Students can go through AP Board 9th Class Biology Notes 7th Lesson జంతువులలో ప్రవర్తన to understand and remember the concept easily.
AP Board 9th Class Biology Notes 7th Lesson జంతువులలో ప్రవర్తన
→ జంతువుల ప్రవర్తన మీద అనేక కారకాలు ప్రభావం చూపుతాయి.
→ జంతువులు తమలో తాము, ఇతర జీవులతో పర్యావరణంతో జరిపే పరస్పర చర్యలను అర్థం చేసుకోవడానికి జంతువుల ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి.
→ జంతువుల ప్రవర్తనను బాహ్య, అంతర ప్రచోదనాలు ప్రేరేపిస్తాయి.
→ జంతు ప్రవర్తన రీతులు నాలుగు రకాలు, అవి : సహజాత ప్రవృత్తి, అనుసరణ, నిబంధన, అనుకరణ.
→ పుట్టుకతో వచ్చే ప్రవర్తనలను సహజాత ప్రవృత్తి లేదా సహజాత లక్షణాలు అంటారు.
→ పక్షులు గూడు కట్టుకోవడం, సంతానోత్పత్తి కోసం భిన్న లింగజీవిని ఎంచుకోవడం, రక్షణ కోసం సమూహాలు ఏర్పాటు చేసుకోవడం, వేడి వస్తువులను తాకినప్పుడు వెనక్కి తీసుకోవడం సహజాత లక్షణాలు.
→ కోళ్ళు, బాతు పిల్లలు గుడ్ల నుండి బయటకు వచ్చిన వెంటనే తల్లిని పోల్చుకోవడం అనుసరణ.
→ సహజంగా కాకుండా కృత్రిమంగా ఒక ఉద్దీపనకు ప్రతిచర్య చూపే ఒక రకమైన ప్రవర్తనను నిబంధన అంటారు. ఇది నేర్చుకోవలసినది.
→ ఇవాన్ పావ్లోవ్ నిబంధనపై ప్రయోగాలు చేశాడు.
→ ఒక జంతువు యొక్క ప్రవర్తనను వేరొక జంతువు ప్రదర్శించడం లేదా కాపీ చేయడం వంటి ప్రవర్తనను అనుకరణ అంటారు.
→ మానవుల ప్రవర్తన ఇతర జంతువుల కన్నా సంక్లిష్టంగా ఉంటుంది.
→ జంతువుల ప్రవర్తన కంటే మానవుల ప్రవర్తన అధ్యయనం చేయడం కష్టం.
→ గుర్తింపు సూచికలు జంతువులు ప్రయాణించే మార్గం అనుసరించడానికి శాస్త్రవేత్తలకు ఉపయోగపడతాయి.
→ కుక్కలు వాసన పసిగట్టడం, చీమల్లో సమాచారం అందించడం అనేవి అవి విడుదల చేసే ఫెర్బనుల వలన జరుగుతుంది.
→ ఉత్తర అమెరికాలో నివసించే క్షీరదం బీవర్ నీటి ప్రవాహానికి అడ్డంగా ఆనకట్ట నిర్మిస్తుంది.
→ డాల్ఫిన్లకు తార్కికంగా ఆలోచించే శక్తి ఎక్కువ.
→ 1977లో ఇర్విన్ పెప్పర్ బర్గ్, అలెక్స్ అనే చిలుకకు 100 పదాలు పైగా నేర్పాడు.
→ కొన్ని జంతువులు శత్రువుల నుండి తమను రక్షించుకోవడానికి శరీరము నుండి దుర్వాసన వెదజల్లుతాయి. ఉదా : టాస్మేనియన్ డెవిల్, బంబార్డియర్ బీటిల్.
→ జంతువుల ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయడాన్ని ‘ఇథాలజీ’ అంటారు.
→ సహజాత ప్రవృత్తి : పుట్టుకతో వచ్చే ప్రవర్తనలను సహజాత ప్రవృత్తి లేదా సహజాత లక్షణాలు అంటారు.
→ అనుసరణ : జంతువుల ప్రవర్తనా రీతులలో ఒకటి.
ఉదా : గుడ్ల నుండి బయటకు వచ్చిన కోడి మరియు బాతు పిల్లలు తమ తల్లిని గుర్తించటం.
→ నిబంధన : సహజంగా కాకుండా కృత్రిమంగా ఒక ఉద్దీపనకు ప్రతిచర్య చూపే ఒక రకమైన ప్రవర్తన.
→ అనుకరణ : ఒక జంతువు యొక్క ప్రవర్తన వేరొక జంతువు ప్రదర్శించడం లేదా కాపీ చేయడం.
→ ప్రతిచర్య : సహజాత లక్షణం ఇది పుట్టుకతో వచ్చేది. ఉదా : వేడి వస్తువును లేదా మొనదేలిన దానిని తాకినప్పుడు మన చేతిని వెనక్కు తీసుకోవడం.
→ సృజనాత్మకత : కొత్త వస్తువును చేయుట లేదా సృష్టించుట.
→ పరిశోధనాత్మకత : క్షేత్రంలో లేదా ప్రయోగశాలలో ఒక విషయమును పరిశోధించుట లేదా నిదర్శనమును చూపుట.
→ ఇథాలజీ : ఇది జీవశాస్త్రంలో భాగం జంతువుల ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయడం.
→ ప్రైమేట్స్ : క్షీరదములకు చెందిన నమూహము. దీనిలో మనుష్యులు మరియు కోతులు ఉంటాయి.
→ నిబంధన సహిత చర్యలు : పుట్టుకతో వచ్చేవి కావు. నేర్చుకోవలసిన చర్యలు.