AP 9th Class Physical Science Notes 9th Lesson తేలియాడే వస్తువులు

Students can go through AP Board 9th Class Physical Science Notes 9th Lesson తేలియాడే వస్తువులు to understand and remember the concept easily.

AP Board 9th Class Physical Science Notes 9th Lesson తేలియాడే వస్తువులు

→ ప్రమాణ ఘనపరిమాణం గల ద్రవ్యరాశిని సాంద్రత అంటారు.
సాంద్రత = ద్రవ్యరాశి / ఘనపరిమాణము

→ సాంద్రత ప్రమాణాలు : గ్రాము/ఘ. సెం.మీ (లేదా) కి.గ్రా/ఘ.మీ.

→ వస్తు సాంద్రతకు, నీటి సాంద్రతకు గల నిష్పత్తిని సాపేక్ష సాంద్రత అంటారు.
వస్తువు యొక్క సాపేక్ష సాంద్రత = వస్తువు సాంద్రత / నీటి సాంద్రత

→ ప్రయోగాత్మకంగా వస్తువు సాపేక్ష సాంద్రత = వస్తువు ద్రవ్యరాశి / అంతే ఘనపరిమాణం గల నీటి ద్రవ్యరాశి

→ ద్రవాల సాపేక్ష సాంద్రత = ద్రవం ద్రవ్యరాశి / అంతే ఘనపరిమాణం గల నీటి ద్రవ్యరాశి

AP 9th Class Physical Science Notes 9th Lesson తేలియాడే వస్తువులు

→ పాల స్వచ్ఛతను కనుగొనుటకు “లాక్టోమీటరు”ను వాడుతారు.

→ ద్రవాల సాపేక్ష సాంద్రతను కనుగొనుటకు “హైడ్రోమీటరు” లేదా “డెన్సిట్ మీటరు” ను వాడుతారు.

→ ఒక ద్రవంలో ఉంచబడిన ఏదైనా వస్తువు యొక్క సాంద్రత, ద్రవం యొక్క సాంద్రతకన్నా తక్కువ ఉన్నపుడు అది ఆ ద్రవంలో తేలుతుంది.

→ వస్తువుపై ఊర్ద్వ దిశలో పనిచేసే నీటిబలం కన్నా దానిపై పనిచేసే భూమ్యాకర్షణ బలం ఎక్కువైతే ఆ వస్తువు నీటిలో మునుగుతుంది, లేనిచో తేలుతుంది.

→ భూఉపరితలంపై నున్న అన్ని వస్తువులపై వాతావరణ పీడనం కలుగజేయబడుతుంది.

→ వాతావరణ పీడనం P0 = ρhg.

→ ఒక ప్రదేశం యొక్క వాతావరణ పీడనాన్ని ‘భారమితి’ నుపయోగించి కనుగొనవచ్చును.

→ ఒక ద్రవంలో లోతున ఉన్న ప్రదేశం దగ్గర పీడనం ρh = P0 + ρhg
P0 = వాతావరణ పీడనం ; ρ = ద్రవం యొక్క సాంద్రత ; h = లోతు ; g = గురుత్వ త్వరణము

AP 9th Class Physical Science Notes 9th Lesson తేలియాడే వస్తువులు

→ ద్రవంలో ఉన్న వస్తువుపై ఊర్ధ్వ దిశలో కలుగజేయబడే బలాన్ని ఉత్తవన బలం అంటారు.

→ ద్రవంలో ముంచబడిన వస్తువు కొంత బరువు కోల్పోయినట్లనిపిస్తుంది (ఉత్సవన బలం వల్ల).

→ ఏదైనా ఒక వస్తువును ఒక ప్రవాహిలో పూర్తిగాగాని పాక్షికంగాగాని ముంచినపుడు ఆ వస్తువు తొలగించిన ప్రవాహి బరువుకు సమానమైన ఉత్పవన బలం ఆ వస్తువుపై ఊర్ధ్వ దిశలో పనిచేస్తుంది. – ఆర్కిమెడిస్ సూత్రం

→ ఒక వస్తువు ద్రవంపై తేలుతున్నపుడు, ఆ వస్తువు తన బరువుకు సమానమైన బరువుగల ద్రవాన్ని తొలగిస్తుంది. ఆ ద్రవంలో లోతుకు పోయేకొలది పీడనం పెరుగుతుంది.

