Students can go through AP Board 9th Class Physical Science Notes 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు to understand and remember the concept easily.
AP Board 9th Class Physical Science Notes 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు
→ ఒక అణువు యొక్క సాంకేతికం ద్వారా దానిలో ఉన్న పరమాణువుల సంఖ్యను, అణుభారాన్ని తెలుసుకొనవచ్చు.
→ కంటికి కనిపించే లేదా తాత్కాలిక మార్పులను భౌతిక మార్పులు అంటారు.
→ శాశ్వత మార్పులను రసాయన మార్పులు అంటారు. వీటిలో క్రొత్త పదార్థాలు ఏర్పడతాయి.
→ రసాయన మార్పు స్థిరమైన, శాశ్వతమైన మార్పు.
→ రసాయన చర్యను అతిసూక్ష్మ రూపంలో లేదా సంకేతాలతో తెలియజేస్తే దానిని రసాయన సమీకరణం అంటారు.
→ ఒక చర్యలో ఏ పదార్థాలు రసాయన మార్పు చెందుతాయో వాటిని క్రియాజనకాలు(reactants) అంటారు.
→ రసాయన చర్యలో క్రొత్తగా ఏరడు పదార్థాలను క్రియాజన్యాలు (products) అంటారు.
→ పూర్తి రసాయన సమీకరణం దానిలోని క్రియాజనకాలు, క్రియాజన్యాలు మరియు వాటి భౌతిక స్థితులను తెలుపుతుంది.
→ రసాయన చర్యలో ద్రవ్యరాశి సృష్టించబడదు, నాశనం చెయ్యబడదు. దీనినే ద్రవ్యనిత్యత్వ నియమం అంటారు.
→ ఏ సమీకరణంలో క్రియాజనకాలలోని పరమాణువుల సంఖ్య, క్రియాజన్యాలలోని పరమాణువుల సంఖ్యకు సమానంగా ఉంటాయో ఆ సమీకరణాన్ని తుల్య సమీకరణం అంటారు.
→ ఒక సమీకరణాన్ని తుల్యం చేసేటప్పుడు గుణకాలను మాత్రమే మార్చాలి. కానీ ఫార్ములా మార్చకూడదు.
→ ఒక రసాయన సమీకరణం తుల్యమైందని చెప్పటానికి దానిలో వివిధ మూలక పరమాణువుల సంఖ్య ఇరువైపులా సమానంగా ఉండాలి.
→ రసాయన సమీకరణం ఎల్లప్పుడు తప్పనిసరిగా తుల్యమై ఉండాలి.
→ ఏ రసాయన చర్య అయినా సరే శక్తిని గ్రహించటమో లేదా శక్తిని విడుదల చేయడమో జరుగుతుంది.
→ శక్తిని బయటకు విడుదల చేసే చర్యలను ఉష్ణమోచక చర్యలు అంటారు.
→ శక్తిని లోపలకు శోషించే చర్యలను ఉష్ణగ్రాహక చర్యలు అంటారు.
→ రసాయన సంయోగంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలు కలిసి ఒక క్రొత్త పదార్థం ఏర్పడుటను రసాయన సంయోగం అంటారు.
→ రసాయన సంయోగంలో క్రియాజనకాలు రెండు, క్రియాజన్యం ఒకటి. A + B → AB.
→ రసాయన వియోగంలో ఒక పదార్థం రెండు లేక మూడు పదార్థాలుగా విడిపోతాయి.
→ రసాయన వియోగంలో క్రియాజనకం ఒకటి, క్రియాజన్యాలు రెండు. AB → A + B
→ రసాయన వియోగం ఉష్ణం వలన జరిగితే ఉష్ణ వియోగం అంటారు.
→ రసాయన వియోగం కాంతి వలన జరిగితే కాంతి రసాయన చర్యలు అంటారు.
→ రసాయన వియోగం విద్యుత్ వలన జరిగితే విద్యుత్ విశ్లేషణ అంటారు.
→ అధిక చర్యాశీలత గల లోహాల అవరోహణ క్రమం
K < Na < Ca < Mg < Al < Zn < Fe < Sn < Pb
→ హైడ్రోజన్ లోహం కానప్పటికీ ఎలక్ట్రాన్లను దానం చెయ్యటంలోనూ, వేలన్సీలోనూ లోహాలను పోలి ఉండును. అందువలన లోహాలతో కలుపవచ్చు.
→ చర్యాశీలత తక్కువ గల లోహాల అవరోహణ క్రమం
H < Cu < Hg < Ag < Au < Pt
→ అధిక చర్యాశీలత గల లోహాలు, అల్ప చర్యాశీలత గల లోహాలను స్థానభ్రంశం చెందించగలవు.
