Students can go through AP Board 9th Class Biology Notes 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు to understand and remember the concept easily.
AP Board 9th Class Biology Notes 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు
→ పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహారోత్పత్తిని పెంచడం భారతదేశానికి ఒక పెద్ద సవాలు వంటి అంశము.
→ అధిక ఆహార ఉత్పత్తి నాటిన విత్తన రకం, నేల స్వభావం, నీటి లభ్యత, ఎరువులు, పోషక పదార్థాల అందుబాటు, వాతావరణం, పంటపై క్రిమికీటకాల దాడి, కలుపు మొక్కల పెరుగుదలను అదుపు చేయడం మీద ఆధారపడి ఉంటుంది.
→ పంటమార్పిడి పద్దతి వలన నేల సారవంతం అవుతుంది.
→ మిశ్రమ పంట విధానం వలన రకరకాల పంటలు పండించటం మాత్రమే కాకుండా, ఉత్పత్తిలో కూడా పెరుగుదల ఉంటుంది.
→ పంట ఉత్పత్తిని పెంచడంలో నీటి పారుదల ముఖ్య పాత్ర వహిస్తుంది.
→ మొక్కలు పిండి పదార్థం తయారుచేయడానికి 0.1 శాతం నీటిని మాత్రమే వినియోగించుకుంటాయి.
→ నీటిలో కరిగిన పోషక పదార్థాలను మాత్రమే మొక్కలు వేళ్ళ ద్వారా గ్రహిస్తాయి.
→ విత్తనములలో మనకు కావలసిన లక్షణాలను పొందడానికి సంకరణ మరియు జన్యు ఇంజనీరింగ్ పద్ధతులు ఉపయోగపడతాయి.
→ పత్ర రంధ్రాల ద్వారా బాష్పోత్సేకము మరియు నీటి సంగ్రహణ జరుగుతుంది.
→ స్థూల పోషకాలు మొక్కలకు అధిక పరిమాణంలో అవసరం.
ఉదా : నత్రజని, భాస్వరము, పొటాషియం మొదలగునవి.
→ సూక్ష్మ పోషకాలు మొక్కలకు తక్కువ పరిమాణంలో అవసరం.
ఉదా : ఇనుము, బోరాన్, మాంగనీసు, జింక్ మొదలగునవి.
→ నీటి వసతి తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఆరుతడి పంటలు పండించాలి.
→ చిక్కుడు జాతి మొక్కలందు ఉండు వేరు బుడిపెలు నత్రజనిని మొక్కకు అందిస్తాయి.
→ మొక్కల, జంతువుల విసర్జితాలు కుళ్ళింపచేసినప్పుడు సేంద్రియ ఎరువులు ఏర్పడతాయి.
→ పంటమార్పిడి, సేంద్రియ ఎరువులు మరియు రసాయనిక ఎరువుల ద్వారా పోషకాలు నేలలో చేరతాయి.
→ కొన్ని రకాల పంటలను పండించిన తరువాత వాటిని నేలలో కలిపి దున్నుతారు. వీటిని పచ్చిరొట్ట ఎరువులు అంటారు.
→ వాతావరణము మరియు నేల నుండి సూక్ష్మజీవులు పోషకాలను తయారుచేయడమును జీవ ఎరువులు అంటారు.
→ ఏ మొక్క ఆకులనైనా పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగించవచ్చు.
→ భూమికి సంబంధించిన పరిజ్ఞానమును భూసార పరీక్షా కేంద్రాలు ఇస్తాయి.
→ సేంద్రీయ సేద్యంలో అధిక దిగుబడి సాధించడం కోసం రైతులు రసాయన ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తారు.
→ సేంద్రియ ఎరువులు వాడడం వల్ల నేలలో హ్యూమస్ చేరి, నీటిని నిల్వ చేసుకునే శక్తి నేలకు పెరుగుతుంది.
→ కీటకనాశనులు, శిలీంధ్రనాశకాలను, కలుపునాశనులు వాడడం వల్ల మానులు నేలలోనే మిగిలిపోతాయి.
→ వర్షాలు పడినప్పుడు నీటిలో కరిగి నీటి వనరులను కలుషితం చేస్తాయి.
→ ఆహారపు గొలుసు : ఆవరణ వ్యవస్థలో పరభక్షి, భక్షక సంబంధాన్ని తెలుపుతుంది. దీనిలో ఉత్పత్తిదారులు, వినియోగదారులు ఉంటారు.
