These AP 8th Class Social Important Questions 2nd Lesson సూర్యుడు – శక్తి వనరు will help students prepare well for the exams.
AP Board 8th Class Social 2nd Lesson Important Questions and Answers సూర్యుడు – శక్తి వనరు
ప్రశ్న 1.
కింద ఉన్న పట్టికలో భారతదేశంలోని కొన్ని పట్టణాలలో జనవరి 10న సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలు ఉన్నాయి. వీటి ఆధారంగా పట్టిక కింద ఉన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
ప్రదేశం | సూర్యోదయం | సూర్యాస్తమయం |
హైదరాబాదు, తెలంగాణ | 6 : 49 | 5:58 |
ఆగ్రా, ఉత్తరప్రదేశ్ | 7: 09 | 5: 42 |
మధురై, తమిళనాడు | 6: 37 | 6: 12 |
నాగపూర్, మహారాష్ట్ర | 6:53 | 5: 48 |
విశాఖపట్టణం , ఆం.ప్ర. | 6: 29 | 5:38 |
కోహిమా, నాగాలాండ్ | 6: 02 | 4 : 40 |
1. పైన ఉన్న ఆరు పట్టణాలలో ముందుగా సూర్యోదయం ఎక్కడ అవుతుంది?
జవాబు:
కోహిమా, నాగాలాండ్
2. ఏ పట్టణంలో అన్నిటికంటే చివర సూర్యాస్తమయం అవుతుంది?
జవాబు:
మధురై, తమిళనాడు
3. ఈ ఆరు పట్టణాలలో పగటికాలం ఎంత? (సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్య ఉన్న కాలం పగటి కాలం అవుతుంది.)
జవాబు:
హైదరాబాదు : 11.09 ని॥లు
ఆగ్రా : 10.33 ని॥లు
మధురై : 11.35 ని॥లు
నాగపూర్ : 10.55 ని॥లు
విశాఖపట్టణం : 11.09 ని॥లు
కోహిమా : 10.38 ని॥లు
ప్రశ్న 2.
ఉష్ణోగ్రత, వర్షపాతం జీవితాలను ప్రభావితం చేస్తాయని ఎట్లు చెప్పగలవు?
జవాబు:
ఉష్ణోగ్రత, వర్షపాతం జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. సూర్యరశ్మి, నీటిపై ఆధారపడి చెట్లు, జంతువులు బతుకుతాయి. చాలా కొద్ది రకాల చెట్లు మాత్రమే వేడిగా ఉండే ప్రాంతాలలో పెరుగుతాయి. చలి ప్రాంతాలలో మరికొన్ని పెరుగుతాయి. బాగా చలి ప్రాంతాలలో ఏవీ పెరగవు. ఈ విధంగా వృక్ష, జంతుజాలాలలో వైవిధ్యత ఉంది.
ప్రశ్న 3.
ఉష్ణోగ్రతకు, వర్షపాతానికి మధ్య గల సంబంధమేమి?
జవాబు:
రెండు ప్రదేశాల మధ్య గల ఉష్ణోగ్రతలలోని తేడాలు గాలులు, వానలను ప్రభావితం చేస్తాయి. ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు వర్షాలు కూడా బాగా కురుస్తాయి.
ప్రశ్న 4.
సౌరశక్తి ఏయే రూపాలలో ఉంటుంది?
జవాబు:
సౌరశక్తి కాంతి, వేడి, అల్ట్రావయొలెట్ తరంగాలు, రేడియో తరంగాలు మరియు X – కిరణాల రూపంలో ఉంటుంది.
ప్రశ్న 5.
భూగోళం వేడెక్కటం అంటే ఏమిటి?
జవాబు:
భూమి మీద వాతావరణంలో (CO) కార్బన్-డై-ఆక్సెడ్ అధికమవడం మూలంగా, వేడి వికిరణం తగ్గుతుంది. భూమి మీద ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీనినే భూగోళం వేడెక్కటం అంటారు.
ప్రశ్న 6.
వేడిమి సమతుల్యం అంటే ఏమిటి?
