Students can go through AP Board 8th Class Social Notes 7th Lesson ద్రవ్యం, బ్యాంకింగ్ to understand and remember the concept easily.
AP Board 8th Class Social Notes 7th Lesson ద్రవ్యం, బ్యాంకింగ్
→ వస్తుమార్పిడిలో డబ్బు లేకుండానే వస్తువులను నేరుగా, ఒకదానితో మరొకటి మార్చుకుంటారు.
→ డబ్బును వినియోగిస్తే సరుకుల మార్పిడిలో సమస్యలుండవు. డబ్బు మాధ్యమంగా పనిచేస్తుంది.
→ సంచి లేదా పర్సులలో డబ్బును ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. అది రవాణాకు అనుకూలమైనది.
→ కాలక్రమంలో అరుదైన, ఆకర్షణీయమైన లోహాలను మార్పిడి మాధ్యమంగా ప్రజలు ఉపయోగించడం మొదలు పెట్టారు.
→ రోమన్ల కాలంలో “బీసెంట్” అనే బంగారు నాణెం ప్రామాణికంగా ఉండేది.
→ 17వ శతాబ్దంలో యూరలో ఆమ్ స్టర్ డాంలో ‘బ్యాంక్ ఆఫ్ ఆమ్ స్టర్ డామ్’ను ప్రారంభించారు.
→ ప్రజలు బ్యాంకులలో దాచుకునే డబ్బును ‘జమ’ అంటారు.
→ డబ్బులు చెల్లించడానికి తీసుకోవడానికి చెక్కులను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
→ కరెంటు ఖాతా నుంచి ఎన్నిసార్లయినా డబ్బులు తీసుకోవచ్చు.
→ ప్రస్తుతం కంప్యూటర్లు, ఇంటర్నెట్లను అంతటా వాడుతున్నారు.
→ బ్యాంకు అనేది ఒక వాణిజ్య సంస్థ. ప్రజలు పొదుపు చేసిన డబ్బు జమల రూపంలో బ్యాంకులోకి వస్తుంది.
→ వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, రైతులు, చేతివృత్తిదారులు వంటి అనేకమందికి బ్యాంకులు అప్పులిస్తాయి.
→ వస్తుమార్పిడి : వస్తుమార్పిడిలో డబ్బు లేకుండానే, వస్తువులను నేరుగా ఒకదానితో మరొకటి మార్చుకుంటారు.
→ డబ్బు రూపాలు : నాణేలు, రశీదులు, హుండీలు, చెక్కులు, డ్రాఫులు మొదలైనవన్నీ డబ్బు రూపాలే.
→ జమలు : ఎవరికైనా ఇవ్వవలసిన సొమ్మును తిరిగి కొంత యిచ్చినా, తమ సొమ్మును బ్యాంక్ లాంటి సంస్థల్లో దాచినా, వీటిని జమలు అంటారు.
→ పొదుపు : భవిష్యత్తులోని అవసరాలను దృష్టిలో ఉంచుకొని తమ ఆదాయంలోని కొంత మొత్తంను దాచుకోవడాన్ని పొదుపు అంటారు.
→ అప్పు / రుణం : తమ ఆర్థిక అవసరాల కోసం ఇతరుల దగ్గర నుండి లేదా ఋణసంస్థల నుండి డబ్బును తీసుకోవడం.
→ వడ్డీ : అప్పు తీసుకున్న సొమ్ముపై వాడుకున్నందుకుగాను కొంత శాతం సొమ్మును ఋణదాతకు ఇవ్వడం.
→ చెక్కు : డబ్బులు చెల్లించడానికి, తీసుకోవడానికి ఉపయోగపడేది. (బ్యాంకు ద్వారా)