→ జింక్ లోహం అధిక చర్యాశీలతతో కాపర్‌ను స్థానభ్రంశం చెందించగలదు.
→ Cu లోహం Zn లోహాన్ని తక్కువ చర్యాశీలత వలన స్థానభ్రంశం చెందించలేదు.
→ రసాయన స్థానభ్రంశచర్యలో ఒక మూలకం, మరొక మూలకాన్ని స్థానభ్రంశం చెందిస్తుంది.
→ రెండు వేర్వేరు మూలక పరమాణువులు లేదా అయానులు, రెండు పదార్థాల మధ్య మార్పు చేసుకొంటే దానిని ద్వంద్వ వియోగం’ అంటారు.
→ రెండు లవణాల మధ్య ద్వంద్వ వియోగ చర్యలు జరుగును.
→ ఆమ్ల, క్షార కలయిక వలన ఏర్పడే తటస్థీకరణ చర్యలు ద్వంద్వ వియోగానికి ఉదాహరణ.
→ ఆక్సిజన్‌ను గ్రహించడం లేదా హైడ్రోజనను తొలగించటం లేదా ఎలక్ట్రానులను పోగొట్టుకొనుటను ఆక్సీకరణం అంటారు.
→ శ్వాసక్రియ ఒక ముఖ్యమైన ఆక్సీకరణ చర్య.
→ హైడ్రోజన్‌ను గ్రహించడం లేదా ఆక్సిజనను తొలగించుట లేదా ఎలక్ట్రానులను పొందటాన్ని క్షయకరణం అంటారు.
→ ఆక్సీకరణం, క్షయకరణం ఒక రసాయన చర్యలో ఒకేసారి సంభవించటాన్ని రెడాక్స్ చర్యలు అంటారు.
→ ఇనుము తుప్పుపట్టుట ఒక ఆక్సీకరణ చర్య.
→ తుప్పును (Fe2O3. 3H2O) సాంకేతికంతో సూచిస్తారు.
→ కాపర్ ఆక్సెడ్ వేడిచేసినపుడు కాపర్‌గా మారుట ఒక క్షయకరణ చర్య.
→ ఇనుప వస్తువులను ఆక్సీకరణం నుంచి కాపాడటానికి గ్రీజు, నూనెలు, పెయింట్లు పూస్తారు.
→ ఆక్సీకరణాలను మిశ్రమలోహాలు సమర్ధవంతంగా నిరోధించగలవు.
→ తుప్పుపట్టకుండా ఇనుప వస్తువులకు జింక్ పూత వేయటాన్ని గాల్వనీకరణం అంటారు.
→ కొన్ని లోహాలు గాలిలోని తేమ వలన గానీ, ఆమ్లాల సమక్షంలో గానీ ఉంచినపుడు మెరుపును కోల్పోతాయి. దీనినే క్షయం చెందటం అంటారు. ఆ తుప్పుపట్టడం, చిలుముపట్టడం లేదా క్షయం చెందడం వలన లోహ వస్తువులు పాడైపోతాయి.
→ నూనెలతో చేసిన ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉంచడం వలన ఆక్సీకరణం చెంది రుచి, వాసన మారిపోతాయి. దీనినే ముక్కిపోవటం అంటారు.
→ ముక్కిపోవటం నివారించటానికి విటమిన్ – సి, విటమిన్ – ఇ లాంటి వాటిని కలపాలి.
→ నూనె వస్తువుల ఆక్సీకరణాన్ని నివారించటానికి యాంటీ ఆక్సిడెంట్లు కలపాలి.
→ కుర్‌కురే, లేస్ వంటి తినే వస్తువులు ఎక్కువ కాలం కరకరలాడటానికి నైట్రోజన్ వాయువును నింపి ప్యాక్ చేస్తారు.
→ క్రియాజనకాలు : ఒక రసాయన చర్యలో ఏ పదార్థాలు రసాయన మార్పుకు గురి అవుతాయో వాటిని క్రియాజనకాలు అంటారు.
→ క్రియాజన్యాలు : ఒక రసాయన చర్యలో క్రొత్తగా ఏర్పడిన పదార్థాలను క్రియాజన్యాలు అంటారు.
→ ఉష్ణమోచక చర్య : రసాయన చర్యలో ఉష్ణశక్తిని బయటకు విడుదల చేసే చర్యలను ఉష్ణమోచక చర్యలు అంటారు. ఉదా : శ్వాసక్రియ.
మెగ్నీషియం గాలిలో మండటం. దీనిని ఈ విధంగా రాస్తారు.