జవాబు:
సూర్యుని నుండి భూమి పొందే వేడి వివిధ పద్ధతులలో తిరిగి వికిరణం చెందుతుంది. కొంతమాత్రమే భూమి గ్రహిస్తుంది. దీనివలన భూమి మీద భరించగలిగే స్థాయిలో మాత్రమే వేడి ఉంటుంది. దీనినే వేడిమి సమతుల్యం అంటారు.
ప్రశ్న 7.
భూమి మీద ఉష్ణోగ్రతలలో మార్పులకు గల కారణాలు ఏవి?
జవాబు:
భూమి మీద ఉష్ణోగ్రతలలో మార్పులకు అనేక కారణాలున్నాయి. అవి :
- అక్షాంశము
- ఎత్తు
- సముద్రం నుండి దూరము
- సముద్ర తరంగాలు
- పర్వతాలు
- గాలులు మొ||నవి.
ప్రశ్న 8.
సూర్యకిరణాలు, సౌరశక్తి అనగా నేమి?
జవాబు:
భూగోళంపై శక్తికి సూర్యుడు మూలవనరు. సూర్యుడు ఒక పెద్ద శక్తి కేంద్రం. కాంతి, వేడిమి రూపంలో అది శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. సూర్యుడి నుంచి నిరంతరాయంగా వెలువడే ఈ శక్తిని సౌర వికిరణం అంటారు. ఏదైనా ఒక వస్తువు శక్తిని వెలువరించటాన్ని వికిరణం అంటారు. సూర్యుడి నుంచి మనకు శక్తి సూర్యకిరణాల రూపంలో వస్తుంది.
ప్రశ్న 9.
ఏఏ ప్రాంతాల ఉష్ణోగ్రతలలో తేడాలు ఉంటాయి?
జవాబు:
సముద్రానికి దగ్గరగా, దూరంగా ఉన్న ప్రాంతాల మధ్య సాధారణంగా ఉష్ణోగ్రతలలో తేడాలు ఉంటాయి. కొండపైన కొండ కింద ఉష్ణోగ్రతలలో తేడాలు ఉంటాయి. భూమధ్య రేఖ నుంచి ఉత్తరానికి లేదా దక్షిణానికి ప్రయాణం చేస్తుంటే ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
ప్రశ్న 10.
హరిత గృహాలు గూర్చి వ్రాయుము.
జవాబు:
మొక్కలకు అనువైన వాతావరణాన్ని కృత్రిమంగా కల్పించటం ద్వారా అన్ని చోట్ల పంటలు పండించటానికి మానవులు ప్రయత్నించటం ఆశక్తికరంగా ఉంటుంది. బాగా చలిగా ఉండే ప్రదేశాలలో హరిత గృహాలు నిర్మించి కూరగాయలు, పళ్ళు పండిస్తున్నారు. హరిత గృహాల గోడలు పారదర్శకంగా ఉండి ఎండను లోపలికి రానిస్తాయి. కానీ బయటకు వెళ్ళనివ్వవు. వారికి అనువుగా మడులు కట్టి సాగునీరు ఇచ్చి నీటిని నిల్వ కడతారు.
ప్రశ్న 11.
సూర్యుడు ప్రాణకోటికి ప్రాథమిక శక్తి వనరు. సూర్యరశ్మిని చెట్లు ఆహారంగా మార్చేసే ఫ్యాక్టరీలు, అటువంటి చెట్లను, అడవులను మనం పెంచుతున్నామా? తగ్గిస్తున్నామా? చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలు చెట్లను పెంచే మన బాధ్యతను గురించి వివరించండి.
జవాబు:
మనం పెంచే చెట్లకన్నా అధికశాతం చెట్లను నరికివేస్తున్నాము.
చెట్లు వలన ఉపయోగాలు :
- చెట్లు వాతావరణంలోని గాలి వేడిని తగ్గిస్తాయి.
- చెట్లు సహజ ఎయిర్ కండిషనర్లుగా పనిచేస్తాయి.
- చెట్లు ధ్వని కాలుష్యాన్ని తగ్గిస్తాయి.
- చెట్ల నుంచి రాలిన ఆకులు నేలలోని ఉష్టాన్ని తగ్గిస్తాయి.
- చెట్లు పక్షులకు, కొన్ని జంతువులకు ఆవాసాన్నీ, ఆహారాన్ని అందిస్తాయి.
