AP 8th Class Social Notes Chapter 24 విపత్తులు – నిర్వహణ

Students can go through AP Board 8th Class Social Notes 24th Lesson విపత్తులు – నిర్వహణ to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 24th Lesson విపత్తులు – నిర్వహణ

→ ప్రపంచంలో విపత్తులకు ఎక్కువ గురయ్యే దేశాలలో భారతదేశం ఒకటి.

→ ఒకే ప్రాంతం అనేక ప్రమాదాలకు గురి అవుతుంటే దానిని ‘పలు ప్రమాదాల ప్రాంతం’ అంటారు.

→ విపత్తులను ఎదుర్కోవటానికి ప్రజలు సిద్ధంగా లేకపోతే నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

AP 8th Class Social Notes Chapter 24 విపత్తులు – నిర్వహణ 1

→ విపత్తులపై నియంత్రణ, వాటి నుండి కోలుకునే మార్గాలు అందించటం మొదలైన వాటిని కలిపి విపత్తుల యాజమాన్యం అంటారు.

→ విపత్తుల యాజమాన్యంలో ఉపాధ్యాయులు, విద్యార్ధులు ముఖ్య పాత్ర పోషిస్తారు.

AP 8th Class Social Notes Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

→ జపాన్ భాషలో ‘సునామీ’ అంటే ‘రేవు అలలు’ అని అర్థం.

→ సునామీ గురించి ముందే హెచ్చరికలు జారీ చేయవచ్చు.

→ కరవు వర్షపాతం లోపం వల్ల ఏర్పడే ప్రకృతి విపత్తు.

→ అధిక లేదా తక్కువ వర్షపాతం అన్నది 70-100 సంవత్సరాల సగటు సాధారణ వర్షపాతంతో పోల్చి చెబుతారు.

→ కొన్ని ప్రాంతాలు అవి ఉన్న భౌగోళిక స్థితుల వల్ల తక్కువ వర్షపాతం పడటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వీటిని కరవు పీడిత ప్రాంతాలు అంటారు.

→ కరవు ప్రభావం మెల్లగా తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.

→ పట్టణ ప్రాంతాల్లో ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీటిని జాగ్రత్తగా నిలువ చేయాలి.

→ కరవు ప్రభావాలను తగ్గించటానికి ప్రభుత్వం కరవు పీడిత ప్రాంతాలలో సమగ్ర వాటర్ షెడ్ యాజమాన్య పథకాలను (IWMP) అమలు చేస్తోంది.

→ పలు ప్రమాదాల ప్రాంతం : ఒక ప్రాంతం అందులోని ప్రజలు ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలకు గురికావచ్చు. ఇటువంటి ప్రాంతాలను పలు ప్రమాదాల ప్రాంతం అంటారు.

AP 8th Class Social Notes Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

→ మానవ నిర్మిత ప్రమాదం : మానవుల చర్యల కారణంగా ఏర్పడే ప్రమాదం. ఉదా : భోపాల్ గ్యాస్ విషాదం.

కరవు : వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి వైపరీత్యం.

→ పురుగుల సమస్య : ఉన్నట్టుండి పురుగులు పంటలను ఆశించడం లేదా మిడతలు లాంటివి దాడి చేయటం.

→ పర్యా వరణ క్షీణత : పర్యావరణ అంశాలైన గాలి, నీరు, వాతావరణంలోని సుగుణాత్మక అంశాలు క్షీణించుట.

→ క్షామము : వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి విపత్తు

AP 8th Class Social Notes Chapter 24 విపత్తులు – నిర్వహణ 2