Students can go through AP Board 8th Class Social Notes 21st Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు to understand and remember the concept easily.
AP Board 8th Class Social Notes 21st Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు
→ కళాకారులు అనేక రకాలుగా ఉంటారు.
→ చాలావరకు జానపద కళలలో ప్రజలే పాల్గొంటారు.
→ యక్షగానం, గుసాడి, లంబాడి, సదిర్ నాట్యం , కురవంజి, కూచిపూడి మొదలైనవి నాట్యరూపాలు.
→ చాలామంది కళాకారులు ఊరూరా తిరగకుండా చక్రవర్తులు, రాజులు, జమీందార్ల పోషణలో ఉండేవాళ్ళు.
→ బుర్రకథలో కథనం చాలా ముఖ్యమయినది. దీనికి ఆట, వాచ్యం, పాట, నటనతోడై కథనంలో ఆసక్తిని పెంపొందిస్తాయి.
→ కమ్యూనిస్టు పార్టీకి మద్దతుదారులైన ప్రగతిశీల కళాకారులు 1943లో ప్రజానాట్య మండలిగా ఏర్పడ్డారు.
→ లాయరు, స్వాతంత్ర్య పోరాట యోధుడైన ఇ. కృష్ణ అయ్యర్ భరతనాట్యం నేర్చుకున్నాడు. ఈ కళలో ప్రజలకు ఆసక్తి కలిగించడానికి ఉద్యమించాడు.
→ కళ బ్రతకాలంటే గౌరవప్రదమైన చేతులకు బదిలీ చేయాలని చదువుకున్నవారు భావించారు.
→ ప్రదర్శన ద్వారా నేడు నాట్యకారులు జీవనోపాధిని పొందలేరు.
→ అన్ని రకాల నాట్యాలు అనేక రకాల ఘర్షణలకు గురి అయ్యాయి.
→ భారతీయ సంప్రదాయ నృత్యాలలో భరతనాట్యం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.
→ తప్పెటలు : గుండ్రటి కంచు పళ్ళాలు (2). ఒకదానితో ఒకటి కట్టబడినవి. సంగీత వాయిద్యంగా ఉపయోగిస్తారు.
→ అందెలు : పాదాలకు మడమల దగ్గర గుండ్రంగా అలంకరించుకునే ఆభరణాలు.
→ భిక్షం : పేదవారికి ఆహారంగా కానీ, ధనం రూపేణా కాని ఉచితంగా ఇచ్చేది.
→ మూకాభినయం : మాట్లాడకుండా సంజ్ఞలతో చేసే అభినయం.
→ తరంగం : కూచిపూడి నృత్య రీతిలో ఇది ఒక కష్టమైన విధానం.
ఈ నృత్యంలో కళాకారులు పళ్ళెంలో కాళ్ళు ఉంచి, తలపై నీళ్ల గిన్నె ఉంచి నాట్యం చేస్తారు. కొంతమంది చేతుల్లో వెలిగే కొవ్వొత్తులు కూడా ఉంచుతారు.
→ నట్టువనార్లు : నాట్యం నేర్పే గురువులు, సాధారణంగా వీళ్ళు దేవదాసీలకు పుట్టిన మగ సంతానం.