Students can go through AP Board 8th Class Social Notes 9th Lesson ప్రజారోగ్యం – ప్రభుత్వం to understand and remember the concept easily.
AP Board 8th Class Social Notes 9th Lesson ప్రజారోగ్యం – ప్రభుత్వం
→ రోగాలను నివారించడానికి, వైద్యం చెయ్యడానికి ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులు, రోగ నిర్ధారణకు పరీక్షా కేంద్రాలు, అంబులెన్సు సదుపాయాలు, రక్తనిధి వంటివి అవసరం అవుతాయి.
→ రోగాలను నివారించడానికి టీకాలతో పాటు తగినంత ఆహారం, శుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యం, శుభ్రమైన వాతావరణం కావాలి.
→ భారతదేశం ఔషధాలు తయారుచేయడంలో ప్రపంచంలో 4వ పెద్ద దేశం.
→ ఆరోగ్య సదుపాయాలను 1) ప్రజా ఆరోగ్య సేవలు 2) ప్రైవేటు ఆరోగ్య సేవలు అంటూ ప్రధానంగా రెండుగా విభజించవచ్చు.
→ గ్రామస్థాయిలో ఒక ‘ఆశ’ ప్రభుత్వ కార్యకర్త ఉంటారు.
→ అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నపిల్లలకు పోషకాహారంతో పాటు టీకాలు కూడా అందిస్తారు.
→ మండలస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటాయి.
→ దేశ జనాభాలో 20% మంది మాత్రమే వాళ్ళు జబ్బుపడినప్పుడు అవసరమైన మందులు కొనగల స్థితిలో ఉన్నారు.
→ జీవనానికి, మంచి ఆరోగ్యానికి నీళ్ళు తప్పనిసరి. రక్షిత మంచినీటి ద్వారా అనేక రోగాలను నివారించవచ్చు.
→ ఆరోగ్య సేవలు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, ప్రజారవాణా, పాఠశాలలు మౌలిక సదుపాయాలలోనికి వస్తాయి. వీటినే ప్రజాసదుపాయాలు అంటారు.
→ మెరుగైన పోషకాహారం అంటే రోగనిరోధకశక్తి బాగా ఉంటుందని అర్థం.
→ ప్రజా ఆరోగ్య సేవలు : ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులతో కూడి ప్రభుత్వం నిర్వహించేవే ప్రజా ఆరోగ్య సేవలు.
→ ప్రాంతీయ ఆసుపత్రి : డివిజన్ స్థాయిలో 100 పడకలతో ఉన్న ఆసుపత్రి.
→ ప్రజాసదుపాయాలు : నీటి లాగానే ప్రతి ఒక్కరికి అందించాల్సిన ఇతర మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఆరోగ్య సేవలు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, ప్రజా రవాణా, పాఠశాలలు కూడా ఈ జాబితాలోకి వస్తాయి. వీటిని ప్రజాసదుపాయాలు అంటారు.
→ పోషకాహారం : మనందరం ఆరోగ్యంగా ఉండటానికి, రోజువారీ పనులు చేయటానికి, రోగాల బారిన పడకుండా ఉండటానికి ప్రతి ఒక్కళ్లకీ శరీరంలో కొంత కొవ్వు పదార్థం అవసరం. దీనినే పోషకాహారం అంటారు.
→ ఆరోగ్యశ్రీ పథకం : తెల్లకార్డున్న వారందరికీ ఈ పథకం క్రింద ప్రయివేటు ఆసుపత్రులలో కూడా ఉచితవైద్యం అందుతుంది.
→ అంగన్ వాడీ కేంద్రాలు : 3 నుండి 5 సం||లలోపు బాలబాలికలందరికీ ఇక్కడ విద్య, పోషకాహారం లభించేలా ప్రభుత్వం చూస్తుంది.
→ రోగనిరోధక శక్తి : ఏదైనా ఒక వ్యాధి శరీరంలోకి ప్రవేశించినపుడు, దానిని నిరోధించే శక్తి మన శరీరానికి కొంత ఉంటుంది.
→ ఆశ కార్యకర్త : గ్రామస్థాయిలో ప్రభుత్వ ఆరోగ్య సేవలను అందించే కార్యకర్త.