AP 9th Class Biology Notes 2nd Lesson వృక్ష కణజాలం

Students can go through AP Board 9th Class Biology Notes 2nd Lesson వృక్ష కణజాలం to understand and remember the concept easily.

AP Board 9th Class Biology Notes 2nd Lesson వృక్ష కణజాలం

→ ఒకే నిర్మాణం కలిగి, ఒకే విధమైన విధుల్ని నిర్వర్తించే కణాల సమూహమే కణజాలం.

→ పెరుగుతున్న భాగాల్లో ఉండే విభజన చెందగలిగే కణజాలంను విభాజ్య కణజాలం అంటారు.

→ మొక్కపై పొరలను ఏర్పరచే కణజాలం త్వచకణజాలం.

→ వృక్షదేహాన్ని ఏర్పరుస్తూ ఇతర కణజాలాలు సరియైన స్థితిలో ఉండేలా చేసేది సంధాయక కణజాలం.

→ పదార్థాల రవాణాకు సహాయపడేది ప్రసరణ కణజాలం.

AP 9th Class Biology Notes 2nd Lesson వృక్ష కణజాలం

→ విభాజ్య కణజాలాలు మూడు రకాలు అవి : 1. అగ్ర విజ్య కణజాలం 2. పార్శ్వ విభాజ్య కణజాలం 3. మధ్యస్థ , విభాజ్య కణజాలం.

→ బహిస్త్వచం (వెలుపలి పొర), మధ్యస్వచం (మధ్యపొర), అంతస్త్వచం (లోపలిపొర). ఇవి త్వచ కణజాలం నుండి ఏర్పడుతాయి.

→ నీటి నష్టము, కొమ్మలు విరగడం, చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలు, పరాన్న జీవులు, రోగకారక జీవుల దాడి మొదలైన వాటి నుండి మొక్కలను త్వచకణజాలం రక్షిస్తుంది.

→ జిగురును ఇచ్చే చెట్ల యొక్క త్వచకణజాలం నుండి జిగురు స్రవించబడుతుంది.

→ సంధాయక కణజాలం మూడు రకములు అవి : 1. మృదు కణజాలం 2. స్థూలకోణ కణజాలం 3. దృఢ కణజాలం.

→ హరితరేణువులను కలిగి ఉండే మృదుకణజాలం హరిత కణజాలం అంటారు. పెద్దగాలి గదులుండే మృదు కణజాలాన్ని వాయుగత కణజాలమని అంటారు.

→ నీరు, ఆహారం, వ్యర్థ పదార్థాలను నిల్వచేసే మృదు కణజాలాన్ని నిల్వచేసే కణజాలం అంటారు.

→ మృదు కణజాలంలోని కణాలు మృదువుగా, పలుచని గోడలు కలిగి వదులుగా అమర్చబడి ఉంటాయి.

→ స్థూలకోణ కణజాలంలోని కణాలు దళసరి గోడలను కలిగి, కొంచెం పొడవైన కణాలుగా ఉంటాయి. దృఢ కణజాలంలోని కణాలు దళసరిగోడలు కలిగి ఉండి, కణాల మధ్య ఖాళీలు లేకుండా దగ్గర దగ్గరగా అమరి ఉంటాయి.

→ నెహేమియా గ్రూ దవ్వభాగానికి మృదు కణజాలమని పేరు పెట్టాడు.

→ ప్రసరణ కణజాలం రవాణా నిర్వహిస్తుంది. అవి రెండు రకాలు. దారువు, పోషక కణజాలం.

AP 9th Class Biology Notes 2nd Lesson వృక్ష కణజాలం

→ దారువు నీరు, పోషక పదార్థాలను వేర్ల నుండి మొక్క అగ్రభాగాలకు చేరుస్తుంది.

→ పోషక కణజాలము ఆకులలో తయారయిన ఆహారపదార్ధములను మొక్క భాగాలకు సరఫరా చేస్తుంది.

→ దారువులో దారుకణాలు, దారునాళాలు, దారుతంతువులు, దారు మృదుకణజాలం ఉంటాయి.

→ పోషక కణజాలంలో చాలనీ కణాలు, చాలనీ నాళాలు, సహకణాలు, పోషక కణజాల తంతువులు, పోషక మృదుకణజాలం ఉంటాయి.

→ దారువు యూకలిప్టస్ నందు నీటిని 200 అడుగులకు మరియు రోజవుడ్ వృక్షము నందు 300 అడుగుల వరకు నీటిని మోసుకొని వెళుతుంది.