క్రియాజనకం → క్రియాజన్యం + శక్తి
→ ఉష్ణగ్రాహక చర్య : ఒక రసాయన చర్యలో ఉష్ణశక్తిని గ్రహించే చర్యలను ఉష్ణగ్రాహక చర్యలు అంటారు.
దీనిని క్రియాజనకం → క్రియాజన్యం – శక్తి
లేదా
క్రియాజనకం + శక్తి → క్రియాజన్యాలతో సూచిస్తారు.
→ రసాయన సంయోగం : ఒక రసాయన చర్యలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ క్రియాజనకాలు చర్య జరిపి, ఒకే ఒక క్రియాజన్యాన్ని ఏర్పరచటాన్ని రసాయన సంయోగం అంటారు.
A + B → AB
→ రసాయన వియోగం : ఒక రసాయన సమ్మేళనం వేడి వలనగానీ, కాంతి వలనగానీ, విద్యుత్ వలనగానీ రెండు ముక్కలుగా విడిపోతే ఆ చర్యను రసాయన వియోగం అంటారు.
AB → A + B
→ రసాయన స్థానభ్రంశం : సమ్మేళనంలో ఒక మూలకం యొక్క స్థానాన్ని అధిక చర్యాశీలత గల మరొక మూలకం ఆక్రమించటాన్ని రసాయన స్థానభ్రంశం అంటారు.
AB + C → AC + B
→ ద్వంద్వ వియోగం : ఒక రసాయన చర్యలో రెండు క్రియాజనకాల ధన, ఋణ ప్రాతిపదికలు మార్పు చెందే చర్యను ద్వంద్వ వియోగచర్య అంటారు.
→ యాంటీ ఆక్సిడెంట్లు : పదార్థాలు ఆక్సిజన్‌తో కలిసి ఆక్సీకరణం చెందకుండా నిరోధించే పదార్థాలను యాంటీ ఆక్సిడెంట్లు అంటారు.
→ ఆక్సీకరణం : ఒక సమ్మేళనానికి ఆక్సిజన్ కలుపుట లేదా హైడ్రోజన్ తొలగించటాన్ని లేదా ఎలక్ట్రానులను కోల్పోవటాన్ని ఆక్సీకరణం అంటారు.
→ క్షయకరణం : ఒక సమ్మేళనానికి హైడ్రోజన్ కలుపుట లేదా ఆక్సిజన్ తొలగించుట లేదా ఎలక్ట్రానులను గ్రహించడాన్ని క్షయకరణం అంటారు.
→ తుప్పుపట్టడం : ఇనుము గాలిలోని తేమ, ఆక్సిజన్ తో కలసిపోయి ఆక్సీకరణం చెందటాన్ని తుప్పు (Fe2O3 . 3H2O) పట్టడం అంటారు. ఇనుము తుప్పు పడితే ద్రవ్యరాశి పెరుగును.
→ ముక్కి పోవడం (Rancidity) : నూనె లేదా క్రొవ్వు పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉంచడం ద్వారా ఆక్సీకరణం చెంది వాటి రుచిని, వాసనను కోల్పోతాయి. దీనినే ముక్కి పోవడం అంటారు.
→ భౌతిక మార్పులు : కంటికి కనిపించే మార్పులు లేదా రంగులోగానీ, స్థితిలోగానీ, ఉష్ణోగ్రతలోగానీ వచ్చే మార్పులను భౌతిక మార్పులు అంటారు.
→ రసాయన మార్పులు : శాశ్వత మార్పులను లేదా క్రొత్త పదార్థాలను లేదా సంఘటనంలో వచ్చే మార్పులను రసాయన మార్పులు అంటారు.
→ రసాయన సమీకరణం : ఒక రసాయన చర్యను అతిసూక్ష్మ రూపంలో లేదా సంకేతాలతో తెలియజేస్తే దానిని రసాయన సమీకరణం అంటారు.
→ తుల్య సమీకరణం : ఏ రసాయన సమీకరణంలో అయితే క్రియాజనకాల వైపుగల మూలకపు పరమాణువులు, క్రియాజన్యాల వైపుగల మూలక పరమాణువులు సమానంగా ఉండునో ఆ సమీకరణాన్ని తుల్య సమీకరణం అంటారు.
→ ద్రవ్య నిత్యత్వ నియమం : ఒక రసాయన చర్యలో ద్రవ్యరాశి పుట్టదు, నశించదు (neither created nor destroyed). దీనినే ద్రవ్యనిత్యత్వ నియమం అంటారు.
