపండి.
i) ముదురు ఆకుపచ్చ
ii) ముదురు నీలిరంగు
iii) తెలుపు
iv) నలుపు
జవాబు:
గ్రామ పటాల తయారీలో
- ముదురు ఆకుపచ్చ రంగును అడువులను సూచించటానికి వాడతారు.
- ముదురు నీలిరంగును మహా సముద్రాలు మరియు సముద్రాలను సూచించడానికి వాడతారు.
- తెలుపు రంగును ఖనిజాలు లభ్యమయ్యే ప్రదేశాలను సూచించడానికి వాడతారు.
- నలుపు రంగును సరిహద్దులను సూచించడానికి వాడతారు.
ప్రశ్న 21.
అట్లాస్ అనగానేమి? మీ వంటి విద్యార్థులకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది?
జవాబు:
వివిధ రకాల మ్యాన్లు లేదా పటాలతో కూడిన పుస్తకాన్ని అట్లాస్ అని పిలుస్తాము. దానిలో ప్రపంచ పటాలు, వివిధ ఖండాల పటాలు మరియు దేశాల పటాలు కూడా ఉంటాయి.
ఈ అట్లాసు విద్యార్థులకు వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. వారు దానిని అధ్యయనం చేసి ఖండాలు, ‘ సముద్రాలు, దేశాల భౌగోళిక, రాజకీయ పరిస్థితులను గురించి తెలుసుకోగలుగుతారు.