→ పర్యావరణ శాస్త్రం : మొక్కలు, జంతువులు ఒకదానికి మరియొక దానికి మరియు పర్యావరణమునకు కలిగిన సంబంధమును శాస్త్రీయంగా అధ్యయనం చేయటం.
→ ఖరీఫ్ పంటలు : వర్షాకాలము లేదా ఋతుపవన కాలములో పండించబడే పంటలు.
ఉదా : వరి, చెరకు, మొక్కజొన్న మొదలగునవి.
→ మిశ్రమ పంట : ఒకే కాలంలో, ఒకే ప్రాంతంలో రెండు వేరు వేరు పంటలను పండించడాన్ని మిశ్రమ పంట అంటారు.
ఉదా : బఠాణీతో పెసలు.
→ రబీ పంట : చలికాలం నందు విత్తులు జల్లి వేసవికాలం నందు కోతకు వచ్చే పంటలు.
ఉదా : గోధుమ, బార్లి, నువ్వులు మొదలగునవి.
→ ఎరువులు : నేల సారాన్ని మరియు మొక్క పెరుగుదలను ఎక్కువ చేసే పదార్థాలు.
→ స్థూల పోషకాలు : మొక్కలకు ఎక్కువ మొత్తంలో అవసరం అయ్యే పోషకాలు.
ఉదా : నత్రజని, భాస్వరం, పొటాషియం.
→ సూక్ష్మ పోషకాలు : తక్కువ మొత్తం (పరిమాణం)లో అవసరం అయ్యే పోషకాలు.
ఉదా: ఇనుము, మాంగనీస్, బోరాన్, జింక్, కాపర్.
→ పంటమార్పిడి : సంవత్సరాల తరబడి ఒకే పంటను పండించకుండా, ఒక పంట తరువాత వేరే ఇతర పంటను పండించే ప్రక్రియను పంటమార్పిడి అంటారు. ఉదా: వరి పండించిన తరువాత లెగ్యుమినేసి వంటలైన పిల్లిపెసర, శనగ పండించటం.
→ భూసార పరీక్షా కేంద్రాలు : నేల సారవంతమును పరీక్షించే కేంద్రాలు. నేలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చు.
→ జీవ ఎరువులు : సూక్ష్మజీవులు వాతావరణము మరియు నేల నుండి మొక్కలకు తయారుచేసి ఇచ్చే ఎరువులు.
→ పరభక్షక కీటకాలు : ఇతర కీటకాలను తినే కీటకాలు.
→ కీటక నాశనులు : కీటకాలను సంహరించే రసాయన పదార్థాలు.
→ కలుపు మొక్కలు : పంట మొక్కలలో పెరిగే నిరుపయోగమైన మొక్కలు.
→ శిలీంధ్ర నాశనులు : మొక్కలను ఆశించే శిలీంధ్రాలను నాశనము చేయు రసాయన పదార్థాలు.
→ నీటి పారుదల : పంట మొక్కలకు నీటిని అందించే విధానం.
→ పొడి సేద్యం : నీరు సక్రమంగా లభ్యం కాని ప్రదేశాలలో పంటలు పండించే విధానం.
→ కీటకాహారులు : కీటకాలను ఆహారముగా తీసుకునే జీవులు.
→ రోగ నిరోధకత : కీటక నాశనులను ఉపయోగిస్తూ పోతే కీటకాలు వాటిని నాశనం చేసే రసాయనాలకు చనిపోకపోవడం.
→ పత్ర రంధ్రాలు : మొక్క బాహ్య చర్మమునందు ఉండు సూక్ష రంధ్రాలు. బాష్పోత్సేకమునకు సహాయపడతాయి. వాయువుల మార్పిడి వీటి ద్వారా జరుగుతుంది.
→ బాక్టీరియా వర్ధనం : వ్యాధి నిర్ధారణ క్రమంలో బాక్టీరియా బాహ్య రూపము మరియు గుర్తింపునకు వాడే మొదటి మెట్టు.
→ సేంద్రీయ సేద్యం : నేల స్వభావాన్ని, సారవంతాన్ని పెంచే సేద్యం. రైతులు సహజ ఎరువులు వాడడం మరియు సహజ శత్రువులతో కీటకాలను అదుపులో పెట్టడం జరుగుతుంది.
→ వర్మీకంపోస్ట్ : వానపాముల విసర్జితం బలమైన ఎరువుగా ఉపయోగపడుతుంది. దీనినే వర్మీకంపోస్ట్ అంటారు.