- చెట్లు CO2 ను తీసుకుని O2 ను వదిలి మనకు ఊపిరినిస్తాయి.
- చెట్లు నీటిని సముద్రంలోనికి పోకుండా పట్టి ఉంచుతాయి. నేలలో సారం కొట్టుకుపోకుండా ఉంచుతాయి. నీటిని నేలలోనికి ఇంకిపోయేలా చేస్తాయి. దీనిమూలంగా కలుషితమైన ఎక్కువ చోటు పారకుండా నేలలోనికి యింకిపోతాయి.
ప్రశ్న 12.
హరిత గృహాలను ప్రశంసించండి.
జవాబు:
హరిత గృహాలనే గాజు గృహాలుగా కూడా పిలుస్తారు. ఇవి మొక్కలను పెంచడానికి నిర్మిస్తారు. ఇవి నియంత్రించబడిన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఇవి మంచి వేడిని, నీటిని మొక్కలకి అందిస్తాయి. వీటి సృష్టి చాలా అద్భుతం.
ప్రశ్న 13.
‘భూగోళం వేడెక్కడం’ మూలంగా ఏం జరుగుతుంది?
జవాబు:
‘భూగోళం వేడెక్కడం’ మూలంగా ధృవాలలో ఉన్న మంచు కరిగి, సముద్రమట్టాలు పెరుగుతాయి. భూమి మీద ఖండాలన్నీ నీట మునుగుతాయి.
ప్రశ్న 14.
హరిత గృహాలను ప్రశంసించండి.
జవాబు:
హరిత గృహాలనే గాజు గృహాలుగా కూడా పిలుస్తారు. ఇవి మొక్కలను పెంచడానికి నిర్మిస్తారు. ఇవి నియంత్రించబడిన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఇవి మంచి వేడిని, నీటిని మొక్కలకి అందిస్తాయి. వీటి సృష్టి చాలా అద్భుతం.
ప్రశ్న 15.
భూగోళం వేడెక్కడం,మూలంగా ఏం జరుగుతుంది?
జవాబు:
భూగోళం వేడెక్కడం మూలంగా ధృవాలలో ఉన్న మంచు కరిగి, సముద్రమట్టాలు పెరుగుతాయి. భూమి మీద ఖండాలన్నీ నీట మునిగిపోతాయి.
ప్రశ్న 16.
ఈ క్రింది ఉన్న పట్టికను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రదేశం | సూర్యోదయం | సూర్యాస్తమయం |
హైదరాబాదు, తెలంగాణ | 6 : 49 | 5 : 58 |
ఆగ్రా, ఉత్తరప్రదేశ్ | 7 : 09 | 5 : 42 |
మధురై, తమిళనాడు | 6 : 37 | 5 : 12 |
నాగపూర్, మహారాష్ట్ర | 6 : 53 | 5 : 48 |
విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్ | 6 : 29 | 5 : 38 |
కోహిమా, నాగాలాండ్ | 6 : 02 | 4 : 40 |
ఎ) ముందుగా సూర్యోదయం అయ్యే పట్టణం ఏది?
బి) ఏ పట్టణంలో అన్నిటికంటే చివరిగా సూర్యాస్తమయం అవుతుంది?
సి) విశాఖపట్టణం పగటి కాలం ఎంత?
డి) ఏ కాలంలో (సీజన్స్) పగటి వ్యవధి తక్కువ?
జవాబు:
ఎ) ముందుగా సూర్యోదయం అయ్యే పట్టణం నాగాలాండ్ రాష్ట్రములోని కోహిమా.
బి) చివరిగా సూర్యాస్తమయం అయ్యే పట్టణం తమిళనాడులోని, మధురై.
సి) విశాఖపట్టణం పగటికాలం సమయం 11 గంటల 9 నిముషాలు.
డి) పగలు వ్యవధి తక్కువగా ఉండే కాలం శీతాకాలం
ప్రశ్న 17.
సముద్ర ప్రభావిత, ఖండాంతర్గత శీతోష్ణస్థితుల మధ్యగల భేదమును వివరించండి.
