Students can go through AP Board 9th Class Physical Science Notes 8th Lesson గురుత్వాకర్షణ to understand and remember the concept easily.
AP Board 9th Class Physical Science Notes 8th Lesson గురుత్వాకర్షణ
→ స్థిర వడితో వృత్తాకార మార్గంలో చలించే వస్తువు చలనాన్ని సమవృత్తాకార చలనం అంటాం.
→ వస్తువేగ దిశలో మాత్రమే నిరంతరంగా మార్పు తీసుకొని వచ్చే త్వరణాన్ని అభికేంద్రత్వరణం అంటారు. దీని దిశ ఎల్లప్పుడూ వృత్త కేంద్రం వైపు ఉంటుంది.
→ ఒక వస్తువును సమ వృత్తాకార చలనంలో ఉంచడానికి ప్రయత్నించే ఫలిత బలాన్ని అభికేంద్రబలం అంటాం.
అభికేంద్ర బలం Fc = Mv²/R. ఇందులో M = ద్రవ్యరాశి, V = వడి, R = వ్యాసార్ధం
→ విశ్వంలో ప్రతి వస్తువు మరొక వస్తువును ఆకర్షించును. రెండు వస్తువుల మధ్య ఆకర్షణ బలం వాటి ద్రవ్యరాశుల లబ్దానికి అనులోమానుపాతంలోనూ, వాటి మధ్య దూర వర్గానికి విలోమానుపాతంలోనూ ఉండును.
→ భూ ఉపరితలానికి దగ్గరగా చలించే అన్ని వస్తువులు ఒకే త్వరణాన్ని కలిగి ఉంటాయి. ఆ విలువ 9.8 మీ./సె² కు సమానం.
→ ఒక వస్తువుపై భూమ్యాకర్షణ బలం మాత్రమే పనిచేస్తూ ఉంటే ఆ వస్తువును “స్వేచ్ఛాపతన వస్తువు” అంటాం.
→ వస్తువుపై పనిచేసే భూమ్యాకర్షణ బలాన్ని “భారం” అంటాం.
W = mg. ఇందులో W = భారం, m = ద్రవ్యరాశి g = గురుత్వ త్వరణం
→ స్వేచ్ఛా పతన స్థితిలో వస్తువు “భారరహిత స్థితి”లో ఉంటుంది.
→ ఒక వస్తువు యొక్క మొత్తం భారం ఏ బిందువు గుండా పనిచేస్తుందో ఆ బిందువునే ఆ వస్తువు యొక్క గురుత్వ కేంద్రం అంటాం.
→ వస్తు గురుత్వ కేంద్రం నుండి గీసిన క్షితిజ లంబం, దాని ఆధారిత వైశాల్య భాగము గుండా పోయినచో ఆ వస్తువు సమతాస్థితిలో లేక స్థిరత్వంలో ఉంటుంది.
→ సమవృత్తాకార చలనం : ఏ వస్తువైనా స్థిరవడితో వృత్తాకార మార్గంలో చలిస్తూ ఉండే వస్తువు చలనం.
→ అభికేంద్ర త్వరణం : వృత్తాకార చలనంలో వస్తు వేగదిశలో మాత్రమే మార్పు తీసుకురాగల త్వరణపు రకము.
→ అభికేంద్ర బలం : వృత్తాకార చలనంలో ఉన్న వస్తువు పై నిరంతరం పనిచేయు బలం.
→ న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ : విశ్వంలో ఏ రెండు వస్తువుల మధ్య ఆకర్షణ బలం, వాటి ద్రవ్యరాశుల లబ్దానికి నియమం అనులోమానుపాతంలోనూ, వాటి మధ్య దూర వర్గానికి విలోమానుపాతంలోనూ ఉండును.
→ స్వేచ్ఛా పతనం : ఏ వస్తువు పైన అయితే భూమ్యాకర్షణ బలం మాత్రమే పని చేస్తుందో, ఆ వస్తువు చలనంలో ఉన్న యెడల వస్తు చలనం స్వేచ్ఛా పతన చలనం అగును.
→ గురుత్వ త్వరణం : భూమికి దగ్గరగా ఉండే వస్తువుల్లో భూమ్యాకర్షణ వల్ల కలిగే త్వరణం.
→ భారం : సమతాస్థితిలో ఉన్నటువంటి వస్తువు పై పనిచేసే ఆధారిత బలం.
→ భారరహిత స్థితి : స్వేచ్ఛగా వదలబడిన వస్తువు స్థితి.
→ గురుత కేంద్రం : ఒక వస్తు భారం మొత్తం కేంద్రీకృతమగు బిందువు.
→ స్థిరత్వం : గురుత్వ కేంద్రంపై ఆధారపడి ఉండు వస్తు లక్షణము.