Students can go through AP Board 8th Class Social Notes 8th Lesson జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం to understand and remember the concept easily.
AP Board 8th Class Social Notes 8th Lesson జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం
→ మనం అత్యంతాధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాం.
→ పారిశ్రామిక విప్లవం వలన 18, 19 శతాబ్దాలలో పెనుమార్పులు వచ్చాయి.
→ ఆవిరియంత్రం వల్ల కర్మాగారాల్లో పని విధానం మారిపోయింది.
→ సాంకేతిక విజ్ఞానంలో మార్పు ఒక కొత్త ఉత్పత్తికి దారితీయవచ్చు.
→ యంత్రాల వినియోగం కూడా కొత్త ఉద్యోగాలకు దారితీస్తుంది.
→ సాంకేతిక విజ్ఞానాన్ని అన్నివేళలా స్వాగతించరు.
→ స్వాతంత్ర్యం తరువాత ప్రభుత్వం ఆనకట్టలు కట్టి సాగునీటి సౌకర్యాలు మెరుగుపరచసాగింది.
→ వ్యవసాయక యంత్రాలను ఉపయోగించడం వలన ఉత్పత్తి ప్రక్రియ గణనీయంగా మారింది.
→ వరికోత యంత్రం వల్ల రైతులు కూలీలపై ఆధారపడటం తగ్గింది.
→ భారతదేశంలో మిల్లుల ద్వారా వస్త్ర ఉత్పత్తిని బ్రిటిషు వాళ్ళు మొదలు పెట్టారు.
→ చేనేతలో క్షీణత అనేది స్పష్టంగా కనిపించే ఒక ప్రధానమైన మార్పు.
→ సాంకేతిక విజ్ఞాన మార్పులు సేవారంగాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.
→ భారతదేశంలో టెలీకమ్యూనికేషన్ నెట్ వర్క్ ప్రపంచంలో మూడవ అతి పెద్దది.
→ ప్రభుత్వ కంపెనీలకు కాక అనేక ప్రైవేట్ కంపెనీలు ల్యాండ్ లైన్, మొబైల్ ఫోన్ సేవలను అందిస్తున్నాయి.
→ సాంకేతిక విజ్ఞానం : ఏదైనా పని విధానం మెరుగుపరచుట లేదా ఏదైనా ఎలా చేయబడింది అనే జ్ఞానాన్ని రోజువారీ జీవితావసరాలకు ఉపయోగించుకుంటే అది సాంకేతిక విజ్ఞానం అవుతుంది.
→ ఆవిష్కరణ : ఒక కొత్త యంత్రాన్ని లేదా ఉత్పత్తి విధానాన్ని తొలిసారిగా కనుక్కొన్నప్పుడు దానిని ఆవిష్కరణ అంటారు.
→ సాగునీటి సౌకర్యాలు : పంట పొలాలకు రకరకాలుగా నీరందించడంను సాగునీటి సౌకర్యాలు అంటారు.
→ రసాయనిక ఎరువులు, పురుగు మందులు : పంటలు బాగా పెరిగి ఎక్కువ దిగుబడినివ్వడానికి రసాయనిక ఎరువులు వాడతారు. పంటలకు పట్టిన చీడ, పీడలకు పురుగు మందులు వాడతారు.
→ వ్యవసాయ పనులు : పొలం దున్నటం, నారుపోయడం, నాట్లు, కలుపు తీయటం, పాయలెయ్యడం, కోత, కుప్ప వేయడం, నూర్పిడి, ఆరబెట్టడం మొదలైనవన్నీ వ్యవసాయ పనులు.
→ సేవలు : వ్యవసాయ, వ్యాపార రంగాలకు సహాయపడేవి, అన్ని వ్యాపార కలాపాల్ని కలిపి సేవలు అని చెప్పవచ్చు.
ఉదా : విద్య, వైద్యం, రవాణా మొ||నవి.