AP 8th Class Social Notes Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

Students can go through AP Board 8th Class Social Notes 10th Lesson బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 10th Lesson బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

→ ‘ఖుద్ ఖాఫ్’ అంటే సొంతంగా జమీందారులు సాగు చేసుకునే భూములు.

→ భారతదేశం పై, బ్రిటిష్ వాళ్ళు ఆధిపత్యం పొందిన తరువాత యుద్ధాలకు, వాణిజ్యానికి డబ్బులు సమకూర్చుకోవటానికి భూమి శిస్తును సాధ్యమైనంత పెంచాలని అనుకున్నారు.

→ కారన్‌వాలిస్ గవర్నరు జనరల్ 1793లో కంపెనీ శాశ్వతశిస్తు నిర్ణయ ఒప్పందం ప్రవేశపెట్టింది. దీని ద్వారా శిస్తు జమీందార్లు వసూలు చేస్తారు.

→ దీర్ఘకాలంలో జమీందారులు శిస్తు కట్టలేక ఋణగ్రస్తులై బాధలు అనుభవించారు.

→ 19వ శతాబ్దం నాటికి శిస్తు విధానాన్ని మరొకసారి మార్చటం తప్పనిసరి అన్న అభిప్రాయానికి చాలామంది కంపెనీ అధికారులు వచ్చారు.

→ రైతు అంటే భూమిని సాగుచేసేవాడు. ‘రైత్వారీ’ అంటే రైతులకు సాగు హక్కు ఇవ్వటం.

→ భారీ నీటి సాగు పథకాలలో పెట్టుబడులు పెట్టడం ప్రభుత్వ విధి అని కొంతమంది బ్రిటిష్ పరిపాలకులు భావించారు.

AP 8th Class Social Notes Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

→ సర్ ఆర్థర్ కాటన్ అవిశ్రాంత కృషి వల్ల 1849లో ధవళేశ్వరం వద్ద గోదావరినదిపై ఆనకట్ట, 1854లో విజయవాడ వద్ద కృష్ణానదిపై ఆనకట్ట కట్టారు.

→ భూమి నుంచి ఆదాయాన్ని పెంచాలన్న కోరికతో భూమిశిస్తును రెవెన్యూ అధికారులు గణనీయంగా పెంచేశారు.

→ వలసపాలనలో భూస్వాములు వారి సొంత భూములలో రైతాంగంతో బలవంతంగా, డబ్బులు ఇవ్వకుండా పనిచేయించుకునే వాళ్ళు. దీనినే వెట్టి అని అంటారు.

→ నిజాం పాలనలోని హైదరాబాదు రాష్ట్రంలో జాగీర్దారులు, సంస్థానాలు, ఇనాందారులు వంటి మధ్య స్థాయి పెత్తందారులు చాలామంది ఉండేవాళ్ళు.

→ హైదరాబాదును పాలించిన నిజాంలు బ్రిటిష్ పాలన కింద వాళ్ళ విధానాలను అనుసరించాల్సివచ్చేది.

→ బ్రిటిష్ పాలనలో కరవులు, తీవ్ర ఆహార కొరతల వల్ల తరచు సంక్షోభాలు తలెత్తేవి.

→ వలస పాలనలో దేశంలోని వివిధ ప్రాంతాలలోని రైతులు, భూస్వాములు, వ్యాపారస్థులు, అధికారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు.

→ భూస్వాములు : జమీందారులు తమ భూములను రైతాంగానికి ఇచ్చి పంటలో కొంత భాగం కానీ, ముందుగా నిర్ణయించిన కౌలుకి గాని ఇచ్చేవారు. ఈ రకంగా భూమి పొందిన వారిని భూస్వాములు అంటారు.

→ వడ్డీ వ్యాపారస్తులు : ప్రజల అవసరాలకు సొమ్మును అప్పుగా ఇచ్చి (తనఖా పై) దానికి గాను వడ్డీ తీసుకునేవారు.

→ జాగీర్లు : నిజాం పాలనలో హైదరాబాదు రాష్ట్రంలో కొంతమంది భూస్వాములుండేవారు. వీరిని జాగీర్ దారులు అనే వాళ్ళు. వీళ్ళ ఆధీనంలో ప్రాంతాలను జాగీర్లు అంటారు.

→ సంస్థానం : బ్రిటిష్ వారి కాలంలో భారతదేశంలో కొన్ని ప్రాంతాలు స్వదేశీయుల ఆధీనంలో ఉండేవి. వీటిని సంస్థానం అనేవారు. వీరు బ్రిటిష్ వారికి కప్పాలు చెల్లించేవారు.

AP 8th Class Social Notes Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు

→ ఇనాందారులు : వీరు కూడా మధ్య స్థాయి పెత్తందారులు. నిజాం వీరిని మెచ్చి కొంత ప్రాంతాన్ని ‘ఇనాం’గా ఇచ్చేవాడు. ఇలా ‘ఇనాం’ను పొందిన వారిని ఇనాందారులు అంటారు.

→ పట్టా : ఏదేని ఒక స్థలంపై యాజమాన్యపు హక్కును స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఇచ్చే కాగితపు ఆదేశమే పట్టా.

→ రైత్వారీ : రైత్వారీ అంటే రైతులకు సాగు హక్కు ఇవ్వటం.

→ దేశముఖ్ : హైదరాబాదు రాష్ట్రంలో (వలస పాలనలో) భూమిశిస్తు వసూలు చేయువారు.

AP 8th Class Social Notes Chapter 10 బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు 1