AP 8th Class Social Notes Chapter 20 లౌకికత్వం – అవగాహన

Students can go through AP Board 8th Class Social Notes 20th Lesson లౌకికత్వం – అవగాహన to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 20th Lesson లౌకికత్వం – అవగాహన

→ కొన్ని దేశాలలో ఒక మతవర్గ ప్రజలు మరొక మత వర్గ ప్రజల పట్ల వివక్షత చూపుతున్నారు లేదా వేధింపులకు గురి చేస్తున్నారు.

→ తమ మత నమ్మకాలతో, తాము వాటిని అర్థం చేసుకున్నదానికి అనుగుణంగా జీవించడానికి వ్యక్తులకు భారత రాజ్యాంగం స్వేచ్ఛను ఇస్తోంది.

→ ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయటాన్నే లౌకికవాదం అంటారు. ఒక దేశం ప్రజాస్వామికంగా పనిచేయాలంటే ఇది ముఖ్యం.

→ భారతదేశంలో ప్రభుత్వ స్థలాల్లో ఏ ఒక్క మత చిహ్నాలను ప్రదర్శించకూడదు, ఏ మతాన్ని ప్రోత్సహించకూడదు.

→ భారత రాజ్యాంగం అంటరానితనాన్ని నిషేధించింది.

→ భారత లౌకిక విధానంలో మతం నుంచి పూర్తిగా వేరుచేయబడనప్పటికీ మతాల నుంచి అది సూత్రబద్ధ దూరంలో ఉంటుంది.

AP 8th Class Social Notes Chapter 20 లౌకికత్వం – అవగాహన

→ లౌకిక సూత్రాలపై ఆధారపడిన ప్రాథమిక హక్కులకు భారత రాజ్యాంగం హామీ ఇస్తోంది.

→ ప్రాథమిక హక్కులు : ఒక వ్యక్తికి అవసరమైన కనీస హక్కులు మన రాజ్యాంగం భారతదేశ పౌరులకు ఇచ్చింది. వీటినే ప్రాథమిక హక్కులు అంటారు.

→ ప్రజాస్వామ్యం : ఎన్నిక కాబడిన ప్రతినిధులచే పరిపాలించబడే విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు.

→ భయోత్పాతం : క్రూరమైన పాలన.

→ పౌర చట్టాలు : ప్రత్యేకించి ఒక వ్యక్తికి కానీ, ఒక వర్గం లేదా సమూహానికి కానీ సంబంధించిన చట్టాలు.

AP 8th Class Social Notes Chapter 20 లౌకికత్వం – అవగాహన 1