→ అవక్షేపం : రెండు సంయోగపదార్థాలు జలద్రావణాలలో ఒకదానితో ఒకటి చర్య జరిపినపుడు ధన, ఋణ ప్రాతిపదికలు మార్పుచెంది నీటిలో కరగని లవణాలు ఏర్పడును. దీనినే
అవక్షేపం అంటారు.
→ S.T.P : సాధారణ ఉష్ణోగ్రత, పీడనాలను S.T.P తో తెలియజేస్తారు. 0°C ఉష్ణోగ్రత, 1 అట్మాస్ఫియర్ పీడనాన్ని S.I.P లేదా N.T.P తో సూచిస్తారు.
→ మోల్ : పదార్థం యొక్క S.I. ప్రమాణాన్ని మోల్ అంటారు.
→ మోలార్ ద్రవ్యరాశి : ఏదైనా పరమాణువు యొక్క పరమాణు సంఖ్యను (Z) గ్రాములలో తెల్సితే లేదా అణుభారాన్ని గ్రాములలో (G.M.W) తెల్సితే దానిని మోలార్ ద్రవ్యరాశి అంటారు.
→ మోలార్ ఘనపరిమాణం : ఏదైనా ఒక మోల్ వాయువు 22.4 లీటర్ల ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది. దీనినే మోలార్ ఘనపరిమాణం అంటారు.
→ అవగాడ్రో సంఖ్య : ఒక మోల్ పదార్థం 6.023 × 1033 అణువులను కలిగియుండును. ఈ సంఖ్యను అవగాడ్రో సంఖ్య అంటారు.
→ కాంతి రసాయన చర్యలు : ఒక సమ్మేళనం కాంతి వలన వియోగం చెందితే అటువంటి చర్యలను కొంతి రసాయన చర్యలు అంటారు.
→ ఉష్ణవియోగ చర్యలు : ఒక సమ్మేళనం ఉష్ణం ప్రసరించడం వలన వియోగం చెందితే అటువంటి చర్యలను ఉష్ణవియోగ చర్యలు అంటారు.
→ విద్యుత్ విశ్లేషణ చర్యలు : జలద్రావణంలో సమ్మేళనాలు విద్యుత్ ప్రవహించడం వలన వియోగం చెందితే అటువంటి చర్యలను విద్యుత్ విశ్లేషణ చర్యలు అంటారు.
→ అధిక చర్యాశీలత గల లోహాలు : పొటాషియం (K), సోడియం (Na), కాల్షియం (Ca), మెగ్నీషియం (Mg), అల్యూమినియం (Al), జింక్ (Zn), ఫెర్రస్ (Fe), టిన్ (Sn), లెడ్ (Pb)లను అధిక చర్యాశీలత గల లోహాలు అంటారు.
(K < Na < Ca < Mg < AL < Zn < Fe < Sn < Pb)
→ అల్ప చర్యాశీలత గల లోహాలు : కాపర్ (Cu), పాదరసం (Hg), వెండి (Ag), బంగారం (AU), ప్లాటినం (PI).
Cu > Hg > Ag > Au > Pt
→ మిశ్రమలోహాలు : రెండు లేదా అంతకన్నా ఎక్కువ లోహాలు కలిసి ప్రత్యేక లక్షణాలు గల క్రొత్త లోహాలు ఏర్పడటాన్ని మిశ్రమలోహాలు అంటారు.
ఉదా : స్టెయిన్లెస్ స్టీల్, ఇత్తడి, కంచు.
→ గాల్వనీకరణం : ఇనుము పై తుప్పు పట్టకుండా జింక్ పూతపూసే పద్దతిని గాల్వనీకరణం అంటారు.
→ స్టెయిన్లెస్ స్టీలు : ఫెర్రస్ (Fe) – 83%, కార్బన్ – 1%, క్రోమియం – 15%, నికెల్ – 1% లతో ఏర్పడిన మిశ్రమలోహాన్ని స్టెయిన్లెస్ స్టీలు అంటారు.
→ రెడాక్స్ చర్యలు : ఒక రసాయన చర్యలో ఆక్సీకరణం, క్షయకరణం ఒకేసారి సంభవించటాన్ని రెడాక్స్ చర్యలు అంటారు.
→ క్షయము చెందడం : కొన్ని లోహాలు తేమగాలిలోగానీ, ఆమ్లాల సమక్షంలో గానీ ఉంచినపుడు లోహ ఆక్సైడులను ఏర్పరచి, మెరుపు కోల్పోవటాన్ని క్షయము చెందడం అంటారు.
→ ఈస్ట్ : 160 రకాల బాక్టీరియా, శిలీంధ్రాలను కలిపి ఈస్ట్ అంటారు.