→ ప్రమాణ ఘనపరిమాణంలో బంధింపబడిన ప్రవాహిపై కలుగజేయబడిన బాహ్య పీడనం ఆ ప్రవాహిలో అన్ని దిశలలో ఒకే విధంగా కలుగజేయబడుతుంది.

→ సాంద్రత : ప్రమాణ ఘనపరిమాణము గల ద్రవ్యరాశిని సాంద్రత అంటారు.
సాంద్రత = ద్రవ్యరాశి / ఘనపరిమాణము
సాంద్రత ప్రమాణములు : గ్రా /ఘ. సెం.మీ (లేదా) కి.గ్రా /ఘ. మీ.

AP 9th Class Physical Science Notes 9th Lesson తేలియాడే వస్తువులు

→ సాపేక్ష సాంద్రత / తారతమ్యసాంద్రత : ఒక వస్తువు యొక్క సాంద్రతకు, నీటి సాంద్రతకు గల నిష్పత్తిని సాపేక్ష సాంద్రత అంటారు.
వస్తువు యొక్క సాపేక్ష సాంద్రత = వస్తువు సాంద్రత/ నీటి సాంద్రత
(లేదా)
వస్తువు యొక్క సాంద్రత = వస్తువు ద్రవ్యరాశి / అంతే ఘనపరిమాణం గల నీటి ద్రవ్యరాశి.

→ లాక్టోమీటరు : పాల స్వచ్చతను కనుగొనడానికి వాడే ఒక పరికరమే లాక్టోమీటరు. ఇది సాపేక్ష సాంద్రత అనే నియమంపై ఆధారపడి పని చేస్తుంది.

→ హైడ్రోమీటరు / డెన్సిట్ మీటరు : ఏ ద్రవ పదార్థం యొక్క సాపేక్ష సాంద్రతనైనా హైడ్రోమీటరు లేదా డెన్సిటీ మీటరును ఉపయోగించి కనుగొనవచ్చును.

→ వాతావరణ పీడనం : భూ ఉపరితలంపై నున్న అన్ని వస్తువులపై గాలి కలుగజేసే పీడనాన్ని వాతావరణ పీడనం అంటారు.
వాతావరణ పీడనం P0 = ρhg
ρ = గాలి యొక్క సరాసరి సాంద్రత
h = వాతావరణ పొర యొక్క ఎత్తు
g = గురుత్వ త్వరణం

AP 9th Class Physical Science Notes 9th Lesson తేలియాడే వస్తువులు

→ భారమితి : వాతావరణ పీడనాన్ని భారమితి సహాయంతో కొలవవచ్చు. పాదరసాన్నుపయోగించి మొట్టమొదటి భారమితిని తయారుచేసినది “టారిసెల్లి”. సాధారణ వాతావరణ పీడనం వద్ద పాదరస స్థంభం ఎత్తు 76 సెం.మీ.

→ ఉత్తవనము : ద్రవంలోనున్న వస్తువుపై ఊర్ధ్వ దిశలో కలుగజేయబడే బలాన్ని ఉల్లేవనము అంటారు. ఈ బలం ఆ వస్తువు వల్ల తొలగింపబడిన ద్రవం బరువుకి సమానం.

→ ఆర్కిమెడిస్ సూత్రం : ఏదైనా ఒక వస్తువును ఒక ప్రవాహిలో పూర్తిగాగాని, పాక్షికంగా గాని ముంచినపుడు ఆ వస్తువు తొలగించిన ప్రవాహి బరువుకు సమానమైన ఉత్తవన బలం ఊర్థ్వ దిశలో పని చేస్తుంది.

→ పాస్కల్ నియమం : ప్రమాణ ఘనపరిమాణంలో బంధింపబడిన ప్రవాహి పై కలుగజేయబడిన బాహ్య పీడనం ఆ ప్రవాహిలో అన్ని దిశలలో ఒకే విధంగా కలుగజేయబడుతుంది.

AP 9th Class Physical Science Notes 9th Lesson తేలియాడే వస్తువులు 1