→ కణజాలం : ఒకే నిర్మాణం కలిగి ఒకే విధమైన విధులను నిర్వర్తించే కణాల సమూహము.

→ విభాజ్య కణజాలం : పెరుగుతున్న భాగాల్లో ఉండే విభజన చెందగలిగే కణజాలం.

→ త్వచ కణజాలం : మొక్క బయట భాగాన్ని కప్పి ఉంచి రక్షణ కలుగచేసేది.

→ బెరడు : పెద్ద చెట్లలో బాహ్యచర్మంపై ఉండే అనేక పొరల త్వచ కణజాలం.

→ సంధాయక కణజాలం: మొక్క దేహంలో ఎక్కువ భాగాన్ని ఏర్పరచేది.
ఉదా : మృదుకణజాలం, స్థూలకోణ కణజాలం, దృఢ కణజాలం.

AP 9th Class Biology Notes 2nd Lesson వృక్ష కణజాలం

→ మృదు కణజాలం : కణాలు మృదువుగా పలుచని గోడలు గలిగి వదులుగా అమర్చబడిన సంధాయక కణజాలం.

→ హరిత కణజాలం : హరితరేణువులను కలిగి ఉండే మృదు కణజాలం.

→ వాయుగత కణజాలం : పెద్ద గాలిగదులను కలిగి ఉండే మృదు కణజాలం.

→ నిల్వ చేసే కణజాలం : నీరు, ఆహారం వ్యర్థ పదార్థములను నిల్వచేసే మృదుకణజాలం.

→ దృఢ కణజాలం : కణాలు దళసరి గోడలను కలిగి, కణాల మధ్య ఖాళీలు లేకుండా ఉండే సంధాయక కణజాలం.

→ స్థూలకోణ కణజాలం : కణాలు దళసరి గోడలను కలిగి, కొంచెం పొడవైన కణాలు గల సంధాయక కణజాలం.

→ ప్రసరణ కణజాలం : పదార్థాల రవాణాలో సహాయపడే కణజాలం.

→ దారువు : నీరు, పోషక పదార్థములను వేర్ల నుండి మొక్క పై భాగాలకు రవాణా చేసే కణజాలం.

→ పోషక కణజాలం : ఆకు నుండి ఆహారపదార్థములను మొక్క భాగాలకు సరఫరా చేసే కణజాలం.

→ అగ్ర విభాజ్య కణజాలం : కాండం, వేరు కొనభాగాల్లో ఉండే కణజాలం.

→ పార్శ్వ విభాజ్య కణజాలం : కాండంలో పార్శ్వపు అంచుల చుట్టూ వర్తులంగా పెరుగుదలను కలిగించే కణజాలం.

→ మధ్యస్థ విభాజ్య కణజాలం : కాండం మీద శాఖలు ఏర్పడే చోట, ఆకులు, పుష్పవృంతం పెరిగే చోట ఉండే కణజాలం.

→ నాళికాపుంజాలు : దారువు, పోషక కణజాలం కలిగిన ప్రాథమిక ప్రసరణ కణజాలంనందలి ఒక వరుస కణజాలం.

→ దారు కణాలు : దారువు నందు నీటి ప్రసరణకు యాంత్రిక బలాన్ని ఇచ్చే అంశములు. కణాలు పొడవుగా కండె ఆకారంలో ఉండి, కణ కవచం మందంగా లిగ్నిస్ పూరితమై ఉంటుంది.

→ దారునాళాలు : దారువు నందలి నిర్జీవ కణములు. నీటి రవాణా మరియు మొక్కకు యాంత్రిక బలాన్ని ఇస్తాయి.

AP 9th Class Biology Notes 2nd Lesson వృక్ష కణజాలం

→ చాలనీ కణాలు : పోషక కణజాలం నందలి అంశాలు. ఒకదాని మీద మరియొక కణాలు అమరి ఉంటాయి. ఆహారపదార్థాల రవాణాలో పాల్గొంటాయి.

→ చాలనీ నాళాలు : పోషక కణజాల అంశములు. ఆహారపదార్థాల రవాణాలో పాల్గొంటాయి.

→ సహ కణాలు : పోషక కణజాల అంశములు :
చిక్కని కణద్రవ్యం, పెద్దదైన కేంద్రకం ఉంటుంది.
చాలనీ నాళాలతో కలసి ఉంటాయి. ఆవృత బీజాలలో మాత్రమే ఉంటాయి.

AP 9th Class Biology Important Questions 2nd Lesson వృక్ష కణజాలం 5