జవాబు:
సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితి :
సముద్ర తీరాన ఉండే ప్రదేశాలలో సాధారణంగా సంవత్సరమంతా శీతోష్ణస్థితులు ఒకేరకంగా ఉంటాయి. దీనిని సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితి అంటారు.
ఖండాతర్గత శీతోష్ణస్థితి :
సముద్రతీరానికి దూరంగా ఉండే ప్రాంతాలలో గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలలో చాలా తేడాలు ఉంటాయి. ఇలా ఉండటాన్ని ఖండాతర్గత శీతోష్ణస్థితి అంటారు.
ప్రశ్న 18.
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య భూగోళం వేడెక్కటం (Global warming) దీనియొక్క రెండు దుష్పరిణామాలు రాయండి.
జవాబు:
భూగోళం వేడెక్కడం మూలంగా ధృవాలలో ఉన్న మంచు కరిగి, సముద్రమట్టాలు పెరుగుతాయి. భూమి మీద ఖండాలన్నీ నీట మునిగిపోతాయి.
ప్రశ్న 19.
క్రింది పట్టికు పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఎ) పై పట్టిక ప్రకారం ఎక్కువ శక్తిని గ్రహించునది?
బి) అన్ని అంశాల ద్వారా మొత్తం ఎంత శాతం శక్తి పరావర్తనం చేయబడుతుంది?
జవాబు:
ఎ) భూమి ఎక్కువ శక్తిని గ్రహిస్తుంది – 54%
బి) పరావర్తనం చెందే శక్తి శాతం – 30%
ప్రశ్న 20.
“కార్బన్ డై ఆక్సైడ్” లాంటి వాయువులు వాతావరణంలో పెరగటం భూగోళం వేడెక్కడానికి ఎలా దారి తీస్తున్నది?
జవాబు:
భూ వికిరణం ద్వారా వెలువడే వేడి వాతావరణం నుంచి బయటకు పోకుండా కార్బన్ డై ఆక్సెడ్ లాంటి వాయువులు అడ్డుకుంటున్నాయి. ఇది ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగటానికి కారణమవుతున్నది. తద్వారా భూగోళం వేడెక్కడానికి దారి తీస్తున్నది.
ప్రశ్న 21.
క్రింది గ్రాఫ్ ను చదివి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఎ) ప్రాంతం A యొక్క సంవత్సరంలోని ఉష్ణోగ్రత క్రమం ఏమిటి?
బి) రెండు ప్రాంతాలలో ఏది పర్వత ప్రాంతం అయి వుంటుంది?
జవాబు:
ఎ) ప్రాంతం A యొక్క సంవత్సరంలోని ఉష్ణోగ్రత క్రమంలో ఏ మార్పులు పెద్దగా లేవు.
బి) ప్రాంతం A పర్వత ప్రాంతం అయ్యే అవకాశాలు ఎక్కువ.
ప్రశ్న 22.
పునరుద్ధరింపబడే వనరులు మరియు అంతరించిపోయే వనరుల మధ్య తేడా ఏమిటి? ఒక్కొక్క దానికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
- పునరుద్దరించేబడే వనరులు అనగా ఒకసారి ఉపయోగించిన తరువాత కూడా తిరిగి ఉపయోగించడానికి లేదా తిరిగి ఉత్పత్తి చేయడానికి అవకాశం గల వనరులు
ఉదా : సౌరశక్తి. - అంతరించిపోయే వనరులు అనగా ఒకసారి ఉపయోగించిన తరువాత తిరిగి ఉపయోగించడానికి లేదా ఉత్పత్తి చేయడానికి వీలు కానివి.
ఉదా : బొగ్గు, పెట్రోలియం.
ప్రశ్న 23.
“కార్బన్ డై ఆక్సైడ్” లాంటి వాయువులు వాతావరణంలో పెరగటం భూగోళం వేడెక్కడానికి ఎలా దారి తీస్తున్నది?
జవాబు:
భూ వికిరణం ద్వారా వెలువడే వేడి వాతావరణం నుంచి బయటకు పోకుండా కార్బన్ డై ఆక్సెడ్ లాంటి వాయువులు అడ్డుకుంటున్నాయి. ఇది ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగటానికి కారణమవుతున్నది.. తద్వారా భూగోళం వేడెక్కడానికి దారి తీస్తున్నది.